నిజందాగదుక్షణంఆగదు

Oct 28 2023, 10:20

ఓటరుగా నమోదుకు లాస్ట్ డేట్ ఇదే!

ఓటరుగా నమోదుకు లాస్ట్ డేట్ ఇదే!

తెలంగాణలో కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31 వరకు మాత్రమే అవకాశం ఉంది. అన్ని అర్హతలు ఉండి ఓటరు జాబితాలో పేరు లేని వారు తమ ప్రాంతానికి చెందిన బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) వద్ద మాన్యువల్ లేదా eci.gov.in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందుకోసం మొబైల్ నంబర్, ఫొటో, గుర్తింపు కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పది రోజుల్లో దరఖాస్తును పరిశీలించి ఆమోదం తెలుపుతారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 28 2023, 10:03

దీపావళి తేదీపై సందిగ్ధత - పండితుల క్లారిటీ, సెలవు ఖరారు..!!

Diwali 2023: దీపావళి తేదీపై సందిగ్ధత - పండితుల క్లారిటీ, సెలవు ఖరారు..!!


దీపావళి కి పండుగల్లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఈ పండగను కార్తీకమాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ సంవత్సరం దీపావళి తేదీల్లో మార్పులు రావడంతో తేదీల్లో గందరగోళం నెలకొంది. దీని పైన పండితులు స్పష్టత ఇస్తున్నారు. ప్రభుత్వం సెలవు పైన క్లారిటీ ఇచ్చింది.


అమావాస్య తిధి ఇలా

దీపావళి ప్రతి సంవత్సరం ఈ పండగను ఘనంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం దీపావళి పండుగను అమావాస్య తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం నవంబర్ 12వ తేదీన అమావాస్య తిథి ప్రారంభం కాబోతోంది. ఈ తిథి మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2.50 గంటలకు ముగుస్తుంది.


ఈరోజు ప్రత్యేక పూజలు చేయాలనుకునేవారు అమ్మవారికి ప్రదోషకాలంలో ఉపవాసాలు, పూజలు చేయడం శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో లక్ష్మీదేవి పూజతో పాటు గణేశుడి పూజను కూడా చేయడం శుభప్రదంగా చెబుతున్నారు. నవంబర్ 12 సాయంత్రం 5:39 నుంచి 7:35 వరకు లక్ష్మీపూజకు అనువైన సమయం గా పేర్కొంటున్నారు.

అయిదు రోజుల పండుగ

ధంన్ తేరాస్ జరుపుకున్న మరుసటిరోజే ఈ నరక చతుర్దశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీన నరక చతుర్దశిని జరుపుకోవాలని వేద జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ధంన్ తేరాస్ జరుపుకున్న మరుసటిరోజే ఈ నరక చతుర్దశి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం నవంబర్ 11వ తేదీన నరక చతుర్దశిని జరుపుకోవాలని వేద పండితులు చెబుతున్నారు.ప్రతి సంవత్సరం గోవర్ధన పూజను దీపావళి జరుపుకున్న తర్వాత మరుసటి రోజు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పూజను కార్తీక మాసం రోజున జరుపుకోవాలని సూచిస్తున్నారు. తిథుల ప్రకారం నవంబర్ 14వ తేదీన గోవర్ధన జరుపుకోవాల్సి ఉంటుంది.సెలవుల ప్రకటన

దసరా సెలవులు ముగియటంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. దసరా సెలవుల విషయంలో అధికారికంగా ప్రకటించే సందర్భంగా చివరి నిమిషం వరకు ఊగిసలాట కనిపించింది. దీంతో, దీపావళి సెలవు పైన మాత్రం ఈ సారి ముందే స్పష్టత ఇచ్చారు. ఈ సారి నవంబర్ 12న (ఆదివారం) దీపావళి రావడంతో ఆ రోజునే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సెలవుగా ప్రకటించాయి. ఇక దీపావళి ఏ రోజు చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. నవంబర్ 12వ తేదీ రాత్రి గడియల్లో అమావాస్య తిథి ఉండటంతో ఆ రోజునే దీపావళి పండుగ జరుపుపోవాలని పండితులు సూచిస్తున్నారు. దీంతో..మొత్తంగా ఈ సారి నవంబర్ 12వ తేదీనే దీపావళి జరుపుకొనేందుకు సిద్దం అవుతున్నారు.


