యాదగిరి రెడ్డి మృతి BRS పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి

NLG: యాదగిరి రెడ్డి మృతి BRS పార్టీకి తీరని లోటు

నల్లగొండ పట్టణ కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మార్త యాదగిరి రెడ్డి గారు అనారోగ్యంతో మృతి చెందారు. వారి పార్థివ దేహానికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు పూలమాలవేసి నివాళులర్పించారు. వారి మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, మిర్యాల యాదగిరి, గుర్రం వెంకన్న, తలారి యాదగిరి, రాజేందర్, జయప్రకాష్ గార్లు నివాళులర్పించారు.

మిషన్ వాత్సల్య పథకంలో వికలాంగుల పిల్లలకు అవకాశం కల్పించాలి:పల్లకొండ కుమారస్వామి

మిషన్ వాత్సల్య పథకంలో వికలాంగుల పిల్లలకు అవకాశం కల్పించాలి

వి-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి డిమాండ్

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య పథకంలో అనాధ పిల్లలతో పాటుగా వికలాంగులు తల్లిదండ్రులుగా ఉన్న వారి పేద విద్యార్థులకు కూడా మిషన్ వాత్సల్య పథకానికి వర్తింపజేయాలని వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు వికలాంగులుగా ఉన్న వారి పిల్లలు పేదరికం వలన విద్యాభ్యాసం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం పరిచారు.

   కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడ విద్యను అందించడం కోసం కృషి చేయాలని,ఈ పథకానికి 72 వేల ఆదాయ పరిమితి విధించడం వల్ల,ఆదాయ పరిమితిలో

సడలింపు ఇవ్వాలి. చాలామంది ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యను అభ్యసించడం జరుగుతుందని, ప్రభుత్వం,ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు కూడా మిషన్ వాత్సల్య పథకంలో వర్తింప చేయాలనీ కోరడమైందన్నారు.

    కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ వాస్తల్య పథకానికి కావాల్సిన ధ్రువ పత్రాలు సరైన సమయానికి అందక విద్య సంస్థలు సెలవులు కావడం వల్ల నాన అవస్థలుపడుతున్నారని దరఖాస్తు గడువు చాలా తక్కువగా ఉందనందున ఈ గడువును మరోసారి పొడిగించాలని తెలిపారు.పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ వాస్తల్య పథకం వికలాంగుల కుటుంబానికి చెందిన వారి పిల్లలు కూడా విద్యను అభ్యసించడానికి సహకారం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.

సత్తా చాటిన ఎల్లారెడ్డిగూడెం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు

నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామం ఎస్ఎస్సి ఫలితాల్లో జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థుల మంచి ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరైన 42 మంది విద్యార్థులకు 39 మంది విద్యార్థులు 97% ఉత్తీర్ణత సాధించారు. వీరిలో నల్లగొండ, చర్ల పళ్లికి చెందిన శ్యామల శివప్రసాద్ 9.3 మరియు నల్ల రక్షిక 9.2 జిపిఏతో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్ చైర్మన్ రమేష్ అభినందించారు.

వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

NLG: వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట...

వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రేడియో డయాగ్నొస్టిక్ హబ్, రేడియాలజీ (రొమ్ము కాన్సర్) మరియు ఎక్స్ రే పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేడియో డయాగ్నొస్టిక్ హబ్ ప్రారంభించి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు... ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కటికం సత్తయ్య గౌడ్ గారు,

DMHO అనిమల్ల కొండల్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటిండెంట్ లచ్చు నాయక్, వైద్య కార్మికుల సంఘం పల్లా దేవేందర్ రెడ్డి, సందినేని జనార్దన్ రావు గార్లు తదితరులు పాల్గొన్నారు.

పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట: మున్సిపల్ చైర్మన్

NLG: పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని 17వ వార్డు పద్మానగర్ లో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ పట్టణాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. పట్టణాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమన్నారు….ఈ కార్యక్రమంలో *గాదె వివేక్ రెడ్డి, మద్ది దినేష్ యాదవ్,మూడ వేణు, వనం చంద్ర శేఖర్,మిర్యాల కిరణ్, దొంత రవి, పోషంగిరి, కైరంకొండ శివశంకర్, గంజి గణేష్, మూడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం... ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

NLG: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు. నల్గొండ పట్టణంలో వారి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పేద బిడ్డ పెళ్లికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు...ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, కౌన్సిలర్లు మరియు MPP, ZPTC, మండల అధ్యక్షులు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

నల్లగొండ 48 వార్డులో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్

 నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు పట్టణంలోని 48వ వార్డులో...

 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైన్ పనులను.. ప్రారంభించారు.

కెసిఆర్ గారి దత్తత నియోజకవర్గమైన నల్లగొండలో నియోజకవర్గ వ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని..

 పట్టణంలోని వివిధ వార్డుల్లో అంతర్గత రహదారులను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో.. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి స్థానిక కౌన్సిలర్ యామా కవిత దయాకర్, సింగల్ విండో చైర్మన్ ఆలకుంట నాగరత్నం రాజు సీనియర్ నాయకులు బకరం వెంకన్న.. తదితరులు వెంట ఉన్నారు.

నల్గొండలో ఇషా కంటి హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

మెరుగైన వైద్య సేవలు అందించాలి... ఎమ్మెల్యే కంచర్ల

నల్గొండ పట్టణ కేంద్రంలో బస్టాండ్ సమీపంలో గల ఇషా కంటి వైద్యశాలను నల్గొండ ఎమ్మెల్యే శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ..

పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో... వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేటలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపల్ ఉద్యోగిపై గొడ్డలితో దాడి

సూర్యాపేటలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపల్ ఉద్యోగిపై దాడి ఘటన చోటు చేసుకుంది. శనివారం జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న మున్సిపాలిటీ ఉద్యోగి బిక్షం పై అక్రమ నిర్మాణం చేపడుతున్న భద్రయ్య అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ మున్సిపాలిటీ ఉద్యోగిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు .

ఈ మేరకు సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగి బిక్షంను జిల్లా కలెక్టర్ వెంకట్రావు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, ప్రసాద్ ఉన్నారు.

నల్లగొండ ఆర్జాలబావి గోదాములను పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

 నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఆర్జాలబావి ధాన్యం గోదాములను... పరిశీలించారు..

 ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయిన. రాష్ట్రంలో పండిన పండిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని... ఇప్పటికే రాష్ట్రంలో నల్లగొండ జిల్లా..3.5 లక్షల మెట్రిక్ టన్నుల,ధాన్యాన్ని కొనుగోలు చేసి అగ్రస్థానంలో ఉందని,అందులో నల్లగొండ నియోజకవర్గం లో లక్ష మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరించినదన్నారు.

రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకొని తాలు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ధాన్యం తడవకుండా రాశులను కప్పి ఉంచుకోవాలని, కోరారు.

 ఎప్పటికప్పుడు, కాంట ఐన ధాన్యాన్ని .. లారీలు ట్రాక్టర్లతో వెంట వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసి గోదాములకు తరలించాలని.. అధికారులను ఆదేశించారు..

 జిల్లా సివిల్ సప్లై అధికారి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి అన్నెపర్తి సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి, రైస్ మిల్లుల యజమానులు కందుకూరు మహేందర్ కొండా లక్ష్మయ్య తదితరులు వెంట ఉన్నారు.