KA Paul: మోదీ, కేసీఆర్, రాహుల్‌ను ఢీ కొట్టే శక్తి నాకే ఉంది

సంగారెడ్డి: బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఒప్పందం ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ''తొమ్మిదేళ్లలో ఏనాడూ జగ్గారెడ్డిని నేను శపించలేదు..

జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నా. సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టా. చారిటీ సిటీని చూసి దేశ, విదేశీ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేయించి నా చారిటీ మూయించారు.

జగ్గారెడ్డిని ఇప్పటి వరకు క్షమించాను.. ఇక నుంచీ క్షమించను. వెయ్యి కోట్లు ఇచ్చిన బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరుతావా? అభివృద్ధి చేసే నా పార్టీలో చేరతావా?, కేసీఆర్...

గద్దర్ బతికి ఉన్నప్పుడు ఏనాడూ పట్టించుకోలేదు. గద్దర్ చచ్చిపోతే అన్ని పార్టీల నాయకులు కుక్కల్లాగా వాలిపోయారు. మంత్రి మల్లారెడ్డి భూములు కబ్జా చేస్తున్నారు. కేటీఆర్ (KTR) గూగుల్‌ని కనిపెట్టినట్లు బిల్డప్ ఇస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నా రేవంత్‌కి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్‌కి అసలు ఓటు బ్యాంకే లేదు.

ఆర్ఎస్ఎస్ (RSS) వల్లే రేవంత్‌ని టీ పీసీసీ చీఫ్‌ని చేశారు. మోదీ, కేసీఆర్, రాహుల్‌ని ఢీ కొట్టే శక్తి కేఏ పాల్‌కే ఉంది. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు నాతో టచ్‌లో ఉన్నారు. నేను గెలిస్తేనే తెలంగాణ బాగుపడుతుందని మంత్రులు చెప్పారు.'' అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు..

INS Vindhyagiri : తీర రక్షణకు 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి'.. ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

కోల్‌కతా : భారత నౌకాదళంలో సేవలందించనున్న సరికొత్త యుద్ధనౌక 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి'ని (INS Vindhyagiri) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రారంభించారు..

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోల్‌కతాలోని హుగ్లీ నది ఒడ్డునున్న గార్డెన్ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ను (జీఆర్‌ఎస్‌ఈ) సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతన స్టెల్త్ యుద్ధ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.

'వింధ్యగిరి' కర్ణాటక రాష్ట్రంలోని ఓ పర్వత శ్రేణి పేరు. 'ప్రాజెక్ట్‌ 17ఎ'లో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధనౌక ఇది. ఇదే పేరుతో గతంలో ఉన్న యుద్ధనౌక 31 ఏళ్లపాటు సేవలందించింది. 2012 దాకా అది పలు క్లిష్టతరమైన ఆపరేషన్లలో పాల్గొని సత్తా చాటింది..

భారత అమ్ములపొదిలోకి చేరనున్న అత్యాధునిక నౌక 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి'లో సరికొత్త గ్యాడ్జెట్‌లను అమర్చనున్నారు. దీనిని నౌకాదళానికి అప్పగించే ముందు విస్తృత స్థాయిలో.. వివిధ రకాలుగా పరీక్షించి చూస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా.. 'పీ17ఎ' నౌకలన్నీ గైడెడ్‌ మిస్సైల్‌ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒక్కో నౌక పొడవు 149 మీటర్లు ఉంటుంది. 6,670 బరువుతో.. ఇవి 28 నాట్స్‌ వేగంతో ప్రయాణించగలవని ఓ అధికారి తెలిపారు.

ఇవి శివాలిక్‌ క్లాస్‌ ప్రాజెక్ట్ 17 యుద్ధనౌకల కంటే మెరుగైనవని చెప్పారు. అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు వీటిలో పొందుపరిచినట్లు వెల్లడించారు. భూమి, ఆకాశం, నీటి లోపల నుంచి ఎదురయ్యే సవాళ్లకు ఇవి దీటుగా బదులిస్తాయని రక్షణశాఖ తెలిపింది..

