NLG: సరంపేటలో బతుకమ్మ చీరల పంపిణీ
నల్లగొండ జిల్లా,మర్రిగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగ సందర్భంగా,  ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలను శనివారం మండలంలోని సరంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ వేనమళ్ళ వెంకటమ్మ - మధుకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాకేష్, రేషన్ డీలర్ రాములు, ఫీల్ అసిస్టెంట్ రవి, ఐకెపి అధ్యక్షురాలు నాగమణి, ఐకేపీ సీసీ శ్రీశైలం, స్త్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ సురేష్, గ్రామ మహిళలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: మర్రిగూడ మండలంలో ఆశ వర్కర్ల సమ్మెలో భాగంగా రాస్తారోకో
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశ వర్కర్ల సమ్మెలో భాగంగా 13వ రోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18000 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు.

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలంలో ఆశ వర్కర్ల సమ్మెలో భాగంగా 13వ రోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ. 18000 నిర్

ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన అసిఫాబాద్ జిల్లా కలెక్టర్
కొమరం భీం అసిఫాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం' ద్వారా విద్యార్థులకు సకాలంలో అల్పాహారం అందించి పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. SB NEWS ASIFABAD DIST

SB NEWS TELANGANA
NLG: కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని వెంటనే పర్మినెంట్ చేయాలని, రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని AITUC మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండలో జరిగిన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేసారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే విధంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చి అమలు చేయాలని ఆయన కోరారు. కనీస వేతన చట్టాలు అమలు చేయకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పేరుతో రాష్ట్రంలో కార్మికుల శ్రమ దోపిడి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగునంగా కాంటాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి విశ్వనాధుల, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి ఎల్లమ్మ భాగ్యమ్మ, ఏ.పద్మ, సబిత, ఉషమ్మ, ఇంద్రమ్మ, శ్యామల, జీవిత, వీరమ్మ, మంగమ్మ, జాన్ బి, టి.పద్మ పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
మర్రిగూడ: 12వ రోజుకు చేరిన ఆశా వర్కర్ల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, 12వ రోజు ఆశా వర్కర్ల సమ్మె కొనసాగుతూ ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఫిక్స్డ్ వేతనం రూ. 18000/- ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్లను చిన్నచూపు చూడకుండా వారికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, కాలం సుజాత, జాజాల అనిత, కోయ మంజుల, పందుల పద్మ, ఎస్ కే సైదా బేగం, దుర్గమ్మ పల్లె కౌసల్య, బాలమణి, ఐతరాజు సునీత, వెంకటమ్మ, యాదమ్మ, పొగాకు అలివేలుమంగ, తదితరులు పాల్గొన్నారు

NLG: ఎన్జీ కళాశాలకు నూతన ప్రిన్సిపాల్ గా డాక్టర్ సముద్రాల ఉపేందర్ 
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ గా పదోన్నతిపై డాక్టర్ సముద్రాల ఉపేందర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ సముద్రాల ఉపేందర్  మ్యాథమెటిక్స్ అధ్యాపకుడిగా తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డిలో పనిచేశారు. డాక్టర్ ఘన శ్యామ్ ఎన్జీ కళాశాలకు ఇన్చార్జి ప్రిన్సిపల్ గా ఇప్పటివరకు కొనసాగారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మునీర్ మరియు డాక్టర్ అంతటి శ్రీనివాసులు , స్టాఫ్ క్లబ్ సెక్రటరీ చంద్రశేఖర్, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది కొత్త ప్రిన్సిపల్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ను శాలువాతో సత్కరించి సన్మానించారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బిజెపి పార్టీని వీడుతున్నట్టు మీడియాలో   వస్తున్న వార్తల పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పార్టీ మార్పు అనేది అవాస్తవం అని దీనిని ఖండిస్తున్నా అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ..నా వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యం తో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. సబ్బండ వర్గాలు  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా నరేంద్ర మోడీ, అమిత్ షా లకు ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యం లో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశానని తెలిపారు. నేనే కాదు ఇతర బిజెపి ముఖ్య నాయకులు ఎవరు బిజెపిని వీడరని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులమై ముందుకు కదులుతున్నామని అన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
TS: సెకండ్ ఏఎన్ఎం లను నిర్బంధించిన పోలీసులు (వీడియో)
హైదరాబాద్: సెకండ్ ఏఎన్ఎం లు తమను పర్మినెంట్ చేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద ఏఎన్ఎం లు ధర్నా చేస్తున్న సందర్భంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తమను అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఏఎన్ఎం లు వాపోయారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇకనైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు.

హైదరాబాద్: సెకండ్ ఏఎన్ఎం లు తమను పర్మినెంట్ చేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద ఏఎన్ఎం లు ధర్నా చేస్తున్న సందర్భంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తమ