ఎస్ బి ఐ వినియోగదారుల సేవా కేంద్రం సేవలు సద్వినియోగం జేసుకోవాలి

ఎస్ బి ఐ వినియోగదారుల సేవా కేంద్రం సేవలు సద్వినియోగం జేసుకోవాలి

- హలియా ఎస్ బి ఐ బ్రాంచ్ మేనేజర్ రాంబాబు

 

వినియోగదారుల సేవా కేంద్రం సేవలను అందరూ వినియోగించుకోవాలి అని హాలియా ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ రాంబాబు అన్నారు. బుధవారం హాలియాలో నరేష్ కంప్యూటర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఎస్ బి ఐ ఖాతాదారుల సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సేవ కేంద్రం లో నగదు డిపాజిట్ ఉపసంహరణ సేవలతో పాటు కేవైసీ సౌకర్యం, బీమా సేవలు పాస్ బుక్ ప్రింటింగ్ కూడా అందుబాటులో ఉంటాయని నూతన ఖాతాలు కూడా తెరవబడునని ఇలాంటి సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన అన్నారు కార్యక్రమంలో నల్లగొండ ఎస్బిఐ ఎఫ్ఐ మేనేజర్ శ్రీకాంత్ పే పాయింట్ అధికారి కంకు నరేష్, నరేష్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నరేష్, సేవా కేంద్రం నిర్వాహాకుడు ఆదిత్య స్టాఫ్ మల్లికార్జున్ మహేశ్వరి మురళి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు* *ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులు

రూ.5 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డు

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు.

వైద్య సేవల పరిమితి రూ.3 లక్షలు పెంపు

సీఎం ఫొటో.. ప్రభుత్వ లోగోతో కొత్త డిజైన్‌

క్యూఆర్‌ కోడ్‌తో కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

రోగుల నమోదుకు ఫేస్‌ రికగ్నిషన్‌ విధానం

వరంగల్‌ ఎంజీఎంలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో హరీశ్‌రావు

హైదరాబాద్‌, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో కొత్త కార్డులను అందించనున్నది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం త్వరలో అందించనున్న ఆరోగ్య శ్రీ కార్డు ముందుభాగంలో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, లింగం, కార్డు నంబర్‌ వంటి ప్రాథమిక వివరాలు ఉండనున్నాయి. ప్రభుత్వ లోగో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ లోగో, సీఎం కేసీఆర్‌ ఫొటో ముద్రించనున్నారు. స్కాన్‌ చేస్తే సమగ్ర వివరాలు తెలిసేలా క్యూఆర్‌ కోడ్‌ను కూడా కార్డ్‌పై ముద్రిస్తారు. వెనకభాగంలో ఆరోగ్యశ్రీ ఉపయోగాలు ఉంటాయి.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేసేందుకు ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

నిమ్స్‌ స్పెషల్‌ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలి.

బయోమెట్రిక్‌ విధానంలో ఆరోగ్యశ్రీ రోగుల ఇబ్బందుల రీత్యా ఫేస్‌ రికగ్నైజేషన్‌ను అందుబాటులోకి తేవాలి.

ఆన్‌లైన్‌ పర్యవేక్షణతో మరింత నాణ్యమైన డయాలసిస్‌ సేవలను అందించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించేందుకు అనుమతి.

కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్టీ దవాఖానకు రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలి.

మూగ, చెవిటి పిల్లలకు హైదరాబాద్‌ కోఠి ఈఎన్టీ దవాఖానలో ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలను వరంగల్‌ ఎంజీ ఎంలోనూ అందుబాటులోకి తేవాలని బోర్డు నిర్ణయించింది. సమావేశంలో హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాస్‌రావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ కానుక’ దరఖాస్తులకు రేపు తుది గడువు

‘కేసీఆర్‌ కానుక’ దరఖాస్తులకు రేపు తుది గడువు 

మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు ప్రభుత్వం తెచ్చిన కేసీఆర్‌ కానుక పథకం దరఖాస్తులకు గురువారంతో గడువు ముగియనున్నది. అత్యంత నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది. వీటిలో క్రిస్టియన్‌ మైనార్టీ మహిళలకు 2 వేలు, ఇతర మైనార్టీ మహిళలకు 18 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నట్టు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

ఈ పథకానికి 21-55 ఏళ్ల వయసు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయంతో తెల్లరేషన్‌ కార్డు కలిగిన నిరుపేద మైనార్టీ మహిళలు అర్హులు. ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హతల పత్రాలు, పాస్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు సూచించారు.

పండ్ల తోటలకూ ఆర్థిక సాయం నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు

★ పండ్ల తోటలకూ ఆర్థిక సాయం

★ ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు 

   రైతులకు చాన్స్‌

★ నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు

★ సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం

★ ఉపాధిహామీ, పీఎంకేఎస్‌వైతో 

   అనుసంధానం 

★ ఈ ఏడాది లక్ష్యం 50 వేల ఎకరాలు

ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని కూడా రైతులకు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 31 నాటికి లబ్ధిదారుల ఎంపిక, పండ్ల మొక్కలు నాటడం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఐదు ఎకరాల లోపు భూమి, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డ్‌ ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులను లబ్ధిదారులుగా ఎంపికచేయనున్నారు.

పండ్ల తోటల పెంపకానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇందుకు ఉపాధిహామీ, పీఎంకేఎస్‌వై పథకాలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన శాఖ అధికారులు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు. ఆయా శాఖల పరిధిలోని అంశాలను పరిష్కరిస్తారు. పండ్ల తోటల్లో అంతర్‌ పంటలు వేసుకునే అవకాశం ఉండటంతో రైతులకు రెండు రకాలుగా ఆదాయం లభిస్తుంది. సంప్రదాయ పంటలతో ఒక్కోసారి రైతులు నష్టపోతున్నారు. ఒకేరకమైన పంటలు పండించడం వల్ల బహిరంగ మార్కెట్‌లో ధరలు పడిపోవడం జరుగుతుంటాయి. వాటన్నింటికి పరిష్కారంగా ఉద్యాన పంటలను సాగు చేయించాలని నిర్ణయించారు.

మార్గదర్శకాలు

------------------------------

★ ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డ్‌లు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులు, చిన్న, సన్నకారు రైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు.

★ బతికిన ప్రతి మొక్కకు మూడేండ్లపాటు నెలకు రూ.10 చొప్పున వాచ్‌ అండ్‌ వార్డు కోసం చెల్లిస్తారు.

★ గుంతలు తీయడం, మొక్కలు నాటడం ఉపాధిహామీ కూలీలతో చేయిస్తారు.

★ లబ్ధిదారుడికి మట్టి నమునా చార్జీలు చెల్లిస్తారు.

★ డ్రిప్‌ ఇన్‌స్టాలేషన్‌కు అయ్యే ఖర్చు చెల్లిస్తారు. దీనిలో ఎస్సీ, ఎస్టీలకు 100% సబ్సిడీ ఇస్తారు. చిన్న, సన్నకారు రైతులు 90% సబ్సిడీ ఇస్తారు.

★ మొక్కల ఎరువులకు మూడేండ్లపాటు డబ్బులు చెల్లిస్తారు. ఒక్కో చెట్టుకు సంవత్సరానికి రూ.50 చెల్లిస్తారు.

★ ప్రతి లబ్ధిదారునికి గరిష్ఠంగా ఐదు ఎకరాల వరకు మాత్రమే ఉండాలి.

★ లబ్ధిదారులు మొకలను ప్రభుత్వ నర్సరీల ద్వారా కానీ రిజిస్టర్డ్‌ ప్రైవేట్‌ నర్సరీల ద్వారా గాని కొనుగోలు చేయవచ్చు.

నల్గొండలో ఘనంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా, మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు.. సర్వ మత ప్రార్థనలు నిర్వహించి, మంత్రి జగదీష్ రెడ్డి ని,ఆశీర్వదించిన మత పెద్దలు...

పాల్గొన్న..zp చైర్మన్ బండ నరేందర్ రెడ్డి...స్థానిక mla కంచర్ల భూపాల్ రెడ్డి.. mp లింగయ్య యాదవ్...mla dr. గాదరి కిషోర్ కుమార్.. mla చిరుమర్ధి లింగయ్య, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,, వైస్ ఛైర్మన్ అబ్బాగోని రమేష్..గ్రంధాలయా చైర్మన్ మల్లికార్జున రెడ్డి.. కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు.. ముఖ్య నాయకులు.

నల్లగొండ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.

నల్లగొండ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం.

మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి...

నల్లగొండను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 38వ వార్డులో రెండు లక్షల వ్యయంతో హైమాక్స్ లైట్లు ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో కనివిని ఎరుగని రీతిలో నల్గొండ పట్టణం ఎంతో అభివృద్ధి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ అబ్బగోనీ రమేష్, కౌన్సిలర్ బోయినపల్లి శ్రీను, నాయకులు గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, కాసం శేఖర్ తదితరులు ఉన్నారు..

నంది అవార్డు గ్రహీత పెరుమాళ్ళ కుమారి గారికి నల్గొండ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

నంది అవార్డు గ్రహీత పెరుమాళ్ళ కుమారి గారికి ఘనంగా సన్మానం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 

నేడు నల్గొండ జిల్లా అంబేద్కర్ భవనం నందు నంది అవార్డు గ్రహీత పెరుమాళ్ళ కుమారి గారికి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది పెరుమాళ్ళ కుమారి గారు కరోనా సమయంలో పేద ప్రజలకు ఎంతో అండగా వుండి మనం ఫౌండేషన్ ద్వారా లేదా విద్యార్థులకు పేద ప్రజలకు అనాధాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు ఎన్నో సహాయ సహకారాలు 2017 నందు దళితరత్న అవార్డు గ్రహీత చేస్తున్న దృశ్య వారికి జాతీయ పురస్కారాల్లో భాగంగా నంది అవార్డు ఇవ్వడం పట్ల హర్షిస్తూ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ cholleti ప్రభాకర్ గారు రిటైర్డ్ ఎస్ డబ్ల్యూ షణ్ముఖ గారు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి గారు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కత్తుల జగన్ సత్యశోధక్ సమాజ్ జిల్లా అధ్యక్షులు గదే లింగస్వామి బీఎస్పీ సీనియర్ నాయకులు రంగాపూరి యాదయ్య 

sc st విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ప్రజలకు సేవ చేయాలని మరిన్ని అవార్డులు రావాలని తెలిపారు మాతంగి లింగస్వామి పెరిక అంజయ్య కట్టెల మహేష్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ ఇంచార్జ్ కుడుతాల నాగరాజు mrps అధ్యక్షులు కత్తుల సందీప్ సన్నీ అధ్యక్షులు అల్లంపల్లి కొండల్ గంట సుమన్ mrps మస్రం వెంకన్నరమేష్ వెంకన్న కిన్నారా విజ్ఞాన్ వంగూరు బన్నీ  కత్తుల సాయికిరణ్ పాల్గొన్నారు.

పెరిగే ధరలకు హద్దు లేదు కేంద్ర పాలకులకు బుద్ధి లేదు

పెరిగే ధరలకు హద్దు లేదు కేంద్ర పాలకులకు బుద్ధి లేదు

 కూరగాయల ధరలు అదుపు చేయడంలో విఫలం చెందిన పాలకులు

   పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్

ప్రతిరోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి సామాన్య ప్రజలు లబోదిబోమంటూనే ఉన్నారు పెరిగే ధరలకు హద్దే లేదు కేంద్ర పాలకులకు బుద్ధి లేదు అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి విమర్శించారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో కూరగాయలతో నిరసన తెలియజేసి ధరలు నియంత్రించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ టమాటా 140 రూపాయలు కూరగాయలు 80 నుంచి 100 రూపాయల వరకు కేజీ పెరిగిపోయినప్పటికీ ధరలు అదుపు చేయడంలో చిత్తశుద్ధి లేని పాలకులు ప్రజలపై భారాలు మోపుతున్నారని కార్పోరేట్ దోపిడీదారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని సిగ్గులేని పాలకుల తీరు ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల అప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత తన మాట అన్నట్లుగా నేడు పెరుగుతున్న ధరలతో కొనలేని తినలేని పరిస్థితులు దాపురించాయని " ఏముకొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు, ధరలు ఇట్లా పెరగబట్టే నాగులు నాగన్న ధరల మీద మన్ను పొయ్య నాగులో నాగన్న పాలించే పాలకులు నాగులు నాగన్న మన నడ్డి విరగొట్టే నాగులో నాగన్న " అన్న చందంగా తయారయిందని ప్రజలు పాలకులకు బుద్ధి చెప్పడం తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వెలుబుచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, పట్టణ అధ్యక్షురాలు తుమ్మల పద్మ, సాబేర బేగం, నుష్రత్ ఉన్నిస్సా, పుష్పలత, భార్గవి, గీత,కవిత,నర్మద, కవిత,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ఇది మరో ఉద్యమం.. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌పై తెలంగాణ రైతాంగం పోరాటం..

★ రైతు యుద్ధ వేదిక

★ 3 గంటలు నశించాలి.. 

   3 పంటలు వర్ధిల్లాలి

★ గాంధీభవన్‌లో గాడ్సే 

★ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఆరెస్సెస్‌ ఏజెంట్‌

★ ఎమ్మెల్యేలను కొనటంలో సిద్ధహస్తుడు

★ బాబు కనుసన్నల్లోనే తెలంగాణ కాంగ్రెస్‌

★ రాహుల్‌గాంధీకి ఎడ్లు తెల్వదు.. 

   వడ్లు తెల్వదు

★ హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదు

★ ప్రతి బడిని కేసీఆర్‌ సర్కారే బాగుచేస్తున్నది

★ జగిత్యాలలో మీడియాతో మంత్రి కేటీఆర్‌

★ నేటి నుంచి రైతు సభలు

★ కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక 

   విధానాలపై తీర్మానాలు

★ రేవంత్‌ తీరుపై నిరసన

ఇది మరో ఉద్యమం.. రైతు వ్యతిరేక కాంగ్రెస్‌పై తెలంగాణ రైతాంగం పోరాటం.. సాగుకు మూడు గంటల కరెంటు చాలన్న హస్తం పార్టీ కుట్రలను ఎండగట్టేందుకు రైతు వేదికలు సిద్ధమయ్యాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు రైతు సభలు నిర్వహించనున్నారు. ‘మూడు పంటలు బీఆర్‌ఎస్‌ నినాదం-మూడు గంటల కరెంటు కాంగ్రెస్‌ విధానం’ పేరుతో పది రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పనున్నారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యిమంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

బషీర్‌బాగ్‌లో రేవంత్‌ గురువు చంద్రబాబు రైతులపై కాల్పులు జరపగా, రేవంత్‌ ప్రస్తుత పార్టీ కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా ముదిగొండలో ఇండ్ల స్థలాలు అడిగినవారిపై బుల్లెట్ల వర్షం కురిపించిన ఘటనలు ఇంకా కండ్ల ముందే మెదులుతున్నాయి. ఆ నాటి దుస్థితి రావొద్దని రైతన్నలు రేవంత్‌పై, రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ పార్టీపై యుద్ధానికి దిగుతున్నారు.

ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పటికీ అదే పనిచేస్తున్నదని మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడిన మాటలు వ్యవసాయంపై కాంగ్రెస్‌ నేతల అవగాహన లేమికి నిదర్శనమని మండిపడ్డారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎల్‌ రమణను పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ నివాసంలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ పార్టీ కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టేవిధంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.

రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మపరిశీల చేసుకోవాలని కోరారు. ఆరు గంటలపాటు కరెంట్‌ ఇస్తానన్న కాంగ్రెస్‌, ఏనాడైనా మూడుగంటల పాటైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు. ఎండకాలం వచ్చిందంటే ఎండిన పంటలు, సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు నిత్యకృత్యమయ్యేవని గుర్తుచేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయతో చెరువులను బాగుచేస్తూనే.. మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేశామని చెప్పారు.

తెలంగాణలో ఉన్నట్టు ఏ రాష్ట్రంలో అయినా 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్‌ నాయకులు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని మండిపడ్డారు. ‘మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్‌ చాలు అన్న రేవంత్‌రెడ్డి మాటలే కాంగ్రెస్‌ విధానమా? నా నోటి నుంచి ఏది వస్తే అదే వేద వాక్కు, అదే కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో, రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ వేరు కాదు, నేను గీసిందే గీత, రాసిందే రాత అని అమెరికాలో రేవంత్‌ చెప్పింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో రైతాంగం మూడు పంటలు పండించడమే సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నినాదమైతే, మూడు గంటల కరెంట్‌ కాంగ్రెస్‌ విధానం. ఇందులో ఏది శ్రేయస్కరం? ఏది తెలంగాణకు, రైతులకు మంచిది? అనేది రైతులు ఆలోచన చేయాలి. మరోసారి కటిక చీకట్ల కాంగ్రెస్‌ కావాలా?, 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణ కావాలా? రైతుబంధు తెచ్చిన కేసీఆర్‌ను విశ్వసిద్ధామా? ఐదు దశాబ్దాల పాటు రైతులను రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్‌ను నమ్ముదామా?’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం జలాల పుణ్యమా అని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లు ఎదురుపోతున్నాయని అన్నారు.

రాహుల్‌గాంధీకి వ్యవసాయం తెలుసా?

---------------------------------------------

కాంగ్రెస్‌ నేతలు తెల్లారి లేస్తే నోటికొచ్చిన మాటలు, కారు కూతలు కూస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అంటున్నారు. ఆయనకు ఎడ్లు తెలువదు, వడ్లు తెలువదు. క్లబ్బులు, పబ్‌లు మాత్రమే తెలుసు. ఎడ్లు, వడ్లు తెలువనోడు ఇక్కడికి వచ్చి డిక్లరేషన్‌ అంటూ ఏదో చదివారు. రాహుల్‌గాంధీ లీడర్‌ కాదు.. రీడర్‌. ఏం రాసిస్తే అదే చదివారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుంది? అందుకే రాహుల్‌గాంధీని దేశంలో ఏమంటారో అందరికీ తెలుసు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగితే ఈ నీళ్లు ఎలా వస్తున్నాయి. వరద కాలువలో 122 కిలోమీటర్ల పొడవునా నిండుకుండలా నీళ్లు పొంగిపొర్లుతున్న విషయం వాస్తవం కాదా? ఎస్సారెస్పీలోకి పైనుంచి నీళ్లు రాకుంటే ఈ రోజు దిగువ నుంచి కాళేశ్వరం ద్వారా ఎగువకు నీటిని తరలించి ప్రాజెక్టును నింపుతున్నది వాస్తవం కాదా? మార్గమధ్యలో 68 చెరువులను నింపిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాలేదా? ఎస్సారెస్పీ ఆయకట్‌ రైతులకు ఈ విషయం తెలియదా? వానలు పడకుండానే ఈ నీళ్లు ఎక్కడినుంచి వస్తున్నాయి?’ అని ప్రశ్నించారు.

ప్రజా క్షేత్రంలో తేల్చుకొందాం

--------------------------------------------

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ పార్టీ నిజరూపాన్ని నగ్నంగా బయటపెడుతామని మంత్రి కేటీఆర్‌ స్పష్టంచేశారు. ‘ప్రజాక్షేత్రంలో చర్చపెడ్దాం.. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన కరెంట్‌ కావాలా? నేడు కేసీఆర్‌ ఇస్తున్న కరెంట్‌ కావాలా? అని అడుగుదాం. దాని ఆధారంగా ఓట్లు అడుగుదాం. మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్టార్టర్లు కాలిపోయే కరెంటు మళ్లీ కావాలా? అర్ధరాత్రి పోయి బాయికాడ పడుకొనుడు, పాముకుట్టుడు, తేలుకుట్టుడు, మనుషులు చచ్చుడు కావాలా? కేసీఆర్‌ ఇస్తున్న 24 గంటల కరెంట్‌ కావాలా? అని ప్రజలను అడుగుదాం. చైతన్యవంతమైన తెలంగాణ రైతులు తప్పకుండా తీర్పు చెప్తారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నది రాజకీయ సమస్య కాదని, రైతుల సమస్య అని అన్నారు. ‘కేసీఆర్‌ పాలన, వ్యవసాయ విధానం బాగున్నాయని మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రైతులు చెప్తున్నారు. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అని కేసీఆర్‌ అంటే, మహారాష్ట్ర రైతన్న గొంతు కలుపుతున్నాడు. మరి ఇక్కడున్న కాంగ్రెస్‌ సన్నాసి పార్టీకి ఏమైంది? రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్‌, ఊరూరా కొనుగోలు కేంద్రం వంటి పథకాలు మంచిగున్నాయని ఇతర రాష్ర్టాలు అంటుంటే, ఇక్కడి భావ దారిద్రపు ప్రతిపక్షం ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? రైతులకు కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పేదాక ఉద్యమిస్తాం. తెలంగాణ ఉద్యమం నాటి స్ఫూర్తిని ప్రదర్శిద్దాం. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదిరోజుల పాటు రైతాంగాన్ని చైతన్యవంతం చేయాలి. రాష్ట్రంలోని 2,603 రైతు వేదికల్లో కదం తొక్కాలి’ అని పిలుపునిచ్చారు.

గాంధీ భవన్‌లో గాడ్సే

-----------------------------------

రేవంత్‌రెడ్డి నేపథ్యం తెలిసిన వారందరికీ అతడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్‌ అన్న విషయం స్పష్టంగా తెలుసని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కాంగ్రెస్‌ నడుస్తున్నదని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చినవారేనని పేర్కొన్నారు. ‘రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ కార్యకర్త. ఆయన పీసీసీ అధ్యక్షుడు అయినప్పటినుంచి నేటివరకు ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణకు రావాల్సివాటిపై ప్రశ్నించిన పాపాన పోలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌తో రేవంత్‌కు ఉన్న అనుబంధాన్ని తెలిపే పాత వీడియోలు కూడా ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌వాళ్లు కనబడితే ఇప్పటికీ కాళ్లు మొక్కుతాను అన్న రేవంత్‌ వీడియోలన్నీ ఉన్నాయి. ఈ రోజు కొత్తగా వచ్చి బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌ అంటూ నోటికొచ్చినట్టు వాగతున్నారు. రేవంత్‌రెడ్డి పూర్వాశ్రమం అంతా ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లోనే కాదా? ఢిల్లీ గవర్నమెంట్‌ హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే, బీజేపీకి వంతపాడుతున్నది కాంగ్రెస్‌ పార్టీ కాదా?’ అని ఆయన ప్రశ్నించారు.

26 వేల పాఠశాలలు ఆధునీకరణ

-------------------------------------------

కాంగ్రెస్‌ పార్టీ 50 ఏండ్లలో ఏ పనీ చేయకుండా వదిలిపెట్టి పోతే, జగిత్యాలను జిల్లా కేంద్రం చేసి, ఇక్కడ మెడికల్‌ కాలేజీ పెట్టామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తున్నది కేసీఆర్‌ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. అన్ని పాఠశాలల సుందరీకరణ పూర్తయిన తర్వాత కంటివెలుగు శిబిరాలు పెట్టి కాంగ్రెస్‌ నాయకులు జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డికి అద్దాలు ఇచ్చి ఎంతబాగా పని జరిగిందో చూపెట్టే బాధ్యత సైతం తమదేనని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్‌, సుంకె రవిశంకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, గుండు సుధారాణి, జగిత్యాల మున్సిపల్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు విధానాలే ఎజెండాగా ప్రజల వద్దకు వెళ్దాం

--------------------------------------------

రైతు ప్రయోజనాలు అనే సింగిల్‌ ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్దామని కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ‘కాంగ్రెస్‌ గతంలో ఇచ్చిన కరెంట్‌ కావాలా? కేసీఆర్‌ ప్రస్తుతం ఇస్తున్న కరెంట్‌ కావాలా? అని ప్రజలను అడుగుదాం. తిమ్మిని బమ్మిని చేయడంలో, ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్‌రెడ్డి సిద్ధహస్తుడు. కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీభవన్‌లోకి గాడ్సేగా చొచ్చి ఈ రోజు ఆ పార్టీని నడుపుతున్నారు. అలాంటి చోట లాగ్‌బుక్‌ల గురించి మాట్లాడటం కాదు, వాళ్లు దేన్నైనా మార్చగలరు. అందుకే రైతుల వద్దకే వెళ్లి అడుగుదాం. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకొందాం. రాష్ట్రంలోని 70 లక్షల రైతులు రూ.73 వేల కోట్లు రైతుబంధు రూపంలో పొందారు. వారిని తీర్పు ఇవ్వమని కోరుదాం’ అని సవాల్‌ విసిరారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద కాంగ్రెస్‌ పార్టీని రైతులు, ప్రజలు తన్ని తరిమివేస్తే ఆ బాధ్యత తమది కాదని మంత్రి స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరు

------------------------------------------

కాంగ్రెస్‌ పార్టీ రైతులకు క్షమాపణలు చెప్పాలని సోమవారం నుంచి రాష్ట్రంలోని ప్రతి రైతువేదికలో వెయ్యిమంది రైతులతో తీర్మానం చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రైతులను, వ్యవసాయాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ రైతు వేదికకు వచ్చి తీర్మానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్‌ కటిక చీకట్ల కాలం వద్దు, 24 గంటలపాటు కరెంట్‌ ఇస్తున్న కేసీఆర్‌ పాలనే ముద్దు.. మూడు గంటల వ్యవహారం వద్దు, మూడు పంటల విధానం కావాలి’ అని తీర్మానం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ దుర్నీతిని ఎండగడుతూ పదిరోజులపాటు ప్రతి నియోజకవర్గంలోని రైతువేదికలో తీర్మానం చేయాలని కోరారు. గ్రామ రైతు వేదికలు తీర్మానం చేసి మండల రైతు సమాఖ్యకు, వారు జిల్లా రైతు సమాఖ్యకు, వారు రాష్ట్ర రైతుబంధు సమితికి పంపించాలని సూచించారు. రాష్ట్రంలో ఉచిత కరెంట్‌పై మాట్లాడే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి ఉన్నదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉచిత కరెంట్‌ తెచ్చిన మాట నిజం. మరి నేడు రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఉన్నదా? ప్రస్తుతం ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్‌ తప్ప, రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ కాదు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ను జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడో ఆంధ్రాకు తీసుకుపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్‌ తప్ప ఒరిజినల్‌ కాంగ్రెస్‌ కాదు. చంద్రబాబు వ్యవసాయం దండుగ అంటే, ఆయన శిష్యుడు.. చోటా చంద్రబాబు అదే లైన్‌లో మూడు గంటల కరెంట్‌ చాలు అంటూ ముక్కు విరుస్తున్నారు. తెలంగాణ రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులారా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్‌ మీది కాదు.. ఇక్కడి కాంగ్రెస్‌ చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే కాంగ్రెస్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుచేతల్లో నడిచే కాంగ్రెస్‌. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు గుర్తించాలి’ అని సూచించారు.

కరెంటు అడిగితే కాల్చి చంపారు..

--------------------------------------------

కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనకు దిగినవారిపై కాల్పులకు దిగి ముగ్గురిని బలిగొన్నది నాటి చంద్రబాబు సర్కార్‌. 2000 ఆగస్టు 28న వామపక్షాల ఆందోళనకు భారీగా రైతులు, యువకులు తరలివచ్చారు. బషీర్‌బాగ్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. అలాంటి చంద్రబాబు శిష్యుడు ఇప్పుడు కరెంటు మూడుగంటలే చాలంటూ మళ్లీ రైతుల గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నారు.

భూమి అడిగితే బుల్లెట్‌ దించారు..

------------------------------------------

ఇండ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ పేదలు చేసిన ఆందోళనపై కర్కశంగా వ్యవహరించింది.. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. 2007 జూలై 28న ఖమ్మం జిల్లా ముదిగొండలో నిరసనపై బుల్లెట్ల వర్షం కురిపించింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏడుగురిని పొట్టనబెట్టుకున్నది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌.. ఉచిత విద్యుత్తుపై విషం కక్కుతున్నారు. పేద రైతుల నోట్లో మట్టిగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది నల్లగొండ యువకులు బిఆర్ఎస్ లో చేరిక

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో... నల్గొండ 22 వార్డు నుండి...మహమ్మద్ నూర్.. నాయకత్వంలో .. నాగుల్ షరీఫ్, ఆసిఫ్ భాయ్ ఆధ్వర్యంలో... 100 మందికి పైగా వివిధ పార్టీలకు చెందిన యువకులు... బిఆర్ఎస్ పార్టీలో చేరారు..

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ...

కెసిఆర్ నాయకత్వంలో అన్ని మతాల వారికి అన్ని వర్గాల వారికి.. అభివృద్ధిలో, సంక్షేమంలో సమన్యాయం జరుగుతుందని... సమాజంలోని ప్రతి ఒక్క పేదవారికి వారి సంక్షేమ పథకాలు అవుతున్నాయని... అందుకే అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని..

 ముఖ్యంగా నల్లగొండకు గత ఎన్నికల్లో... ఇచ్చిన హామీ మేరకు దత్తత తీసుకొని నల్లగొండ నల్లవైపుల నుండి అభివృద్ధి చేస్తూ సుందర పట్టణంగా నల్లగొండను తీర్చిదిద్దుతున్నారని... 1200 కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి శర వేగంతో నిర్మాణం పనులు పూర్తవుతున్నాయని... ఇవన్నీ పూర్తి కావడానికి మరో రెండు సంవత్సరాల పడతాయన్నారు.

 ఇందుకు నల్లగొండ నియోజకవర్గ ప్రజలందరు తమ సహకారాన్ని అందించి...తమ రాజకీయ చైతన్యాన్ని మరోసారి చాటుకోవాలని..విజ్ఞప్తి చేశారు.

 పార్టీలో చేరిన వారందరికీ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..

నాగుల్ షరీఫ్ మాట్లాడుతూ..తాము స్వర్ణకార వృత్తి చేస్తున్నామని తమను ఇంతవరకు ఎవరు గుర్తింపు చేయలేదని... మా సమస్యలు కెసిఆర్ నాయకత్వంలో మాత్రమే సాధించుకోగలమని నమ్మకంతో...

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి, పట్ల పూర్తి విశ్వాసంతో BRS పార్టీలో చేరుతున్నామని... పార్టీ విజయం కోసం తమ శాయశక్తుల కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో... జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి సీనియర్ నాయకులు జమాల్ ఖాద్రి.. బకరం వెంకన్న . 22 వ వార్డు నాయకులు మహమ్మద్ శంషుద్దీన్.. సోహెల్ అహ్మద్,

పార్టీలో చేరిన వారిలో...సుభాని ఇంతియాజ్,ఇమ్రాన్,రెహమతుల్లా, యూనస్, సుభాని, అల్తాఫ్, రసూల్ మహమ్మద్ షఫీ మహమ్మద్ సమీర్... తదితర వందమందికి పైగా ముస్లిం మైనార్టీ కి చెందిన యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.