నిజందాగదుక్షణంఆగదు

Oct 28 2023, 09:30

గూగుల్ పే వాడుతున్న వారికి గుడ్ న్యూస్!

గూగుల్ పే వాడుతున్న వారికి గుడ్ న్యూస్!

బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా కస్టమర్లకు ఇంకా చిన్న వ్యాపారాలకు లోన్ ప్రొడక్ట్స్ అందించడం ప్రారంభిస్తామని Google Pay తెలిపింది. 

 


భారతదేశంలో గుర్తింపుని మరింతగా విస్తరించాలని చూస్తున్న Google Pay వినియోగదారులకు ఇంకా చిన్న వ్యాపారాలకు లోన్ ప్రొడక్ట్స్ అందించడం ప్రారంభించనున్నట్లు తెలిపింది. దేశంలో చాలా మందికి ఇప్పటికీ సరైన లేదా సమానమైన ఆర్థిక సేవలు పొందేందుకు తగిన ఆక్సెస్ లేదు.

 

ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యంతో దేశంలోని వినియోగదారులకు, చిన్న వ్యాపారాలకు లోన్ ప్రొడక్ట్స్ అందించడం ప్రారంభిస్తామని Google Pay ప్రకటించింది. "గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల ద్వారా క్రెడిట్ (లోన్) జారీ చేయబడినప్పటికీ, Google Pay వాటిని యాక్సెస్ చేయడానికి, సులభంగా ఇంకా సౌకర్యవంతంగా చేయడానికి వారితో సహకరిస్తుంది" అని ఏజెన్సీ తెలిపింది.

 

భారతదేశంలోని Paytm, PhonePe వంటి వాటితో పోటీ పడుతున్న ఫిన్‌టెక్ కంపెనీ వ్యాపారులకు రూ. 15,000 నుండి సాచెట్ లేదా స్మాల్-టికెట్ రుణాలను అందించడానికి DMI ఫైనాన్స్‌తో భాగస్వామ్యం ఉంది. అంతేకాకుండా, వ్యాపారులు వారి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి దీని ద్వారా వారికి ePayLater భాగస్వామ్యంతో క్రెడిట్ లైన్‌ను కూడా అందిస్తుంది.

"ప్రపంచ సగటుతో పోలిస్తే భారతదేశం రుణాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయి" అని ఏజెన్సీ పేర్కొంది. అలాగే, PhonePe అండ్ Paytmతో పాటు Google Pay దేశంలోని UPI వాల్యూమ్‌లలో అత్యధిక వాటా ఉంది.

వినియోగదారుల కోసం Google Pay Axis బ్యాంక్‌తో భాగస్వామ్యం ద్వారా వ్యక్తిగత రుణాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. దీని ద్వారా వ్యక్తిగత రుణాలను Google Payలో అందుబాటులో ఉంచడం కూడా తెలిసిందే. 

దేశంలో కొన్నేళ్లుగా యూపీఐ వినియోగం పెరుగుతుండడంతో నగదు వినియోగం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి అప్లికేషన్లను కస్టమర్లు ఎక్కువగా వాడుతున్నారు. 


నిజందాగదుక్షణంఆగదు

Oct 28 2023, 07:28

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..ఇలా దరఖాస్తు చేసుకోండి..!!

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..ఇలా దరఖాస్తు చేసుకోండి..!!


నిరుద్యోగులకు శుభవార్త. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL మేనేజర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు HAL hal-india.co.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో అందించిన వివరాల ప్రకారం, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2023.

