NLG: స్పెషల్ ఆఫీసర్ కు సమ్మె నోటీసు ఇచ్చిన గ్రామపంచాయతీ కార్మికులు

మర్రిగూడ మండలం, రాంరెడ్డి పల్లి గ్రామపంచాయతీలో కార్మికులు, గ్రామపంచాయతీ స్పెషల్ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి మాలతి కి, ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె నోటీసు ఇచ్చారు. కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని, 51 జిఓ ను సంవరించాలని సమ్మె నోటీసు ఇచ్చారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, జిపి వర్కర్స్ ముత్తయ్య, యాదయ్య, సందమ్మ, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

NLG: విద్యార్థులకు స్వచ్ఛందంగా ఫిజికల్ ఫిట్నెస్, క్రికెట్ కోచింగ్ ప్రోగ్రాం
నల్గొండ: మాధవ్ నగర్ జేబిఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మపాల గిరిబాబు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఫిజికల్ ఫిట్నెస్ మరియు క్రికెట్ కోచింగ్ శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రాస్ రూట్ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు

నల్గొండ: మాధవ్ నగర్ జేబిఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, వ్యాయామ ఉపాధ్యాయులు బొమ్మపాల గిరిబాబు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఫిజికల్ ఫిట్నెస్ మరియు క్రికెట్ కోచింగ్ శిక్షణ కార్యక్రమ

TS: మేడారం జాతరకు ఆరువేల ప్రత్యేక బస్సులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు మంగళవారం ప్రకటించింది.

మేడారం జాతర 21 నుంచి 24 వరకు జరుగనుండగా, భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపింది.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం, మేడారం సమక్క-సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఉన్నతాధికారులతో కలిసి సోమవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క పరిశీలించినట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

16న మేడారంలో టీఎస్‌ఆర్టీసీ బేస్‌క్యాంప్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు.30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.ఆయా జిల్లాల భక్తులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేస్తామని సజ్జనార్‌ చెప్పారు...

NLG: చత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో గ్రౌండ్ పూజ

నల్లగొండ: చత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో, ఈరోజు సాయంత్రం ఎన్జీ కాలేజ్ మైదానంలో క్రీడాకారులు కబడ్డీ ప్రాక్టీస్ చేసిన అనంతరం ప్రతి మంగళవారం నిర్వహించే గ్రౌండ్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మ పాల గిరిబాబు తెలిపారు.

ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఫిజికల్ ఫిట్నెస్, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కబడ్డీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కబడ్డీ క్రీడాకారులు షరీఫ్, నాగేష్, చంటి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పి.ఆర్.టి.యు సీనియర్ కార్యకర్త, సర్వేల్ పాఠశాల ఉపాధ్యాయునీరాలు ఎస్. విజయలక్ష్మి కి సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా:

నారాయణపూర్: మండల వనరుల కేంద్రంలో ఈరోజు, పిఆర్టియు సీనియర్ కార్యకర్త, సర్వేల్ పాఠశాల టీచర్ ఎస్. విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు మాట్లాడుతూ.. పి ఆర్ టి యు కార్యకర్త విజయలక్ష్మి ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ కాబోతున్న సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించామని తెలిపారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి జి.శ్రీనివాస్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రమ, మండల ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, రాష్ట్ర బాధ్యులు సురేందర్ రెడ్డి, హరి కిషన్ రెడ్డి, జిల్లా బాధ్యులు చొల్లేటి శ్రవణ్ కుమార్, యాదిరెడ్డి, మండల కార్యదర్శి పబ్బు దేవేందర్, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

NLG: ఎంపీ బరిలో జానారెడ్డి తనయుడు.. గెలిపించుకుంటామన్న స్థానిక నాయకులు

నల్లగొండ: మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి చిన్నకుమారుడు జయవీర్ రెడ్డి, ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్ లో తన అన్న రఘువీర్ రెడ్డి తరపున అప్లికేషన్ అందజేశారు. 

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమవుతోంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కూడ ముగియడంతో 6న పిసిసి ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించనుందని సమాచారం, నల్లగొండ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సన్నిహితుడు గా ఉంటూ ప్రజల మన్ననలను పొందారు. 

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేరొందిన యువ నాయకుడు గా గుర్తింపు పొందారు. బడుగు బలహీన వర్గాల ప్రజల మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి తమ్ముడు జయవీర్ రెడ్డి అధిక మెజార్టీ తో గెలిచారు. ఇదే తరహాలో రఘువీర్ రెడ్డికి కూడా ఎంపీ టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలందరూ సన్నద్ధమై అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించుకుంటామంటున్నారు

ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షులు కెలావత్ నగేష్ నాయక్ నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. రఘువీర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించినట్లయితే విజయం సాధించడానికి తామంతా కృషి చేసి గెలిపించుకుంటామని తెలిపారు.

కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 2023-24 విద్యా సంవత్సరం నుండి స్వయం ప్రతిపత్తి పొందినది. కళాశాలకు స్వయం ప్రతిపత్తి వచ్చిన తరువాత మొదటి సారిగా మొదటి సెమిస్టర్ పరీక్షలు 2023 డిసెంబర్ లో నిర్వహించటం జరిగినది. ఈ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం నాడు కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యాం, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి (COE) డాక్టర్ ఆర్. నరేష్ ల సమక్షంలో  మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ G. ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. 

విద్యార్థినిలు కళాశాల వెబ్ సైట్ (https://gdcts.cgg.gov.in/ramagiri.edu) లో ఫలితాలు పొందవచ్చని వారు తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 766 విద్యార్థినిలు హాజరు కాగా, 267 మంది ఉత్తీర్ణులు కాగా 499 మంది విద్యార్థినిలు ప్రమోట్ అయినట్లు పేర్కొన్నారు. కళాశాల మొత్తం ఉత్తీర్ణత 34.86% గా ఉండగా బి. కామ్ విభాగంలో అత్యధికంగా 50.25% ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. పునర్ మూల్యాంకనం (రీ వాల్యుయేషన్) ప్రకటన త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారి (ACOE) త్రిపురం భాస్కర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కె.దేవవాణి, లైబ్రేరియన్ డాక్టర్ యస్. రాజారామ్, వివిధ విభాగాల అధిపతులు, పరీక్షల విభాగ సభ్యులు, పరీక్షల నియంత్రణ అధికారి (COE) కార్యాలయం సిబ్బంధి సునీత, వహీద్, అలివేలు పాల్గొన్నారు.

NLG: తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలి: ఎస్ఎఫ్ఐ

ఫిబ్రవరి 10,11న నల్లగొండ లో జరిగే తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు నేనావత్ ఉమా అన్నారు. ఈ రోజు దేవరకొండలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కరపత్రాలు విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థీనీలపై జరిగే దాడులను అరికట్టేందుకు అన్ని రంగాలలోని విద్యార్థులు, మహిళలు ఏకం కావాలని అన్నారు. డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్,గర్ల్స్ నాయకురాలు పాల్గొన్నారు.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా 32వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో.. బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా హాజరైన మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గత నెల జనవరి 8న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది.

TS: గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా కే. సీతా లక్ష్మి ని నియమించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా ఉన్న నవీన్ నికోలస్ ను.. టీఎస్పిఎస్సీ కార్యదర్శిగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా కే. సీతా లక్ష్మి ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.