ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి తెరపైకి ఎమ్మెల్సీ కవిత పేరు

ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును వెల్లడించిన ఈడి.. మద్యం విధానం రూపకల్పనలో కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది.

ముందు గానే అమ్ అద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని… ఈ ముడుపులను తిరిగి రాబట్టుకునేందుకు ఇండో స్పిరి ట్స్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారని తెలిపారు ఈడీ అధికారులు.

సౌత్ గ్రూపుకు ఇందులో 65% వాటా ఉందని…ఈ సౌత్ గ్రూపులో కవితతో పాటు శరత్ రెడ్డి, మాగుంట రాఘవ్ ఉన్నారన్నారు. ఇండోస్పిరిట్ లో కవిత తర పున అరుణ్ పిళ్ళై ప్రతినిధిగా వ్యవహరించారు…హోల్సేల్ డీలర్లకు 12 శాతం కమిషన్ , రిటైల్ వ్యాపారులకు 185 శాతం కమిషన్ వచ్చేలా మద్యం పాలసీ రూపొందించారని తెలిపారు ఈడీ అధికారులు. ఈ కమిషన్ను మళ్లించేందుకు ఇండస్పిరిట్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు..కార్టలైజేషన్ ద్వారా అనుచిత లబ్ధి పొందారన్నారు.

కాళేశ్వరంపై ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతం... - మంత్రి హరీష్ రావు

దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని చెప్పారు. శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీష్.. కాళేశ్వరంపై ప్రతిపక్షాలు పదే పదే బురదజల్లె ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం మహా అద్భుతమని ప్రపంచ ఇంజనీర్లు మెచ్చుకుంటుంటే, ఈ ప్రాజెక్టు కోసం చేసిన అప్పులను సాకుగా చూపిస్తూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ద్వారా వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతోందని చెప్పారు. 

మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశమంతా తెలిసేలా చేశారని హరీష్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలలో నీటి కోసం యుద్ధాలు జరిగేవని.. కాని ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండు వేసవిలో కూడా చెరువులు జలకళతో దర్శనమిస్తున్నాయని ఆయన వెల్లడించారు. దేశంలో 49% మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోందని.. ఇంకా 51% మందికి తాగునీరు దొరకడం లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

సికింద్రాబాద్ రైల్‌ నిలయం వద్ద అగ్నిప్రమాదం..

సికింద్రాబాద్ రైలు నిలయంలోని పాత క్వార్టర్స్‌లో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.