Chandrababu: చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్, లోకేష్ ములాఖత్ అయ్యారు..

చంద్రబాబును పరామర్శించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం ఉంది. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు చేరుకున్నారు.

పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు కంటే ముందు టీడీపీ క్యాంప్ కార్యాలయానికి పవన్‌ కళ్యాణ్ వెళ్లారు. చంద్రబాబు భార్య భువనేశ్వరితో కొద్దిసేపు పవన్‌ కళ్యాణ్‌ చర్చలు జరిపారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు వచ్చారు. ఆరు వాహనాల కాన్వాయ్‌తో పవన్ కళ్యాణ్ జైలు వద్దకు చేరుకోగా.. ఆరు వద్దు, ఒక కారు సరిపోతుందని అధికారులు సూచించారు. పవన్‌ వెంట జైల్లోకి వెళ్లేందుకు జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌ ప్రయత్నించగా.. ఇష్టానుసారంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంపై అధికారుల అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది..

చికెన్ పాక్స్ కొత్త వేరియంట్.. తొలికేసు నమోదు

దేశంలోనే తొలిసారిగా చికెన్ పాక్స్ కొత్త వేరియంట్ ' క్లాడ్ 9'ను గుర్తించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సైంటిస్టులు వెల్లడించారు.

మంకీపాక్స్ అనుమానిత కేసులను పరిశీలించే క్రమంలో పలువురిలో 'క్లాడ్ 9' వేరియంట్ ను గుర్తించినట్లు తెలిపారు.

యూకే, జర్మనీ, యూఎస్ లో ఈ వేరియంట్ అధికంగా కనిపిస్తుందన్నారు.

'క్లాడ్ 9' సోకిన 2 వారాల తర్వాత దద్దుర్లు, తలనొప్పి, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన రామచంద్ర పిళ్లై

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు.

ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమచారం.

ఈ క్రమంలో అరుణ్ నుంచి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

అరుణ్ రామచంద్రన్ పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడీ అభియోగం మోపింది. గత మార్చి 7న ఈడీ అధికారులు పిళ్లైని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అంతేకాకుండా పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన అప్రూవర్గా మారడం ఆసక్తి రేపుతోంది.

వాస్తవానికి అరుణ్‌ పిళ్లై అప్రూవర్‌గా మారడం ఇదేం కొత్త కాదు. గతంలో ఒకసారి అప్రూవర్‌గా మారి స్టేట్‌మెంట్‌ ఇచ్చిన పిళ్లై.. ఆ తర్వాత బలవంతంగా అప్రూవర్ గా మారేలా చేశారంటూ మాట మార్చారు. ఈడీ బలవంతంగా వాంగ్మూలం తీసుకుందని.. అదంతా తప్పంటూ పిళ్లై మళ్లీ కోర్టును ఆశ్రయించారు. అదేసమయంలో ఆ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలంటూ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ఈడీ అధికారులు తన వద్ద బలవంతంగా సంతకం చేయించుకున్నారని.. ఆ పత్రాల్లో తన వాంగ్మూలాలను సమర్పించారని.. అదంతా ఫేక్ అంటూ వివరించారు. అయితే.. తాజాగా పిళ్లై మరోసారి అప్రూవర్‌గా మారి కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇవ్వడం.. సంచలనంగా మారింది.

అయితే, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటి వరకూ అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువ మంది సౌత్ గ్రూపు‌నకు చెందిన వారే ఉన్నారు. దీనిలో ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కొడుకు మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, దినేష్ ఆరోరా ఉండగా.. తాజాగా రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు

Pakistan vs Sri Lanka, Super Fours, 5th Match : ఆసియా కప్ 2023 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఐదో మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో టీమిండియాతో ఆడనుంది. దీంతో అందరు కచ్చితంగా పాకిస్తాన్ జట్టు గెలుస్తుందని… అనుకుంటున్నారు.

Sri Lanka XI: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (WK), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (c), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ.

Pakistan XI: మహ్మద్ హారిస్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిమ్ జూనియర్, జమాన్ ఖాన్

రేపు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్:

దేశ వైద్యవిద్య చరిత్రలో తెలంగాణ వరుసగా రికార్డులు సృష్టిస్తున్నది. నిరుడు ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభించి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఈసారి ఏకంగా 9 కళాశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమైంది.

15న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయంశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగామ జిల్లాల్లో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఏమూల ఎవరికి ఏ కష్టం వచ్చినా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ దవాఖానలే దిక్కయ్యేవి. వందల కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వచ్చేది. సకాలంలో వైద్య సదుపాయం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది. ఉద్యమ సమయంలో ఇవన్నీ కండ్లారా చూసిన కేసీఆర్‌.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టిసారించారు. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందిస్తూనే మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.

తొమ్మిదేండ్లలో 29 కాలేజీలు

తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఉన్నవి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే. వీటిలో ఉస్మానియా (1946), గాంధీ (1954) మెడికల్‌ కాలేజీలు ఉమ్మడి ఏపీ ఆవిర్భావానికి ముందు నుంచే ఉన్నాయి. వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీని ప్రైవేట్‌ సంస్థ ఏర్పాటు చేస్తే ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నది. అంటే దాదాపు ఆరు దశాబ్దాల్లో ఉమ్మడి పాలకులు తెలంగాణలో ఏర్పాటు చేసింది కేవలం రెండే కాలేజీలు. అవి.. ఆదిలాబాద్‌లో రిమ్స్‌, నిజామాబాద్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ. మొత్తంగా చూస్తే కేవలం నాలుగు జిల్లాల్లోనే మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. కానీ, స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్‌ 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశారు. అంటే సగటున ఏడాదికి మూడు కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ ఏడాది ఏకంగా ఒకేసారి 9 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానుండడం దేశ వైద్యవిద్య రంగంలోనే సరికొత్త చరిత్ర కానున్నది.

ఐదున్నర రెట్లు పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు

జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు గణనీయంగా పెరిగాయి. 2014లో 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కలిపి 850 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి.

ఈ ఏడాది కొత్త కాలేజీలతో కలిపి ఆ సంఖ్య 3,790కి పెరిగింది. వచ్చే ఏడాది మరో 800 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో సీట్ల సంఖ్య 4,590కి పెరుగుతుంది. అంటే.. 9 ఏండ్లలోనే ఐదున్నర రెట్లు పెరుగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 2014 నాటికి 2,850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటే ఈ ఏడాదితో 8,340కు పెరిగాయి...

AP High Court: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణ..

AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు..

ఈ పిటిషన్‌ నేడు విచారణకు లిస్ట్ అయింది. ఇదిలా ఉండగా.. ఇవాళ పవన్‌ కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లనున్నారు. ఒకేసారి చంద్రబాబును జైలులో కలవనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో బాలయ్య, పవన్, లోకేష్ ములాఖత్ కానున్నారు.

ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సెంట్రల్ జైలుకు రానున్నారు. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకు బాలయ్య, లోకేష్ రానున్నారు. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. నేడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.

ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ముగ్గురు కలిసి 11:30 తర్వాత చంద్రబాబుతో ములాఖత్ కానున్నట్లు సమాచారం. ములాఖత్ తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ పవన్ వెళ్లనున్నారు.

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం స్వామివారిని 75,059 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారికి 27,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

Kishanreddy: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష భగ్నం..

హైదరాబాద్‌: కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన '24 గంటల నిరాహార దీక్ష'ను పోలీసులు భగ్నం చేశారు..

ఈక్రమంలో భాజపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు కిషన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.

బుధవారం సాయంత్రం 6గంటల వరకే దీక్షకు అనుమతి ఉందని, వెంటనే దీక్షా శిబిరం ఖాళీ చేయాలని 6.30గంటల సమయంలో పోలీసులు కిషన్‌డ్డికి సూచించారు. గురువారం ఉదయం 6గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులను హెచ్చరించారు. వెనక్కి తగ్గిన పోలీసులు.. రాత్రి 8గంటల సమయంలో మరోసారి ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కిషన్‌రెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.

