అంగన్వాడి ఉద్యోగులపై వేధింపులు ఆపాలి ---సిఐటియు

అంగన్వాడి ఉద్యోగులపై వేధింపులు ఆపాలి ---సిఐటియు

      

నారాయణపేట జిల్లా మద్దూరు సిడిపిఓ అంగన్వాడి ఉద్యోగుల పట్ల వేధింపులు ఆపాలని సిఐటియు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య కోరారు

       సోమవారం నల్లగొండ సిడిపిఓ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ బాసిత్ కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ బిఎల్ఓ డ్యూటీలు ఇతర సందర్భాల్లో నారాయణపేట జిల్లా మద్దూర్ సిడిపిఓ వేధింపులకు గురి చేస్తూ నలుగురిని టెర్మినేట్ చేయడం, 100 మంది వరకు మెమోలు ఇవ్వడం విచారకరమని అన్నారు. సిడిపిఓ పై చర్య తీసుకోవాలని జూలై 10న కలెక్టరేట్ ధర్నా సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి ఇచ్చిన హామీ అమలు చేయకుండా తిరిగి సిడిపిఓ అంగన్వాడీ ఉద్యోగులను వేధింపులకు గురి చేయడం సరికాదని అన్నారు. మద్దూరు సిడిపిఓ ఆగడాలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నామని, ఆమెపై చర్య తీసుకుని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

   

ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి నల్లగొండ ప్రాజెక్టు నాయకులు మని రూప పాదూరు లక్ష్మి భారతి రత్న భవాని తదితరులు పాల్గొన్నారు*

ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ

ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ 3 నెలలు.. రూ.50,910 కోట్లు

తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది.

వినూత్న సంసరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది.

ఆర్థికశక్తిగా ఎదుగుతున్న తెలంగాణ

బడ్జెట్‌ అంచనాల్లో 20% రాబడి

నిరుడు కంటే 7,360 కోట్లు అధికం

పన్నుల రూపంలోనే 31 వేల కోట్లు

జీఎస్టీ ద్వారా 11 వేల కోట్ల రాక

స్టాంపులు, రిజిస్ట్రేషన్లతో 3 వేల కోట్లు

కాగ్‌ త్రైమాసిక నివేదికలో వెల్లడి

తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంసరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో రాష్ర్టానికి రూ.2,59,861.91 కోట్లు సమకూరుతుందని బడ్జెట్‌లో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో అంటే.. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో కలిపి మొత్తం రూ.50,910.11 కోట్లు ఖజనాకు చేరాయి. అంటే.. బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఇప్పటికే సుమారు 20 శాతం ఆదాయం సమకూరినట్టే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,45,256.61 కోట్లు సమకూరుతాయని బడ్జెట్‌లో అంచనా వేయగా, నిరుడు జూన్‌ వరకు రూ.43,550.51 కోట్లు వచ్చా యి. అంటే.. అప్పటి బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే వచ్చింది 18 శాతం. అయితే… గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రూ.7,359.6 కోట్లు అధిక ఆదాయం సమకూరింది. శనివారం కాగ్‌ మొదటి త్రైమాసిక నివేదికను వెల్లడించింది. అందులో తెలంగాణ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్న తీరును వర్ణించింది. కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్థికంగా అణగదొక్కాలని చూస్తున్నా… తెలంగాణ మాత్రం ఆర్థికంగా ఏటికేడు బలపడుతూనే ఉన్నది. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులివ్వకుండా కొర్రీలు పెడుతున్నా… సీఎం కేసీఆర్‌ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.

జీఎస్టీదే అగ్రస్థానం

రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో జీఎస్టీ రాబడే అగ్రస్థానంలో ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి జీఎస్టీ రూపంలో రూ.50,942.49 కోట్లు వస్తుందని ఆర్థిక అంచనా వేయగా, మొదటి త్రైమాసికానికి రూ.11,418.47 కోట్లు వసూలైంది. బడ్జెట్‌ అంచనాల్లో ఇది 22 శాతం. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపం లో రూ.42,189.47 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా.. మొదటి త్రైమాసికానికి రూ. 9,645.14 కోట్లు వచ్చింది. అంటే నిరుడితో పోలిస్తే ఈ సారి రూ.1,773.33 కోట్లు అధిక రాబడి వచ్చిం ది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.18,500 కోట్లు వస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ అంచనా వేయగా, జూన్‌ నాటికి రూ. 3,510.63 రాబడి సమకూరింది. అమ్మకం పన్ను రూపంలో రూ.7,532.96 కోట్లు, కేంద్ర పన్నుల వాటా రూ.2,988.88 కోట్లు, పన్నేతర రాబడి రూ.1,488.10 కోట్లు రాబడి వచ్చింది. ప్రధాన వ్యయాలను పరిశీలిస్తే రెవెన్యూ ఖాతా ఖర్చు రూ.15,406.89 కోట్లు ఉన్నది. వేతనాల కోసం రాష్ట్రం వెచ్చించింది రూ.9,796.83 కోట్లు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు పింఛన్ల రూపంలో రూ.4,158.57 కోట్లు వెచ్చించింది. ఇలా.. జూన్‌ నెల వరకు రాష్ర్టానికి రూ.50,910.11 కోట్లు సమకూరగా, అన్నింటికీ కలిపి రూ.47,290.64 కోట్లను రాష్ట్రం ఖర్చు చేసింది. రాబడిలో ఎక్కువ మొత్తం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసమే రాష్ట్రం వెచ్చిస్తున్నది. పటిష్ట ప్రణాళికతో ఏటికేడు ఆర్థిక వనరులను పెంచుకొంటున్నది.