ఖాళీల వివరాలు :

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 84 పోస్టులను భర్తీ చేస్తుంది. వీటిలో-

సీనియర్ టెస్ట్ పైలట్ (FW) / టెస్ట్ పైలట్ (FW): 2 పోస్టులు

చీఫ్ మేనేజర్ (సివిల్): 1 పోస్ట్

సీనియర్ మేనేజర్ (సివిల్): 1 పోస్ట్

డిప్యూటీ మేనేజర్ (సివిల్): 9 పోస్టులు

మేనేజర్ (IMM) I: 5 పోస్ట్‌లు

డిప్యూటీ మేనేజర్ (IMM): 12 పోస్టులు

ఇంజనీర్ (IMM): 9 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్): 9 పోస్టులు

ఫైనాన్స్ ఆఫీసర్: 6 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (HR): 5 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (లీగల్): 4 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్): 5 పోస్టులు

సెక్యూరిటీ ఆఫీసర్: 9 పోస్టులు

ఆఫీసర్ (ఆఫీసర్ లాంగ్వేజ్): 1 పోస్ట్

ఫైర్ ఆఫీసర్: 3 పోస్టులు

ఇంజనీర్ (CS) (కాంప్లెక్స్ ఆఫీస్): 3 పోస్టులు

దరఖాస్తు రుసుము:

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500/-. ఈ అప్లికేషన్ ఫీజులో 18% GST కూడా యాడ్ చేసి ఉంటుంది. అయితే, SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఎక్కడ దరఖాస్తు చేయాలి?

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ పూర్తి చేసిన దరఖాస్తును నిర్ణీత నమూనాలో చివరి తేదీలోపు కింది చిరునామాకు పంపవచ్చు: చీఫ్ మేనేజర్ (హెచ్‌ఆర్), రిక్రూట్‌మెంట్ విభాగం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, 15/1 కబ్బన్ రోడ్, బెంగళూరు – 560 001. మరిన్నింటికి ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం, అభ్యర్థులు HAL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అర్హత ప్రమాణాలు:

ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రతి పోస్ట్‌కు వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితిని చెక్ చేసుకోవచ్చ.

నిజందాగదుక్షణంఆగదు

Oct 21 2023, 07:41

సూర్యాపేటలో కాంగ్రెస్నూ వీడి టిఆర్ఎస్ లోకి కార్యకర్తల వలసలు...

సూర్యాపేట పట్టణంలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్న కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు

28వ వార్డులో కాంగ్రెస్ గుడ్ బై చెప్పిన కాంగ్రెస్ కార్యకర్తలు 

మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

 సూర్యాపేట

 ఎన్నికలు సమీపిస్తున్న వేళ సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. పట్టణంలో, నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కారెక్కుతున్నారు. తాజాగా కాంగ్రెస్ కు పట్టు ఉన్న సూర్యాపేట మున్సిపాలిటీ 28వ వార్డుకు చెందిన మైనార్టీ కాంగ్రెస్ నాయకులతోపాటు , 100 మంది యూత్ నాయకులు కాంగ్రెస్ కు రాజీనామా చేసి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు. గులాబీ కండువాతో ఆహ్వానం పలికారు. కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన చేరీకల కార్యక్రమంలో మొయినుద్దీన్ పాల్గొనగా , అంజద్, సాజిద్, నజీర్, నజీర్, జునైద్, జానీ, ఆరీఫ్, తో పాటు చింతల నాగరాజు, నవీన్, కార్తీక్, రోహిత్, సందీప్, చంద్రశేఖర్, లక్ష్మణ్, సుధాకర్ తో పాటు వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 20 2023, 19:45

పాక్‌కి వెళ్లినప్పుడు నాపైన రాళ్లు వేశారు! ‘జై శ్రీరామ్’ అంటే తప్పేంటి... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

పాక్‌కి వెళ్లినప్పుడు నాపైన రాళ్లు వేశారు! ‘జై శ్రీరామ్’ అంటే తప్పేంటి... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం అందుకుంది. ఈ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ని చూస్తూ ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు కొందరు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్. ఈ ప్రవర్తనపై పాకిస్తాన్ క్రికెట్ కోచ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు..

article_image1భారత్ చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కూడా దీన్ని సాకుగా పెట్టుకుని, సానుభూతి పొందాలని ప్రయత్నించింది. అహ్మదాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫ్యాన్స్ చేసిన దానికి తామేం చేయలేమని, వారికి కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని తేల్చేసింది ఐసీసీ..


తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దీనిపై స్పందించాడు. ‘నేను ఓ సారి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాను. అప్పుడు నా పైకి రాళ్లు, ఐరన్ బోల్ట్‌లు విసిరారు. అందులో ఓ రాయి నా కళ్ల మధ్య తగిలింది. కంటికి తగిలి ఉంటే నా చూపు పోయి ఉండేది..


అయితే అభిమానులు చేసిన ఆ చిల్లర పనిని పట్టుకుని, మేం రచ్చ చేయాలని అనుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మాత్రం చెత్త పర్ఫామెన్స్ కారణంగా వస్తున్న ట్రోలింగ్ తప్పించుకునేందుకు అహ్మదాబాద్ ఫ్యాన్స్ చేసిన చిన్న పనిని పెద్దది చేయాలని చూస్తోంది..’ అంటూ వ్యాఖ్యానించాడు ఇర్ఫాన్ పఠాన్..


పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా దీనిపై ఘాటుగా స్పందించాడు. ‘పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ జైనబ్ అబ్బాస్ ఇండియా గురించి, హిందువుల గురించి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే తప్పులేదు..

 


article_image5

ఐసీసీ ఈవెంట్‌లో పాకిస్తాన్ పాటలు వేయలేదని మిక్కీ ఆథర్, దీన్ని బీసీసీఐ ఈవెంట్ అంటే తప్పులేదు? ప్లే గ్రౌండ్‌లో, భారతీయుల మధ్య మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేస్తే తప్పులేదు.. ఎదుటివారిలోనే తప్పులు వెతకాలని చూడకండి?’ అంటూ ట్వీట్లు చేశాడు డానిష్ కనేరియా...

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి తర్వాత భారత జట్టుపై పాక్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మహ్మద్ షమీ, ఓ పాక్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. అయితే మిగిలిన టీమ్ ప్లేయర్లు, ఓటమి బాధతో డ్రెస్సింగ్ రూమ్‌కి సైలెంట్‌గా వెళ్లారే తప్ప, జనాల ప్రవర్తనను పెద్దది చూసి సానుభూతి పొందాలని చూడలేదు.. 

నిజందాగదుక్షణంఆగదు

Oct 20 2023, 19:15

కాంగ్రెస్‌కు టాటా.. బీఆర్‌ఎస్‌ బాట..

కాంగ్రెస్‌కు టాటా.. బీఆర్‌ఎస్‌ బాట

ఆసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ పార్టీలో కల్లోలం కొనసాగుతున్నది. కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడటం అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతున్నది.

ఒకవైపు రాహుల్‌గాంధీని తీసుకువచ్చి బస్సుయాత్ర చేస్తుండగా, మరోవైపు అదే ఊపులో పార్టీకి నేతలు గుడ్‌బై చెప్పడం కనిపిస్తున్నది.

టికెట్లలో అన్యాయంపై బీసీ నేతల గుర్రు

నిత్యం కాంగ్రెస్‌ను వీడుతున్న సీనియర్లు

దశాబ్దాలుగా సేవచేసినా పట్టించుకోలేదని ఆవేదన

ఏకంగా డీసీసీ అధ్యక్షులు కూడా రాజీనామా

బీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్న నాయకులు

త్వరలో మరిన్ని చేరికలుండే అవకాశం

అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ పార్టీలో కల్లోలం కొనసాగుతున్నది. కాంగ్రెస్‌కు చెందిన అనేక మంది నేతలు పార్టీని వీడటం అగ్రనాయకత్వాన్ని కలవరపెడుతున్నది. ఒకవైపు రాహుల్‌గాంధీని తీసుకువచ్చి బస్సుయాత్ర చేస్తుండగా, మరోవైపు అదే ఊపులో పార్టీకి నేతలు గుడ్‌బై చెప్పడం కనిపిస్తున్నది. సగం కూడా టిక్కెట్లు ప్రకటించకముందే పరిస్థితి ఇలా ఉంటే.. మొత్తం అసెంబ్లీ స్థానాలకు టిక్కెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని కాంగ్రెస్‌ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఎన్నికల్లో పోటీచేసే స్థాయి నేతలు లేక ఇబ్బందిపడుతున్న పార్టీకి, వర్గపోరు తలనొప్పిగా పరిణమించింది. పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న నేతలెవరూ ఇప్పుడు సంతోషంగా లేరని సమాచారం. అనేకమంది అసంతృప్త నేతలు అధికార భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ నాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