Hyderabad: నిజాంపేటలో కుప్పకూలిన రెండంతస్తులు.. ఉలిక్కిపడిన స్థానికులు

హైదరాబాద్‌: నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రెండు అంతస్తులు ఒక్కసారిగా కుప్ప కూలాయి. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఈ ఘటన జరిగింది..

ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిర్మాణంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.

ఒకటో స్లాబ్ క్యూరింగ్ సరిగా చేయకపోవడం, వెంటనే రెండో స్లాబ్ వేయడం, రెండో స్లాబ్ కూడా బరువు తాళలేక కుప్పకూలిందని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు..

13 చోట్ల చంద్రబాబు సంతకాలు-జీవోకు బదులు అగ్రిమెంట్ అమలు-స్కిల్ స్కాంపై సీఐడీ ఛీఫ్..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఐడీ ఛీఫ్ సంజయ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారం లో ఉన్నాయని సంజయ్ తెలిపారు. సాధారణం గా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు అటు నుంచి వ్యక్తులకు వెళ్లాయని సంజయ్ తెలిపారు. ఒక కార్పొరేషన్ నుంచి డబ్బు హవాలా రూపంలో ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిందన్నారు.

సీమెన్స్,డిజైన్ టెక్ సంస్థల ప్రతినిధులు నిందితులుగా ఉన్నారని సంజయ్ తెలిపారు. గంటా సుబ్బారావు కు మూడు పదవులు ఇచ్చారన్నారు. పైస్థాయిలో ప్రోద్బలం తోనే అన్నీ జరిగాయన్నారు. జీవోలో పొందుపరిచిన అంశాలకు భిన్నంగా అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. అగ్రిమెంట్ లో 330 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పడం వెనుక దుర్భుద్ధి కనపడుతుందని సంజయ్ ఆరోపించారు..

తమకు 58.8 కోట్లు మాత్రమే అందాయని సీమెన్స్ సంస్థ స్పష్టత ఇచ్చిందన్నారు.

మొత్తం 313 కోట్లలో 241 కోట్లు ఎలాంటి సంబంధం లేని షెల్ కంపెనీకి వెళ్లాయని సంజయ్ తెలిపారు. మిగతా డబ్బులు మాత్రమే కేంద్రాల ఏర్పాటు కు ఖర్చు చేశారన్నారు. 58 కోట్ల తో కొనుగోలు చేసి 2800 కోట్లు గా చూపించారని సంజయ్ వెల్లడించారు. గుజరాత్ లో 85-15 శాతం మోడల్ లో ఒప్పందాలు జరిగాయని, గుజరాత్ లో 85 శాతం పరికరాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయని సంజయ్ తెలిపారు. ఇందులో కొందరు అధికారులు కూడా ఉన్నారన్నారు. ఏపీలో2800 కోట్ల సాప్ట్ వేర్ గాల్లో మాత్రమే కనిపిస్తోందన్నారు.

సీఐడి ఆరోపించింన సుమన్ బోస్ , వికాస్ ఖన్వేల్కర్ లను ఈడీ అరెస్టు చేసిందని సంజయ్ తెలిపారు. డిజైన్ టెక్ కు చెందిన 32 కోట్లు ఈడి సీజ్ చేసిందన్నారు. టీడీపీకి చెందిన జే.వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని సీఏ గా నియమించారని, ఈ వ్యవహారం లో మొత్తం 13 చోట్ల చంద్ర బాబు సంతకాలు ఉన్నాయని సంజయ్ తెలిపారు. బడ్జెట్ అనుమతి తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ఏర్పాటు, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తదితర అంశాల పై చంద్రబాబు సంతకాలు చేశారన్నారు. జీవో లో 90 - 10 శాతం వాటా లను పేర్కొన్నారని, కానీ ఒప్పందంలో లేదన్నారు..