నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం స్వామివారిని 75,059 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారికి 27,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

Kishanreddy: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష భగ్నం..

హైదరాబాద్‌: కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన '24 గంటల నిరాహార దీక్ష'ను పోలీసులు భగ్నం చేశారు..

ఈక్రమంలో భాజపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. భారీగా మోహరించిన పోలీసులు కిషన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.

బుధవారం సాయంత్రం 6గంటల వరకే దీక్షకు అనుమతి ఉందని, వెంటనే దీక్షా శిబిరం ఖాళీ చేయాలని 6.30గంటల సమయంలో పోలీసులు కిషన్‌డ్డికి సూచించారు. గురువారం ఉదయం 6గంటల వరకు దీక్ష చేస్తానని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులను హెచ్చరించారు. వెనక్కి తగ్గిన పోలీసులు.. రాత్రి 8గంటల సమయంలో మరోసారి ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కిషన్‌రెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.

Hyderabad: నిజాంపేటలో కుప్పకూలిన రెండంతస్తులు.. ఉలిక్కిపడిన స్థానికులు

హైదరాబాద్‌: నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రెండు అంతస్తులు ఒక్కసారిగా కుప్ప కూలాయి. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఈ ఘటన జరిగింది..

ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిర్మాణంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.

ఒకటో స్లాబ్ క్యూరింగ్ సరిగా చేయకపోవడం, వెంటనే రెండో స్లాబ్ వేయడం, రెండో స్లాబ్ కూడా బరువు తాళలేక కుప్పకూలిందని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు..

13 చోట్ల చంద్రబాబు సంతకాలు-జీవోకు బదులు అగ్రిమెంట్ అమలు-స్కిల్ స్కాంపై సీఐడీ ఛీఫ్..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు, రిమాండ్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఐడీ ఛీఫ్ సంజయ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారం లో ఉన్నాయని సంజయ్ తెలిపారు. సాధారణం గా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు అటు నుంచి వ్యక్తులకు వెళ్లాయని సంజయ్ తెలిపారు. ఒక కార్పొరేషన్ నుంచి డబ్బు హవాలా రూపంలో ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిందన్నారు.

సీమెన్స్,డిజైన్ టెక్ సంస్థల ప్రతినిధులు నిందితులుగా ఉన్నారని సంజయ్ తెలిపారు. గంటా సుబ్బారావు కు మూడు పదవులు ఇచ్చారన్నారు. పైస్థాయిలో ప్రోద్బలం తోనే అన్నీ జరిగాయన్నారు. జీవోలో పొందుపరిచిన అంశాలకు భిన్నంగా అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. అగ్రిమెంట్ లో 330 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పడం వెనుక దుర్భుద్ధి కనపడుతుందని సంజయ్ ఆరోపించారు..

తమకు 58.8 కోట్లు మాత్రమే అందాయని సీమెన్స్ సంస్థ స్పష్టత ఇచ్చిందన్నారు.

మొత్తం 313 కోట్లలో 241 కోట్లు ఎలాంటి సంబంధం లేని షెల్ కంపెనీకి వెళ్లాయని సంజయ్ తెలిపారు. మిగతా డబ్బులు మాత్రమే కేంద్రాల ఏర్పాటు కు ఖర్చు చేశారన్నారు. 58 కోట్ల తో కొనుగోలు చేసి 2800 కోట్లు గా చూపించారని సంజయ్ వెల్లడించారు. గుజరాత్ లో 85-15 శాతం మోడల్ లో ఒప్పందాలు జరిగాయని, గుజరాత్ లో 85 శాతం పరికరాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయని సంజయ్ తెలిపారు. ఇందులో కొందరు అధికారులు కూడా ఉన్నారన్నారు. ఏపీలో2800 కోట్ల సాప్ట్ వేర్ గాల్లో మాత్రమే కనిపిస్తోందన్నారు.

