Amitabh Bachchan: 'భారత్‌ మాతాకీ జై' రాజకీయ వివాదం వేళ అమితాబ్‌ ట్వీట్‌..!

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన 'భారత్‌ మాతాకీ జై' అని ట్విటర్‌లో పోస్టు చేశారు..

కాకుండా.. 'భారత్‌' (Bharat)గా సంబోధించడం మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. వచ్చే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో దేశం పేరును భారత్‌గా మాత్రమే స్థిరపర్చేలా ప్రత్యేక బిల్లును తీసుకొస్తారన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

అమితాబ్‌ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఆయనకు మద్దతు పలకగా.. మరి కొందరు మాత్రం ''జయా జీ అంటే మీకు భయం లేదా'' అని సరదాగా వ్యాఖ్యానించారు.

తాజాగా భారత్‌ అధ్యక్షతన జీ-20 సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్‌ 9న ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. దీని ఆహ్వాన పత్రాల్లో President of India అని బదులుగా President of Bharat అని ప్రచురించారు. దీనిని తప్పు పడుతూ కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ట్వీట్‌ చేశారు..

బీసీలు అంటే బిచ్చగాళ్ళు కాదు... మన దేశ నిర్మాతలు

•నక్సలైట్ విప్లవ ఉద్యమ నేత కామ్రేడ్ జే ఎస్ ఆర్

మన దేశ జనాభా 140 కోట్ల మందిని సాదుతున్న ప్రాణదాతలు మన బీసీలు

CPIML secretary JSR

మనదేశ వెన్నెముక బీసీల హక్కులను విస్మరిస్తున్నా దగాకోరు రాజకీయ పార్టీలను బొంద పెట్టండి

ప్రజాస్వామిక వాది

కామ్రేడ్

జే ఎస్ ఆర్ పిలుపు

మండల్ కమిషన్ ముఖ్యమైన సిఫార్సు అయిన బి.సిలకు

ఇకనైనా చట్ట సభలల్లో ప్రాతినిధ్యం అమలుచేయలనీ కామ్రేడ్

జే ఎస్ ఆర్ డిమాండ్

పార్లమెంట్లో మండల్ కమీషన్ నివేదిక అమలు ప్రకటిస్తూ అప్పటి ప్రధాని వి.పి.సింగ్ గారు 1990 ఆగస్టు 7న అన్న మాటలు, "ఇక్కడ పోరాటం. బిసిల జీవనోపాధికి సంబంధించినది కాదనీ... రాజ్యాధికారంలో భాగం కోసం... ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.

మన దేశ జనాభాలో 50% పైగా ఉన్న బిసిలు చేసే పోరాటం ఇది. ఇది కేవలం ఆర్ధిక అంశాలకు సంబంధించిన ప్రశ్న కాదు. ఇది ఈ దేశంలోని బిసిల అస్తిత్వం, ఆత్మ గౌరవానికి దేశంలో అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేసే ప్రశ్న. మనదొక వింత దేశం. ఇక్కడ గౌరవం అనేది సంపదలతో వచ్చేది కాదు. ఇక్కడ గౌరవం కులంతో ముడిపడి ఉంది. కులానికి అధికారం తోడైతే ఆ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ దేశంలో ఇప్పుడున్న సామాజిక ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా వివక్షతో వెలివేతలతో కూడుకొని ఉంది. అణచివేయబడిన బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. అలాంటి అణగదొక్కబడిన, సామాజికంగా వెనుకబడిన వారిని, వ్యవస్థలో ఇప్పటికే బాగా అభివృద్ధిచెంది ముందు వరుసలో ఉన్న వారితో పోటీపడాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు సమ సమాజ స్వప్నకుడు నక్సలైట్ కమ్యూనిస్టు సిపిఐ ఎంఎల్ పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్.

ఇలాంటి పద్ధతి ఇప్పటి వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం. సామాజికంగా, విద్యాపరంగా వేలాది సంవత్సరాలుగా వెనక్కు నెట్టివేయబడిన వారిని సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెంది ముందు వరుసలో వారితో సమాన స్థాయిలో పోటీపడాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అని నిష్కళంక దేశభక్తుడు, నిస్వార్థ ప్రజా సేవకుడు... అణగారిన వర్గాల హక్కుల పోరాటయోధుడు...

ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్

జె.ఎస్.ఆర్. నేతాజీ నేడు ఇక్కడ విడుదల చేసిన బహిరంగ రేఖలు సమాజాన్ని ప్రశ్నించారు.

