నల్లగొండ లో రెస్టారెంటు ప్రారంభించిన ఎమ్మెల్యే కంచర్ల, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.

నల్లగొండ: రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నల్లగొండ పట్టణ పరిధిలోని హైద్రాబాద్ రోడ్డులో తాజ ఆహార్ రెస్టారెంట్ ను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు ఆలకుంట్ల నాగరత్నం రాజు, పల్లా ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్లు ఉట్కూరి వెంకట్ రెడ్డి, ప్రదీప్ నాయక్, వట్టిపల్లి శ్రీనివాస్, బొజ్జ నాగరాజు, కంకణాల నాగిరెడ్డి, సాయి, రావుల శ్రీనివాస్ రెడ్డి, దోనాల నాగార్జున్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి గార్లు తదితరులు పాల్గొన్నారు.

TSPSC: ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు.. గుర్తించిన ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులు.

TSPSC: ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో 3 ప్రశ్నపత్రాలు.. గుర్తించిన ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులు.

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ ప్రశ్నపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు..

కానీ, ప్రవీణ్‌ దగ్గర ఉన్న పెన్‌ డ్రైవ్‌లో ఏఈ ప్రశ్నపత్రంతో పాటు టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు సిట్‌ అధికారులు అనుమానించారు. దీంతో ప్రవీణ్‌ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించారు.

వాటిని విశ్లేషించిన ఎఫ్ఎస్‌ఎల్‌ అధికారులు ప్రవీణ్‌ పెన్‌ డ్రైవ్‌లో మరి కొన్ని ప్రశ్నపత్రాలు గుర్తించినట్టు సమాచారం. వెటర్నరీ అసిస్టెంట్‌, టౌన్‌ ప్లానింగ్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై టీఎస్‌పీఎస్సీ అధికారులు కానీ, సిట్‌ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎలాంటి వివరాలు వెల్లడించినా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంటుందని, సమాచారం వెల్లడించడం సాధ్యం కాదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 9మంది నిందితులను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. నిందితుడు ప్రవీణ్‌ ఏఈ ప్రశ్నపత్రం రేణుకకు విక్రయించగా.. మిగిలిన ప్రశ్నపత్రాలు ఎవరికి విక్రయించాడనే దానిపై సిట్‌ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

మహిళలను కార్యాలయం పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధం: ఎమ్మెల్సీ కవిత

మహిళలను కార్యాలయం పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధం: ఎమ్మెల్సీ కవిత

 అధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చు. ఈనెల 11న జరిగిన విచారణలో పూర్తిగా సహకరించా. ఈడీ ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలు ఇచ్చా. ఈనెల 11న రాత్రి 8 గంటల వరకు విచారించారు. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని ఈనెల 11న సమన్లు ఇచ్చారు. వ్యక్తిగతంగా రావాలని సమన్లలో పేర్కొనలేదు. నా ప్రతినిధిగా భరత్‌ను ఈడీకి పంపుతున్నాను. నా హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాను. నా పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈనెల 24 న విచారించనుంది.' అని కవిత ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు కవిత తరఫు న్యాయవాది భరత్ మాట్లాడుతూ ఆమెను ఈడీ వేధిస్తోందని ఆరోపించారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కవిత అనారోగ్యంతో ఉన్నారని ఆమెపై అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహిళను ఇంటి వద్దే విచారించాలని తెలిపారు. విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలని ఈడీ చెప్పలేదని.. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని.. 24న విచారణ ఉందని వెల్లడించారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని న్యాయవాది భరత్ స్పష్టం చేశారు.

Tspsc ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజ్ కి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి-sc st విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

Tspsc ఉద్యోగాల పరీక్ష పేపర్ లీకేజ్ కి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని tspsc చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుద్యోగులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్లు తీసుకుంటూ ఉంటే మన నిరుద్యోగుల పొట్ట కొడుతున్న టీఎస్పీఎస్సీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యం వహించిన చైర్మన్ జనార్ధన్ రెడ్డి సస్పెండ్ చేయాలని లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ లు తీసుకొని ఈరోజు ఉద్యోగాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రవన్న బిడ్డలు చదువుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో లీకేజీల వ్యవహారం చాలా దౌర్భాగ్యకరమని దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఇట్టి కారకులైన వారిని పీడియాట్ కేసు నమోదు చేయాలని సీట్ వేగవంతంగా దర్యాప్తు చేసి వారిని శిక్షించాలని బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని యధావిధిగా గ్రూప్ వన్ మరియు ఇతర పరీక్షలు కూడా అభ్యర్థులు పరీక్ష పెట్టాలని రాబోయే రోజుల్లో జరిగే పరీక్షలు పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కఠినంగా నియమ నిబంధనలతో నిర్వర్తించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు మామిళ్ల జానీ యాదవ్ వరికుప్పల విష్ణు వెంకన్న శ్రీధర్ నవీన్ విష్ణు సురేష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.

వినియోగదారుడా మేలుకో నీ హక్కులు తెలుసుకో: వినియోదారుల హక్కుల జోనల్ కార్యదర్శి ఎం డి సాధిక్ పాష

వినియోగదారుడా మేలుకో

నీ హక్కులు తెలుసుకో

తేదీ: 15/03/2023 నాడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త, మరియు వినియోగదారుల హక్కుల జోనల్ కార్యదర్శి శ్రీ ఎం.డి.సాదిక్ పాషా గారు మాట్లాడుతూ సమాజంలో ప్రతిదీ కల్తీ జరుగుతున్న నేపధ్యంలో వినియోగదారుడు చాలా అప్రమత్తంగా ఉండాలని వస్తువు కొనే ముందు తయారీ తేదీ మరియు గడువు తేదీ, నాణ్యత చూసి కొనాలని కొన్న ప్రతి వస్తువుకు తప్పని సరిగా బిల్లు తీసుకోవటం మరిపోవద్దని వస్తువు యొక్క నాణ్యత విషయంలో లోపం ఉంటే వ్యాపారిని నిలదీసే హక్కును వినియోగదారుల హక్కుల చట్టం వినియోగదారునికి కల్పించిందని ఒకవేళ వినియోగదారుడు నష్ట పరిహారం కోరుకుంటే జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్ ను సంప్రదించి స్వయంగా కేసు వేసి తన కేసును తానే వాదించుకునే అవకాశం వినియోగదారునికి ఉన్నది కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి వినియోగదారుల హక్కుల చట్టం గురించి అవగాహన పెంపొందించుకోవాలని అలాగే ప్రభుత్వం మరియు వినియోగదారుల సంఘాలు కూడా తమ వంతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, డి.ఎస్.ఓ,జిల్లా వినియోగదారుల హక్కుల కమీషన్ చైర్మన్, లీగల్ మెట్రాలజి,ఆర్.టి.ఏ. మరియు వివిధ శాఖ అధికారులు పలు వినియోగదారుల సంఘాలు పాల్గొన్నాయి.

_తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదు..

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదు....

మనోలేఖ న్యూస్

వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ విక్రయించినందుకు మహేశ్వరం మాజీ తాసిల్దార్ ఆర్ పి. జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టర్, , ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ వీడియో నెంబర్ 83/2023 కింద కేసు నమోదు అయింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వేనెంబర్ 181లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరం మాజీ తాసిల్దార్ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ , ఈఐపిల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డికి అప్పనంగా అందజేశారు.

ఈ విషయమై దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా XVII అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం సిఐ మధుసూదన్ సెక్షన్ 420, 166 కింద తాసిల్దార్ జ్యోతి సబ్ రిజిస్టర్ ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు తో పాటు తెలంగాణ హైకోర్టు WP37146/2022 ద్వారా విచారణ కూడా కొనసాగుతుంది.

ఇది ఇలా ఉండగా భూముల విషయమై సాక్షాత్తు తాసిల్దార్ పై కేసు నమోదు కావడం తెలంగాణలో ఇది మొట్టమొదటిసారి కావడం విశేషం. మహేశ్వరం పోలీసులు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు.

భూవాదాలు కోర్టులో ఉన్నందువల్ల తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాసిల్దార్ మహ్మద్ అలీ మాట్లాడుతూ. నాగారం లోని సర్వే నెంబర్ 181 విషయం తమ దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని తెలిపారు

జిల్లా పోలీస్ షీటీం ఆధ్వర్యంలో నిర్వహించిన 3.2 K రన్ లో మొదటి 4 బహుమతులు సాధించిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుల

జిల్లా పోలీస్ షీ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన 3.2 K రన్ లో మొదటి 4 బహుమతులు సాధించిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు

ఈరోజు ఉదయం 6 గంటలకు నల్గొండ జిల్లా SP అపూర్వరావు గారి ఆధ్వర్యంలో జిల్లా షీ టీమ్ పర్యవేక్షణలో నిర్వహించిన 3.2 కె రన్ లో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు బాలికల విభాగంలో మద్ది కీర్తన (1st ప్రైజ్) కురిమిల్ల అరుణ జ్యోతి (2nd ప్రైజ్) బాలుర విభాగంలో కురిమిల్ల ఆదిత్య (1st ప్రైజ్) కమ్మంపాటి ధనుష్ (2ndప్రైజ్) సాధించి జిల్లా ఎస్పీ అపూర్వరావు గారి ద్వారా బహుమతులు మెమొంటోలు అందుకున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. వీరు 4గురు ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ సారధ్యంలో గత 2 సంవత్సరాలుగా నిరంతరం క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అనంతరం 5గురు సాంఘిక సంక్షేమ శాఖ A-1 క్రీడాకారులకు SP గారి చేతుల మీదుగా ఫుట్బాల్ షూస్ స్టాకింగ్స్ అందజేయడం జరిగింది.

బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

బిఎస్పి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

నకిరేకల్ మండల కేంద్రంలో నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణ కేంద్రంలో పద్మశాలి భవనంలో ఆశ వర్కర్లకి శాలువాతో సన్మానం, కేక్ కట్ చేసి ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రియదర్శిని మేడి, డాక్టర్ స్నేహలత గార్లు హాజరై వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మునిసిపల్ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలన్నారు.పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. మహిళా దినోత్సవం రోజున మాత్రమే మహిళలను గౌరవించడం కాకుండా ప్రతి రోజు మహిళల పట్ల విధేయత చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, కేతాపల్లి మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి, ఆశ వర్కర్ల జిల్లాఅధ్యక్షురాలు సింగం రేణుక, మండల అధ్యక్షురాలు ఎస్కే సుల్తాన్, నకిరేకల్ మండల అధ్యక్షులు శెట్టిపల్లి శంకర్ కేతపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్ వివిధ గ్రామాల ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఆర్ధిక సహాయమందించిన కస్తూరి ఫౌండేషన్....

అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారిణికి ఆర్ధిక సహాయమందించిన కస్తూరి ఫౌండేషన్....

నల్గొండ జిల్లా చండూర్ మండలం శిర్ధేపల్లి గ్రామానికి చెందిన గంట గీత తండ్రి:నగేష్,నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది.చిన్నప్పటినుంచి చదువుతో పాటు ఆటల్లోనూ మంచి ప్రతిభ కనబర్చుతూ ఉండేది.ఇటీవల యూత్ ఫెడరేషన్ డెవలప్ గేమ్స్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ తరుపున వివిధ రాష్ట్రల జట్టులతో తలపడి ఉత్తమ ప్రతిమ కనబర్చింది.దీంతో భారత దేశం తరుపున ఏప్రిల్ 6 నుంచి నేపాల్ లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన,ఈ అమ్మాయిది నిరుపేద కుటుంభం,వారి తల్లిదండ్రులు రోజువారి కూలీ పనులు జీవనం సాగిస్తున్నారు.నేపాల్ లో జరిగే కబడ్డీ పోటీలకు తన కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా వెళ్లలేనేమో అని నిరాశతో ఉన్న విషయాన్నీ తెలుసుకున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ గారు స్పందించి 15,000/- రూపాయల ఆర్ధిక సహాయాన్ని తమ ఫౌండేషన్ సభ్యులైన శ్రీ పిన్నింటి నరేందర్ రెడ్డి గారి ద్వారా కుటుంభానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గంట రాము గారు ,శ్రీ మారగోని శ్రవణ్ కుమార్ గారు,శ్రీ పేసర్ల హరీష్ గారు,శ్రీ కారింగు సాయి కుమార్ గారు,శ్రీ కనగాని లింగయ్య గారు,శ్రీ గంట రమేష్ గారు,తదితరులు పాల్గొన్నారు.

ఇదో దివ్యాంగుడి ముంపు గోస

వీరి దీనస్థితిగతులపై 'ఈనాడు' గత ఏడాది జులై 20న 'ఇదో దివ్యాంగుడి ముంపు గోస' పేరిట కథనాన్ని ప్రచురించింది. ఇతను శాశ్వత పరిష్కారం కోసం రెండు పడక గదుల ఇల్లు కేటాయించాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోవడం గమనార్హం. సోమవారం జిల్లా సమీకృత ప్రాంగణానికి అతడి తల్లితో సహా వచ్చి మరోసారి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లక్ష్మీనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆయన మంథని ఆర్డీవో వీరబ్రహ్మేంద్రచారికి ఫోన్‌ చేసి రెండు పడక గదుల ఇల్లు మంజూరుకు అర్హతలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదే విషయాన్ని మంథని ఆర్డీవోతో 'ఈనాడు' ప్రస్తావించగా.. అదనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో మహేశ్‌ కుటుంబ, ఆర్థిక పరిస్థితులు సమగ్రంగా పరిశీలించి అర్హుడా? కాదా? అనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

35 ఏళ్ల మహేశ్‌.. కండరాల క్షీణత (మాస్క్యులర్‌ డిస్ట్రోఫీ) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అతడిని చిన్నపిల్లాడిలా సాకుతున్న తల్లి మల్లమ్మకు వితంతు పింఛను, మహేశ్‌కు దివ్యాంగుల పింఛనే ప్రధాన ఆదాయం. దరఖాస్తు చేసుకోవడానికి బెస్తపల్లి నుంచి ఆటోలో ప్రజావాణికి వచ్చిన ప్రతిసారి రానుపోనూ రూ.1,000 ఖర్చవుతున్నాయని, అయినా రోజుల తరబడి తమ ఇల్లు సమస్య పరిష్కారం కావడం లేదని మహేశ్‌ వాపోయారు.