తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త..
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
ఉద్యోగ నియామకాల వయోపరిమితి రెండేళ్లు పెంపు
అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు
ఉత్తమ్ ప్రజెంటేషన్ మాకే అర్థం కాలేదు ఇక ప్రజలకు ఏమి అర్థం అవుతుంది: కేటీఆర్
ఉత్తమ్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లో ఉంది-KTR
తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు
మాకే అర్థం కాలేదు.. ప్రజలకు ఎలా అర్థమవుతుంది-KTR
పెండింగ్ లో ఉన్న హాస్టల్ మెస్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పెండింగ్ లో ఉన్న హాస్టల్ మెస్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్
నేడు నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని కలిసి పెండింగ్ లో ఉన్న
హాస్టల్ మెస్ చార్జీలు విడుదల చేయాలి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ గత 14 నెలలుగా పెండింగ్లో హాస్టల్ మిస్ ఛార్జీలు విడుదల కాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెజార్టీలు పెంచాలని మెస్ బకాయిల విడుదల చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3500 కోట్లు బకాయిలు విడుదల చేయాలని ఫీజు బకాయిలు విడుదల కాకపోవడం వలన బహుజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావడం జరుగుతుంది అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ అల్లం పెళ్లి కొండన్న శంకర్ సుమిత్ తదితరులు పాల్గొన్నారు.
TS :కొత్తగూడెం:యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్:డివైఎఫ్ఐ
యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్.
-డివైఎఫ్ఐ
యువత సంక్షేమానికి పాటుపడతామని చెబుతూనే, యువజన సర్వీసులు, క్రీడలకు బడ్జెట్లో నిరాశ జనకంగా కేటాయింపులు ఉన్నాయని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అభిప్రాయపడింది. యువత సంక్షేమానికి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ లోనే యువజనుల సర్వీసు శాఖకు సరైన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం అన్యాయం.2021-22 బడ్జెట్ లో 188 కోట్లు,2022-23 బడ్జెట్లో 176 కోట్లు,2024-25 బడ్జెట్లో 173 కోట్ల 93లక్షలు మాత్రమే కేటాయింపులు ఉన్నవి. ఈ కొద్దిపాటి నిధులతో రాష్ట్రంలో యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. యువజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు పేర్కొన్న మాదిరిగా నిరుద్యోగ భృతి చెల్లింపు విషయంలో స్పష్టత ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, 2 లక్షల ఉద్యోగాలపై నామమాత్ర ప్రస్తావననే తప్ప స్పష్టత లేదు. ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీ సమావేశాల ముందు ప్రకటించిన మాదిరిగా సత్వరమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, గడువులోపు రెండు లక్షల ఉద్యోగాలుభర్తీ చేయాలి. యువజనులు క్రీడలు శారీరక నైపుణ్యం కేంద్రాలు పెంచాలి. యువత నైపుణ్య శిక్షణ అభివృద్ధి కొరకు ప్రత్యేక యూనివర్సిటీ నిర్మిస్తామని చెప్పిన మాటలకు బడ్జెట్లో మాత్రం ప్రస్తావించలేదు. విద్యారంగానికి ఆశించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు లేవు పాఠశాల, ఉన్నత విద్య యూనివర్సిటీలు మరింత సంక్షోభంలో ఉన్నవి.బడ్జెట్ లో యువతని విస్మరించడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
TS:వైష్ణవి మృతిపై విచారణ జరిపి,నిందితులను కటినంగా శిక్షించాలి:కొత్తపల్లి రేణుక POW జిల్లా కార్యదర్శి
వైష్ణవి మృతిపై విచారణ జరిపి,నిందితులను కటినంగా శిక్షించాలి.