సీఐడి ఆరోపించింన సుమన్ బోస్ , వికాస్ ఖన్వేల్కర్ లను ఈడీ అరెస్టు చేసిందని సంజయ్ తెలిపారు. డిజైన్ టెక్ కు చెందిన 32 కోట్లు ఈడి సీజ్ చేసిందన్నారు. టీడీపీకి చెందిన జే.వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని సీఏ గా నియమించారని, ఈ వ్యవహారం లో మొత్తం 13 చోట్ల చంద్ర బాబు సంతకాలు ఉన్నాయని సంజయ్ తెలిపారు. బడ్జెట్ అనుమతి తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ఏర్పాటు, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తదితర అంశాల పై చంద్రబాబు సంతకాలు చేశారన్నారు. జీవో లో 90 - 10 శాతం వాటా లను పేర్కొన్నారని, కానీ ఒప్పందంలో లేదన్నారు..

రేపు రాజమండ్రికి జనసేనాని..

టీడీపి అధినేత చంద్రబాబుగారు తో జనసేన్ అధ్యక్షుడు పవన్ ములాఖాత్..

జైలులో కలవనున్న ఇద్దరు అగ్రనేతలు..

చంద్రబాబుకు మడ్డతు తెలిపి, దైర్యం చెప్పనున్న జనసేనాని

ప్రత్యేక విమానంలో రాజమండ్రీ కి పవన్..

జైలు అధికారులు ఇచ్చే సమయంలో సెంట్రల్ జైల్లో ములాఖాత్..

చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పవన్ కలిసే అవకాశాలు..

నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు : రజినీకాంత్

చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్ష..

లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్...

తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు..

అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు..

నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు..

తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజాసేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు..

కెసిఆర్ సార్ అమ్మ నాన్న లేని అనాథలం మాకూడ దళిత బంధు ఇవ్వండి

దళితుల కొరకు కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం తమకి కేటాయించాలని వంగూరి దివ్య వంగూరి సంధ్య అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం పంపారు

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన వంగూరి సంధ్య (20) మరియు వంగూరి దివ్య (19) SC(మాదిగ) అనే ఇద్దరు అనాథ అక్క చెల్లెలు 20 సంవత్సరాల లోపు వయసు వారే. ఒకరేమో ఇంటర్ పూర్తి చేసినారు.మరొకరు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నరు. వాళ్లు 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తల్లి వంగూరి రేణుక రొమ్ము క్యాన్సర్ తో చనిపోయింది. దాని తరవాత కొద్ది కాలానికే తండ్రి వంగూరి కిష్టయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు.

ఆయన అలన పాలన ఈ ఇద్దరు పిల్లలే చూసుకుంటూ ఇద్దరు చదువుకుంటూ కులిపనులు పనులు చేస్తూనే ఇంతకాలం తండ్రిని సాదుకుంటు వచ్చారు. నెల రోజుల క్రితం(06 ఆగస్ట్ 2023) నాడు తండ్రి కూడా చనిపోయాడు. ఇలా తాము ఇంత చిన్న వయసులోనే తల్లిదడ్రులిద్దరూ చనిపోవటం ఆ పిల్లలు తట్టుకోలేకపోతున్నారు.చివరికి తండ్రి అంత్యక్రియలు కూడా సొంత ఖర్చులతో జరపాలేని పేదరికం లో ఉన్న ఆ అక్క చెల్లెలకి మానవత్వం ఉన్న కొంత మంది అండగా నిలిచి కొంత ఆర్థిక సహకారం అందించటం తో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇప్పుడు తమకి ఎవరు లేక ఒంటరిగా మిగిలిపోయామని బోరున విలపిస్తున్నారు.తమకి అస్తి పాస్తులు కూడా ఏమీ లేవని తమ మంచి చెడూ చూసుకునే వారు కూడా ఎవరూ లేకపోవడంతో అమ్మ నాన్న లేని ఇద్దరు అనాథలు అయిన ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ తమకు కేసిఆర్ ఏ పెద్దదిక్కు కావాలని తమ కాళ్లపై తాము నిలబడి బ్రతకడానికి,స్వయం ఉపాధినీ ఎంచుకొని తమ జీవనం కొనసాగించటానికి రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఎదుగుదల కొరకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని తమకు ఒక యూనిట్ నీ కేటాయించి కెసీఆర్ గారే తమకు అండగా నిలవాలని కోరుకుంటూ బుధవారం రోజు తమ బాధని పోస్ట్ కార్డు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉత్తరం పంపారు.

