నల్లగొండలో అతిధి అధ్యాపక పోస్టు భర్తీ కొరకు దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న వాణిజ్య శాస్త్రం - 01 అతిధి అధ్యాపక పోస్టు భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ లో 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం
ప్రాధాన్యత: నెట్/సెట్/పీహెచ్డీ మరియు బోధన అనుభవం పూర్తి చేసిన దరఖాస్తు తో పాటు విద్యా అర్హతలు, బోధనానుభవం సర్టిఫికెట్లతో ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు.

అభ్యర్థులు ఈనెల 13వ తేదీన తమ  ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించవచ్చు. Share it
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్.. సభల షెడ్యూల్ ఖరారు
TS: ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, సభలపై దృష్టి సారించాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి.. రేసులో ముందున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 15 నుంచి 41 నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

ఈనెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుండి నవంబర్ 9 వరకు బీఆర్ఎస్ అధినేత సభలకు షెడ్యూల్ ఖరారైంది. రోజుకు 2 లేదా 3 సభలలో  కేసీఆర్ పాల్గొనేలా బీఆర్ఎస్ నేతలు షెడ్యూల్ సిద్ధం చేశారు. ముందుగా హుస్నాబాద్‌లో కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార భేరీ మోగించారు. ఈసారి సభకు భారీ ఏర్పాట్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 16న జనగామ, భువనగిరిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు.ఈనెల 18న జడ్చర్ల, మేడ్చల్‌ బహిరంగ సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.

ఈనెల 26న అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు లో కేసీఆర్‌ వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రకటించారు. 27న పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మిగతా చోట్ల షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
TS: 'ఓటు హక్కు కోసం అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం'
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అయితే ఎన్నికల కోడ్‌ ఎవరైనా ఉల్లంఘించినచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటు హక్కు కోసం అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా.. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

SB NEWS TELANGANA
TS: కేటీఆర్ ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం: అమిత్ షా
ఆదిలాబాద్ జిల్లా:  తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ లో జరిగిన గర్జన సభలో ప్రసంగించిన అమిత్‌షా.. కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. డిసెంబర్‌ 3న ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమన్న అమిత్‌షా మాట్లాడుతూ.. ఢిల్లీలోనూ గల్లీలోనూ మోదీయే ఉండాలన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్‌ విఫలం అయితే.. అక్టోబర్‌ లో రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు హామీలు అమలు చేశారన్నారు. కేవలం కేటీఆర్ ను  సీఎంను చేయాలని.. కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అమిత్ షా ఆరోపించారు. గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని మోదీ నిర్ణయించినా కేసీఆర్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు. చివరకు మోదీ 900 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నెంబర్‌వన్‌ రాష్ట్రం అని కెసిఆర్ చెబుతున్నారు. నిజమే నెంబర్‌ వన్‌ చేశారు. ఉపాధి కల్పించడంలోనా, తాగునీరు ఇవ్వడంలోనా, ఉద్యోగాలు ఇవ్వడంలోనా కాదు, రైతు ఆత్మహత్యల్లో దేశంలో నెంబర్‌వన్‌, మహిళలు, చిన్నారులపై దాడుల్లో నెంబర్‌వన్‌, అవినీతిలోనూ నెంబర్‌వన్‌ అయింది. పదేళ్లుగా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని ఎలా చేయాలా అని ఆలోచించారని అమిత్ షా విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి కి కేవలం తన కొడుకును సీఎం చేయడమే లక్ష్యం. కానీ మా లక్ష్యం ఆదిలాబాద్‌ గిరిజన బిడ్డలకు ఉద్యోగాలు, విద్య, రైతులకు నీరు అందించడం మా లక్ష్యం. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఎక్కడ..? దళితులకు మూడెకరాలు ఎక్కడ? దళిత బంధు అందరికీ ఇచ్చారా..? మీ కార్యకర్తలను ఇచ్చుకున్నారు.. మిగిలినవారి సంగతేంటి? అని ప్రశ్నించారు. గిరిజన వర్శిటీ మోదీ ప్రకటించారు. పసుపు బోర్డు ప్రకటించారు. కృష్టా బోర్డు ట్రిబ్యునల్‌ విధివిధానాలు క్యాబినేట్‌ లో ఇచ్చారని అమిత్ షా తెలిపారు.
NLG: ఆదిమల్ల వెంకటేష్ ను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మిర్యాలగూడ: సాగర్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ 4 రోజుల క్రితం ఉదయం వాకింగ్ చేస్తుండగా బిపి పెరిగి పెరాలసిస్ రావడం తో మిర్యాలగూడ అపోలో రీచ్ హాస్పిటల్ లో చేర్పించటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం, అతడిని పరామర్శించి అతని కుటుంబానికి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా ఆదిమల వెంకటేష్ కుటుంబానికి బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని ఆర్ఎస్పి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వూదరి సైదులు , జిల్లా ఇన్చార్జి పంబాల అనిల్ కుమార్ , సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పోలేపల్లి రాజేష్ , నియోజకవర్గ అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు , రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నర నిర్మల , సాగర్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ , జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్సిరాం , ఆదిమల సత్యనారాయణ , మహేందర్ , శివ తదితరులు పాల్గొన్నారు.*
RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ శిక్షణ శిబిరం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన దాదాపు 319 బూత్ లకు టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని తారా కన్వెన్షన్ సెంటర్లో మంగళ వారం బూత్ సాయి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరానికి నియోజకవర్గంలోని ఎంపిక చేయబడ్డ బూత్ కమిటీ సభ్యులు హాజరు కావడం జరిగింది. వారికి టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, టిపిసిసి బూత్ ఎన్ రోల్ ట్రైనింగ్ కమిటీ కన్వీనర్ పవన్ మల్లాది హాజరై.. బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పోల్ మేనేజ్ మెంట్, ప్రచార వ్యూహం, ఓటర్ల కలయిక, పార్టీ పటిష్టత,సోషల్ మీడియా తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ జెండాను భుజానమోస్తున్న ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని తెలియజేశారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకమని, అధికార పార్టీ నాయకులు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని దొడ్డిదారిన గెలవాలని ప్రయత్నం చేస్తుందని దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రజలతో మమేకం అయ్యే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ 45 రోజుల సమయంలో పార్టీ కార్యకర్తలు పూర్తి సమయం ఇచ్చి పని చేయాలని పార్టీ గెలుపు కోసం అందరం కష్టపడదామని, ప్రతి కార్యకర్త కష్టసుఖాలను నేను దగ్గరుండి చూసుకుంటా అని తెలియజేశారు. అవినీతి బంధుప్రీతికి భూకబ్జాలకు కేరాఫ్ గా ఉన్న టిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. త్వరలో నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అందరితో చర్చించి ప్రతి కుటుంబాన్ని కలుస్తామని, ప్రతి గడప తొక్కుతానని.. ప్రతి తండా..గ్రామం తిరుగుతానని చెప్పారు.

కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల మున్సిపల్ నాయకులతో పాటు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, మున్సిపల్ అధ్యక్షులు, గౌరవ ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఉపాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్ వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రెండవ ఏఎన్ఎంల సమ్మె విరమణ
NLG: ఈనెల 5వ తారీఖు నుండి హైదరాబాద్ కోటీ లోని డి.హెచ్ కార్యాలయము వద్ద జరుగుతున్న రెండవ ఏఎన్ఎం ల నిరవధిక పోరాటాన్ని విరమణ చేస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలియజేశారు. మంగళ వారం నల్లగొండ డిఎంహెచ్ఓ కొండలరావు కు సమ్మే విరమణ లెటర్ ను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా రెండవ ఏఎన్ఎం  లు అలుపెరగని పోరాటాన్ని నిర్వహించారని ఆయన కొని ఆడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తరువాత అటువంటి పోరాటం మళ్లీ రెండవ ఏఎన్ఎం ల దేనని అన్నారు. ఆగస్టు 4వ తేదీ చలో అసెంబ్లీ సందర్భంగా 4000 మంది అరెస్టయ్యారని ఆరోజు నుండి ఆగస్టు 14వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరసన తెలియజేశారన్నారు.

ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు నిరవధిక సమ్మె నిర్వహించారని చర్చల ద్వారానే సమ్మెను తాత్కాలిక విరమణ చేశారన్నారు.

సెప్టెంబర్ ఒకటో తేదీ నాడు జరిగిన చర్చల సందర్భంగా గ్రాస్ శాలరీ అమలు ను పరిశీలించడానికి కమిటీ వేయడంతో పాటు 15 రోజుల్లో పి.ఆర్.సి బకాయిల తో పాటు సమ్మె కాలానికి వేతనం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పటం వల్లనే మరలా అక్టోబర్ 4 వ తేదీ నుండి హైదరాబాదులోని కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మెను నిర్వహించడం జరిగిందన్నారు.