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నందు నిరసన కార్యక్రమం

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నందు నిరసన కార్యక్రమం గురుకుల ఉద్యోగ పరీక్షలు వారి జిల్లాల్లో సెంటర్ వేయకుండా విద్యార్థులను 200 కిలోమీటర్ల దూరంలో పరీక్ష ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు టీచర్ అర్హత పరీక్ష రాయలేకపోవడం జరుగుతుంది ఒక్క పరీక్షకి 2000 రూపాయలు అయితే ఉన్న నాలుగు పరీక్ష పేపర్లు రాయాలంటే సుమారుగా ఒక్కొక్క విద్యార్థి పదివేల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది.

కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు వారి సొంత జిల్లాలోనే అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాల్లో గురుకుల టీచర్ పరీక్ష తేదీలను దూర ప్రాంతం విద్యార్థుల కేటాయించడం పట్ల విద్యార్థులు ఉద్యోగ పరీక్ష రాయకపోవడం జరిగి వారికి పూర్తి అన్యాయం జరుగుతుంది కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సొంత జిల్లాల్లో సుమారు 20 కిలోమీటర్ల పరిధి లోపల సెంటర్లు ఏర్పాటు చేయాలని లేని ఎడల అనేక ఉద్యమాలు విద్యార్థుల పట్ల చేస్తామని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి రాష్ట్ర కార్యదర్శి చుక్క సైదులు నరేందర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి:ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ జిల్లా అద్యక్షులు మిర్యాల శివ కుమార్

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

ఆర్యవైశ్యుల లో ఉన్న పేదలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ జిల్లా అద్యక్షులు మిర్యాల శివ కుమార్ తెలిపారు.ఆదివారం హైదరాబాద్ లోని ముషిరాభాధ్ నందు ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి అన్ని వైశ్య కుల సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్యులంతా ఐక్యంగా ఉండి తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ సాధన లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సభ్యులు ఈగా దయాకర్ గుప్త అధ్వర్యంలో తరలి వెళ్లే వారిలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం సురేష్ కోశాధికారి గుడిపాటి రమేష్, రాష్ట్ర నాయకులు బొనగిరి విజయ్ కుమార్ సభ్యులు గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం,చల్లా శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం 

కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి 

 సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి

       కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాల చేస్తున్న పోరాటంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు.

     

శుక్రవారం సిఐటియు నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాస్తుందని విమర్శించారు. 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం 26వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం కార్మిక హక్కుల పై దాడి అధిక ధరలు నిరుద్యోగం ప్రజలందరి సమస్యల పైన 11 కేంద్ర కార్మిక సంఘాలు ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో జిల్లా కలెక్టరేట్ల ముందు ఆగస్టు 10న ఆర్డీవో కేంద్రాలలో జరిగే ధర్నా ల లో కార్మిక వర్గం పాల్గొనాలని కోరారు.

      

కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో , కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. సమ్మెల పట్ల మొండి వైఖరి విడనాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు,ఐకెపి వివో ఏ, ఆశ వర్కర్స్ ,మున్సిపల్, ఆర్టీసీ, సింగరేణి, అంగన్వాడి ,మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ స్వీపర్ల్, కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ రకాల సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం చొరవ చేసి కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోరాటం చేస్తున్న కార్మికులకు సిఐటియు అండగా ఉంటుందని తెలియ చేశారు . ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు

    

   సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి ,జిల్లా ఉపాధ్యక్షులు అవుత సైదయ్య, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నారబోయిన శ్రీనివాస్, మల్లు గౌతమ్ రెడ్డి, కానుగు లింగస్వామి,  జిల్లా కమిటీ సభ్యులు పెంజెర్ల సైదులు, కరిమ్మున్నిసా బేగం, అద్దంకి నరసింహ పోలే సత్యనారాయణ, దయానంద్, భీమ గాని గణేష్, సలివొజు సైదాచారి, వరికుప్పల ముత్యాలు, సాగర్ల యాదయ్య, సుందరయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

రూపాయలు 250 లాటరీ కట్టి ... రూపాయలు 10 కోట్లు జాక్పాట్

రూపాయలు 250 లాటరీ కట్టి ...

రూపాయలు 10 కోట్లు జాక్పాట్

మలప్పురమ్: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. లక్ కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు...!