ఇలాంటి పద్దతి ఇప్పటి వ్యవస్థలో ఉన్న పెద్దలోపం. అత్యంత అన్యాయం. ఈ అన్యాయాన్ని సరిదిద్దడం చాలా అవసరం. కనుక మేము చాలా స్పష్టమైన అవగాహనతోనే ఈ దేశ పరిపాలనా యంత్రాంగంలో బలహీనవర్గాలకు భాగస్వామ్యం ఇవ్వదలిచాము. ఆ క్రమంలో అధికార వ్యవస్థలో బిసిలను భాగస్వాములను చేయదలిచాము. ”

'విపి సింగ్ గారు మండల్ కమిషన్ అమలు చేస్తుంటే భరాయించ లేక అద్వానీ రధయాత్ర చేసి విపి సింగ్ గారి ప్రభుత్వాన్ని పడవేసారు అలాంటి బిజెపి లో ఉన్నందుకు బిసిలు సిగ్గు పడాలి. ప్రభుత్వ పరిశ్రమలను అమ్ముతున్న బిజెపి లో ఉన్నందుకు సిగ్గుపడాలి. చట్టసభలల్లో బిసి లకు ప్రాతినిధ్య చట్టం తీసుకురాకుండా, చిత్తశుద్ధితో పనిచేయని బిజేపి, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైయస్ఆర్సిపి, టీడిపి మొదలయిన పార్టీలలో ఉన్న బిసిలు సిగ్గు పడాలి...

బయటకు రావాలి. చట్టసభలల్లో బిసి లకు ప్రాతినిధ్య చట్టం వచ్చే వరకు బిసి లు ఓట్లు వేయకూడదని నోటా నొక్కాలనే నిర్ణయాన్ని ప్రకటించే శక్తి బిసిలు పొందాలి. చట్ట సభలల్లో బిసి ల ప్రాతినిధ్యాన్ని సాధించాలి. ప్రజాస్వామ్యానికి, సోషలిజానికి పునాదులు వేయాలి. కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.

సురవరం సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ కోటీశ్వర్ల క్లబ్ గా తయారయింది అన్నారు. దానిని మార్చడానికి చేయాల్సిన కార్యాచరణ గురించి చెప్పలేదు. వాళ్ళ కున్న వర్గపోరాట దృక్పధంతో ఏమి చేయాలో చెప్పరు. చర్చ చేయరు. చట్టసభలు ఉన్నతంగా ఉండాలంటే డబ్బు, మద్యం బహుమతులు పంచేవారు, వారి నాయకులు నేరస్తులు వారిని శిక్షించాలి. పార్టీల రిజిస్ట్రేషన్ రద్దుచేయాలి. అపుడే పార్లమెంట్ అసెంబ్లీలు కోటీశ్వర్ల క్లబ్బులు కావు.... పని అణగారిన వర్గాల హక్కుల కోసం అను దినం పోరాటం కొనసాగిస్తున్న ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్

జే ఎస్ ఆర్ తేల్చి చెప్పారు.

రాజ్యాంగం వలన ఇప్పుడు పార్లమెంట్లో 84, 47 మంది యస్.సి., యస్.టీలు యంపీ లుగా ఉన్నారు. 412 మంది ఒసి లు యంపీ లుగా ఉన్నారు. 131 మంది యస్.సి., యస్.టీ లు యంపీ లు

ఉన్న వారు ఏమి చేయలేకపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తున్న, మొత్తం ప్రవేటీకరణ చేస్తున్నా మౌనంగా ఉంటున్నారు. ఇంతమంది ఉన్న తమ గళం విప్పడం లేదు. అంబేద్కర్ స్టేట్ సోషలిజం కోరుకుంటున్నారు. భూమి, పరిశ్రమలు ప్రభుత్వం చేతిలో ఉండాలన్నారు. కాని ఈ యంపిలు నోరు విప్పడం లేదు. కనీసం నిరసన తెలియచేయడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కోటీశ్వర్లు, పీడక కులాల వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వలన, వారు మౌనంగా ఉంటున్నారు.... అని ప్రజాతంత్ర ఉద్యమకారుడు బాధితుల బంధువు కామ్రేడ్ జె ఎస్ ఆర్ సార్ ఆరోపించారు.

