NLG: నూతన ఎంపికైన గ్రంథపాలకులకు అభినందనలు తెలిపిన తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు

నల్లగొండ: గురుకుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైబ్రేరియన్ పోస్టులపై, రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ ప్రక్రియ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈరోజు హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం ఎంతో శుభసూచకమని గ్రందపాలకుడు డాక్టర్ రాజారామ్ అన్నారు.

సాధించుకున్న తెలంగాణలో గ్రంథాలయాల సేవలు గ్రంథ పాలకుల ద్వారా సాధ్యమని, విద్యార్థుల డెవలప్మెంట్ గురించి పోటీ పరీక్షలపై అవగాహనను కల్పించడం కొరకు జ్ఞానాభివృద్ధి కోసం గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడుతాయని డాక్టర్ రాజారామ్ తెలిపారు. ఈరోజు నల్గొండలో తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ రాజారామ్ (మహిళా కళాశాల గ్రంథ పాలకులు), డాక్టర్ దుర్గాప్రసాద్ (నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథపాలకులు) నూతనంగా ఎంపికైన గ్రంథపాలకులను అభినందించారు.

NLG: విద్యార్థులకు స్నాక్స్ అందజేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎస్ పి టి ప్లాటినం సభ్యులు

నల్గొండ పట్టణంలోని మాధవ నగర్ జేబీఎస్ ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే క్రమంలో ఉదయం మరియు సాయంత్రం పూట విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకుగాను, ఈరోజు లయన్స్ క్లబ్ ఎస్పిటి ప్లాటినం నల్గొండ సభ్యులు మరియు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ - ఆండాలు వివాహ వార్షికోత్సవం సందర్భంగా లయన్ జెల్లా దశరథ ఆధ్వర్యంలో దాదాపు 10 వేల రూపాయల స్నాక్స్ అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నిర్మల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వ జేబీఎస్ పాఠశాలలోని విద్యార్థులకు గత 3 సంవత్సరముల నుండి లయన్స్ క్లబ్ ఆఫ్ ప్లాటినం ఎస్ పి టి నల్గొండ ఆధ్వర్యంలో ఈ యొక్క స్నాక్స్ అందజేస్తున్నామని, దాతలు అందించిన సహకారంతో విద్యార్థులు పట్టుదలతో కృషిచేసి 10వ తరగతిలో ఉన్నతమైన మార్కులు సంపాదించి ముందుకు వెళ్లాలని, తద్వారా మంచి భవిష్యత్తును పొందవచ్చునని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జెల్లా దశరథ, పుట్టా వెంకన్న, దాసోజు శ్రీనివాసచారి, మాధగోని స్వామి, మామిడి శ్రవణ్ కుమార్, జెల్లా లవన్ కుమార్,పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ నాగిరెడ్డి ఆర్ నరసింహారెడ్డి కే సంపత్ కుమార్ బి.రూప, ఎన్. శ్రీనివాస్, బొమ్మపాల గిరిబాబు, కే.ప్రతిమ, జీ.రత్నమాల, పి. వెంకట్రావు, ఏవీఆర్ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

NLG: గౌరవ డాక్టరేట్ పొందిన దళిత నాయకుడికి సన్మానం

నల్లగొండ జిల్లాకు చెందిన తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల రవి సామాజిక రంగంలో కృషి చేసినందుకు గాను, చెన్నైలోని గ్లోబల్ యూనివర్సిటీ వారు ఇటీవల ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.

డాక్టరేట్ ని పొంది బుధవారం నల్లగొండకు వచ్చిన సందర్భంగా ఆ సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.

NLG: మార్చి 27, 28 తేదీల్లో ఎన్జీ కళాశాలలో జాతీయ సదస్సు

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో మార్చి 27, 28 తేదీల్లో తెలుగు నాటక సాహిత్యం- సమాజం అను అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించబడుతుందని కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ అన్నారు.

బుధవారం జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడారు. జాతీయ సదస్సులను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందింపచేయడమే కాకుండా వారిలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఉపయోగపడుతుందని, అదేవిధంగా సాహిత్య పరిశోధకులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ మునీర్, డాక్టర్ అంతటి శ్రీనివాసులు, ఐక్యు ఏసి కోఆర్డినేటర్ వైవిఆర్ ప్రసన్నకుమార్, అకడమిక్ కోఆర్డినేటర్ వి. శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి వి. నాగరాజు, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య , తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఎన్. దీపిక, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ వెల్దండి శ్రీధర్, జి. గోవర్ధనగిరి, ఎస్. ప్రభాకర్, ఎం.లింగస్వామి, గ్రంథపాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, వ్యాయామ అధ్యాపకులు కె.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

TS: తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర గ్రంధాలయ సంఘం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గురుకుల పాఠశాల, కళాశాలలో లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయడానికి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ జారీ చేయగా, ఈ ప్రభుత్వంలో త్వరితగతిన రిజల్ట్స్ ఇచ్చినందుకు గురుకుల విద్యా సంస్థకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు, తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంకా గురుకుల విద్యా సంస్థలలో మిగిలి ఉన్న లైబ్రరీ పోస్టులను భర్తీ చేసి పాఠశాలల్లో, కళాశాలలో గ్రంథాలయాల ప్రాధాన్యతను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు తెలిపారు.

అదేవిధంగా 434 పాఠశాల, 150 జూనియర్ కళాశాల గ్రంథాలయ పోస్టులు భర్తీ చేయడానికి ఫలితాలు విడుదల చేసినందుకు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సుంకరి రాజారాం, డాక్టర్ దుర్గాప్రసాద్ లు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

NLG: నల్లగొండలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి నగరోత్సవం

నల్లగొండ: 

శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు జాతర నేపథ్యంలో.. స్వామి వార్లకు పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అలంకరణ చేసి ఘనంగా పూజలు నిర్వహించి రామగిరి నుండి క్లాక్ టవర్ మీదుగా ఊరేగింపు గా బయలుదేరారు.

ఈ నగరోత్సవ కార్యక్రమం పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

తదుపరి చెరువుగట్టు గ్రామంలో నగరోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీంతో చెరువుగట్టు జాతర ఈరోజు నుండి మొదలు అయింది.

NLG: నల్లగొండ సబ్ డివిజన్ డిఎస్పీ గా శివరాం రెడ్డి

నల్లగొండ సబ్ డివిజన్ లో డిఎస్పీ యం.శ్రీదర్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో యాదాద్రి రాచకొండ ఏసిపి గా పనిచేస్తున్న కె.శివరాం రెడ్డిని నల్లగొండ సబ్ డివిజన్ డిఎస్పీ గా కేటాయించగా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా శివరాం రెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

TS: 'తదేక' సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తక ఆవిష్కరణ

నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్. మహమ్మద్ హసేన రచించిన" తదేక" సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తకాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు చేతిలో మీదుగా, హైదరాబాదులో ఆచార్య రవ్వ శ్రీహరి వేదిక పై మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన ఇరవై ఒక్క వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు సూర్య ధనుంజయ్, ప్రసిద్ధ కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ కె. ఆనందాచారి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ల సంఘం రాష్ట్ర బాధ్యులు పి. మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర బాధ్యులు డాక్టర్ ఎస్. రాజారామ్, కవి యాకుబ్, స్కై బాబా గారు, డాక్టర్ వెల్దండ శ్రీధర్, అనంతోజు మోహన్ కృష్ణ, గ్రంథ పాలకులు దుర్గ ప్రసాద్, బూర్గు గోపికృష్ణ, పల్లె సతీష్ తదితరులు పాల్గొన్నారు.

NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని లకు ఆరోగ్య అవగాహన సదస్సు

నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఉమెన్ సేఫ్టీ మరియు జువాలజి డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత విభాగపు కన్వీనర్ డాక్టర్ భాగ్యలక్ష్మి నిర్వహణ లో మంగళవారం కళాశాల విద్యార్థినులకు " రిప్రొడక్టివ్ హెల్త్ హైజిన్ మరియు ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కాన్సర్ " అనే అంశం మీద మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రఖ్యాత గైనకాలజిస్టులు డాక్టర్ సుచరిత, డాక్టర్ దీప్తి మాట్లాడుతూ.. రిప్రొడక్టివ్ హెల్త్, మెనుస్ట్రునల్ హెల్త్ హైజీన్ మరియు కాన్సర్ ముందస్తు గుర్తింపు లక్షణాలు, నివారణ, బ్రెస్ట్ కాన్సర్, సర్వైకల్ కాన్సర్ మొదలైన అంశాలపై విద్యార్థిని లకు అవగాహన కల్పించారు. తమ విలువైన సమయాన్ని వెచ్చించి విద్యార్థినులకు వివిధ అంశాలమీద అవగాహన కల్పించినందుకు డాక్టర్ సుచరిత, డాక్టర్ దీప్తి లకు కళాశాల ప్రిన్సిపాల్ కార్యక్రమ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మునీర్, జువాలజి‌ విభాగాధిపతి శ్రీనాథ్ పటేల్, మహిళా అధ్యాపకులు దీపిక, జ్యోత్స్న, శివరాణి, శిరీష, సావిత్రి, సరిత, మహేశ్వరి, రమ, స్రవంతి, శ్వేత, వాణి, గాయత్రి, సంతోష్, ప్రవీణ్ మరియు విద్యార్థినులు హాజరయ్యారు.

NLG: నల్లగొండ అభివృద్ధికి కేసిఆర్ చేసింది శూన్యం: మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య

నల్లగొండ జిల్లా:

గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్ నల్గొండకు చేసింది శూన్యం అని మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య విమర్శించారు. మర్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో బాలయ్య మాట్లాడుతూ.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కృష్ణా జలాల పరిరక్షణ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కేవలం ఆయన కేడర్ ను కాపాడుకోవడం కోసమే ఈ నల్లగొండ సభ అని, వేరే ఉద్దేశం ఏమీ లేదని అన్నారు. 

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణలో బిఆర్ఎస్ నాయకులను చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించారని, వారి ఉనికి కోసమే ఈ బహిరంగ సభ నిర్వహించుకున్నారని, దీంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలిమినేటి సత్తిరెడ్డి, మారగొని మల్లేష్, సిరిపంగి శ్రీనివాస్, లపంగి కృష్ణ, దామెర సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.