అధికారుల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థుల ఆత్మహత్యలు
మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- కొత్తపల్లి రేణుక POW జిల్లా కార్యదర్శి
అధికారుల నిర్లక్ష్యం, అక్కడ ఉన్న సిబ్బంది ప్రవర్తన వల్ల తెలిసి తెలియని వయసులో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ ఆత్మహత్యలకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక అన్నారు.ఈ మధ్యకాలంలో అనేక సంక్షేమ గురుకుల ప్రభుత్వ హాస్టల్లలోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ అన్నారు. ఈ మధ్యనే భువనగిరిలో వార్డెన్ వేదింపులు తట్టుకోలేక ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యా చేసుకుంటే విచారణ పెరుతో కాలయాపన చేస్తూ చర్యలు తీసుకోలేదు అన్నారు.నేడు సూర్యాపేట ఇమాంపేట గురుకుల కళాశాలలో వైష్ణవి అత్మహత్య ఇందులో భాగమేనని అన్నారు. చాలా హాస్టల్లో వసతులు సరిగా లేక అరకొర వసతులతో బాలికలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. అదేవిధంగా పురుగుల పడ్డ, చెడిపోయిన ఆహార పదార్డాలను పిల్లలకు అందిస్తుంటే,పిల్లలు ఇదేంటని అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే, ప్రశ్నించిన పిల్లల మీద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కక్షగట్టి పిల్లల్ని ఇబ్బందుల గురిచేస్తుంటే మనస్థాపానికి గురై తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వ ఉన్నత అధికారులు తక్షణమే కల్పించుకొని అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైష్ణవి ఆత్మహత్య పై విచారణ జరిపి,కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.లేనియెడల ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఎనిమిదవ సారి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమితులైన బాకీ తరుణ్
హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం నందు నల్గొండ జిల్లా కొండారం గ్రామం గ్రామానికి చెందిన బాకీ తరుణ్ గారిని 8 వా సారీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా బాకీ తరుణ్ రాష్ట్ర కోఆర్డినేటర్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ గారికి మరియు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసి సంఘం అభివృద్ధికి తోడ్పడుతానని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై కృషి చేస్తానని నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికై హాస్టల్ సమస్యల పైన పోరాటం చేస్తానని తెలిపారు.
తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీలు..
తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీలు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు చేసిన సర్కార్
ఈసీ గైడ్‌లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని..
కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం సూచన
TS: సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని మృతి...
స్కూల్లో ఫేర్ వెల్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్టూడెంట్స్ ఆ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా ఓ విద్యార్థిని మాత్రం ఫేర్ వెల్ డే లో పాల్గొన్న కాసేపటికే గదిలోకి వెళ్లింది. ఆ తర్వాతర ఏం జరిగిందంటే?
ఇటీవల కొందరు చిన్న చిన్న విషయాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారి కలలను కాలరాస్తూ తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇటీవల భువనగిరిలో ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సూర్యపేటలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాలలో ఫేర్ వేల్ డేలో పాల్గొన్న కాసేపటికే గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా ఆ విద్యార్థిని అపస్మారక స్థితిలో ఉంది. దీంతో ఆందోళనకు గురైన తోటి విద్యార్థినులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కు చేరవేశారు. అసలు ఏం జరిగిందంటే?
సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి. ఈమె సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాగా గురుకుల పాఠశాలలో శనివారంనాడు ఫేర్ వెల్ డే ఉండడంతో తమ కూతురుకు పూలు, గాజులు ఇచ్చి వెళ్లాడు తండ్రి. పాఠశాలలో జరిగిన ఫేర్ వెల్ డేలో వైష్ణవి పాల్గొన్నది. అయితే ఓవైపు ఫేర్ వెల్ డే జరుగుతుండగానే హాస్టల్ గదిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చి చూసిన విద్యార్థినులు వైష్ణవి అపస్మారక స్థితిలో పడి ఉండడం చూసి ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వైష్ణవిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే వైష్ణవి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.
వైష్ణవి మృతిచెందిన విషయాన్ని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న వైష్ణవి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా తమ కూతురు వైష్ణవి మృతికి ప్రిన్సిపాలే కారణమంటూ వారు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమ కూతురు ఇంటికి వచ్చినప్పుడు మున్సిపల్ చైర్‌పర్సన్ కలిసి ఎలా చదువుతున్నావని పలకరించిందని చెప్పారు. అప్పుడు తమ కూతురు.. హాస్టల్‌లో అన్నం బాగుండడం లేదని, రాళ్లు వస్తున్నాయని చెప్పిందని వెల్లడించారు.
వెంటనే మున్సిపల్ చైర్‌పర్సన్ ఫోన్‌లో ప్రిన్సిపల్‌తో మాట్లాడారని చెప్పారు. ఈ విషయం మనసులో పెట్టుకుని తమ కూతురును వేధించారని, దీంతోనే మనస్తాపంతో మృతిచెందిందని, తమ కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. తమ కూతురు మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అమెరికాలో విజృంభిస్తోన్న ప్లేగ్ వ్యాధి..
అమెరికాలో విజృంభిస్తోన్న ప్లేగ్ వ్యాధి. ఒరెగాన్ స్టేట్‌లో తొలి పాజిటివ్ కేసు.. పదేళ్ల తర్వాత మరోసారి ప్లేగ్ వ్యాధి కలకలం.. పెంపుడు పిల్లుల ద్వారా సోకిన ప్రాణాంతక వ్యాధి.
Feb 13 2024, 15:30