మునుగోడు: సోలిపురం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
నల్లగొండ జిల్లా:
మునుగోడు ఉప ఎన్నికలలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇచ్చిన హామీ అమలులోకి వచ్చింది. ఉపఎన్నికల్లో టి ఆర్ యస్ ఆభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన పక్షంలో మునుగోడు మండల కేంద్రం నుండి సోలిపురం గ్రామం మార్గం మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం దశాబ్దాల తరబడి నిరీక్షణకు తెర దించుతానంటూ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఆ ఎన్నికల్లో విజయం సాధించిన మీదట పలుమార్లు స్థానిక శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలసి రాష్ట్రస్థాయి నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందుకు అనుగుణంగా అధికారులు రూపొందించిన డి పి ఆర్ ను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి విషయాన్ని వివరించగా, అందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సోలీపురం బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో శనివారం రోజున అధికారులు 404.50 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దశాబ్దాల కాలం నుండి ఏ ఎన్నికలు వచ్చినా మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న సోలిపేట బ్రిడ్జి ఎన్నికల అంశంగా పతాక శీర్షికలకెక్కేది. అటువంటి సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలు ముగింపు పలికాయి. ఆ ఎన్నికల్లో అన్నీ తానై భుజాల మీద వేసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి రాజకీయాలకతితంగా గ్రామస్తులు అందరూ ముక్తకంఠంతో తేవడం తో స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి, సాంకేతికంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డి పి ఆర్ రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్  అనుమతులు తీసుకోవడంతో కధ సుఖాంతం అయి, శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఎన్నికలు పూర్తి అయిన మీదట ఎప్పటి మాదిరి గానే అటకెక్కుతుందేమో అనుకున్న తీరుకు భిన్నంగా సోలిపురం బ్రిడ్జి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ కావడంతో మునుగోడు మండలం సోలిపురం గ్రామస్తులు హర్షం  వ్యక్తం చేశారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
మునుగోడు నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేయనున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఆదివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉదయం 7 గంటలకు చండూర్ మండలం ఇడికుడ గ్రామంలో,

ఉదయం 8 గంటలకు చండూర్ మండలం గొల్లగూడం గ్రామంలో,

ఉదయం 9 గంటలకు చండూర్ BRC ఫంక్షన్ హాల్లో చండూర్ మరియు గట్టుప్పల్ మండలాలకు సంబందించిన గృహలక్ష్మి లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపాక ఫంక్షన్ హాల్లో నారాయణపురం మండలానికి సంబందించిన లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేస్తారు.

సాయంత్రం 4 గంటలకు జయశ్రీ ఫంక్షన్ హాల్లో చౌటుప్పల్ మండల మరియు మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేయనున్నారు.

ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.

NLG: బీఎస్పీ ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ మహబూబ్ అలీ దిష్టిబొమ్మ దగ్ధం
నల్లగొండ: సెక్యూరిటీ ఆఫీసర్ కానిస్టేబుల్ కు హోమ్ మినిస్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, పట్టణంలో బీఎస్పీ ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ మహబూబ్ అలీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అక్కడికి వెళ్లిన హోమ్ మినిస్టర్ మహబూబ్ అలీ.. తన సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి కానిస్టేబుల్ పై ఇటీవల చేయి చేసుకోవడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో హోమ్ మినిస్టర్ మహబూబ్ అలీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో మాట్లాడుతూ.. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ పై కేసు నమోదు చేయాలని, దీనికి సాక్షులుగా అక్కడే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పెట్టాలని మీడియా ముఖంగా డిజిపి కోరుతున్నట్లు తెలిపారు. మహమూద్ అలీని వెంటనే మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్, జిల్లా ట్రెజరర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు ఒంటెపాక యాదగిరి, నియోజకవర్గ ఇన్చార్జ్ వినోద్ చారి, నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి, పట్టణ అధ్యక్షులు చిట్టిబాబు, అభిలాష్, రాంప్రసాద్ పాల్గొన్నారు.