తెలంగాణ రాష్ట్రంలోరెండు రోజులు వర్షాలు

ఖమ్మం జిల్లా :ఆగస్టు 17

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది. కొత్తగూడెం, సుజాతానగర్‌, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, చండ్రగొండ, ఇల్లందు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.

ఇక రాష్ట్రంలో గురువారం శుక్రవారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది.

బంగాళాఖాతం సముద్ర మట్టం నుంచి 4.5 నుంచి 7.6 మి.మీ. ఎత్తు మధ్యలో ఆవర్తనం ఉన్నది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ఈ నెల 18 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

దీని ప్రభావంతో 18, 19 తేదీల్లో ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

20న కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది...

CP Anand : హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ ఆనంద్..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేతపై హైదరాబాద్ సీపీ ఆనంద్ సంచలన విషయాలు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్‌ కేసులో డేవిడ్ హుకా అనే నైజేరియన్‌ని అరెస్ట్ చేశామన్నారు..

8 ఏళ్ళ క్రితం బెంగళూరుకు వచ్చారని.. ఇండియాకి వచ్చాక పాస్టర్‌గా అవతరమెత్తి డేవిడ్ హుకా తన పేరును మార్చుకున్నాడని తెలిపారు. ఫేక్ వీసా, ఫేక్ ఐడీతో సిమ్ కార్డులు తీసుకుంటున్నాడన్నారు.

ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు వాడి పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారని పేర్కొన్నారు. ఆల్ ఇండియా నైజేరియన్ స్టూడెంట్ కమ్యూనిటీ అసోషియేషన్‌ను ఏర్పాటు చేశాడని అన్నారు.

డ్రగ్స్ , గంజాయి కేసులో నైజేరియన్స్ అరెస్ట్ అయితే వారికి బెయిల్ ఇప్పించడం.. వారిని వారి దేశాలకి పంపించడం వంటి విషయాల్లో డేవిడ్ హుకా బాధ్యత తీసుకుంటున్నాడని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.

ఇతని కోసం బెంగళూరులో మకాం వేసి పట్టుకున్నామన్నారు. డేవిడ్ హుకా నుంచి 264 MD పిల్స్ ని సీజ్ చేశామన్నారు. రూ.4 కోట్లు ఆస్తులు జప్తు చేయబోతున్నామని సీపీ ఆనంద్ వెల్లడించారు..

కాగా.. నేటి ఉదయం హైదరాబాద్‌లో భారీగా గంజాయిని లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయలు విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఆరుగురు గంజాయి సప్లయర్లను అరెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ చేశారు. పక్కా సమాచారంతో గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో నైజీరియన్స్ డ్రగ్ సప్లై చేస్తున్నారు. 11 లక్షల విలువైన డ్రగ్స్‌ను నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ సీజ్ చేసింది. ఈ కేసులో ఒక నైజీరియన్ అరెస్ట్ అయ్యారు..

రేపే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల?

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రిలీజ్‌కు ప్రాథమిక సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఇప్పటివరకూ అదే జరిగింది. కానీ గతేడాది దసరా సందర్భంగా పార్టీని జాతీయ స్థాయికి విస్తరింపచేసే ఆలోచనతో బీఆర్ఎస్‌గా నామకరణం చేయడంతో కేసీఆర్ జాతీయ అధ్యక్షుడయ్యారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.

శ్రావణ మాసం వచ్చేయడంతో ఈ నెల 18న విడుదల చేయించేలా ముహూర్తం ఖరారవుతున్నది. అన్నీ అనుకూలిస్తే తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆ జాబితాను విడుదల చేస్తారు. ఈ కారణంగానే కేటీఆర్ అమెరికా పర్యటనను కూడా వాయిదా వేసుకున్నట్లు ఆయన సన్నిహితుల సమాచారం.

ముందుగా అనుకున్న ప్రకారం కేటీఆర్ గురువారం అమెరికాకు వెళ్లాల్సి ఉన్నది. కుమారుడిని గ్రాడ్యుయేషన్ కోర్సులో చేర్పించడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లాలనుకున్నారు. కానీ ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసే ప్రోగ్రామ్ ఉండడంతో ఆయన చేతులమీదుగానే ఈ వ్యవహారాన్ని నడిపించాలని కేసీఆర్ భావించినందున అమెరికా టూర్‌‌ను వాయిదా వేయించినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఆయన రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో అప్రకటితంగా రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలను చూసుకుంటున్నారు. బీఆర్ఎస్‌ను ఇప్పటికే ఒక జాతీయ పార్టీగా ఆ పార్టీ నేతలు భావిస్తుండడంతో కేసీఆర్ జాతీయ అధ్యక్షుడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఫస్ట్ లిస్టును ఈ నెల 18న విడుదల చేయడంలో ఏదేని పరిస్థితుల్లో చివరి నిమిషంలో సవరణలు, మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చి వాయిదా పడాల్సిన అవసరం ఏర్పడితే ఈ నెల 24న ఆ కార్యక్రమం ఉండొచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాతనే కేటీఆర్ అమెరికాకు వెళ్లనున్నారు.

తొలి జాబితాను విడుదల చేయడంలో కేసీఆర్ లక్కీ నెంబర్‌గా ఉండే ‘6’ ప్రతిబింబించనున్నది. అందులో భాగంగానే తొలి జాబితాలో అభ్యర్థుల సంఖ్య 66 లేదా 87 లేదా 96 లేదా 105 చొప్పున ఉండొచ్చని సమాచారం.

ఇప్పటికే ఏయే నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది దాదాపుగా కొలిక్కి వచ్చింది.వివాదం లేని స్థానాలన్నీ ఫస్ట్ లిస్టులో చోటుచేసుకుంటాయి....

తెలంగాణ సర్కార్‌‌పై మరోసారి రెచ్చిపోయిన డింపుల్ హయాతి

టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి ‘ఖిలాడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇటీవల తెలంగాణ ట్రాఫిక్ గురించి పలు పోస్టులు చేసి పెద్ద దుమారం రేపాయి. అంతేకాకుండా డిసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టి ధ్వంసం చేసి వార్తల్లో నిలిచింది.

ఈ ఘటనపై క్రిమినల్ కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఈ అమ్మడు నిత్యం సర్కార్‌పై పలు వివాదాస్పద పోస్టులతో రచ్చ చేస్తోంది.

తాజాగా, మరోసారి డింపుల్ హయాతి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది.

తన ఇన్‌స్టాస్టోరీలో కుక్కలను బంధించి తీసుకెళ్తున్న వీడియో షేర్ చేస్తూ తెలంగాణలో ఇలాగే జరుగుతుంది.

ఎవరైనా ఆపండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం డింపుల్ మయాతి పోస్ట్ వైరల్‌గా మారింది...

Renu Desai: పవన్‌ గురించి రెండు సందర్భాల్లోనూ నిజమే చెప్పా: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్ (Pawan kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్‌ (Renu Desai) మరోసారి వైరల్ కామెంట్స్‌ చేశారు. ఓ అభిమాని ఆమె విడాకులపై అభ్యంతరకర కామెంట్‌ పోస్టుచేయగా..

రేణూ అతడికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ''నన్ను నిందించడంలో మీకు ఆనందం ఉంటే అలానే చేయండి. పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకుల నుంచి నిందలు పడటం నా జీవిత లక్ష్యం అనుకుంటా..'' అని రేణూ దేశాయ్‌ రిప్లై ఇచ్చారు..

ఇటీవల ఆమె పవన్‌ కల్యాణ్‌కు మద్దతు ప్రకటిస్తూ వీడియో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు వ్యక్తులు ఆమెను టార్గెట్‌ చేసి మాట్లాడారని రేణూ చెప్పారు.

''విడాకుల గురించి చెప్పినప్పుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు నన్ను తీవ్రంగా ద్వేషించారు. ఇప్పుడు దేశ పౌరురాలిగా ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే అతడి వ్యతిరేకులు నన్ను దుర్భాషలాడుతున్నారు.

తొలుత విడాకుల గురించి మాట్లాడి.. ఆయన వ్యతిరేకుల నుంచి డబ్బు తీసుకున్నానని ఆరోపించారు. ఇప్పుడేమో.. పవన్‌ అనుకూల వ్యక్తుల నుంచి నేను సొమ్ము తీసుకుని ఆయనకు మద్దతిచ్చానని అంటున్నారు.

నా మాజీ భర్త గురించి అప్పుడూ, ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ నేను నిజమే చెప్పాను. తప్పుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ప్రేమలో పడినందుకు.. నిజాలు మాట్లాడుతున్నందుకు నేను ఇలా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇదే నా విధి రాత అయితే.. ఇలానే తిట్టండి.. ఈ కామెంట్స్‌పై కూడా నన్ను నిందించడం ప్రారంభించండి'' అని రాసుకొచ్చారు..

Tirumala: భక్తులకు కర్రల పంపిణీ.. ట్రోల్స్‌పై స్పందించిన తితిదే ఛైర్మన్‌

తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.

బోనులో చిక్కిన మగ చిరుతకు దాదాపు ఐదేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మరోవైపు, అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను వారు ఖండించారు.

అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని భూమన తెలిపారు. ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ..

''ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నామంటున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నాం.

చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం'' అని చెప్పారు..

బి ఆర్ ఎస్ పార్టీకి కలిసొచ్చిన శ్రావణమాసం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళ అయింది. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీ య పార్టీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి నిజ శ్రావణ మాసం మొదలవుతున్నది.

శ్రావణంలో శుభముహుర్తం కుదరడంతోనే అభ్యర్థుల ఎంపికకు, ప్రచారానికి ఇక అన్ని పార్టీలు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ నెల 18న శ్రావణమాసం తొలి శుక్రవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి విశేషమైన రోజుగా ఎంచుకుంటారు. అభ్యర్థుల ప్రకటన, మ్యానిఫెస్టో విడుదల, ఎన్నికల ప్రచారం వంటివి శ్రావణమాసంలో ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు.

ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రావణమాసంలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి శ్రావణమాసం కలిసొచ్చింది (2018) బీఆర్‌ఎస్‌ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శ్రావణంలోనే ప్రకటించింది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్‌ కొనసాగే అవకాశం ఉంది.

శ్రావణం త ర్వాత వచ్చే భాద్రపదంలో ప్రథమార్ధం వినాయక చవితి సందడితో ముగుస్తుంది. ద్వితీయా ర్ధం పితృపక్షాలను అంత శుభకరంగా భావించరు.

శ్రావణంలోపే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో

శ్రావణం ముగిసేలోపు మ్యానిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. సెప్టెంబర్‌ 15న సోనియా గాంధీతో చేతుల మీదుగా మ్యానిఫెస్టో విడుదల చేయించాలన్నది టీపీసీసీ యోచన.

ఆ పార్టీ అభ్యర్థుల దరఖాస్తులకు శ్రావణం లోనే శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఆ పార్టీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సిద్ధం చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం వల్ల నష్టం జరిగిందని, ఈసారి అలా జరగకుండా దశల వారీగా జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

బీజేపీ రాష్ట్ర కమిటీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌లో ఒక సీటుకు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుంటే కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం అభ్యర్థుల కొరతతో సతమతమవుతున్నాయి. బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండగా, కాంగ్రెస్‌కు ఉత్తర తెలంగాణలో చెప్పుకోదగ్గ అభ్యర్థులు కనిపించడం లేదు. సిట్టింగ్‌ ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపాల్సిందిగా రాష్ట్ర బీజేపీని అమిత్‌ షా ఆదేశించారని సమాచారం. ఇప్పటివరకు 40 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులు ఉన్నారని, మిగతా సెగ్మెంట్ల కోసం అభ్యర్థులను వెతకాల్సిందిగా పార్టీ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.

