ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళి సై తొలి పూజ

వినాయక చవితి పర్వదినం సందర్భంగా సోమవారం ఖైరతాబాద్ గణపతి వద్ద కోలాహలం మొదలైంది. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిపూజ చేశారు.

ఈ ఏడాది శ్రీ దశమహా విద్యాగణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు. వైభవంగా జరిగిన తొలిపూజలో గవర్నర్ తో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున గణనాథుడికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సంఘం గరికమాల, జంధ్యం, 75 అడుగుల భారీ కండువాను సమర్పించింది.

ఈ సారి 63 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీదశమహా విద్యాగణపతికి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు...

భూ వివాదంలో నాగార్జున సోదరి పై కేసు నమోదు

ప్రముఖ టాలీవుడ్‌ హీరో నాగార్జున సోదరి నాగ సుశీలపై కేసు నమోదయ్యింది.శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈనెల 12న నాగసుశీల మరికొంత మంది కలిసి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ బాధితులు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై మొయినాబాద్‌ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

కాగా, గతంలో నాగసుశీల తన వ్యాపార భాగస్వామి అయిన నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుతో కొన్నేళ్లుగా భూ వివాదాలు ఉన్నట్టు సమాచారం, కేసు కు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియవలసి ఉంది..

SB NEWS

SB NEWS

వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించబోతున్న ఖైరతాబాద్ గణపతి

గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఎటు చూసినా గణేష్‌ ఉత్సవ శోభే కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణపయ్య రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు.

ఈ సారి దశమహా విద్యా గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు ఖైరతాబాద్ గణేశుడు.. 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు మరి కాసేపట్లో తొలి పూజలు అందుకోనున్నాడు.

చరిత్రలోనే తొలిసారి.. 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్‌లో ప్రతిష్టించారు. ఈ ఏడాది దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

నేడు వినాయక చవితి పర్వదినాన వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నారు.

ఈ మహాక్రతువుకు ఉదయం 9:30 గంటలకు తొలి పూజను గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి నిర్వహిస్తారు...

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు...

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సోమవారం నుంచి 5 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో.. ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటుందా? అనే అనుమానం అందరిలోనూ ఉంది.

ఎజెండా ఇదీ అంటూ కొన్ని వివరాలను ప్రభుత్వం ప్రకటించినా అంతకు మించి ఏదో ఉందనే అన్ని వర్గాలు భావిస్తున్నాయి.

అసలు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల లక్ష్యమేంటి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది? అనే విషయం అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది.

ఆగస్టు 3న ఈ సమావేశాలపై ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది.

SB NEWS

పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చేయండి: అధినేత్రి సోనియాగాంధీ

కాంగ్రెస్‌ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చినపుడు సమన్వయం పాటించాలని, వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ కోరారు.

రెండు రోజుల సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై

ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా సోనియా జోక్యం చేసుకుని మీడియా సమావేశాల సందర్బంగా నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని, లేదంటే పొరపాటుగా చేసే చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు.

వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఐఖ్యత, క్రమశిక్షణతోనే విరోధులను జయించగలమని, ఇది కర్ణాటక ఎన్నికల్లో నిరూపితమైందని గుర్తు చేశారు.

టీచర్ల బదిలీలకు మోకాలడ్డుతింది ఎవరు?

టీచర్ల బదిలీ విషయంలో పూటకో తిరకాసు.. రోజుకో అభ్యంతరం

హైదరాబాద్‌లో తిష్టవేసిన పంతుళ్ల స్వార్థం.కోసం 95శాతం టీచర్లకు నష్టం జరుగుతుందని, పట్టణాల్లో ఉన్న టీచర్ల వ్యవహారాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పు పడుతున్నాయి

హైదరాబాద్‌ లాంటి అంతర్జాతీయస్థాయి నగరంలో ఉంటే ఆ మజానే వేరు. అందులోనూ సర్కారు కొలువైతే ఆ కిక్కే వేరు.

గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే ఇక్కడ దాదాపు రెట్టింపు హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది. సరిగ్గా ఇప్పుడిదే అంశం టీచర్ల బదిలీలకు మోకాలడ్డుతోంది.

