నేడు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

నేడు ఆదివారం తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది,

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పన జరగనుంది. ఈరోజు రాత్రి 7 గంటల స‌మ‌యంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పన జ‌రుగుతుంద‌ని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.

సెప్టెంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, సెప్టెంబ‌ర్ 22న గరుడ సేవ నిర్వ‌హించ‌నున్నారు. ఉత్స‌వాల నేప‌థ్యంలో తిరుమల కొండపై ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

Parliament: రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..

రేపుటి ( సోమవారం ) నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా నేడు (ఆదివారం) అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో కేంద్ర ప్రభుత్వం భేటీ కానుంది..

ఈ సెషన్స్ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఐదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్‌ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది..

ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ది అడ్వొకేట్స్‌(సవరణ)బిల్లు-2023, ది ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు-2023, ది పోస్టాఫీస్‌ బిల్లు-2023లను ఈ సెషన్‌లో లోక్‌సభలో కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సెషన్స్ లో రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లును ఈసారి చర్చకు తీసుకురానుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం సభ ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా కొనసాగుతుంది..

నవదీప్ ను ఈ నెల 19 వరకు అరెస్టు చెయ్యొద్దు: హై కోర్టు*

తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.నవదీప్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఈనెల 19 వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసుల ప్రకటనపై సినీ నటుడు నవదీప్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

నేను డ్రగ్స్ కన్జ్యూమర్ కాదు. డ్రగ్స్ తీసుకున్న అనటానికి ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే నేను పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు.

నా గురించి మీడియాలో తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు. నేను మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాను. పోలీసుల స్టేట్‌మెంట్ నా కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఈ కేసులో ఎలాంటి కస్టోడియల్ దర్యాప్తు అవసరం లేదు. నేను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు.అని నవదీప్ తెలిపారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన ప్రారంభమైన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం.

ఎంపి గల్లా జయదేవ్ నివాసంలో భేటి అయిన ఎంపిలు

పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ.

పార్లమెంట్ సమావేశాల్లో రాబోయే బిల్లులు, టిడిపి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.

కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాల పై చర్చ..

శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నకు జైలు శిక్ష?

శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నకు హైకోర్టు నెలరోజుల జైలు శిక్ష విధించింది.

లవన్న గతంలో కడప మున్సిపల్ కమిషనర్ గా పనిచేసే సమయంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని పద్మావతి బాయికి చెందిన షాపులను, ఇంటి పై భాగంను మునిసిపల్ అధికారులు కూల్చేస్తున్నారంటూ 2020లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

అయితే కోర్టు ఆదేశాలున్నా తన ఇంటిని కూల్చేశారని ఆమె మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ విచారించిన కోర్టు లవన్నకు జైలుశిక్ష విధించింది.

బాబుతో పవన్ ములాఖత్లో మిలాఖత్ అయ్యారు: జగన్

చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్ పై CM జగన్ ఫైర్ అయ్యారు.

'అవినీతి కేసులో బాబు అరెస్ట్ అయితే ఈయన వెళ్లి ములాఖత్ అయి మిలాఖత్ చేసుకున్నాడు.

పొత్తు పెట్టుకున్నాడు. ఎలాంటి మనుషులు ఉన్నారో ఆలోచన చేయాలి.

ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు?

ఎవరు జేబులోకి డబ్బులు పోయాయి?

ఆ దోచేసిన వారిని జైల్లో పెట్టకపోతే ఎక్కడ పెట్టాలని ప్రశ్నించాల్సిన వ్యక్తులు.. ములాఖత్లో మిలాఖత్లు అవుతున్నారు' అని విమర్శించారు.

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన CM జగన్

చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ స్పందించారు.

'ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్టైన ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెబుతాను.

ఇన్ని దొంగతనాలు చేసినా చంద్రబాబు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగలముఠా సభ్యులు ఉన్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడియోతో అడ్డంగా దొరికినా పత్రికలు, టీవీల్లో నిజాలను చూపించరు.

ఆ పని సబబేనని సపోర్ట్ కూడా చేస్తారు' అని విమర్శించారు.

Ponnam Prabhakar: చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్నో ఊహాగానాలు

టీడీపీ అధినతే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై (TDP Chief Chandrababu naidu) రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ (Congress Leader Ponnam Prabhakar) అన్నారు..

శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసారని ఏపీ ప్రభుత్వం (AP Government)ఆరోపిస్తుందని.. ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ (TDP) చెబుతోందన్నారు. తప్పు ఒప్పులను డిసైడ్ చేసేది, నిర్ణయించే అధికారం న్యాయ స్థానాలకు ఉందని తెలిపారు.

కాబట్టి రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని హితవుపలికారు. కరప్షన్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు (Telangana CM KCR), బీఆర్ఎస్ నేతలకు (BRS Leaders) లేదన్నారు. దేశంలో ఎక్కడ జరగని అవినీతి అక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు..

Nara Lokesh: నారా లోకేశ్‌ అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ సమావేశం

దిల్లీ: చంద్రబాబు అరెస్టు అక్రమమని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చే ప్రధాన అజెండాగా నేడు దిల్లీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది..

ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు తెదేపా ఎంపీలు భేటీకానున్నారు..

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. చంద్రబాబు అరెస్టు, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లేలా వ్యూహ రచన చేయనున్నారు. వివిధ పార్టీల మద్దతుతో చంద్రబాబు అరెస్టు అంశం ఉభయసభల్లో చర్చకు తీసుకెళ్లేలా కసరత్తు చేయనున్నారు. కాగా ఇప్పటివరకూ తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతూ వచ్చేది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉండటంతో తొలిసారి లోకేశ్‌ ఆధ్వర్యంలో జరగనుంది..

Tummala: భారాసకు తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా

హైదరాబాద్‌: భారాసకు తుమ్మల నాగేశ్వరావు (Tummala nageswa rao) రాజీనామా చేశారు. భారాసలో తనకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు..

కాగా ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మలతోపాటు భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు సైతం కాంగ్రెస్‌లో చేరతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాల సమాచారం. తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్‌ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తుమ్మల శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు..