తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని మోడీ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబరు 1న హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది.

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో ఆయన పలు అభివృద్ధి పనులకు బేగంపేట ఎయిర్‌పోర్టులోనే శంకుస్తాపన చేయాల్సి ఉంది.

అయితే మారిన షెడ్యూల్‌ మేరకు ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్టుకు కాకుండా ప్రత్యేకంగా విమానంలో నేరుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.

అక్టోబరు 1న మధ్యాహ్నం 1.30 కు ప్రధాని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.35 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయల్దేరి వెళతారు.

2.10గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరకుని 2.50 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.

అనంతరం 3 గంటల నుండి 4 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం 4.10 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తారు. సాయంత్రం 4.50గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ కి తిరిగి వెళ్లనున్నారు...

Streetbuzz News

ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో లోకేష్ అరెస్ట్ అవుతాడా ❓️

నారా లోకేష్ జైలు భ‌యంతో ఏపీకి రావ‌డం లేద‌ని, అందుకే ఆయ‌న ఢిల్లీలో కూర్చున్నాడ‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.

అరేయ్.. తురేయ్.. అంటూ మొన్న‌టి వ‌ర‌కూ వీధుల్లో త‌న వ‌ద‌ర‌బోతుత‌నాన్ని చాటుకున్న లోకేష్..తీరా అస‌లు క‌థ మొద‌ల‌య్యే స‌రికి ఢిల్లీలో కూర్చోవ‌డంతో లోకేషుడి హీరోయిజం రేంజ్ ఏమిటో బ‌య‌ట‌ప‌డింది!

ఎఫ్ఐఆర్ లో ఇప్పుడు ఎవ‌రెవ‌రి పేర్లు రాస్తున్నారో కానీ, లోకేష్ ఇన్న‌ర్ రింగ్ రోడ్ స్కామ్ లో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ను వేసుకున్నారు. ఈ కేసులో లోకేష్ పేరు ఏ14 గా ఉండ‌గా.. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ కేటాయించాలంటూ లోకేష్ పిటిస‌న్ వేసుకున్నారు.

ఇలా లోకేష్ అరెస్టు భ‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఏపీకి వ‌స్తే త‌న‌ను అరెస్టు చేస్తార‌నే భ‌యంతో లోకేష్ ఢిల్లీలో ఉన్నార‌నే ప్ర‌చారానికి ఈ పిటిష‌న్ మ‌రింత ఊతం ఇస్తోంది. త‌ను త‌ప్పు చేయ‌క‌పోతే లోకేష్ ఎందుకు అరెస్టుకు భ‌య‌ప‌డుతున్నాడో మ‌రి!

అందునా త‌న తండ్రి జైలు పాలైన నేప‌థ్యంలో... లోకేష్ ఈ ప‌రిణామాల‌ను ధైర్యంగా ముందుకు వ‌చ్చి ఎదుర్కొని ఉంటే.. సరిపోయేది.

అయితే పాద‌యాత్ర‌లో బీరాలు ప‌లికిన లోకేష్ అరెస్టుకు భ‌య‌ప‌డి ఢిల్లీ పారిపోయాడ‌నే ముద్ర శాశ్వ‌తంగా ఉండిపోతుంది. దీన్ని క‌వ‌ర్ చేయ‌డానికి ప‌చ్చ‌మీడియా ఎంత ప్ర‌య‌త్నించినా ప్ర‌యోజ‌నం కూడా ఉండ‌దు!

అయినా.. చంద్ర‌బాబు జైలు కెళ్లే త‌మ‌కు బోలెడంత సానుభూతి వ‌చ్చేసింద‌ని, మొన్న‌టి వ‌ర‌కూ త‌మ విజ‌యంపై ఏవైనా అనుమానాలు ఉంటే అవి చంద్ర‌బాబు అరెస్టుతో ప‌టాపంచ‌లు అయ్యాయ‌ని ప‌చ్చ‌వ‌ర్గాలు ప్ర‌చారం చేసుకుంటూ ఉన్నాయి. మ‌రి అలాంట‌ప్పుడు.. లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఇంకా ఎక్కువ సానుభూతి వ‌స్తుంది క‌దా!

చంద్ర‌బాబు జైల్లో ఉంటే సానుభూతి వ‌చ్చేట్టుగా అయితే.. లోకేష్ కూడా అరెస్టై జైలుకు వెళితే తండ్రీకొడుకుల అరెస్టుతో మ‌రింత సానుభూతి పెల్లుబుకుతుంది క‌దా! మ‌రి లోకేష్ ఎందుకు ఇంకా జైలుకు వెళ్ల‌కుండానే బెయిల్ పిటిష‌న్ వేసుకున్న‌ట్టు?

ప్రారంభమైన ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర

మహా నగరం లో గణేష్‌ మహా శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనానికి రాత్రి నుంచే గణనాథులు తరలివస్తున్నారు.

దీంతో ట్యాంక్‌ బండ్‌పై సందడి మొదలైపోయింది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర కోసం పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన వేడుకకు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటలకు మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమై.. టెలిఫోన్‌ భవన్‌, సచివాలయం మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది.

ఉదయం 9:30కు ఎన్టీఆర్‌ మార్గ్‌కు, ఉదయం 10:30కు క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గర పూజా కార్యక్రమం జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఖైరతాబాద్‌ గణేషుడి నిమజ్జనం జరగనుంది.

మ.12 గంటల్లోపు మహా గణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తి కానుంది. ఖైరతాబాద్‌ గణేషుడి నిమజ్జనం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు...

Streetbuzz News

Streetbuzz News

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

సింగరేణి కార్మికుల కు యాజమాన్యం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల వాటాల్లో 32 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు, గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంలో తెలంగాణ నిలిచింది.

తాజాగా 32 శాతం బోనస్ అందివ్వాలన్న నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

కాగా ఇటీవలే 11వ వెజ్ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జమ చేసింది...

SB NEWS

SB NEWS

Streetbuzz News

ఆంధ్రప్రదేశ్ ఘర్షణలకు హైదరాబాద్ వేదిక కావాలా❓️

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.

చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్‌లో రాజకీయ ర్యాలీలు తీస్తున్నారన్నారు. పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారా అని అడిగారు.

శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అని అన్నారు. వాళ్ల ఘర్షణకు హైదరాబాద్ వేదిక కావాలా అని ప్రశ్నించారు. రాజమండ్రి, అమరావతి, కర్నూలులో చేయకుండా ఇక్కడ రాద్దాంతం ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు.........

175కి 175వైనాట్..ఇది పాజిబుల్ సీఎం జగన్

ఇప్పటివరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలం మరో ఎత్తు

వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం

మనం గేర్‌ మార్చాల్సిన అవసరం వచ్చింది

పార్టీ నేతలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం

తాడేపల్లి : వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు. 175కి 75 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదని, కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్‌. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌.

ఈ మేరకు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ‘ఇప్పటివరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలం మరో ఎత్తు. వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం. మనం గేర్‌ మార్చాల్సిన అవసరం వచ్చింది.

మన పార్టీ, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. సూచించారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయి. మన పార్టీ, మన ప్రభుత్వం పట్ల సానుకూల అంశం చూశాం. ఇదే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలి’ అని సూచించారు సీఎం జగన్‌.

‘అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమే. టికెట్లు ఇవ్వనంత మాత్రాన నిరాశ వద్దు. కొందరికి టికెట్లు ఇవ్వొచ్చు.. మరికొందరికి ఇవ్వకపోవచ్చు. మరో అవకాశం కల్పిస్తాం’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, పార్టీ రీజినల్‌ ఇంచార్జులు హాజరయ్యారు.

తెలంగాణ సమాజానికి చాకలి ఐలమ్మ స్పూర్తి… మంత్రి జగదీష్‌ రెడ్డి

సూర్యాపేట:

ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్పూర్తి అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు.

వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…

తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు.

ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్పూర్తి అన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపించిన తెగువ ప్రపంచంలోనే తెలంగాణకు గుర్తింపు తెచ్చిందని కొనియాడారు.

తమ హక్కుల కోసం కొట్లాడే వారికి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.

ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు.

Streetbuzz News

సైలింగ్ లో భారత్ కు వెండి, కాంస్య పతకలు

చైనాలో జ‌రుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత క్రీడాకారులు నేడు కూడా ప‌త‌కాల వేట కొన‌సాగిస్తున్నారు..

నేడు జ‌రిగిన సెయిలింగ్ పోటీల‌లో వెండి, కాంస్య ప‌త‌కాలు మ‌న సెయిల‌ర్స్ గెలుచుకున్నారు.. సైలింగ్ లో 4 క్యాట‌గిరి మ‌హిళ‌ల‌ విభాగంలో భార‌త్ కు చెందిన‌17 ఏళ్ల నేహా ఠాకూర్ వెండి మెడ‌ల్ ను కైవసం చేసుకుంది..

ఇక పురుషుల విండ్ స‌ర్ప‌ర్ విభాగంలో మ‌న దేశానికి చెందిన ఇబాద్ అలి కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు..

సైలింగ్ లో భారత్ ఇదే తొలి మెడల్ అందించిన నేహా ఠాకూర్ రైతు కుటుంబం కావడం విశేషం.. హాంగ్జౌలోని గర్ల్స్ డింగీ – ఐఎల్సీఏ 4 కేటగిరీలో పోటీ పడిన నేహా.. 11 రేసులలో 27 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

థాయ్ లాండ్ చెందిన ఖున్బూంజన్ 16 పాయింట్లతో స్వర్ణం నెగ్గగా సింగపూర్ కు చెందిన కీరా మేరీ కార్లిల్ 28 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకుంది...

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

ఆలేరు ఎమ్మెల్యేకు హైకోర్టు జరిమానా

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. గత ఎన్నికల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారనే ఆరోపణలపై హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనందుకు ఆమెకు హైకోర్టు మంగళవారం రూ.10 వేల జరిమానా విధించింది.

అక్టోబర్ 3 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.

అయితే 2018 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించి సునీత తప్పుడు సమాచారం అందించారని, ఆస్తులను చూపలేదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తప్పుడు సమాచారం అందించినందుకు ఆమె ఎన్నిక చెల్లదని, అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..

కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సునీతను ఆదేశించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.....

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Kavitha: రాష్ట్రాల్లో నడుస్తోంది భారత రాజ్యాంగమా? భాజపా రాజ్యాంగమా?: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ తమిళిసై వ్యవహరించారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నామినేటెడ్‌ కోటా కింద సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్‌ తిప్పిపంపడాన్ని ఆమె తప్పుబట్టారు..

భారాస బీసీలకు పెద్దపీట వేస్తుంటే.. భాజపా వాటిని అడ్డుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

శాసన మండలి ఆవరణలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కవిత పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

''ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్‌ ఆమోదించడం సంప్రదాయం. అనేక కారణాలను చెప్పి పేర్లను ఆమె తిరస్కరించారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తోందా? భాజపా రాజ్యాంగం నడుస్తోందా?

పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్లే ఇలా వ్యవహరించడం దురదృష్టకరం. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయి.

బీసీ వర్గాలకు భాజపా పెద్ద పీట వేస్తోంది. బీసీ వ్యతిరేక పార్టీ అని భాజపా మరోసారి నిరూపించుకుంది'' అని కవిత వ్యాఖ్యానించారు..

Streetbuzz News

Streetbuzz News