NLG: నల్లగొండ సబ్ డివిజన్ డిఎస్పీ గా శివరాం రెడ్డి

నల్లగొండ సబ్ డివిజన్ లో డిఎస్పీ యం.శ్రీదర్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో యాదాద్రి రాచకొండ ఏసిపి గా పనిచేస్తున్న కె.శివరాం రెడ్డిని నల్లగొండ సబ్ డివిజన్ డిఎస్పీ గా కేటాయించగా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా శివరాం రెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

TS: 'తదేక' సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తక ఆవిష్కరణ

నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్. మహమ్మద్ హసేన రచించిన" తదేక" సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తకాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు చేతిలో మీదుగా, హైదరాబాదులో ఆచార్య రవ్వ శ్రీహరి వేదిక పై మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన ఇరవై ఒక్క వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు సూర్య ధనుంజయ్, ప్రసిద్ధ కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ కె. ఆనందాచారి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ల సంఘం రాష్ట్ర బాధ్యులు పి. మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర బాధ్యులు డాక్టర్ ఎస్. రాజారామ్, కవి యాకుబ్, స్కై బాబా గారు, డాక్టర్ వెల్దండ శ్రీధర్, అనంతోజు మోహన్ కృష్ణ, గ్రంథ పాలకులు దుర్గ ప్రసాద్, బూర్గు గోపికృష్ణ, పల్లె సతీష్ తదితరులు పాల్గొన్నారు.

NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని లకు ఆరోగ్య అవగాహన సదస్సు

నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఉమెన్ సేఫ్టీ మరియు జువాలజి డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత విభాగపు కన్వీనర్ డాక్టర్ భాగ్యలక్ష్మి నిర్వహణ లో మంగళవారం కళాశాల విద్యార్థినులకు " రిప్రొడక్టివ్ హెల్త్ హైజిన్ మరియు ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ కాన్సర్ " అనే అంశం మీద మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రఖ్యాత గైనకాలజిస్టులు డాక్టర్ సుచరిత, డాక్టర్ దీప్తి మాట్లాడుతూ.. రిప్రొడక్టివ్ హెల్త్, మెనుస్ట్రునల్ హెల్త్ హైజీన్ మరియు కాన్సర్ ముందస్తు గుర్తింపు లక్షణాలు, నివారణ, బ్రెస్ట్ కాన్సర్, సర్వైకల్ కాన్సర్ మొదలైన అంశాలపై విద్యార్థిని లకు అవగాహన కల్పించారు. తమ విలువైన సమయాన్ని వెచ్చించి విద్యార్థినులకు వివిధ అంశాలమీద అవగాహన కల్పించినందుకు డాక్టర్ సుచరిత, డాక్టర్ దీప్తి లకు కళాశాల ప్రిన్సిపాల్ కార్యక్రమ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మునీర్, జువాలజి‌ విభాగాధిపతి శ్రీనాథ్ పటేల్, మహిళా అధ్యాపకులు దీపిక, జ్యోత్స్న, శివరాణి, శిరీష, సావిత్రి, సరిత, మహేశ్వరి, రమ, స్రవంతి, శ్వేత, వాణి, గాయత్రి, సంతోష్, ప్రవీణ్ మరియు విద్యార్థినులు హాజరయ్యారు.

NLG: నల్లగొండ అభివృద్ధికి కేసిఆర్ చేసింది శూన్యం: మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య

నల్లగొండ జిల్లా:

గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్ నల్గొండకు చేసింది శూన్యం అని మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య విమర్శించారు. మర్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో బాలయ్య మాట్లాడుతూ.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కృష్ణా జలాల పరిరక్షణ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కేవలం ఆయన కేడర్ ను కాపాడుకోవడం కోసమే ఈ నల్లగొండ సభ అని, వేరే ఉద్దేశం ఏమీ లేదని అన్నారు. 

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణలో బిఆర్ఎస్ నాయకులను చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించారని, వారి ఉనికి కోసమే ఈ బహిరంగ సభ నిర్వహించుకున్నారని, దీంతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలిమినేటి సత్తిరెడ్డి, మారగొని మల్లేష్, సిరిపంగి శ్రీనివాస్, లపంగి కృష్ణ, దామెర సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: నల్గొండ చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. హోంగార్డు మృతి

నల్గొండ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నేపథ్యంలో చర్లపల్లి వద్ద ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న హోంగార్డులను ఢీ కొట్టిన కారు ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నార్కట్ పల్లి పీఎస్ లో పనిచేస్తున్న హోంగార్డు కిషోర్ మృతి చెందాడు. మరో హోంగార్డు కు గాయాలు అయ్యాయి, ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NLG: పగడాల ముత్తు సేవలు అభినందనీయం

నల్లగొండ జిల్లా, గుర్రంపోడు మండలం, ఆమలూరు గ్రామానికి చెందిన రాచమల్ల వెంకన్న ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త మరణంతో భార్య రేణుక, ముగ్గురు పిల్లలు అనాదలయ్యారు. విషయం తెలుసుకున్న పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు వారి కుటుంబానికి ఈ రోజు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు.

కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, ట్రెజరరీ పగడాల కళ్యాణ్, మొగిలి కిషన్, పందుల శ్రీను, పుప్పాల పాపయ్య పాల్గొన్నారు.

NLG: ఫిబ్రవరి 14 బ్లాక్ డే గా జరుపుకుందాం: మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు

నల్లగొండ: సహజంగా ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని వాలెంటైన్స్ డే అని తెలుసు. కానీ ఇదే రోజు 2019లో పుల్వామా దాడిలో భారత్ 40 మంది వీర జవాన్లను కోల్పోయింది. ఈ రోజును బ్లాక్ డే గా జరుపుకుందామని పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ విద్యార్థులు అన్నారు. 

మంగళవారం ఎస్బి న్యూస్ తో పట్టణంలోని పలువురు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు మాట్లాడుతూ.. ప్రపంచం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది, అయితే క్రూరమైన పుల్వామా దాడుల కారణంగా ఈ రోజును భారతదేశానికి 'బ్లాక్ డే' అని పిలుస్తారని అన్నారు.

Ads

బిఏ మూడో సంవత్సరం చదువుతున్న గడగోజు శ్రీజ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14 ను ప్రపంచం ప్రేమికుల రోజు అంటుంది. కానీ భారత్ లో ఈ రోజుకి సరైన ఆదరణ లేదని, తాను ఫిబ్రవరి 14 ను బ్లాక్ డే గా చూస్తానని అన్నారు. ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల పైన ఆమె మాట్లాడుతూ.. పెద్దలు కుదిర్చిన వివాహాలు మేలని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 

Ads

అదేవిధంగా బిఏ మూడో సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థిని వల్కి మనీషా మాట్లాడుతూ.. పెద్దలు కుదిర్చిన వివాహాలు మేలని, సమస్యలొస్తే పెద్దలు మాట్లాడి పరిష్కరిస్తారని అన్నారు. అంతే కాదు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం అనే భావన మన భారతీయులు మరిచిపోయి ఫిబ్రవరి 14 బ్లాక్ డే అని గుర్తుంచుకోవాలి అని అన్నారు.

మరో విద్యార్థిని మైత్రి మాట్లాడుతూ.. ప్రేమ వివాహాలకు కన్నా, పెద్దలు కుదిర్చిన వివాహాలు బెటర్ అని అన్నారు.

మరో విద్యార్థిని నసెరా మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14 బ్లాక్ డే గా నిర్వహించాలని, ప్రేమ వివాహాలలో ఒక జంట మధ్య అనుబంధం ఉంటుందని, పెద్దలు కుదిర్చిన వివాహంలో ఒక కుటుంబం మధ్య అనుబంధం ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. అదేవిధంగా తెలియని వ్యక్తులతో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో స్నేహం చేయరాదని సూచించారు.

కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ.. సెల్ఫ్ డిఫెన్స్ లో కళాశాల విద్యార్థిని లకు శిక్షణ ఇవ్వడానికి సర్టిఫికెట్ కోర్సు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు.

NLG: ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు, వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, జిల్లా కార్యదర్శి, లింగయ్య యాదవ్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 

కాగా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించారా ?పరిష్కరించలేదా? దరఖాస్తుదారానికి నెల రోజుల లోపు అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని, రాతపూర్వకంగా ఇచ్చిన దరఖాస్తులకు రాతపూర్వకమైన సమాధానం ఇవ్వాలని పలువురు ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తుదారులు అంటున్నారు.

NLG: వసతి గృహం అధికారిణిని సస్పెండ్

నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ లోని ప్రీ మెట్రిక్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం అధికారిణి ఎం. అహల్యను జిల్లా కలెక్టర్ హరిచందన సోమవారం సస్పెండ్ చేశారు. సోమవారం సంక్షేమ శాఖల అధికారులతో వసతి గృహాల నిర్వహణ, సంక్షేమ శాఖల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దాసరి అధికారులను ఆదేశించారు. 

మిర్యాలగూడ ప్రీ మెట్రిక్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం అధికారిణి ఎం.అహల్య హాస్టల్లో ఉండకపోవడమే కాకుండా, విద్యార్థినులకు భోజనం సరిగా పెట్టకపోవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్టు వివరించారు. హాస్టల్ ను తనిఖీ చేసిన అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు ఆమె తెలిపారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.

NLG: అనుమానాస్పదంగా ఉన్న విద్యార్థుల మరణాలను హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ద్వారా న్యాయ విచారణ జరిపించాలి: ఏఐఎస్ఎస్డి

దేవరకొండ: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నియోజకవర్గ కన్వీనర్ వస్కుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల అనుమానస్పద మృతులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆర్డీవోకు మెమోరండం అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. గురుకులాల విద్యార్థుల సూసైడ్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర విచారణ జరిపించి, మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ప్రతి గురుకులాల హాస్టల్ కు ఒక సైకాలజిస్ట్ను నియమించాలని,

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రభుత్వం చాలా పకడ్బందీగా గురుకులాల హాస్టల్స్ విద్యార్థులు భయభ్రాంతులకు గురికాకుండా, వారు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా, భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా, గురుకులాల హాస్టల్లో మనో ధైర్యంతో చదివే విధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అందుగుల గిరి, చేపూరి రాజేష్, యాదగిరి, నాగరాజు, తదితర సభ్యులు పాల్గొన్నారు.