ఎంతో మందికి దళిత బంధు పథకం ద్వారా సహాయపడి వారి బతుకుల్లో మార్పులు తీసుకొచ్చిన కెసిఆర్ అమ్మ నాన్న లేని తమకి కూడా దళిత బంధు పథకం ఇచ్చి అమ్మ నాన్న అన్ని తానే అయ్యి తమ బతుకుల్లో మార్పులు తీసుకురావాలని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గారు కూడా స్పందించి తమ చెల్లెల లాగా అనుకొని మాపై మానవత్వం చూపి మాకు అన్నలాగ ఉండాలని ఆ పిల్లలు వేడుకుంటున్నారు.

ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యార్థుల నిరుద్యోగుల ఆరాధ్య దైవం,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు మరియు ఆస్పత్రి సిబ్బందికి పండ్లు పంపిణీ కార్యక్రమం భారీగా చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనారిటీ నిరుపేద ప్రజల కోసం 50 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింపజేసి ప్రభుత్వంపై పోరాడిన గొప్ప నాయకుడు ఆర్ కృష్ణన్న అని కొనియాడారు. అదేవిధంగా బలహీన వర్గాల పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులను ఫ్రీగా చదువుకోవడం కొరకు ప్రభుత్వంపై అనేక దపాలుగా పోరాటాలు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టించిన గొప్ప చరిత్ర ఆర్ కృష్ణ అన్నది అన్నారు.

అంతేకాకుండా నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వాలపై అనేక పోరాటాలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయించిన చరిత్ర గల నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేరని అన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల హక్కుల కోసం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి రెండు వేలకు పైగా జీవోలు తెప్పించిన ఘన చరిత్ర ఆర్.కృష్ణన్నదని అలాంటి నాయకుడు ఇంకా ముందు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయనకు ఆయుష్ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్యా యాదవ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగుల నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, పుల్లెంల యాదగిరి గౌడ్ ,బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, చింటూ యాదవ్, రాజు, హరికృష్ణ, జై పాలు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు టికెట్లపై రాయితీలు కూడా ప్రకటిస్తోంది.

ఈ క్రమంలో ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో శుభ వార్త అందించింది. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు బస్సుల్లో ప్రయాణికులు టికెట్ కోసం ఆన్‌లైన్ పేమెంట్ చేసే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం ఐ టిమ్స్ పరికారాలను బస్సుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

తొలుత పైలట్ ప్రాజెక్టుగా బండ్లగూడ డిపో పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. యూపీఐ యాప్‌లతో పాటు డెబిట్, కార్డుల ద్వారా టికెట్ కోసం పేమెంట్ చేయవచ్చు. బస్సుల్లో టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర సమస్య ఏర్పడుతుంది.

కండక్టర్ దగ్గర చిల్లర లేకపోవడంతో ప్రయాణికులతో ఇబ్బంది అవుతుంది. దీని వల్ల కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి.

ఈ క్రమంలో చిల్లర సమస్య లేకుండా చేసేందుకు ఆన్‌లైన్ నగదు లావాదేవీలను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

ఎప్పటి నుంచో దీని గురించి చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం గతంలో అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు అదే విధానం బస్సుల్లో కూడా తీసుకురానుంది.....

కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేద్దాం

•టిపిసిసి ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ బైకాని లింగం యాదవ్

మునుగోడు: టిపిసిసి ఆధ్వర్యంలో ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని టిపిసిసి అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ బైకాని లింగం యాదవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బుధవారం డాక్టర్ లింగం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా విజయభేరి బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలంతా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని రానున్న సెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు.

విజయభేరి బహిరంగ సభకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ హాజరవుతున్నారని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమానంగా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. విజయభేరి బహిరంగ సభలో తెలంగాణలోని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు భరోసా కల్పించేందుకు డిక్లరేషన్ ను ప్రకటించడం జరుగుతుందన్నారు.