ఇటువంటి పరిస్థితి వస్తుందని ఒక దార్శనికుడిగా జె ఎస్ ఆర్ గారు బిసిలు చట్టసభలల్లో ఉండాలని కోరుకున్నారు. అపుడే చట్ట సభలు దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తాయని జె ఎస్ ఆర్ భావించారు. అందుకొరకు చట్ట సభలల్లో బిసిలు ప్రాతినిధ్యం ఉండాలని, బిసి కమిషన్ వేయాలని జె ఎస్ ఆర్ కోరారు.

విపి సింగ్గారు మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తుంటే అద్వానీ, ఆర్యస్యస్ వాళ్ళు,

బిజేపి వాళ్ళు, వాళ్ళ బానిసలు కమండల యాత్ర చేసి విపి సింగ్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టారు. మండల్ కమిషన్ నివేదిక లో బిసిలకు చట్ట సభలల్లో ప్రాతినిధ్యం ఉండాలని సిఫార్సు కూడా ఉంది. ఆ నివేదిక ను అమలు కాకుండా ఈ ఆర్యస్యస్ వాళ్ళు, వాళ్ళ పార్టీ బిజేపి, వాళ్ళ బానిసలు అడ్డుకున్నారనీ .... జె ఎస్ ఆర్ గారు తెలిపారు.

చివరికి ఈ నాడు కనీసం బిసి జనగణన చేయకుండా అడ్డుకుంటున్నారు. అసలు బిసి జనగణన 2011లో చేసారు. మండల్ కమిషన్ రిపోర్ట్ లో కూడా బిసి ల లెక్కలు ఉన్నాయి వాటిని ప్రాతిపదికగా తీసుకోవచ్చు. కాని తీసుకోరు. కాని ఈ ప్రభుత్వం 10% ఇ.డబ్ల్యు యస్. రిజర్వేషన్ కయితే ఒక వారంలోనే చేసుకుంది. బిసీ ల కోసం అయితే చేయదు. ఇంత జరుగుతున్న బిసి సంఘాలు ఐక్యంగా కదలరు. ఐక్యంగా ఉద్యమించరు. బిసి మంత్రులు, యంపి, యంయల్.ఎ లు రాజీనామా చేయాలి. అంబేద్కర్ గారి స్ఫూర్తితో యస్, యస్సీ యంపి లు అంబేద్కర్ వాదులు చట్ట సభలల్లో బిసిల ప్రాతినిద్యం రాజ్యాంగ సవరణ చేయించడానికి ముందుకు రావాలి. మనకి యాగాలు, యజ్ఞాలు, దేవాలయాలు కాదు కావల్సింది. చట్ట సభలల్లో బిసి లకు 52% ప్రాతినిధ్యం. అపుడే అందరికి ఉచిత విద్య, వైద్యం వస్తుంది. దేశం ముందుకు పోతుంది. అందుకు బిసిల ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే చట్టసభలు బాగుంటాయి. దేశం బాగుంటుందనీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ తెలిపారు.

70 సం||లు బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, కమ్మలు, రెడ్లు, దొరలు వాళ్ళ బానిసలే అధికారంలో ఉన్నారు. మరియు ప్రతిపక్షంలో ఉన్నారు. ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వహిస్తున్నారు. ఉ ద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. అయినా దేశం లో పేదరికం ఎందుకు వుంది. చరిత్రలోను వర్తమానం లోను ఈ దేశ ప్రజల సమస్యలకు కారణాలు ఏమిటి. ఎవరు కారకులు అని అద్యయనం చేసారా. చేయరు... తీవ్రమైన పాదం వ్యక్తం చేశారు.

ఇందాక గోరుతో పెళ్లి రాజకీయ పార్టీల వాళ్ళకు అధికారం కావాలి. నాయకత్వం కావాలి. ఆస్తులు పెంచుకోవాలి. కానీ వీళ్ళకు అందరికి విద్యవద్దు. ప్రజాస్వామ్యము వద్దు. సోషలిజం వద్దు.

చట్ట సభలు బాగుండాలంటే ప్రజాస్వామ్యం ఉండాలంటే దేశం బాగుండాలంటే బిసిలు చట్ట సభలల్లో ఉండాలి. బిసి లంటే శ్రమ జీవులు. యస్సీ యస్టీ, బిసిలు శ్రమ జీవుల పాలన కావాలంటే 52శాతం బిసిల ప్రాతినిధ్యం అవసరం.... అని కామ్రేడ్ జై బొరన్న గారు పేర్కొన్నారు.

131 మంది ఏస్ టీ,, యస్సీ, యంపి లు ఉన్నా ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకంటే మిగతా 412 మంది ఓసీలు. అందుకని ఏమి చేయలేకపోతున్నారు. కనీసం నిరసన కూడా తెలియచేయడం లేదు. అదే 270(52%) బీసీలు ఉంటే వాళ్ళ గళం ఇంకొక రకంగా ఉంటుంది. 410 (యస్సి, యస్ టి, బిసి) యంపీ లు ఉంటే అది శ్రమజీవుల గళం అవుతుందనీ...

జై భారత్ క్రాంతి బోర రాజన్న

రిషి త్రినేత్రుడు జె కె గారి

సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ అన్నమయ్య జె ఎస్ ఆర్ సా ర్

9848540078 తెలిపారు.

శ్రమ జీవుల పాలన అవుతుందనీ జె ఎస్ ఆర్ గారు పేర్కొన్నారు. అందుకొరకు మండల్ కమిషన్ చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని ముఖ్యమైన సిఫార్సు చేసింది అ సిఫార్సు అమలుకు బీసీ సంఘాలు ఐక్యంగా కృషి చేయాలనీ ...బిసి సంఘాలు ఐక్యతతో, కలసివచ్చే శక్తులతో, అంబేద్కర్వాదులతో, ఐక్యతతో కృషి చేసి చట్టసభలల్లో బిసి లకు 52% ప్రాతినిధ్యం కొరకు ఉద్యమించాలి, సాదించాలి... అని ప్రజా బంధువు కామ్రేడ్ జె ఎస్ ఆర్ గారు తెలిపారు.

ప్రజాస్వామ్యం, సోషలిజం, రాజ్యాంగం వర్ధిల్లాలి.... బీసీ లారా మీరు బిచ్చగాళ్లు కాదు... ఈ దేశ నిర్మాతలు... అని ప్రజా నేస్తం కామ్రేడ్ జె ఎస్ ఆర్ గారు8328277285 తెలిపారు

బహుజన రాజ్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనవరి 3 వ తేదీన జరుపుకుందాం: బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన రాజ్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనవరి 3 వ తేదీన జరుపుతామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ మేరకు ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దేశంలో పేద వర్గాలు, మరి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా మహిళల, వితంతువుల చదువు కోసం అలుపెరగని కృషి చేసిన మొదటి తరం మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే అని ప్రవీణ్ కుమార్ కొనియాడారు..

పేద వర్గాలకు చదువునందించే క్రమంలో ఎన్నో అవమానాలు, బెదిరింపులను ఫూలే దంపతులు ఎదుర్కొన్నారన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతామన్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ వల్ల మెజారిటీ పేదలకు చదువు వచ్చిందని గాని, ఉపాధ్యాయుల పనీతీరు మెరుగైందని చెప్పడానికి పెద్దగా చారిత్రక ఆధారాలు లేవని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు......

ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ :పోలీసుల సూచన

నగరంలో వర్షాల కారణంగా ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు ఒక కీలక సూచన చేశారు. కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ అంతా జలమయంగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది.

ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో వర్షాల కారణంగా ట్రాఫిక్ బీభత్సంగా పెరిగిపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంపిక చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ ఉద్యోగులకు సూచించారు.

నగరంలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ప్రజలందరూ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఐటి ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఎంపిక చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుండి బయటకు రాకూడదు,అని సైబరాబాద్ పోలీస్ లు ట్విటర్ వేదికగా సూచించారు...

తిరుపతి లో పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమల :సెప్టెంబర్ 05

తిరుమలలో భక్తుల రద్దీ నేడు మంగళవారం బాగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నేడు శ్రీవారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం శ్రీవారిని 76,555 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.75 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 33,488 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

మహిళలూ! మీలో ఎవరు అదృష్టవంతులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను నేడు టీఎస్ ఆర్టీసీ నిర్వహించనుంది. రాష్ట్రంలోని 11 రీజియన్ కేంద్రాల్లో లక్కీ డ్రాను నిర్వహించి.. ప్రతి రీజియన్‌కు ముగ్గురి చొప్పున 33 మంది విజేతలను ఎంపిక చేయనుంది.

ఈ లక్కీ డ్రాకు జిల్లా స్థాయి మహిళా అధికారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించి.. గెలుపొందిన వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం రీజియన్‌కు రూ.50 వేల చొప్పన 11 రీజియన్లకు రూ.5.50 లక్షలను కేటాయించింది.

ఒక్కో రీజియన్‌లో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఇవ్వాలని సంస్థ తాజాగా నిర్ణయించింది. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆగస్టు 30, 31 తేదిల్లో సంస్థ ప్రకటించిన లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్‌ను రాసి వేశారు.నేడు నిర్వహించే ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 33 మందికి హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఈ నెల 8న బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. విజేతలకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించి వారిని ఘనంగా సంస్థ సత్కరించనుంది

రాఖీ పర్వదినం సందర్భంగా ఆగస్టు 30, 31 తేదిల్లో సంస్థ ప్రకటించిన లక్కీ డ్రాకు మహిళా ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్‌ను రాసి వేశారు.

నేడు నిర్వహించే ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 33 మందికి హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఈ నెల 8న బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. విజేతలకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించి వారిని ఘనంగా సంస్థ సత్కరించనుంది..

స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ: నేడు ఉత్తర్వులు

హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా విద్యాశాఖ నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ, అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి ఎవరూ బయటికి రావద్దు అంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది.

కాగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కుండపోత వానతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. వందలాది కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి భాగ్యనగరం అంధకారంలో ఉండిపోయింది...

ఆదిత్య ఎల్-1 కక్ష్య పెంపు రెండోసారీ విజయవంతం

ఈ తెల్లవారుజామున 3 గంటలకు కక్ష్య పెంపు విన్యాసం

10న మధ్యాహ్నం 2.30 గంటలకు మూడోసారి కక్ష్య పెంపు

ప్రస్తుతం 282 కి.మీ. x 40,225 కి.మీ. కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆదిత్య ఎల్-1

సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటలకు దాని భూకక్ష్యను మరోమారు పెంచారు.

ఆదివారం తొలిసారి ఉపగ్రహం కక్ష్యను పెంచిన శాస్త్రవేత్తలు రెండోసారి నేటి తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యపెంపు విన్యాసాన్ని చేపట్టారు. ఈ మేరకు ఇస్రో ఎక్స్ చేసింది. బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్‌లోని గ్రౌండ్ స్టేషన్లు ఆదిత్య గమనాన్ని పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. నేడు చేపట్టిన విన్యాసం ద్వారా ఆదిత్య ఉపగ్రహం 282 కి.మీ. x 40,225 కి.మీ. కక్ష్యలో పరిభ్రమించనుంది. ఈ నెల 10న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మూడో కక్ష్య పెంపు విన్యాసాన్ని చేపడతారు.

శనివారం శ్రీహరికోట నుంచి బయలుదేరిన ఆదిత్య ఎల్-1ను హాలో ఆర్బిట్ అయిన లాంగ్రాంజియన్ పాయింట్-1 (ఎల్-1) లో ప్రవేశపెడతారు. ఈ పాయింట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగంలో ఉపగ్రహం సూర్యుడికి సమీపంగా వెళ్లడం కానీ, సూర్యుడి మీద లాండింగ్ కానీ ఉండదని ఇస్రో స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం ఆదిత్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపిస్తుంది. ఆ తర్వాత కూడా మరో 10-15 సంవత్సరాల వరకు అది పనిచేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

మంచిర్యాల జిల్లా :

హాజీపూర్‌ శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్ట్‌లతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ 20 గేట్లు 2 లక్షల క్యూసెక్కులనీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను 18.110 టీఎంసీలతో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 1.67 లక్షల క్యూసెక్కులు ప్రా జెక్ట్‌లోకి చేరుతోంది.

హైదరాబాద్‌ మెట్రో వా టర్‌ వర్క్స్‌ పథకానికి 311 క్యూసెక్కులు, 20 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు...

గుంతకల్ రాయదుర్గం పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు నేడు పర్యటన

నేటి నుంచి మూడు రోజులు పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బాబు ష్యురిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

నేడు ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు బళ్లారి జిల్లా జిందాల్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. బళ్లారిలో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గం నియోజకవర్గం ఓబులాపురం చెక్‌పోస్ట్‌కు చేరుకుంటారు.

రాయదుర్గం నియోజకవర్గం పల్లె పల్లె సమీపంలో వేరుశనగ రైతులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు రాయదుర్గం పట్టణానికి చేరుకుని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

రేపు 6న కళ్యాణదుర్గం, 7న గుంతకల్లు నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చంద్రబాబు రాక సందర్భంగా ఘనంగా టీడీపీ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశారు...