Daggubati Purandeswari : నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలును హరిస్తున్నారు..
విశాఖలో నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు సమావేశం జరిగింది. ఏపీ బీజీపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ పదాధికారుల సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఆందోళన కరంగా వుందిని ఆమె అన్నారు. నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలును హరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మరణాలను హత్యలుగానే చేస్తున్నట్లుగానే భావించాలన్నారు పురంధేశ్వరి..
అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం కృంగిపోతుందని, వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల్లో ఏడు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు పురంధేశ్వరి. ఎప్పుడు మీడియాకి దూరంగా ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన ఈరోజు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని, ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేసిన పరిస్థితి అని ఆమె వ్యాఖ్యానించారు.
గ్రామపంచాయతీలు నిధులను దారి తప్పించారని, చిన్న చిన్న కాంట్రాక్టర్లుకు చెల్లించవలసిన బకాయిలు ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ ను నియమించారని ఆమె ధ్వజమెత్తారు. మతమార్పిడులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల భక్తులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత టీటీడీ ఉందని ఆయన అన్నారు. కొండలు నరికేస్తే జంతువులు బయటకే వస్తాయని, ఎర్రచందనం బయటికి తరలించేస్తన్నారన్నారు పురంధేశ్వరి..









Aug 23 2023, 16:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.0k