డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని నల్గొండలో వారికి నివాళులర్పించిన నల్గొండ బిసి సంక్షేమ సంఘం నాయకులు

రాజ్యాంగ నిర్మాత , బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రం మర్రిగూడ బైపాస్ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి బీసీ సంక్షేమ, ఉద్యోగ ,యువజన, మహిళా సంఘాలు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

 ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బహు భాషా కోవిదుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, వారు అందరివారని కొనియాడారు. ఎంతో ముందు చూపుతో అన్ని విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సంక్షోభాలు తలుత్తకుండా చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. స్వతంత్ర భారత్ మొదటి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి దేశానికి విశిష్టమైన సేవలను అందించారని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, యువజన సంఘం అధ్యక్షులు మూ నా స ప్రసన్నకుమార్, మహిళా సంఘం అధ్యక్షులు మామిడి పద్మ యాదవ్, శంకరదుర్గ , వెంకన్న యాదవ్, కర్ణా టి యాదగిరి , L వెంకన్న, రాజు. తదితరులు పాల్గొన్నారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ నిర్వహించిన నలగొండ బీసీ సంక్షేమ సంఘం

ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ గడియారం సెంటర్లో ఘనంగా నిర్వహించిన బీసీీీీ సంక్షేమ సంఘం.

 ఈ సందర్భంగా బీసీ కుల, ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీ సమాజానికి మండల్ చేసిన సేవలను కొనియాడారు .మండల కమిషన్లో సూచించిన 40 అంశాలలో ఒక్కదాని మాత్రమే అమలు చేసి మిగతా 39 అంశాలను నేటికీ అమలు చేయకపోవడం బీసీ సమాజానికి అన్యాయం చేయడమేనని,

 ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 39 అంశాలను అమలు చేసి తీరాలని  

అందులో భాగంగా క్రిమిలేయర్ విధానాన్నిఎత్తివేయాలని ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని ,చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, జనగణనలో కులగనన చేపట్టాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్గఎన్నికైన పంకజ్ యాదవ్ గారు ,దుడుకు లక్ష్మీనారాయణ, వంగూరు నారాయణ యాదవ్, కాశి రాములు యాదవ్ ,పర్వతాలు, ఆమంచి అంజయ్య ,రమణ ముదిరాజ్, ప్రసన్నకుమార్ ,బత్తుల శ్రీనివాస్, కనకరాజు, బక్కతట్ల వెంకన్న, మామిడి పద్మ ,శంకర్ దుర్గ ,వల కీర్తి శ్రీనివాస్, కోటయ్య, రాచకొండ గిరి ,హరీ తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్ విందు లో పాల్గొన్న నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట 

మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నలగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని 17వ వార్డు ఆర్జాలబావిలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల బలోపేతానికి రంజాన్ పండుగ కానుకగా తోఫాలు అందజేసి గౌరవించుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో 17 వార్డు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు.

ఈనెల 13న ఆవుల రామన్న యాదవ్ జయంతి పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్న వారి మిత్ర బృందం సభ్యులు

ఈనెల 13న ఆవుల రామన్న యాదవ్ 35వ జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆస్పటల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రామన్న యాదవ్ మిత్రబృందం సభ్యులు తిరుమల రాము, మరియు సిరిగిరి సురేష్ రెడ్డిలు ఒక ప్రకటనలు తెలిపారు. ముఖ్యంగా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో రామన్న యాదవ్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వారు లేని లోటు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. వారు మన మధ్యలో లేకున్నా వారి సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని వారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున రామన్న యాదవ్ మిత్రులు, యువకులు యువజన సంఘాల నాయకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు.రక్తదానం చేయదలుచుకున్న్న్న వారు వారి వివరాలు సిరిగిరి సురేష్ రెడ్డి గారికి తెలియజేయాలని వారి సెల్ -9640098219 ను సంప్రదించగలరనిి తెలిపారు.

రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పెండెం ధనుంజయ్ నేత

రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పెండెం ధనుంజయ్ నేత

మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం తాస్కాని గూడెం గ్రామంలో నిర్వహించబడిన రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో బీఎస్పీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ పెండెం ధనుంజయ్ నేత పాల్గొనడం జరిగింది అనంతరం గ్రామ సర్పంచ్ అబ్బనబోయిన లింగయ్య యాదవ్ గారి నివాసానికి వెళ్లి వారిని కలిసి గ్రామ సమస్యలు మరియు గ్రామ అభివృద్ధి పై చర్చించడం జరిగింది మరియు గ్రామ నివాసి అయినా పర్వతాలు యాదవ్ గత రెండు సంవత్సరాలుగా కంటి చూపు సమస్యపై బాధపడుతుంటే వెళ్లి పరామర్శించి అతనికి హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పూర్తి ఉచితంగా చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందుకు సంబంధించి డాక్టర్లతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో నరేష్ యాదవ్, హరీష్ రవితేజ శివ ముదిరాజ్ శ్రీకాంత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికునికి ఆర్థిక సహాయం అందజేసిన నల్లగొండ పద్మశాలి సంఘం నాయకులు

ఆర్థిక సహాయం అందజేత:

కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి, చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట రాజీవ్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు తిరందాసు వెంకటేశం ఇంటి (రేకుల)పైకప్పు ఎగిరిపోవడంతో ఇంట్లోని మగ్గం ఇతర సామాగ్రి వర్షానికి తడిసి భారీ నష్టం జరిగింది.ఈ విషయం తెలుసుకుని నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం తరఫున శ్రీ పొట్ట బత్తిని సత్యనారాయణ గారు తమ వంతు తక్షణ సహాయంగా 10,000 రూపాయల ను బాధిత కుటుంబాన్ని పరామర్శించి అందజేశారు. వారి వెంట జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు స్థానిక పద్మశాలి నాయకులు ఉన్నారు.

