నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు...

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సోమవారం నుంచి 5 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో.. ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటుందా? అనే అనుమానం అందరిలోనూ ఉంది.

ఎజెండా ఇదీ అంటూ కొన్ని వివరాలను ప్రభుత్వం ప్రకటించినా అంతకు మించి ఏదో ఉందనే అన్ని వర్గాలు భావిస్తున్నాయి.

అసలు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల లక్ష్యమేంటి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది? అనే విషయం అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది.

ఆగస్టు 3న ఈ సమావేశాలపై ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది.

SB NEWS

పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చేయండి: అధినేత్రి సోనియాగాంధీ

కాంగ్రెస్‌ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చినపుడు సమన్వయం పాటించాలని, వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ కోరారు.

రెండు రోజుల సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై

ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా సోనియా జోక్యం చేసుకుని మీడియా సమావేశాల సందర్బంగా నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని, లేదంటే పొరపాటుగా చేసే చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు.

వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఐఖ్యత, క్రమశిక్షణతోనే విరోధులను జయించగలమని, ఇది కర్ణాటక ఎన్నికల్లో నిరూపితమైందని గుర్తు చేశారు.

టీచర్ల బదిలీలకు మోకాలడ్డుతింది ఎవరు?

టీచర్ల బదిలీ విషయంలో పూటకో తిరకాసు.. రోజుకో అభ్యంతరం

హైదరాబాద్‌లో తిష్టవేసిన పంతుళ్ల స్వార్థం.కోసం 95శాతం టీచర్లకు నష్టం జరుగుతుందని, పట్టణాల్లో ఉన్న టీచర్ల వ్యవహారాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పు పడుతున్నాయి

హైదరాబాద్‌ లాంటి అంతర్జాతీయస్థాయి నగరంలో ఉంటే ఆ మజానే వేరు. అందులోనూ సర్కారు కొలువైతే ఆ కిక్కే వేరు.

గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే ఇక్కడ దాదాపు రెట్టింపు హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది. సరిగ్గా ఇప్పుడిదే అంశం టీచర్ల బదిలీలకు మోకాలడ్డుతోంది.

ఇక్కడి నుంచి ఇంకెక్కడో బదిలీ అయితే మహా నగరంలోని సకల సౌకర్యాలను కోల్పోవడంతోపాటు హెచ్‌ ఆర్‌ఏ సహా ఇతర

వ్యాపకాలను కోల్పోతామన్న భయం వారికి పట్టుకుంది, ఎలాగైనా బదిలీలను అడ్డుకోవాలని కొందరు టీచర్ల పాచిక

కోర్టులకెక్కి బదిలీలను జాప్యం చేయించేందుకు కారణమవుతున్నది. సొంత లాభం కొంత మానుకో .అన్న గురజాడ పలుకులను భ్రష్టు పట్టిస్తూ, సొంత లాభం కోసం పాకు లాడుతున్న కొందరు టీచర్లు.. 95శాతం మంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకుంటూ విలన్లుగా మారుతున్నారని తెలుస్తుంది..

నేడు శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం జగన్

తిరుమల లో ఆదివారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీవారి తరపున సర్వసేనాధిపతి అయిన విష్వక్సేనుడు మాడవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అనంతరం విష్వక్సేనుడు ఆలయానికి చేరుకున్నాక యాగశాలలో శాస్త్రోక్త కార్యక్రమాలను నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల నడుమ బీజవాపం కార్యక్రమంతో అంకురార్పణ కార్యక్రమం సమాప్తమైంది. ఇక, సోమవారం సాయంత్రం జరిగే ధ్వజరోహణంతో బ్రహ్మోత్సవాల సంరంభం మొదలుకానుంది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్‌ సోమవారం సాయంత్రం శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.

రాత్రి 9 గంటల నుంచి నిర్వహించే పెద్దశేష వాహనంతో వాహనసేవలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ టీటీడీ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.

సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మాత్రమే అమల్లో ఉంటాయి.

గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజలు ఐక్యమత్యంతో జరుపుకోవాలి: సీఎం కేసీఆర్

వినాయక చవితి పండగ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా’ అంటూ శుభం కలుగాలని ఏకదంతున్ని భక్తులు ఆరాధిస్తారని తెలిపారు.

శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రజలందరూ ఐకమత్యంతో, ఆనందంతో గణపతి నవరాత్రులను జరుపుకోవాలని సిఎం కేసీఆర్‌ సూచించారు.

గణనాథుడి ఆశీస్సులతో అనేక విఘ్నాలు అధిగమిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర రాష్ట్రాల్రకు ఆదర్శంగా నిలుస్తున్నదని ఆయన అన్నారు.

ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు లంబోధరుడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు.

నవరాత్రులతోపాటు, నిమజ్జనం సందర్భంగా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు...

గణపతి పూజకు వేళాయె

వినాయక చవితి పండుగ అంటేనే అందరిలో ఉత్సాహం. భారీ విగ్రహాలు.. వీధి వీధినా మండపాలు.. ఆకర్షణీయమైన సెట్టింగులు..

ఉదయం నుంచి విశేష పూజలు, భక్తుల దర్శనాలతో అర్ధరాత్రి వరకు సందడే సందడి. విఘ్నాలు తొలగించే వినాయకుడు

నేడు సోమవారం కొలువుదీరనుండగా, విభిన్న ఆకృతుల్లో గణనాథుడు పూజలందుకుంటాడు. ఏటేటా మండపాలు, విగ్రహాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

వీటిని నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితమవుతున్నది. గతంలో మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేవారు.

కానీ నేడు యువత పోటీపడి ఆకర్షణీయమైన రంగులతో ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.

భారీ విగ్రహాల విషయంలో ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గడం లేదు...

Sonia Gandhi: కర్ణాటకకు అప్పుడు 5 హామీలే.. తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించిన సోనియా

Telangana: కర్ణాటక ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి 5 హామీలు ప్రకటించి గెలుపొందిన కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించింది.

6 హామీలు ఇవే..

1. మహాలక్ష్మి పథకం

2. రైతు భరోసా పథకం

3. గృహ జ్యోతి పథకం

4. ఇందిరమ్మ ఇంటి పథకం

5. యువ వికాసం పథకం

6. చేయూత పెన్షన్‌ పథకం

అధికారంలోకి రాగానే పై ఆరు పథకాలను అమలు చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తారు. అలాగే, ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తారు. రాష్ట్రంలోని పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు.

రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఇస్తారు. కౌలు రైతుకి కూడా అంతే ఇస్తారు. రైతు కూలీలకు ఏడాది రూ.12,000 అందుతాయి.

యువ వికాస పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డులు అందిస్తారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తారు..

Kharge: రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన మల్లికార్జున ఖర్గే

తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే (Mallikarjuna Kharge) మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు..

తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలను ప్రకటిస్తోందని తెలిపారు. రైతు భరోసా పథకాన్ని (Rythu Bharosa scheme) మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

"రైతు భరోసా కింద రూ.15 వేలు పెట్టుబడి సాయం. కౌలురైతులకు రూ.12 వేలు సాయం.

వరికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్‌. వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌.

ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశాం. ఉపాధిహామీ చట్టం చేసింది కాంగ్రెస్సే. ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చింది కాంగ్రెస్‌." అని ఖర్గే అన్నారు..

ఆదరించండి అభివృద్ధి చేస్తాం: రాహుల్ గాంధీ

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ముఖ్య నేత సోనియాగాంధీ ఎలా అయితే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో.. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదే విధంగా ఆరు హామీలను అమలు చేస్తాం అన్నారు.

పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ. ఇవ్వాల ఆదివారం జరిగిన విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పథకాలను తెలియజేస్తూనే.. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు చేసిన అవినీతిని, ఇక్కడినేతల అవినీతిపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే…

రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో వారి గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్తోనే కొట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పోరాటం చేస్తోంది. ఇవన్నీ వేర్వేరు పార్టీలుగా కనిపించినా, తెలంగాణలో అన్నీ కలిసిపోయాయి.

నేను లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను. పార్లమెంట్లో బీజేపీ అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు తెలిపింది. జీఎస్టీకి సపోర్టు ఇచ్చింది. ఎప్పుడూ బీజేపీకి అవసరం పడితే అప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టుగా నిలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ మీటింగ్ పెట్టామని వాళ్లు ముగ్గురు కూడా వేర్వేరేరు మీటింగ్లు పెట్టాయి.

కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న విషయం మీరు గమనించాలి. ఇంకొక విషయం దయచేసి గమనించాలి.ప్రతిపక్షాల అందరి నాయకులపై ఏదో ఒక కేసు ఉంది.

ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటివన్నీ విపక్ష నేతలపై ఉన్నాయి. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ వారు ఏ ఒక్క కేసు పెట్టలేదు. ఎంఐఎం నాయకులపై కూడా ఏ కేసు లేదు. కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులు పెట్టారు. నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై కేసులు పెట్టడు. అందుకే కేసీఆర్, ఎంఐఎం నేతలపై కేసులు లేవు. మోదీ వీళ్లిద్దరినీ తన మనుషులుగా భావిస్తున్నారు.

కాబట్టే ఎట్లాంటి కేసులు పెట్టలేదు. ఇక్కడ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా వీరిపైన కేసులు ఏవు. ఇవ్వాల సోనియా గాంధీ స్పీచ్ వింటున్నాను. సోనియా గాంధీ మాట ఇస్తే తప్పనిసరిగా మాట నిలబెట్టుకుంటారు.

ఏమి జరిగినా, ఎంత నష్టపోయినా సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. 2012లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆలోచిస్తామని చెప్పారు.ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నారు. మీ కల, మీ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు.

ఇక్కడ మొత్తం అన్ని లాభాలు కూడా ముఖ్యమంత్రి కుటుంబానికే దక్కుతున్నాయి. మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి ఇవ్వలేదు. వారి లాభాల కోసం ఇవ్వలేదు. పేదల కోసం, రైతుల కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఏర్పాటు చేశాం.

కానీ, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదు. మేము అప్పడు తెలంగాణ విషయంలో గ్యారెంటీ ఇచ్చాం.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా అదే గ్యారెంటీ ఇస్తున్నాం..

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో తమిళి సై

వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ బడా గణేశ్ సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి పూజలు అందుకోనున్నారు.

ఇందుకోసం గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వినాయకుడికి సోమవారం తొలి పూజ గవర్నర్ తమిళి సై‌తో చేయించాలని కమిటీ నిర్ణయించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆమెను కలిశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేయాలని గవర్నర్‌కు కోరారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించారు.

ఖైరతాబాద్ గణేశ్‌కు తొలి పూజ చేయడం తన పూర్వ జన్మ సుకృతమని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది.కాగా ఖైరతాబాద్‌లో ‌ వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.

ఈ ఏడాది 63 అడుగల గణేశుడు పూజలందుకునేందుకు సిద్ధమయ్యారు. 9 రోజుల పాటు భక్తుల దర్శనాలకు ఉత్సవ కమిటీ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ జరగనుంది.

దీంతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభవుతాయి. 9 రోజలు పాటు గణనాథుడు పూజలందుకుంటారు. అనంతరం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఖైరతాబాద్ పరిసరాల్లో శోభాయాత్ర నిర్వహించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు...