SBI లో 2 వేల పీవో పోస్టులు

దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్‌బీఐలో డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీని ద్వారా 2 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.

వీటిలో ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌-200, జనరల్‌- 810 ఖాళీలు ఉన్నాయి. పీహెచ్‌సీ కోటాలో వీఐ-20, హెచ్‌ఐ-36, ఎల్‌డీ-20, డీ అండ్‌ ఈఈ-36 పోస్టులను కేటాయించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

ప్రారంభ వేతనం రూ.41,960,నాలుగు అడ్వాన్స్‌ ఇంక్రిమెంట్స్‌తో ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయనున్నవారు, మెడికల్‌, ఇంజినీరింగ్‌, సీఏ, కాస్ట్‌ అకౌంటెంట్‌ తదితర డిగ్రీలు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు 2023, ఏప్రిల్‌ 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 27లోగా దరఖాస్తు చేసుకోవాలి.

నేడే జగిత్యాల కు ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్‌గల్‌ మామిడి మార్కెట్‌లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదే వేదికగా కాంగ్రెస్‌ నుంచి ముఖ్య నాయకులు గులాబీ పార్టీలో చేరనుండగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు అంతా సిద్ధం చేశారు.

ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పరిశీలించి, సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు....

అంగన్‌వాడీ టీచర్ల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీలు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై కేసీఆర్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్‌వాడీలకు సంబంధించి ఇప్పటికే పలు జీవోలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తాజా మరో జీవో జారీ చేసింది.

దేశంలో ఎక్కడాలేనివిధంగా పదవీ విమరణ సమయంలో అంగన్‌వాడీల సేవలకు గుర్తింపుగా ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల్లో 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షలు బీమా సదుపాయం, 50 ఏండ్లు దాటిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయసును 65 ఏండ్లుగా నిర్ణయించిన ప్రభుత్వం.. పదవీ విరమణ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.

దురదృష్టవశాత్తు సర్వీస్‌లో ఉన్న అంగన్‌వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20 వేలు, హెల్పర్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనున్నది. అంగన్‌వాడీల డిమాండ్లను మానవీయ దృష్టిలో పరిష్కరించిన సీఎం కేసీఆర్‌కు స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తోపాటు యూనియన్ల ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు...

ప్రపంచ పటంపై జీ 20 శిఖరాగ్ర సదస్సు భారత ఖ్యాతిని మరింత పెంచిందా?

గత ఏడాది జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ అందుకున్నప్పుడు దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇది భారత్‌కు లభించిన సువర్ణావకాశం అని కొందరు, రొటేషన్‌ ప్రకారం భారత్‌కు అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి తప్ప అందులో ఏముంది గొప్ప అంటూ పెదవి విరిచినవారు మరికొందరు. ఇలా అందరూ విభిన్నరీతుల్లో తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం మాత్రం ఎవరి మాటలను లెక్కచేయకుండా.. ప్రెసిడెన్సీ ఎలా వచ్చిందన్నది కాదు.. ఆ అధ్యక్ష బాధ్యతల్లో మనం ఏం చేశామన్నదే లోకం గుర్తు పెట్టుకుంటుంది అన్నట్టుగా పనిచేసింది. దేశంలోని 60 నగరాల్లో సుమారు 200 సమావేశాలను నిర్వహించింది.

జీ-20 సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల ప్రతినిధులకు భారత్‌లోని సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని కలిగిన నేల ఇది అని ప్రపంచ దేశాలకు గుర్తుచేసింది. మిగతా ఖండాల్లో నాగరికత ఇంకా అభివృద్ధి చెందక ముందే ఎంతో పక్కాగా అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత కల్గిన దేశం భారత్ అని వారికి తెలియజెప్పింది. ఇదంతా ఒకెత్తయితే.. వర్తమాన ప్రపంచంలో భారత్ శక్తి, సామర్థ్యాలు ఏంటన్నది ఈ జీ-20 అధ్యక్ష బాధ్యతల ద్వారా చాటి చెప్పింది. వాటిలో మచ్చుకు ఓ 5 కీలకాంశాలను గమనిస్తే..

ప్రపంచ వేదికపై పెరిగిన ఆదరణ..