ఇక్కడి నుంచి ఇంకెక్కడో బదిలీ అయితే మహా నగరంలోని సకల సౌకర్యాలను కోల్పోవడంతోపాటు హెచ్‌ ఆర్‌ఏ సహా ఇతర

వ్యాపకాలను కోల్పోతామన్న భయం వారికి పట్టుకుంది, ఎలాగైనా బదిలీలను అడ్డుకోవాలని కొందరు టీచర్ల పాచిక

కోర్టులకెక్కి బదిలీలను జాప్యం చేయించేందుకు కారణమవుతున్నది. సొంత లాభం కొంత మానుకో .అన్న గురజాడ పలుకులను భ్రష్టు పట్టిస్తూ, సొంత లాభం కోసం పాకు లాడుతున్న కొందరు టీచర్లు.. 95శాతం మంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకుంటూ విలన్లుగా మారుతున్నారని తెలుస్తుంది..

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం జగన్

తిరుమల లో ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీవారి తరపున సర్వసేనాధిపతి అయిన విష్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అనంతరం విష్వక్సేనుడు ఆలయానికి చేరుకున్నాక యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల నడుమ బీజవాపం కార్యక్రమంతో అంకురార్పణ కార్యక్రమం సమాప్తమైంది. ఇక, సోమవారం సాయంత్రం జరిగే ధ్వజరోహణంతో బ్రహ్మోత్సవాల సంరంభం మొదలుకానుంది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ సోమవారం సాయంత్రం శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.

రాత్రి 9 గంటల నుంచి నిర్వహించే పెద్దశేష వాహనంతో వాహనసేవలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ టీటీడీ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.

సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మాత్రమే అమల్లో ఉంటాయి.

గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజలు ఐక్యమత్యంతో జరుపుకోవాలి: సీఎం కేసీఆర్

వినాయక చవితి పండగ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా’ అంటూ శుభం కలుగాలని ఏకదంతున్ని భక్తులు ఆరాధిస్తారని తెలిపారు.

శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రజలందరూ ఐకమత్యంతో, ఆనందంతో గణపతి నవరాత్రులను జరుపుకోవాలని సిఎం కేసీఆర్‌ సూచించారు.

గణనాథుడి ఆశీస్సులతో అనేక విఘ్నాలు అధిగమిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర రాష్ట్రాల్రకు ఆదర్శంగా నిలుస్తున్నదని ఆయన అన్నారు.

ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు లంబోధరుడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు.

నవరాత్రులతోపాటు, నిమజ్జనం సందర్భంగా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు...

గణపతి పూజకు వేళాయె

వినాయక చవితి పండుగ అంటేనే అందరిలో ఉత్సాహం. భారీ విగ్రహాలు.. వీధి వీధినా మండపాలు.. ఆకర్షణీయమైన సెట్టింగులు..

ఉదయం నుంచి విశేష పూజలు, భక్తుల దర్శనాలతో అర్ధరాత్రి వరకు సందడే సందడి. విఘ్నాలు తొలగించే వినాయకుడు

నేడు సోమవారం కొలువుదీరనుండగా, విభిన్న ఆకృతుల్లో గణనాథుడు పూజలందుకుంటాడు. ఏటేటా మండపాలు, విగ్రహాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

వీటిని నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితమవుతున్నది. గతంలో మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేవారు.

కానీ నేడు యువత పోటీపడి ఆకర్షణీయమైన రంగులతో ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.

భారీ విగ్రహాల విషయంలో ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గడం లేదు...

Sonia Gandhi: కర్ణాటకకు అప్పుడు 5 హామీలే.. తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించిన సోనియా

Telangana: కర్ణాటక ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి 5 హామీలు ప్రకటించి గెలుపొందిన కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించింది.

6 హామీలు ఇవే..

1. మహాలక్ష్మి పథకం

2. రైతు భరోసా పథకం

3. గృహ జ్యోతి పథకం

4. ఇందిరమ్మ ఇంటి పథకం

5. యువ వికాసం పథకం

6. చేయూత పెన్షన్‌ పథకం

అధికారంలోకి రాగానే పై ఆరు పథకాలను అమలు చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తారు. అలాగే, ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తారు. రాష్ట్రంలోని పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు.

రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఇస్తారు. కౌలు రైతుకి కూడా అంతే ఇస్తారు. రైతు కూలీలకు ఏడాది రూ.12,000 అందుతాయి.

యువ వికాస పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డులు అందిస్తారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తారు..