నల్లగొండ: సెక్యూరిటీ ఆఫీసర్ కానిస్టేబుల్ కు హోమ్ మినిస్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, పట్టణంలో బీఎస్పీ ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ మహబూబ్ అలీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట

NLG: సరంపేటలో బతుకమ్మ చీరల పంపిణీ
నల్లగొండ జిల్లా,మర్రిగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ సందర్భంగా,  ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలను శనివారం మండలంలోని సరంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ వేనమళ్ళ వెంకటమ్మ - మధుకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాకేష్, రేషన్ డీలర్ రాములు, ఫీల్ అసిస్టెంట్ రవి, ఐకెపి అధ్యక్షురాలు నాగమణి, ఐకేపీ సీసీ శ్రీశైలం, స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ సురేష్, గ్రామ మహిళలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: మర్రిగూడ మండలంలో ఆశ వర్కర్ల సమ్మెలో భాగంగా రాస్తారోకో
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశ వర్కర్ల సమ్మెలో భాగంగా 13వ రోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18000 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు.

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశ వర్కర్ల సమ్మెలో భాగంగా 13వ రోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18000 నిర్

NLG: మర్రిగూడ మండలంలో ఆశ వర్కర్ల సమ్మెలో భాగంగా రాస్తారోకో
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశ వర్కర్ల సమ్మెలో భాగంగా 13వ రోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18000 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు.

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశ వర్కర్ల సమ్మెలో భాగంగా 13వ రోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18000 నిర్

ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన అసిఫాబాద్ జిల్లా కలెక్టర్
కొమరం భీం అసిఫాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' ద్వారా విద్యార్థులకు సకాలంలో అల్పాహారం అందించి పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. SB NEWS ASIFABAD DIST

SB NEWS TELANGANA
NLG: కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని వెంటనే పర్మినెంట్ చేయాలని, రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని AITUC మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండలో జరిగిన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేసారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే విధంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చి అమలు చేయాలని ఆయన కోరారు. కనీస వేతన చట్టాలు అమలు చేయకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పేరుతో రాష్ట్రంలో కార్మికుల శ్రమ దోపిడి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగునంగా కాంటాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి విశ్వనాధుల, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి ఎల్లమ్మ భాగ్యమ్మ, ఏ.పద్మ, సబిత, ఉషమ్మ, ఇంద్రమ్మ, శ్యామల, జీవిత, వీరమ్మ, మంగమ్మ, జాన్ బి, టి.పద్మ పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
మర్రిగూడ: 12వ రోజుకు చేరిన ఆశా వర్కర్ల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, 12వ రోజు ఆశా వర్కర్ల సమ్మె కొనసాగుతూ ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఫిక్స్డ్ వేతనం రూ. 18000/- ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్లను చిన్నచూపు చూడకుండా వారికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, కాలం సుజాత, జాజాల అనిత, కోయ మంజుల, పందుల పద్మ, ఎస్ కే సైదా బేగం, దుర్గమ్మ పల్లె కౌసల్య, బాలమణి, ఐతరాజు సునీత, వెంకటమ్మ, యాదమ్మ, పొగాకు అలివేలుమంగ, తదితరులు పాల్గొన్నారు

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
మర్రిగూడ: 12వ రోజుకు చేరిన ఆశా వర్కర్ల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, 12వ రోజు ఆశా వర్కర్ల సమ్మె కొనసాగుతూ ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఫిక్స్డ్ వేతనం రూ. 18000/- ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్లను చిన్నచూపు చూడకుండా వారికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, కాలం సుజాత, జాజాల అనిత, కోయ మంజుల, పందుల పద్మ, ఎస్ కే సైదా బేగం, దుర్గమ్మ పల్లె కౌసల్య, బాలమణి, ఐతరాజు సునీత, వెంకటమ్మ, యాదమ్మ, పొగాకు అలివేలుమంగ, తదితరులు పాల్గొన్నారు

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA