రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నిరాహార దీక్షలు

రేపటి నుంచి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహారదీక్షలు చెయ్యాలని అధిష్టానం నిర్ణయించింది . రోజుకు ఒక మండలం చొప్పున అన్ని మండలాల నాయకులతో ఒక చోట నిరాహారదీక్ష శిబిరం ఏర్పాటు చేయాలని సూచించింది..

ఈ రిలే నిరాహారదీక్షలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని అనుబంధ సంఘాల వారు పాల్గొనాలి. టీడీపీలో ఉన్న వివిధ విభాగాల వారీగా పాల్గొనేలా ప్రణాళికలు. నిరాహారదీక్ష జరిగే శిబిరం వద్ద తీర్మానాల బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు, ప్రజల అభిప్రాయాలు రాయించాలి.

అన్ని మండలాల గ్రామ స్థాయి నాయకుల నుంచి ముఖ్య నాయకులందరూ పాల్గొనాలి." అని నేతలకు టీడీపీ పిలుపునిచ్చింది.........

Chandrababu Arrest: సత్యాన్ని చంపి.. ధర్మాన్ని చెరపట్టామని సంబరాలు చేసుకుంటున్నారు: లోకేశ్‌

రాజమహేంద్రవరం: సత్యాన్ని చంపేసి.. ధర్మాన్ని చెరపట్టామని వైకాపా కాలకేయులు సంబరాలు చేసుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు..

అంతిమంగా గెలిచేది సత్యమేనన్నారు. మనం కాపాడిన ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రగతి ప్రదాత చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ చేపట్టిన సామూహిక నిరాహారదీక్షలపై సైకో జగన్‌ సర్కారు విరుచుకుపడిందని మండిపడ్డారు..

శ్రీకాళహస్తిలో శాంతియుతంగా దీక్ష చేపట్టిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం నియంతృత్వమని దుయ్యబట్టారు. కుప్పం, గుడిపల్లిలోనూ తెదేపా కేడర్‌పై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా అధినేత చంద్రబాబుకి సంఘీభావం ప్రకటిస్తున్నవారిపై సైకో జగన్‌ సర్కార్‌ అప్రకటిత యుద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులతో చంద్రబాబును కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. కోపతాపాలు వద్దు సంయమనం పాటించండి.. తెలుగుదేశం పార్టీ మీ వెనుక ఉందని శ్రేణులకు భరోసా ఇచ్చారు..

Telangana Elections: అక్టోబరులో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకపోవచ్చు: కేటీఆర్‌

అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు.

అక్టోబర్‌ 10 లోపు నోటిఫికేషన్‌ వస్తేనే సమయంలోపు ఎన్నికలన్న కేటీఆర్‌.

సమయంలోగా నోటిఫికేషన్‌ వచ్చేది అనుమానమేనన్న మంత్రి.

తెలంగాణలో ఎన్నికలు కూడా మేలో జరగవచ్చని కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్న కేటీఆర్‌.

NCBN : ఉత్కంఠకు తెర.. చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ఇదీ..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది. హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు..

జైలు రిమాండ్‌ను హౌస్ రిమాండ్‌గా మార్చాలన్న పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించినట్లయ్యింది.

సోమవారం ఉదయం నుంచి ఈ తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడింది. అయితే.. ఈ తీర్పు తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది..

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. తాజాగా ముగ్గురు మృతి

మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు..

ట్రైబల్ యూనిటీ (COTU) ఖండించింది. లోయలోని అన్ని జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్త ప్రాంతాలుగా ప్రకటించాలని సామాజిక సంస్థ పేర్కొంది.

మరోవైపు ఘటనా స్థలానికి పోలీసులు, అస్సాం రైఫిల్స్ బలగాలు చేరుకున్నాయి. భద్రత బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని పోలీస్ అధికారి తెలిపారు. మృతులను కుకి గొడుగు సమూహమైన ఇండిజెనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరంకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ముగ్గురు కుకి-జో నివాసితులని, సాయుధ దుండగులు సైనిక దుస్తులు ధరించారని గిరిజన ఐక్యత కమిటీ (COTU) ఒక ప్రకటనలో తెలిపింది..

ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఉంటే.. వెంటనే లోయలోని అన్ని జిల్లాలను చెదిరిన ప్రాంతాలుగా ప్రకటించాలిని, సాయుధ దళాల చట్టం, 1958ని అమలు చేయాలి అని COTU తెలిపింది. అంతుకుముందు సెప్టెంబర్ 8న తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్‌లో జరిగిన హింసకాండలో ముగ్గురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. సెప్టెంబర్ 6న బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగక్చావో ఇఖాయ్ వద్ద బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్న నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి..

గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన - పిల్లి రామరాజు యాదవ్

ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణపతి నవరాత్రుల్లో బాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని 20వ వార్డు పెద్దబండలో RKS ఫౌండేషన్ ద్వారా 1,000 గణపతి విగ్రహాలను తయారు చేయించి ఉంచడం జరిగింది.

ఈరోజు విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహించి నల్లగొండ నియోజకవర్గం పరిధిలో చవితి జరుపుకునే యువతకు గణపతి విగ్రహాన్ని పంపిణీ చేపట్టి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన తెరాస రాష్ట్ర నాయకులు,RKS ఫౌండేషన్ ఛైర్మెన్ - పిల్లి రామరాజు యాదవ్ గారు.

నోట్ - వినాయక చవితి వరకు విగ్రహాలు రాసి ఇవ్వడం జరుగుతుంది..

తిరుమల ఘాట్ రోడ్ లో భక్తులకు ఆంక్షలు విధించిన టిటిడి

గత రెండు మాసాల్లో అలిపిరి కాలిబాట మార్గంలో రెండు దురదృష్టకర ఘటనలు జరిగాయని సీసీఎఫ్ మధు సూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నడకమార్గంలో గతంలో కూడా కొన్ని ఘటనలు జరిగాయని చెప్పారు. రెండు నెలలుగా అలిపిరి నడకమార్గంలో నిఘా పెంచామని.. త్వరలోనే అలిపిరి నడకమార్గంలో వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ట్రాప్ కెమెరాల ద్వారా నడక మార్గంలో చిరుత, ఎలుగు బంటిలు సంచరించడాన్ని గుర్తించామన్నారు. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించామని.. ఇంకా ఐదు చిరుతలు సంచరిస్తునట్లు గుర్తించామని చెప్పారు.

వ్యర్థ పదార్ధాల కారణంగానే నడక మార్గంలో జంతు సంచారం పెరిగిందన్నారు. కాలిబాట మార్గంలో ఇరువైపులా 20 మీటర్ల మేర అటవీ ప్రాంతాన్ని చదును చేశామన్నారు. తద్వారా జంతువుల సంచారాన్ని భక్తులు ముందుగానే గుర్తించి అప్రమత్తం అవుతారన్నారు.

త్వరలోనే అత్యధునాతన టెక్నాలజీతో ఉన్న 500 కెమెరా ట్రాప్‌లను నడకమార్గంలో ఏర్పాటు చేస్తామన్నారు. 130 మంది అటవీ సిబ్బందితో నడకమార్గంలో నిఘా ఉంచామన్నారు. ఘాట్ రోడ్డు, నడక మార్గంలో పలు చోట్ల అండర్ పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. నడక, ఘాట్ రోడ్డుల్లో ఆంక్షలు కొనసాగుతాయని సీసీఎఫ్ మధు సూదన్ రెడ్డి స్పష్టం చేశారు...

CM Jagan: పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ

అమరావతి: పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) సమావేశమయ్యారు.

మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) , వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar reddy), ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు (Intelligence Chief Sitaramanjanulu), ఎఎజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) , తదనంతర పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై సమీక్ష చేయనున్నారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు..

Balakrishna: నేనొస్తున్నా.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: బాలకృష్ణ

మంగళగిరి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి తెదేపా అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు..

ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని అరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు.

''పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? హిందూపురంలో 1,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? ఛార్జిషీట్‌ ఎందుకు వేయలేదు? ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారు. రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు..

చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు

జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి.. బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. జగన్‌ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్‌ కుట్ర చేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చారు. డిజైన్‌ టెక్‌ సంస్థకు జగన్‌ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది. జగన్‌.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు ..

చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరి బ్రహ్మణి కి ములాఖత్

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన త్వరగా నిద్రపోయారు.

ఈ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆయన వాకింగ్, యోగా చేశారు. అనంతరం న్యూస్ పేపర్లు చదివారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆయన సహాయకుడు ఆయనకు అల్పాహారాన్ని అందించాడు.

టిడిపి అధినేత చంద్రబాబు ని కలిసేందుకు కుటుంబ సభ్యులు ములాఖత్ అనుమతి తీసుకున్నారు. చంద్రబాబు సతీమణి, భువనేశ్వరి కోడలు బ్రహ్మణి లు ఈరోజు మధ్యాహ్నం రాజమండ్రి కి చేరుకోనున్నారు,

వీరికి సాయంత్రం నాలుగు గంటలకు ములాఖత్ కు జైలు అధికారులు అనుమతిచ్చారు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం జరగనుంది. చంద్రబాబు అక్రమ అరెస్టు ను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి వాస్తవాలను వివరించేలా టిడిపి అధిష్టానము కార్యచరణ రూపొందించింది

చంద్రబాబుకు జైల్లో స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్ లో ఒక పత్రేక గదిని ఆయనకు ఇచ్చారు.

చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఈ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది...