ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి

ఎండాకాలంలో ప్రారంభించిన చలివేంద్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది: ఏవి రంగారావు ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి 

ఏవి రంగారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎండాకాలంలో నల్గొండ విద్యుత్ నగర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి విజయవంతం గా పూర్తి చేసుకున్న సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ అక్కినపల్లి శ్రీనివాస చక్రవర్తి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏవి రంగారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాదాచారులకు నల్గొండ విద్యుత్ నగర్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ సేవలు కొనసాగించామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎండాకాలం పూర్తి కావడంతో చలివేంద్రం ముగింపు కార్యక్రమంలో పాల్గొని, తమ కార్యక్రమాన్ని నిరాటంకంగా ఇన్ని రోజులు నడిచినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎ.తిరుమలనాద్, వేణుగోపాలరావు, చెరి పెళ్లి వెంకటేశ్వర్లు, చెరి పల్లి జయప్రకాష్,m. సైదులు, తలారి యాదగిరి, గంజి రాజేందర్, పెండం ధనుంజయ,కే.సుధీర్, ప్రతాప్, మిర్యాల కిరణ్, బండారు హరినాథ్, ఎస్ నారాయణ, సయ్యద్, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

గుంటూరులో తెలుగు వెలుగు సాహితి సంస్థ నిర్వహించే తెలుగు వెలుగు జాతీయ పురస్కారాలు 2023 కు ఎంపికైన నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాధిక్ పాష

గుంటూరులో తెలుగు వెలుగు సాహితి సంస్థ నిర్వహించే తెలుగు వెలుగు జాతీయ పురస్కారాలు 2023 కు ఎంపికైన నల్గొండ వాసి సామాజిక కార్యకర్త సాధిక్ పాష

తెలుగు వెలుగు సాహితీ సంస్థ తెలుగు వెలుగు జాతీయ పురస్కారాలు-2023 అవార్డుకు గాను నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారిని ఎంపిక చేశారు. ఈనెల 25 నాడు గుంటూరు లో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సామాజిక సేవా రంగంలో సేవలందిస్తు పలువురికి ఈ అవార్డు అందించనున్నారు. కాగా నల్గొండ జిల్లాలో పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్న సామాజిక కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త సాదిక్ పాషా గారికి తెలుగు వెలుగు జాతీయ విశిష్ట సేవా రత్న పురస్కారం అందజేయనున్నారు.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ గొల్లగూడ హాస్పిటల్ పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంచిన కార్యకర్తలు

నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ గొల్లగూడా హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు బ్రెడ్ లు పంచిన నల్గొండ 17వ వార్డు ముఖ్య కార్యకర్తలు

నల్గొండ మున్సిపల్ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా గొల్లగూడ హాస్పిటల్ లో పేషంట్లకు అరటిపండ్లు, బ్రెడ్లు పంచిన 17వ వార్డు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు దొంత రవి, మిర్యాల కిరణ్ కుమార్ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు సైదిరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తాము పండ్లను బ్రెడ్లను పంచామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 17 వార్డు ముఖ్య నాయకులు కట్ట హనుమంతు, షేక్ అన్వర్, సుధీర్, వంశీ, యోగానందం, మొహమ్మద్ ఉమీర్,మధు పాల్గొన్నారు.

ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

ఒడిశా రాష్ట్రం లోని బహనాగ్ స్టేషన్ రైల్వే ప్రమాదానికి పట్టాల పై రక్త పాతానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి

రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలి.

మృతుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం తో పాటు,భద్రత గల ఉద్యోగం ఇవ్వాలి.

 ఈరోజు మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన బి.ఎస్.పి  ముఖ్య కార్యకర్త సమావేశంలో మునుగోడు నియోజకవర్గం నాయకులు పెండెం  ధనుంజయ నేత పాల్గొని మాట్లాడుతూ  

 కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్ప గిస్తున్నది. అందు కోసం ఆయా రంగాల రెగ్యులర్ ఉద్యోగులను తగ్గిస్తూ కాంట్రాక్ట్ కార్మికులను పెంచుతున్నది. 

రెండు జూన్ రాత్రి ఏడున్నర గంటలకు జరిగిన ప్రమాదం కూడా రైల్వేలో ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక పరిణామా ల ఫలితమే నని రైల్వే కార్మికులు అంటున్నారు.

ప్రైవేటీ కరణ వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల సంఖ్య చాలా తగ్గించారు. ట్రాక్ పరిశీలన చేసే వాళ్లు తగ్గి పోయారు. ఇంకో వైపు ఈ పాత ట్రాక్ ల మీదనే వేగంగా నడిచే వందే భారత్ రైళ్లు ప్రవేశ పెడుతున్నారు. 

ఏకారణాలతో పట్టాలు ఎలా మారుతున్నాయో పరిశీలన లేదు. రైల్వే శాఖ వైఫల్యానికి ఆ రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారి నిండు ప్రాణాలు బలి అయ్యాయి. ఇవి కేవలం ప్రమాద మరణాలు కావు. రైల్వే శాఖ చేసిన హత్యలు. 

మహబూబ్ నగర్ జిల్లా లో అప్పన్న పల్లి దగ్గర రైల్ ప్రమాదం జరిగినప్పుడు రైల్వే శాఖ మంత్రి గా ఉండిన లాల్ బహదూర్ శాస్త్రి గారు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జరిగింది అంతకన్నా మూడు నాలుగు రెట్లు పెద్ద తీవ్ర ప్రమాదం. 

 కరుణ గల భారత ప్రజలందరూ ఈ ప్రమాదాన్ని ప్రభుత్వ వైఫల్య మని గుర్తించాలని బాధితులకు న్యాయం కోసం కృషి చేయాలని కోరుతున్నాము. 

ప్రధాన మంత్రి, రైల్వే మంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటనలు చేస్తూ కన్నీరు కారుస్తూ చేతులు దులుపుకుంటున్నారు. వీరందరూ దేశంలో అమలు అవుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విధానాలకు బాధ్యులు. ఈ మరణాలకు కూడా వీరు బాధ్యత వహించాలి. 

ప్రతి బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయల పరిహారం తో పాటు ప్రతి కుటుంబానికి ఒక భద్రత గల ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. 

ఊహించకుండా మృత్యు వాత పడిన, కోలుకోలేని విధంగా గాయాల బారిన పడిన వారందరికీ సానుభూతి ప్రకటిస్తూ...

 ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి  నాయకులు బొట్టు శివ, పందుల సూరన్న, హరీష్, తీగల రమేష్, శివ, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగురాలు అయినా అవివాహితపై అగాయిత్యం చేసిన వ్యక్తిని చట్ట ప్రకారం వెంటనే శిక్షించాలి: Ts వికలాంగుల జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ కుమారస్వామి

దివ్యాంగురాలైన అవివాహితపై అఘాయిత్యం చేసిన వ్యక్తిపై 2016 చట్టం అమలు చేయాలి.

తెలంగాణ వికలాంగుల-జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్

     వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండల కేంద్రంలోని పత్రిక మిత్రులతో తెలంగాణ వికలాంగుల జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ దివ్యాంగులకు ఎన్ని చట్టాలు వచ్చిన,ఎన్ని ప్రభుత్వాలు మారిన మా పరిస్థితులు మారడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు.

   2016 చట్టం ప్రకారం సెక్షన్ 91,92 కేసు అమలు చేస్తే దివ్యాంగ మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.బాపునగర్ గ్రామానికి చెందిన వివాహిత దివ్యాంగురాలుపై అదే గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ కారోబార్ (మల్టీ పర్పస్ వర్కర్)గా పనిచేస్తున్న గుగులోత్ రాజు అఘాయిత్యానికి పాల్పడి పలుమార్లు అత్యాచారం చేశాడనీ వెంటనే కారోబార్ విధులనుంచి తొలిగించి ఆ వ్యక్తిపై 2016 చట్టం ప్రకారం సెక్షన్ 91,92 కేసు అమలు చేసి కఠినంగా శిక్షించి తగిన విధంగా చర్య తీసుకొని జైలుకి పంపించాలని డిమాండ్ చేశారు.

   ఆ దివ్యాంగ మహిళకి తగిన న్యాయం జరగాలంటే అత్యాచారం చేసిన గుగులోత్ రాజుపై 2016 చట్టం ప్రకారం సెక్షన్ 91,92 అమలు చేస్తే ఆ మహిళకి తగిన న్యాయం జరుగుతుందనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వికలాంగుల-జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి కోరారు.

నల్గొండ పట్టణం చెందిన ప్రముఖ వైద్యుని కుమారుడు ఐఏఎస్ కు సెలెక్ట్ అయిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కంచర్ల

ప్రెస్ నోట్..

 నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దామెర యాదయ్య గారి కుమారుడు దామేర హిమవంషి.... ఇటీవల ఐ ఏ ఎస్... కు సెలెక్ట్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని...

 ఈరోజు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు.

ఈ సందర్భంగా కంచర్ల... దామెర హిమవంశిని బొకే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు...

 అత్యున్నత స్థాయి సర్వీస్ లో సెలెక్ట్ అయినందున... కన్న తల్లిదండ్రులకు, నల్లగొండకు, రాష్ట్రానికి,మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు....

 నల్గొండ డి.ఎస్.పి ఎన్ నరసింహారెడ్డి, తీగల జాన్ శాస్త్రి...

 వెంట ఉన్నారు

తెలంగాణ ప్రజలకు తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భం ఇది..! తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం వివిధ దశలో జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, తాగ్యాలను సీఎం స్మరించుకున్నారు. రాష్ట్ర సాధన పోరాట క్రమంలో ఎదురైన కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను అధిగమించిన అడ్డంకులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ స్వయం పాలనకు 9ఏళ్లు పూర్తి చేసుకొని పదో వసంతంలోకి వెళ్తున్నామన్నారు. అనుమానాలు పటాపంచలు చేస్తూ అద్భుతంగా నిలదొక్కుకున్నామన్నారు. ప్రత్యర్థుల కుయుక్తులు తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుతమని చెప్పారు.

వెనుకబాటుతనానికి గురైన తెలంగాణ నేడు దేశాన్ని ముందుకుతీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో విజయం సాధించామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలువడం సంతృప్తికరంగా ఉందన్నారు. ‘తెలంగాణ మోడల్‌’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, తెలంగాణ వంటి పాలన కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారన్నారు. దేశ ప్రజలందరి ఆదరాభిమానాలు పొందడం మన ఘన విజయమని, ఇది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమన్నారు. అన్నిరంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తూ మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగ వైభవంగా జరుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలన్నారు.

స్థానిక కౌన్సిలర్ తల్లి గారి మృతి పట్ల నివాళులర్పించి సంతాపం తెలియజేసిన నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి

నివాళులర్పించిన ఎమ్మెల్యే కంచర్ల, మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి

నల్లగొండ పట్టణ పరిధిలోని ఏడవ వార్డు కౌన్సిలర్ మారగోని గణేష్ గౌడ్ తల్లి అంశమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వారి పార్థివ దేహానికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు, పూలమాలవేసి నివాళులర్పించారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గారు, మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండలో తప్పిపోయిన వృద్ధులకు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలకు బాసటగా నిలుస్తున్న ఆర్టీసీ ఉద్యోగి, సామాజిక కార్యకర్త సాధిక్ పాష

అభాగ్యులకు అండగా

నల్గొండ కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి సామాజిక కార్యకర్త, మరియు మానవ హక్కుల కార్యకర్త అయిన శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు తన గొప్ప మనసును చాటుకుంటు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే నల్గొండ కు చెందిన సాదిక్ పాషా గారు తన వృత్తి ధర్మాన్ని పాటిస్తు పలు సామాజిక కార్యక్రమాలు చేస్తు సమాజానికి తన వంతు సేవలు అందిస్తు పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. 2018 లో తన స్నేహితుని బంధువులు(భార్యా భర్తలు) అనారోగ్యంతో చనిపోగా తానే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించి వారి ఇద్దరు పిల్లల్ని నల్గొండ కు తీసుకువచ్చి సి.డబ్ల్యూ.సి ద్వారా మేయర్స్ బాల భవన్ లో ఆశ్రయం కల్పించి వారికి ఉచిత విద్యా, వసతి కల్పించి వారికి గార్డియన్ గా(సంరక్షకునిగా)వున్నాడు. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు అబ్బాయి 5వ తరగతి అమ్మాయి 3వ తరగతి చదువుతున్నారు. అతను చేసే సేవలకు గాను పలు అవార్డులు ప్రశంసా పత్రాలు అందుకోవడం జరిగింది. కోవిడ్ సమయంలో ఎందరికో తన సేవలు అందించి విజయవాడలో కోవిడ్ వారియర్ అవార్డును సైతం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను సమాజంలో నిరాదరణకు గురైన వారికి, అనాధాలకు, వృద్ధులకు, వికలాంగులకు, అత్యవసర సమయంలో రక్తదానం, మరియు అభాగ్యులకు సేవలు చేస్తుంటానని తాను సామాజిక సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన ఆ భగవంతునికి ఎల్లప్పుడూ రుణ పడి వుంటానని సామాజిక సేవలోనే తనకు తృప్తి వుంటుందని సామాజిక సేవతోనే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుందన్నారు అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి తమకు తొచిన విధంగా ఎదో ఒక రూపంలో సామాజిక సేవలు చేసి సమాజంలో మానవత్వాన్ని చాటాలని అలాగే రక్తదానానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు రావాలని అభిలాషించారు.

పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే కంచర్ల

పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే కంచర్ల

నల్లగొండ పట్టణ ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ పరిధిలోని పానగల్ వాటర్ ప్లాంట్ ను స్థానిక మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, డిఈ రాములు, కౌన్సిలర్ ఖయ్యుం బేగ్ గార్లు తదితరులు పాల్గొన్నారు.