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నా పాల్గొన్న నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం జరిగిన ధర్నాలు ముఖ్యఅతిథిగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరియు నీల వెంకటేష్ , రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు జిల్లేపల్లి అంజి, జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, యువజన సంఘం అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్, జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జనార్దన్ గౌడ్ పాల్గొనడం జరిగింది

పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జనగనలో కులగన్న ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డిమాండ్ చేశారు 70 సంవత్సరాల పాలనలో బీసీలను బిచ్చగాడు లాగా చూస్తున్నారు బట్ట మీద పప్పు మీద పెట్రోల్ మీద ప్రతి దాని మీద పన్ను కట్టేది బీసీలు బీసీల బడ్జెట్లో 2000 కోట్లు పెంచడం చాలా దురదృష్టకరం బీసీలకు బిస్కెట్లు కూడా రావు కేంద్రంలో క్రిమిలే విధానాన్ని రద్దు చేయాలని ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేశారు నీల వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న 2656 కులాలు ఉండగా అందులో 36 కులాలు మాత్రమే పార్లమెంటు రాజ్యసభ పార్లమెంటు అసెంబ్లీ మెట్లు ఎక్కారు కానీ మిగతా కులాలు విద్యా ఉద్యోగ ఆర్థికంగా దూరమై సంచర జాతుల్లాగా మిగిలిపోయారు ఇప్పటికైనా రిజర్వేషన్లు అందాలంటే జనగణలో కులగనగా ఏర్పాటు చేయాలి అప్పుడే బీసీలకు తగిన ఫలితం లభిస్తుందని నీళ్ల వెంకటేష్ సద్దేవ చేశారు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కులాల వారిగా లెక్కలు ఎప్పుడైతే తీస్తుందో ప్రతి కులానికి అప్పుడే ఫలాలు అందుతాయని కులాల పేరు చెప్పుకొని రాజకీయ పార్టీలు

పదవులతో ఎంజాయ్ చేస్తున్నారు కానీ బీసీలు మాత్రం జెండాలు మోసుకుంటూ జేజేలు కొట్టుకుంటూ కుర్చీలు మొసుకుంటూ వాళ్లకు బానిసలుగా బ్రతుకుతున్నారు అందుకే బీసీల రాజ్యాధికారం కోసం కృష్ణయ్య గారు చేస్తున్న పోరాటంలో భాగంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితేనే న్యాయమైన డిమాండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్లగొండ: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్మన్

 నల్లగొండ పట్టణ పరిధిలోని 17వ వార్డు ఆర్జాలబావిలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి చూపును మెరుగు పరుచుకోవాలని కోరారు. సంపూర్ణ అంధత్వమే నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కంటి వెలుగు పథకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గ్రామంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో... 13 గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు...

 ఈ సమ్మేళనంలో... జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు...

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... అభివృద్ధి సంక్షేమ పథకాల నిర్వహణలో... వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో.. అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో..ప్రభుత్వం ద్వారా లబ్ధి చెందారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని బంగారు తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యిందని, ఒకప్పుడు కరెంటుకు మంచినీటికి సాగునీటికి, ఎరువులు విత్తనాలకు ఎలాంటి పరిస్థితి ఉందో ఈనాడు ప్రజలు బెరిజు వేసుకోవాలని... ప్రతి బజారులో ప్రతి మూలలో ప్రతి ఇంట్లో చర్చ జరుపుకోవాలని సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని అందుకు... టిఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచవలసిఉందన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో... తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి లింగారావు, జెడ్పిలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు, చీర పంకజ్ యాదవ్, సుంకరి మల్లేష్,గౌడ్ కటికం సత్తయ్య గౌడ్,... తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి , డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, స్థానిక సర్పంచ్, వంటపాక పరశురాములు, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు కందుల లక్ష్మయ్య సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రొట్టెల రమేష్, జిల్లా రైతుబంధు కమిటీ సభ్యురాలు, వనపర్తి జ్యోతి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, కంచర్ల విజయ తదితరులు పాల్గొన్నారు

హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.

హంస ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ.

కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో కస్తూర్బాగాంధీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు హంస ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హంస ఫౌండేషన్ చైర్మన్ చెరుకు లక్ష్మీ గారు హాజరు కావడం జరిగింది వారి చేతుల మీదుగా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది., 

ఈ సందర్భంగా చెరుకు లక్ష్మి గారు మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థుల జీవితానికి మూలస్తంభం లాంటిదని పట్టుదల క్రమశిక్షణ అలవర్చుకొని శ్రద్ధగా చదువుకొని పదవ తరగతిలో మంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు హంస ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం అన్నారు.

*ఈ కార్యక్రమంలో నాయకులు పూల సైదులు కందికంటి నాగేంద్రబాబు టి ఎస్ యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి మురళీధర్ జిల్లా సంపత్ రాజేష్ సిబ్బంది అనిత సబిత ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.