ఇండియా.. భారతదేశం.. అంటే పేదరికం, వెనుకబాటుతనం, అవిద్య, అనారోగ్యం.. ఇన్నాళ్లుగా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలకు మన దేశంపై ఉన్న అభిప్రాయం ఇది. కానీ గత దశాబ్ద కాలంలో ఆ అభిప్రాయం పూర్తిగా మారుతూ వస్తోంది. అలాగని దేశంలో పేదరికం, వెనుక బాటుతనం నిర్మూలించేశామని అర్థం కానే కాదు. ప్రపంచానికి మన దేశంలోని బలహీనతలు మాత్రమే తెలిసే పరిస్థితి నుంచి బలాలను కూడా చాటుకునే స్థితికి చేరుకున్నాం. భారత్ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తితో తొణకిసలాడుతున్న దేశం. ప్రపంచ మానవ వనరుల అవసరాలను తీర్చుతున్న దేశం. గణితం, సైన్స్, వైద్యం వంటి రంగాల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే కనిపిస్తున్నారు.

కేవలం ఉద్యోగులుగానే కాదు, అసామాన్య నాయకత్వ లక్షణాలను చూపుతూ అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు సీఈవోలుగా, అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో అమలు చేసిన సంస్కరణలు, కొత్త పన్ను విధానాల కారణంగా ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడింది. ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ చేరింది. కోవిడ్-19 చైనా సహా ప్రపంచ దేశాలకు శాపంగా మారితే, భారత్ అందులో నుంచి కూడా వరాన్ని వెతుక్కుంది. అప్పటి వరకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్ల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడ్డ పరిస్థితి నుంచి అతి తక్కువ కాలంలో దేశీయ అవసరాలు తీరిపోను ఎగుమతులు చేసే స్థితికి చేరుకుంది.

అలాగే మన కంటే వెనుకబడిన దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తూ ఆయా దేశాల ఆదారాభిమానాలు చూరగొంది. అనేక ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, సరిగ్గా ఇదే సమయంలో జీ-20 ప్రెసిడెన్సీ భారత్‌కు దక్కడం మరో ఎత్తు. అందివచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో పాటు భారత్ తన సత్తాను చాటేందుకు అత్యుత్తమ ప్రపంచ వేదికగా మార్చుకుంది.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ స్థాయి వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించగలిగే సామర్థ్యంతో నిర్మించిన కొత్త ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ‘భారత మండపం’లో శిఖరాగ్ర సదస్సు నిర్వహించడం ఒకెత్తు.. అక్కడ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం మరో ఎత్తు. శిఖరాగ్ర సదస్సుకు కొద్ది రోజుల ముందే ప్రపంచంలో ఏ దేశమూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధృవంపై భారత్ కాలుమోపడం ప్రపంచ పటంపై భారత ఖ్యాతిని మరింత పెంచింది....

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నిరాహార దీక్షలు

రేపటి నుంచి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహారదీక్షలు చెయ్యాలని అధిష్టానం నిర్ణయించింది . రోజుకు ఒక మండలం చొప్పున అన్ని మండలాల నాయకులతో ఒక చోట నిరాహారదీక్ష శిబిరం ఏర్పాటు చేయాలని సూచించింది..

ఈ రిలే నిరాహారదీక్షలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని అనుబంధ సంఘాల వారు పాల్గొనాలి. టీడీపీలో ఉన్న వివిధ విభాగాల వారీగా పాల్గొనేలా ప్రణాళికలు. నిరాహారదీక్ష జరిగే శిబిరం వద్ద తీర్మానాల బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు, ప్రజల అభిప్రాయాలు రాయించాలి.

అన్ని మండలాల గ్రామ స్థాయి నాయకుల నుంచి ముఖ్య నాయకులందరూ పాల్గొనాలి." అని నేతలకు టీడీపీ పిలుపునిచ్చింది.........

Chandrababu Arrest: సత్యాన్ని చంపి.. ధర్మాన్ని చెరపట్టామని సంబరాలు చేసుకుంటున్నారు: లోకేశ్‌

రాజమహేంద్రవరం: సత్యాన్ని చంపేసి.. ధర్మాన్ని చెరపట్టామని వైకాపా కాలకేయులు సంబరాలు చేసుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు..

అంతిమంగా గెలిచేది సత్యమేనన్నారు. మనం కాపాడిన ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రగతి ప్రదాత చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ చేపట్టిన సామూహిక నిరాహారదీక్షలపై సైకో జగన్‌ సర్కారు విరుచుకుపడిందని మండిపడ్డారు..

శ్రీకాళహస్తిలో శాంతియుతంగా దీక్ష చేపట్టిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం నియంతృత్వమని దుయ్యబట్టారు. కుప్పం, గుడిపల్లిలోనూ తెదేపా కేడర్‌పై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా అధినేత చంద్రబాబుకి సంఘీభావం ప్రకటిస్తున్నవారిపై సైకో జగన్‌ సర్కార్‌ అప్రకటిత యుద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులతో చంద్రబాబును కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. కోపతాపాలు వద్దు సంయమనం పాటించండి.. తెలుగుదేశం పార్టీ మీ వెనుక ఉందని శ్రేణులకు భరోసా ఇచ్చారు..

Telangana Elections: అక్టోబరులో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకపోవచ్చు: కేటీఆర్‌

అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు.

అక్టోబర్‌ 10 లోపు నోటిఫికేషన్‌ వస్తేనే సమయంలోపు ఎన్నికలన్న కేటీఆర్‌.

సమయంలోగా నోటిఫికేషన్‌ వచ్చేది అనుమానమేనన్న మంత్రి.

తెలంగాణలో ఎన్నికలు కూడా మేలో జరగవచ్చని కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్న కేటీఆర్‌.

NCBN : ఉత్కంఠకు తెర.. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ఇదీ..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది. హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు..

జైలు రిమాండ్‌ను హౌస్ రిమాండ్‌గా మార్చాలన్న పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించినట్లయ్యింది.

సోమవారం ఉదయం నుంచి ఈ తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడింది. అయితే.. ఈ తీర్పు తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది..

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. తాజాగా ముగ్గురు మృతి

మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు..

ట్రైబల్ యూనిటీ (COTU) ఖండించింది. లోయలోని అన్ని జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్త ప్రాంతాలుగా ప్రకటించాలని సామాజిక సంస్థ పేర్కొంది.

మరోవైపు ఘటనా స్థలానికి పోలీసులు, అస్సాం రైఫిల్స్ బలగాలు చేరుకున్నాయి. భద్రత బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని పోలీస్ అధికారి తెలిపారు. మృతులను కుకి గొడుగు సమూహమైన ఇండిజెనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరంకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ముగ్గురు కుకి-జో నివాసితులని, సాయుధ దుండగులు సైనిక దుస్తులు ధరించారని గిరిజన ఐక్యత కమిటీ (COTU) ఒక ప్రకటనలో తెలిపింది..

ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఉంటే.. వెంటనే లోయలోని అన్ని జిల్లాలను చెదిరిన ప్రాంతాలుగా ప్రకటించాలిని, సాయుధ దళాల చట్టం, 1958ని అమలు చేయాలి అని COTU తెలిపింది. అంతుకుముందు సెప్టెంబర్ 8న తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్‌లో జరిగిన హింసకాండలో ముగ్గురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. సెప్టెంబర్ 6న బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగక్చావో ఇఖాయ్ వద్ద బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి..

గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన - పిల్లి రామరాజు యాదవ్

ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణపతి నవరాత్రుల్లో బాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని 20వ వార్డు పెద్దబండలో RKS ఫౌండేషన్ ద్వారా 1,000 గణపతి విగ్రహాలను తయారు చేయించి ఉంచడం జరిగింది.

ఈరోజు విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహించి నల్లగొండ నియోజకవర్గం పరిధిలో చవితి జరుపుకునే యువతకు గణపతి విగ్రహాన్ని పంపిణీ చేపట్టి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన తెరాస రాష్ట్ర నాయకులు,RKS ఫౌండేషన్ ఛైర్మెన్ - పిల్లి రామరాజు యాదవ్ గారు.

నోట్ - వినాయక చవితి వరకు విగ్రహాలు రాసి ఇవ్వడం జరుగుతుంది..