బీఆర్‌ఎస్‌ తొలి జాబితా రెడీ?

గత ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సెప్టెంబర్‌ 7, 2018 శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే 80 నుంచి 87 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల సమాచారం.

శ్రావణమాసంలో ఏ క్షణంలో అయినా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 21న పంచమితో కూడిన శ్రావణ సోమవారాన్ని విశేషమైన రోజుగా భావిస్తారు.

ఆ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో అదేరోజు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం లేకపోలేదు.

అంతేకాదు, శ్రావణంలో శుక్ల దశమి, పౌర్ణమి, కృష్ణపక్షంలో విదియ, తదియ కూడా అభ్యర్థుల ప్రకటనకు, ఇతర రాజకీయ ఎత్తుగడలకు అనువైన రోజులుగా పంచాంగకర్తలు విశ్లేషిస్తున్నారు...

ఇక హైదరాబాద్‌లోనే బోయింగ్‌ హెలికాప్టర్ల తయారీ

భారత సైన్యం కోసం అపాచీ హెలికాప్టర్ల తయారీని బోయింగ్‌ ప్రారంభించింది. అమెరికాలోని అరిజోనాలో బోయింగ్‌కు చెందిన మెసా ఉత్పాదక కేంద్రంలో ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌ హెలికాప్టర్లు సిద్ధమవుతున్నాయి. మొత్తం 6 హెలికాప్టర్లు ఇండియన్‌ ఆర్మీకి డెలివరీ కానున్నాయి.

కాగా, ఈ హెలికాప్టర్ల బాడీ ఫ్యూజ్‌లేజ్‌లు హైదరాబాద్‌లోని టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌,టీబీఏఎల్‌, ప్లాంట్‌లోనే రెడీ అవుతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలోనే తొలి ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్‌ ఫ్యూజ్‌లేజ్‌ ఇక్కడి నుంచి అమెరికాకు చేరింది. ఈ క్రమంలోనే అక్కడి ప్లాంట్‌లో హెలికాప్టర్ల తయారీని మొదలుపెట్టినట్టు బోయింగ్‌ తాజాగా ప్రకటించింది.

ఈ మేరకు బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్టే తెలియజేశారు. 2020లో బోయింగ్‌.. 22 ఈ-మోడల్‌ అపాచీ హెలిక్యాప్టర్లను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది. దీంతో ఇండియన్‌ ఆర్మీ కోసం 6 ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్ల కాంట్రాక్టును దక్కించుకున్నది.

వచ్చే ఏడాదిలోగా వీటిని అంచాలన్నది డీల్‌. ఏహెచ్‌64ఈ.. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దాడుల హెలిక్యాప్టర్‌గా పేరొందినట్టు ఈ సందర్భంగా బోయింగ్‌ మెసా ప్లాంట్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, అటాక్‌ హెలిక్యాప్టర్‌ ప్రోగ్రామ్స్‌ విభాగం ఉపాధ్యక్షుడు క్రిస్టినా ఉఫా తెలిపారు.

ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌.. ట్విన్‌-టర్బోషాఫ్ట్‌ అటాక్‌ హెలికాప్టర్‌

ఇందులో అత్యాధునిక రాడార్‌ వ్యవస్థ ఉంటుంది

తక్కువ ఎత్తులోనూ సమర్థంగా పనిచేయగలదు

280kmph గరిష్ఠ ఎత్తులోప్రయాణించే వేగం

అందుబాటులో 16 యాంటి-ట్యాంక్‌ ఏజీఎం-114 హెల్‌ఫైర్‌, స్ట్రింగర్‌ మిస్సైల్స్‌, హైడ్రా-70 అన్‌గైడెడ్‌ మిస్సైల్స్‌

శత్రువులపై బుల్లెట్ల దాడి కోసం 1,200 రౌండ్ల సామర్థ్యంతో 30-ఎంఎం చైన్‌ గన్‌. నిమిషానికి 600-650 రౌండ్లు ఫైర్‌ చేయవచ్చు...