అది ఈ మహిళల విషయంలో జరిగింది. కేరళలోని మలప్పురము జిల్లాలో పరప్పనగాడి మున్సిపాలిటీలో హరిత కర్మసేన అనే విభాగం ఉంది. ఇందులో పనిచేస్తున్న 11మంది మహిళలు తమ దగ్గర ఉన్న చిల్లరంతా జమ చేసి 250 రూపాయల తో లాటరీ టికెట్ కొన్నారు. అదృష్టం కలిసి రావడంతో వీరి టికెట్ కే లాటరీ తగిలి ఏకంగా రూ.10 కోట్ల జాక్పాట్ కొట్టారు.

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న ;(సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ సందర్భంగా.. దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా..భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది. రాష్ట్రంలో వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాల వల్ల వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనున్నది.

రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధిరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది. అదే సందర్భంలో..ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలో పాల్గొన్న నల్లగొండ 35వ వార్డు ముఖ్య నాయకులు

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలో పాల్గొన్న నల్లగొండ 35వ వార్డు ముఖ్య నాయకులు

నల్గొండ పట్టణం లోని బిఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నల్గొండ 35వ వార్డు ముఖ్య నాయకులు పాల్గొని కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా కేటీఆర్ మీద ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. యువతకి ఎంతో ఆదర్శమని, తండ్రి అడుగుజాడల్లో నడిచే యువ నాయకుడు యువతరానికి ఆదర్శమని వారు పొగిడారు.

ఈ కార్యక్రమంలో 35 వార్డు నల్గొండ టౌన్ బిఆర్ఎస్ పార్టీ జాయింట్ సెక్రెటరీ cheripelly జయప్రకాష్, 35 వార్డు అధ్యక్షుడు తలారి యాదగిరి, వాడు ముఖ్య నాయకులు అక్కనపెల్లి చక్రవర్తి గారు మరియు వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు.

విఆర్ఏల సర్దుబాటుపై సీఎం సమీక్ష

గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్​ఏ)లను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వీఆర్​ఏల సర్దుబాటుపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు.

ఉన్నతాధికారులు, వీఆర్ఏ ఐకాసతో ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నీటిపారుదల సహా ఇతర శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసే విషయమై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వీఆర్ఏల సర్దుబాటుపై ఈ నెల 11న జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది.

వీఆర్​ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జులై 10న నిర్వహించిన సమీక్షలో అధికారులకు చెప్పారు. ఇందుకోసం కేటీఆర్ నేతృత్వంలోని ఉపసంఘం... వీఆర్​ఏలతో చర్చలు ప్రారంభించాలని తెలిపిన విషయం తెలిసిందే. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకొని వీఆర్​ఏల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఉపసంఘం కసరత్తు పూర్తయి నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి:కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ కార్యదర్శి

పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

దేశవ్యాప్త ర్యాలీ, ప్రదర్శనలు, ధర్నాలు జయప్రదం. 

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సీ.సీ.పీ.ఏ) ఆధ్వర్యంలో జులై 21న వేలాది పెన్షనర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతం గానున్న సమస్యల పరిష్కారానికై భారీ ర్యాలీ నిర్వహించి లక్షలాది సంతకాలతో ప్రధాన మంత్రికి కోర్కెల పత్రం సమర్పించారు.

వర్షాలను, వయస్సును లెక్క చేయకుండా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (తాప్రా) పిలుపు మేరకు దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పోరాట స్ఫూర్తితో సామూహిక ప్రదర్శనలు నిర్వహించి గురువారం కలెక్టర్ల ద్వారా చీఫ్ సెక్రటరీకి వినతి పత్రాలను సమర్పించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ఈపియస్, సింగరేణి తదితర పెన్షనర్లకు ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ అభినందనలు తెలిపారు.

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీ.పి.ఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓ.పి.ఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పి.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పెన్షనర్లు పొందేది జీవనభృతి కావున ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీలలో గతంలో రద్దు చేసిన రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

8వ కేంద్ర వేతన కమీషన్ (సి.పీ.సీ), రాష్ట్ర పే రివిజన్ కమీషన్ (పి.ఆర్.సీ)లను వేసి ఇంటరిమ్ రిలీఫ్ ను ప్రభుత్వాలు ప్రకటించాలని, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రీస్టోర్ కాలాన్ని 15 సంవత్సరాలకు బదులుగా 12 సంవత్సరాలకు కుదించాలని కోరారు. అన్ని జిల్లాల్లో వెల్ నెస్ సెంటర్లను ఏర్పరిచి వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని, నగదు రహిత చికిత్స వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు.

*ఈ.పి.ఎస్- 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.1000/- నుంచి పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పులను నిజ స్ఫూర్తితో అమలు పరచాలని, పెన్షన్ ఫండ్ల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సింగరేణి తదితర కోల్ మైన్ పెన్షనర్ల కనీస పెన్షన్ ను రూ.350/-, రూ.250/- నుంచి పెంచాలని, కరువు భత్యం చెల్లించాలని, పెన్షన్ ను పెంచాలని వి.కృష్ణ మోహన్ కోరారు. సమస్యలు వెంటనే పరిష్కరించనట్లైతే ఉద్యోగులు, ఆఫీసర్లు, పెన్షనర్లు ఐక్యంగా ఆందోళనా కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాలకు హెచ్చరించారు.