ప్రవాహంలా బీఆర్‌ఎస్‌లోకి నేతలు

కాంగ్రెస్‌లో అంతర్గత పోరు, వివక్ష నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి నేతల ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. కొన్నాళ్లుగా ప్రతీ రోజూ కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి నేతల నుంచి జిల్లా, మండలస్థాయి నేతలవరకు బీఆర్‌ఎస్‌లో చేరుతూనే ఉన్నారు. గడిచిన 15-20 రోజుల నుంచి చేరికలు మరింత పెరిగాయి. ఏకంగా మూడు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు తమ అనుచరులతో సహా బీఆర్‌ఎస్‌లో చేరారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సైతం బీఆర్‌ఎస్‌లో చేరారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్‌, బీజేపీ నుంచి మరిన్ని చేరికలుండే అవకాశం ఉన్నది.

బీఆర్‌ఎస్‌లో చేరిన కీలక నేతలు

పొన్నాల లక్ష్మయ్య:పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, బీసీ నేతగా గుర్తింపు ఉన్న నాయకుడు. జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగా తనను అణచివేసే కుట్ర చేస్తున్నదని, రేవంత్‌రెడ్డి అక్కడి సీటును ఇతరులకు బేరానికి పెట్టాడని ఆరోపిస్తూ ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు.

కంఠారెడ్డి తిరుపతిరెడ్డి: మెదక్‌ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తిరుపతి రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న అపసవ్య పరిస్థితులను చూసి ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. మెదక్‌ నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహనలేని వ్యక్తిని తీసుకొచ్చి టిక్కెట్టు ఇవ్వడాన్ని నిరిసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు.

నందికంటి శ్రీధర్‌:మేడ్చల్‌-మల్కాజ్‌గిరికి చెందిన నందికంటి శ్రీధర్‌ బీసీ బిడ్డ. ఐదేండ్లుగా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ కోసం శ్రమపడ్డ ఆయనను కాదని మైనంపల్లి హన్మంతరావుకు టిక్కెటు ఇవ్వడంతో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీధర్‌కు ఎంబీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చి బీఆర్‌ఎస్‌ గౌరవించుకున్నది.

పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి:గద్వాలకు చెందిన పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వ్యక్తి. ఆయన టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.

పీ శశిధర్‌రెడ్డి: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మెదక్‌ మాజీ ఎమ్మెల్యే కూడా అయిన పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరారు.

గంట రాములు: పీసీసీ స్ట్రాటజీ కమిటీ సభ్యుడు, పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓదెల మండలం జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. నియోజకవర్గ స్థాయిలో బలమైన నేతగా ఈయనకు గుర్తింపు ఉన్నది.

కురువ విజయ కుమార్‌:పీసీసీ ప్రధాన కార్యదర్శి కురువ విజయ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడారు. పార్టీలో అడ్డగోలుగా టిక్కెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ రాజీనామా చేశారు.

చింతపల్లి జగదీశ్వర్‌రావు: పీసీసీ సభ్యుడిగా ఉన్న చింతపల్లి జగదీశ్వరరావు, పార్టీ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలో తనకు తీరని అన్యాయం జరిగిందని కార్యకర్తలతో సమావేశంపెట్టి మరీ వివరించారు.

రాగిడి లక్ష్మారెడ్డి:కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు. ఉప్పల్‌ నియోజకవర్గంలో మంచి పేరున్నది. ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించాడు.

చెరుకు సుధాకర్‌:తెలంగాణ ఉద్యమ పోరాటంలో పీడీ యాక్టు కింద అరెస్టయిన తొలి వ్యక్తి. బీసీ నేత. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, కొందరు ఉద్దేశపూర్వకంగా పార్టీ అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించడంపై ఆవేదనతో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌ను వీడారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి: భువనగిరికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, యువజన సంఘాల నేత జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి టిక్కెట్టు ఆశించి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ పార్టీ ఆయనను మోసం చేయడంతో పార్టీని వీడుతున్నారు. శుక్రవారం మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుల సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

సోమశేఖర్‌ రెడ్డి:ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన సోమశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చురుకైన నేత. కార్పొరేటర్‌ కూడా. పార్టీ తీరు నచ్చక ఆయన బయటకు వచ్చారు.

నాగం జనార్ధన్‌రెడ్డి: మాజీ మంత్రి నాగం జానర్ధన్‌ తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి. సీనియర్‌ నేత. ఈయనకు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే సీటు రాకుండా చేసేందుకు వ్యూహం పన్నారు. కాంగ్రెస్‌ తీరుపై విసిగిపోయిన ఆయన పార్టీకి దూరమయ్యారు.

కొత్త మనోహర్‌రెడ్డి:మహేశ్వరానికి చెందిన కొత్త మనోహర్‌రెడ్డి అసెంబ్లీ టిక్కెట్లు అమ్ముకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ తీరుపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 20 2023, 19:10

చోర్‌ కాంగ్రెస్‌.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న హస్తం పార్టీ: కేటీఆర్‌

చోర్‌ కాంగ్రెస్‌.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న హస్తం పార్టీ: మంత్రి కేటీఆర్‌

దేశానికి సీ టీమ్‌ కాంగ్రెస్‌. అంటే చోర్‌ కాంగ్రెస్‌. ఏ అంటే ఆదర్శ్‌, బీ అంటే భోఫోర్స్‌, సీ కామన్వెల్త్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ టు జెడ్‌.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న పార్టీ కాంగ్రెస్సే

అగస్టా, కామన్వెల్త్‌ మొదలు బొగ్గు దాకా దోచేశారు

అవినీతి, కుటుంబపాలనపై రాహుల్‌ మాట్లాడటమా?

నల్లగొండ ఫ్లోరోసిస్‌ పాపం కాంగ్రెస్‌ పాలనదే

దివ్యాంగులకు అత్యధిక పింఛను తెలంగాణలోనే

కేసీఆర్‌ లాంటి నాయకుడు శతాబ్దానికి ఒక్కరు

మరోసారి బీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను దీవించాలి

దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

దేశానికి సీ టీమ్‌ కాంగ్రెస్‌. అంటే చోర్‌ కాంగ్రెస్‌. ఏ అంటే ఆదర్శ్‌, బీ అంటే భోఫోర్స్‌, సీ కామన్వెల్త్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ టు జెడ్‌.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న పార్టీ కాంగ్రెస్సే

– మంత్రి కేటీఆర్‌

దేశానికి సీ టీమ్‌ కాంగ్రెస్‌.. అంటే చోర్‌ కాంగ్రెస్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో విచారణ కొనసాగుతున్నదని, అలాంటిది అవినీతి గురించి రాహుల్‌ మాట్లాడటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కే వాసుదేవరెడ్డి నేతృత్వంలో గురువారం నిర్వహించిన దివ్యాంగుల పెన్షన్‌ లబ్ధిదారుల కృతజ్ఞత సభలో కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర పర్యటనలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జవహర్‌లాల్‌నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ.. ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ.. ఆయన భార్య సోనియా గాంధీ.. ఆమె కొడుకు రాహుల్‌గాంధీ, కూతురు ప్రియాంకగాంధీ కుటుంబపాలన గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయమే రూ.80 వేల కోట్లు అని, అమెరికాకు చెందిన సంస్థలు సైతం ఆ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించాయని తెలిపారు. ప్రాజెక్టు ఖర్చు కంటే అవినీతి ఎక్కువైందనటంపై మండిపడ్డారు. రాహుల్‌గాంధీ లీడర్‌ కాదని, రీడర్‌ అని.. స్థానిక కాంగ్రెస్‌ నేతలు రాసించ్చిందే చదువుతారని ఎద్దేవా చేశారు.

పుట్టుక నుంచి చావు వరకు ప్రభుత్వం అండగా ఉంటున్నది. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం అన్ని రంగాలను కేసీఆర్‌ బాగు చేశారు. కేసీఆర్‌ లాంటి నాయకుడు శతాబ్దానికి ఒక్కరు వస్తారు. అలాంటి నాయకుడి సారథ్యాన్ని మళ్లీ తెచ్చుకోవాలి.

– మంత్రి కేటీఆర్‌

ఫ్లోరోసిస్‌ పాపం కాంగ్రెస్‌దే

కాంగ్రెస్‌, బీజేపీలు దివ్యాంగులను ఎన్నడూ మనుషులుగా కూడా చూడలేదని, కానీ నేడు ఓట్ల కోసం చాలా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కేవలం 47 వేల మందికి, అదీ అనేక కొర్రీలు పెట్టి రూ.600-రూ.1,000 మాత్రమే పింఛను ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో 1.25 లక్షల మందికి రూ.200 చొప్పున, కర్ణాటకలో రూ.1,100, యూపీ, రాజస్థాన్‌లో అంతే ఉన్నదని తెలంగాణలో మాత్రం రూ.4,000 ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్తున్నారని ధ్వజమెత్తారు.

ఎవరూ అడగకముందే సీఎం కేసీఆర్‌ దివ్యాంగుల పిం ఛన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచారని, 5.65 లక్షల మందికి అందిస్తున్నారని, గెలిచాక రూ.6,016కు పెంచనున్నట్టు వెల్లడించారు. తొమ్మిదేండ్లలో దివ్యాంగుల పింఛను కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,300 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. దివ్యాంగులు సమాజాన్ని ప్రభావితం చేయగలరని, అం దుకు సిరిసిల్లకు చెందిన దివ్యాంగ కవయిత్రి రాజేశ్వరిని ఉదహరించారు. దివ్యాంగులు ఒక్కొక్కరు సైనికుల్లా పనిచేసి పదిమందితో బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించాలని విజ్ఞప్తి చేశారు.

దివ్యాంగుల సంక్షేమంలో ఆదర్శం

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద అందరి కీ ఇచ్చేలా కాకుండా దివ్యాంగులకు అదనంగా రూ.1.25 లక్షలు కలిపి మొత్తంగా రూ.2.25 లక్షలు నగదు ప్రోత్సాహాకాన్ని అందిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. దివ్యాంగుల కు 2.75 లక్షలకుపైగా బ్యాటరీ వాహనాలు, వీల్‌చైర్లు, బధిరులు, అంధులకు అత్యాధునిక ఉపకరణాలను ఉచితంగా అందజేశామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను 3 నుంచి 4శాతానికి పెంచామని, డబుల్‌ బెడ్రూం, గృహలక్ష్మి ఇలా అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కుతుందని స్పష్టం చేశారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రూపకల్పన చేసిన 'దివ్యాంగుల బతుకుల్లో దినకరుడమ్మా.. దివ్యం గా వెలుగు వెదజల్లాడమ్మా' పాటను కేటీఆర్‌ ఆవిష్కరించారు.

దివ్యాంగుల్లో ఆత్మనిబ్బరం: వాసుదేవరెడ్డి

దివ్యాంగ సమాజం ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మనిబ్బరంతో జీవిస్తున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లేనని దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి తెలిపారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పిలుపుతో అనేక మంది దివ్యాంగుల్లో మంత్రి కేటీఆర్‌ వెలుగులు ప్రసాదించారని కొనియాడారు. దివ్యాంగుల కృతజ్ఞత సభ కు విచ్చేసిన మంత్రి కేటీఆర్‌కు వాసుదేవరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్‌ మంద జగన్నాథం, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌, సుధీర్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్‌, చందర్‌రావు, దివ్యాంగుల ప్రతినిధులు రాజేశ్వరి, శ్రీనివాస్‌, మదర్‌పాషా, రాజు, చందర్‌, 2 వేల మందికిపైగా దివ్యాంగులు పాల్గొన్నారు.

 

దేశానికి సీ టీమ్‌ కాంగ్రెస్‌. అంటే చోర్‌ కాంగ్రెస్‌. ఏ అంటే ఆదర్శ్‌, బీ అంటే భోపోర్స్‌, సీ కామన్‌వెల్త్‌ ఇలా చెప్పుకుంటూ ఏ టు జెడ్‌.. ఆగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాక దోచుకున్న పార్టీ కాంగ్రెస్సే

– మంత్రి కేటీఆర్‌

రేవంత్‌ గజదొంగ

'రాహుల్‌గాంధీ పక్కన ఉన్న రేవంత్‌రెడ్డిని మించిన గజదొంగ లేడు. చార్లెస్‌ శో భరాజ్‌, దావుద్‌ ఇబ్రహీం కూడా రేవంత్‌ ముందు చిన్నోళ్లు. నాడు నోటుకు ఓటు. నేడు సీటుకు రేటు. రేపు రాష్ట్రం మొత్తా న్ని, కాంగ్రెస్‌ను కూడా బీజేపీకి టోకున అమ్ముతడు. అలాంటి నేతను పక్కన పెట్టుకుని అవినీతి గురించి మాట్లాడటమా?' అని అన్నారు. రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకోవాల్సి న దుస్థితి కాంగ్రెస్‌దని, పార్టీ నేతలతో మాట్లాడితే రేవంత్‌ బాగోతాలను చెప్తారని అన్నారు. కాంగ్రెస్‌లో బీజేపీ ఏజెం ట్‌, కోవర్ట్‌ రేవంతే అని ఆరోపించారు. గాడ్సేకు గాంధీభవన్‌ను అప్పగించారని చురకలు అంటించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా కూడా చేయని రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డికి దిమ్మతిరిగేలా ఓట్లతో జవాబివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

నిజందాగదుక్షణంఆగదు

Oct 20 2023, 18:22

వ్యవసాయ కూలీలకు కనీసవేతనం 750రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలనీ: న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ డిమాండ్

వ్యవసాయ కూలీలకు కనీసవేతనం 750రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలనీ:

న్యూడెమోక్రసీ నాయకులు

ముసలి సతీష్ డిమాండ్

రోజువారి వ్యవసాయ కూలీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమాన పనికి సమాన వేతనం 750రూపాయలు అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.

వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో రోజువారీ కూలీలను అతి తక్కువ 300 కూలీ తో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని సమయానికి మించి పని చేపిస్తున్నారని ఇది భూస్వాములకు తగదని వారన్నారు. ఏజెన్సీలో భూస్వాములు వందల ఎకరాలని ఆదివాసుల నుంచి కౌలుకు తీసుకొని అదే ఆదివాసీల తోటి వ్యభిచారి చేయించుకుంటున్నారని అది తక్కువ కూలి ఇస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చినప్పటికీ ఏజెన్సీలో ఏది అమలయ్యే పరిస్థితులు లేదని వారు అన్నారు అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారే తప్ప పట్టించుకునే పరిస్థితి లేదని వారు అన్నారు.తరతరాలుగా ఆదివాసి ప్రజలను ఎట్టి చాకిరి పేరుతో శ్రమదోపిడి చేస్తూనే ఉన్నారని వారన్నారు తక్షణమే ఏజెన్సీ ప్రాంతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని లేదా రోజుకి 750 రూపాయలు కూలిని ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు .

ఈ కార్యక్రమలను ఉదృతం చేస్తామని సతీష్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ బీమా పాండు సమ్మక్క భద్రమ్మ కూలీలు తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Oct 19 2023, 21:58

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌.. రేపు బీఆర్ఎస్‌లో చేరనున్న జిట్టా బాలకృష్ణా రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌.. రేపు బీఆర్ఎస్‌లో చేరనున్న జిట్టా బాలకృష్ణా రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సమక్షంలో బాలకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రేపు ఉదయం 11 గంటలకు జరగనుంది.

హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి గురువారం ఉదయం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.