సెప్టెంబర్ 2న కమిటీ వేయగా అక్టోబర్ 6 తేదీన సమ్మె కాలపు జీతాన్ని చెల్లించారని, పిఆర్సి బకాయిలు మాత్రం ఇంకా చెల్లించలేదన్నారు.సోమవారం జరిగిన చర్చల ఫలితంగా రెండు రోజుల్లో పిఆర్సి బకాయిలను చెల్లిస్తామని, ఈనెల 17వ తేదీన 100% గ్రాస్ శాలరీ పరిశీలించడానికి కమిటీ సమావేశం అవుతుందని, మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు హామీ ఇవ్వడంతో సమ్మెను విరమణ చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ

కార్యక్రమంలో ఏఐటీయూసి తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎం ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పోలే రత్నకుమారి ,గీతా రాణి, హైమావతి, పద్మ, వసుమతి, వెంకటమ్మ, నిర్మల, సరిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
NLG: రోడ్డు ప్రమాదం లో కానిస్టేబుల్ మృతి
నల్లగొండ జిల్లా:  గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హాలియా మండలం వెంకటాపురంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం కు చెందిన మధు.. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ (ఎస్పీఎఫ్) గా పని చేస్తున్నాడు. కాగా, మధు మోటార్ సైకిల్‌ పై నల్లగొండ వెళ్తుండగా అతడి బైక్‌ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు  తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

SB NEWS NALGONDA DIST
నకిరేకల్: క్యూబా విప్లవకారుడు కామ్రేడ్ చేగువేరా స్ఫూర్తితో పోరాడుదాం: డేవిడ్ కుమార్
NLG: క్యూబా ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవ యోధుడు.. కామ్రేడ్ చేగువేరా స్పూర్తితో ఉద్యమించాలని CPI (M-L ) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం. డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణంలోని కామ్రేడ్ యానాల మల్లారెడ్డి స్మారక భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో AIKMS జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి అధ్యక్షతన చేగువేరా వర్ధంతి సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేగువేరా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డేవిడ్ కుమార్ మాట్లాడుతూ.. దోపిడీ, పీడన, అసమానతలు లేని వ్యవస్థను క్యూబాలో చేగువేరా నిర్మించాడని అన్నారు. ఎల్లలు లేని విశాల దృక్పథంతో స్వేచ్ఛయుత సమాజం కోసం అనారోగ్యం ను లెక్కచేయకుండా, చిన్న వయసులోనే అవిరామంగా పోరాటం చేసినాడని గుర్తు చేశారు. నేటి యువత చేగువేరా స్పూర్తితో పోరాడాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు.

కేంద్రంలో, రాష్ట్రంలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను యువత ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. తనకు ఆయాసం ఒక చిన్న సమస్యగా ఉన్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ బైక్ ప్రయాణం చేస్తూ ప్రజలకు కూడా హక్కులు ఉంటాయని.. 'బానిసలుగా బ్రతకడం కన్నా లేచి నిలబడి దైర్యం గా ప్రాణాలు వదిలేయడం మేలు' అని ప్రజల్లో స్ఫూర్తినిచ్చే మాటలను చెప్తూ ప్రజల అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకొని, శత్రువుల చేతిలో ప్రాణాలు పోతున్నా అతని కళ్ళల్లో ఎక్కడ కూడా భయం కనపడలేదని ఆయనను కొనియాడారు. పోరాట పటిమ కసి, చిరునవ్వు మాత్రమే కనిపించిందని, శత్రువులకు కూడా ఆశ్చర్యం కలిగించేలా చేసిన యోధుడు చేగువేరా అని, కాల్చి చంపుతున్నా.. ఒనకని బెనకని గుండెల నిండా దైర్యం ఉన్న మనిషి, ప్రపంచ విప్లవ కారుడు కామ్రేడ్ చేగువేరా అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో PYL రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరు సాగర్, AIKMS జిల్లా అధ్యక్షుడు జ్వాల వెంకటేశ్వర్లు, POW జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, AIKMS జిల్లా నాయకులు సిలువేరు జానయ్య, అంబటి వెంకన్న, బూరుగు సత్తయ్య, జానపాటి దేవయ్య, PYL జిల్లా అధ్యక్షుడు మామిడోజు వెంకటేశ్వర్లు, రావుల లింగయ్య, బండారి వెంకన్న, వేముల శంకర్, దేవరకొండ జానయ్య, పసుపులేటి సోమయ్య, చెరుకు సైదులు తదితరులు పాల్గొన్నారు.
NLG: నిరుద్యోగులకు శుభవార్త
నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న వాణిజ్య శాస్త్రం - 01, అతిధి అధ్యాపక పోస్టు భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ లో 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం
ప్రాధాన్యత: నెట్/సెట్/పీహెచ్డీ మరియు బోధన అనుభవం

పూర్తి చేసిన దరఖాస్తు తో పాటు విద్యా అర్హతలు, బోధనా అనుభవం సర్టిఫికెట్లతో ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు. తదుపరి అభ్యర్థులు ఈనెల 12వ తేదీన తమ  ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు. Share it

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA