PM Modi: ఏకధాటిగా 90 నిమిషాలు.. ప్రసంగంలో మోదీ సరికొత్త రికార్డ్
![]()
దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా చారిత్రక ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోదీ (PM Modi) నిలిచారు..
మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన.. పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు.
ఇప్పటివరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా.. సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం..
2014లో ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి మోదీ తొలి ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది 65 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు.
ఆ తర్వాత వరుసగా 88 నిమిషాలు (2015), 94 నిమిషాలు (2016), 56 నిమిషాలు (2017), 83 నిమిషాలు (2018), 92 నిమిషాలు (2019), 90 నిమిషాలు (2020), 88 నిమిషాలు (2021), 83 నిమిషాలు (2022) ప్రసంగించారు.
ఈ ఏడాది కూడా 90 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. మొత్తంగా ప్రధాని సగటు ప్రసంగం నిడివి 82 నిమిషాలు కాగా.. ఇప్పటివరకు ఏ ప్రధాని సగటుగా ఇంత సమయం ప్రసంగించలేదు..











Aug 15 2023, 16:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.1k