SBI Report: 2047 నాటికి ₹15 లక్షలకు తలసరి ఆదాయం: ఎస్‌బీఐ రీసెర్చ్
![]()
దిల్లీ: శత స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశంలో తలసరి ఆదాయం (per capita income) గణనీయంగా పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి (SBI report) పేర్కొంది..
2047 నాటికి తలసరి ఆదాయం ఇప్పుడున్న (2022-23 ఆర్థిక సంవత్సరం) రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు పెరగనుందని పేర్కొంది. అంటే దాదాపు ఏడున్నర రెట్లు పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు.
2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని మోదీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశమనేది స్వప్నం కాకూడదని.. 140 కోట్ల పౌరుల ప్రతిజ్ఞ కావాలని ఆకాక్షించారు..
SB NEWS
SB NEWS












Aug 15 2023, 16:18
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.6k