బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
![]()
నందిహిల్స్ కాలనీలో నివాసముంటున్న వరలక్ష్మీపై ఎల్బీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మీర్‌పేట్ పీఎస్ పరిధిలో అర్ధరాత్రి మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్‌డిగ్రీకి ప్రయోగించిన ఘటనపై గురువారం సాయంత్రం మంత్రి స్పందించారు.
విషయం తెలిసిన వెంటనే మంత్రి స్వయంగా రాచకొండ సీపీకి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు.
మహిళపై దాడికి పాల్పడ్డ బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఆదేశించారు.
సమగ్ర విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకు మంత్రి ఆదేశించారు...


Aug 18 2023, 10:30
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
25.1k