Andrapradesh

May 20 2021, 13:46

AP Budget 2021: కోవిడ్‌పై పోరుకు రూ.1000 కోట్లు
  


ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశం కొనసాగుతుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. సభలో పలువురికి సంతాప తీర్మానాలు చేశారు. పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది.* 

 ఇక బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు.. ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు.. కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు.. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్ల చెప్పున కేటాయించింది.

Andrapradesh

May 20 2021, 12:02

2 లక్షల 29 వేల కోట్లలో సంక్షేమానికి పెద్దపీట
  

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం కాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది.
బడ్జెట్‌ కేటాయింపులు ఇలా
బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు
ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు
కాపు సంక్షేమం: రూ.3,306 కోట్లు
ఈబీసీ సంక్షేమం: రూ.5,478 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమం: రూ.359 కోట్లు
మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌: రూ.1,756 కోట్లు
చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు
వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు
విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు
వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు
వైఎస్సార్‌ పింఛన్‌ కానుక: రూ.17 వేల కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసా: రూ.3,845 కోట్లు
జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు
వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమా: రూ.1802 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు
పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు
వైఎస్సార్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు
వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు
ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు
వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు
రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు

Andrapradesh

May 20 2021, 10:47

మట్టి మాఫియా పై అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడులు
  


తూ.గో..పి.గన్నవరం మండలం యర్రంశెట్టి వారిపాలెంలో లంకప్రాంతం నుండి అక్రమంగా మట్టి, ఇసుక తరలింపు.

ఇళ్ల స్థలాలు మేరక పేరుతో అనుమతులు పొంది పక్కదారి పట్టిస్తున్న మట్టి మాఫియా.

పక్క సామాచారంతో అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడులు.

అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ,ఇద్దరు సీఐ లు, గన్నవరం ఎస్ ఐ యర్రంశెట్టి వారి పాలెం మట్టి తవ్వకాల ప్రాంతంలో దాడులు .

6 లారీలు, రెండు జెసిబి యంత్రాలను సీజ్ చేసిన డీఎస్పీ  మాధవరెడ్డి..

పలువురి పై కేసునమోదు చేసిన పోలీసులు..

Andrapradesh

May 20 2021, 10:45

సంక్షేమాన్ని ఆపలేదు: గవర్నర్‌
  


అమరావతి:  ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి  రాజభవన్‌ నుంచే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌గా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉందన్నారు. వైరస్‌ బారిన పడి మృతిచెందిన వారికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొవిడ్‌ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీని కొవిడ్‌ చికిత్సలో చేర్చామన్నారు. 
ఆరోగ్యశ్రీకి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని గవర్నర్‌ తెలిపారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ను ఆయన అభినందించారు. కరోనాతో ఆర్థిక రంగంపై మరోసారి ప్రభావం  పడిందని.. అయినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని చెప్పారు. నాడు-నేడు, వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గవర్నర్‌ వివరించారు. జాతీయ గీతాలాపనతో గవర్నర్‌ ప్రసంగం ముగిసింది.
కాసేపట్లో సభావ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. అనంతరం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సభలో చర్చించనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రూ.2.30లక్షల కోట్లతో 2021-22 రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో సీనియర్‌ మంత్రుల్లో ఒకరు శాసనమండలిలో ప్రవేశపెడతారు. బడ్జెట్‌పై చర్చ అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ఆమోదించి మండలికి పంపించనున్నారు.

Andrapradesh

May 20 2021, 10:29

కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉంది: గవర్నర్
  


అమరావతి: కరోనా ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉందని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కొవిడ్ మృతులకు సంతాపం తెలిపిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతోందన్నారు. కొవిడ్‌తో పరిస్థితులు ఎలా మారాయో అందరికీ తెలుసన్నారు. సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు సెల్యూట్ తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 95శాతం హామీలు పూర్తి చేశామన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని గవర్నర్ తెలిపారు. కరోనాను ఆరోగ్యశీలో చేర్చామన్నారు. ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయించామని వెల్లడించారు. నవరత్నాలు ద్వారా లబ్ధిదారులకే నేరుగా సాయం అందుతోందన్నారు. రూ.1,600 కోట్లతో 36.8 లక్షల మందికి జగనన్న గోరుముద్ద అందిస్తామని తెలిపారు. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మ ఒడి అందుతోందన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా 47లక్షల మందికి కిట్‌లు అందించామని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.

Andrapradesh

May 20 2021, 10:28

భారీగా పెరిగిన డీఏపీ ధ‌ర‌లు.. స‌బ్సిడీపై కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం
  


డీఏపీ ధ‌ర‌లు పెరుగుతూ రైతుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి.. అయితే, కేంద్రం ప్ర‌భుత్వం ఇవాళ రైతుల‌కు అనుకూలంగా చారిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది.. డీఏపీ ఎరువు ధరల‌ను భారీగా పెంచేందుకు నిర్ణ‌యించిన మోడీ స‌ర్కార్.. అదే స‌మ‌యంలో.. పెరిగిన భారాన్ని రైతుల‌పై మోప‌కుండా సబ్సిడీ రూపంలో తామే భ‌రిస్తామ‌ని పేర్కొంది. డీఏపీపై ప్రభుత్వ సబ్సిడీని కేంద్ర స‌ర్కార్ 140 శాతం పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.. అంటే.. ఇప్పటి వరకు డీఏపీ బ్యాగ్‌ ధర రూ. 1,700 ఉండ‌గా.. రూ. 500 సబ్సిడీతో రూ. 1,200కి డీఏపీ ల‌భ్యం అవుతుంది.. కానీ, ఇప్పుడు డీఏపీ ధ‌ర రూ.2400కు చేరింది.. అయితే, రైతులు చెల్లించాల్సింది మాత్రం.. అదే రూ.1200లు.. మిగ‌తా రూ. 1,200 కేంద్రం సబ్సిడీ రూపంలో ఇస్తుంది. రైతుల‌కు డీఏపీకి రూ.1200 చెల్లిస్తే.. మిగ‌తా రూ.1,200లను కేంద్రం నేరుగా కంపెనీలకు చెల్లించ‌నుంది. తాజా నిర్ణయంతో ప్ర‌భుత్వంపై రూ. 14,775 కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎరువుల ధ‌ర‌ల‌పై ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జ‌రిగింది.. అంతర్జాతీయంగా ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన‌వాటి ధరలు పెరగడం వల్ల ఎరువుల ధరలు పెరుగుతున్నాయని చర్చించారు. అయితే, రైతులు పాత ధ‌ర‌ల‌కే రువులు పొందాలని ప్ర‌ధాని మోడీ స్ప‌ష్టం చేశారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ.. డీఏపీ ఎరువుల రాయితీని ఒక్కో సంచికి రూ .500 నుంచి రూ .1,200 కు పెంచాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇది 140 శాతం పెరుగుదల అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవ‌ల డీఏపీలో ఉపయోగించే ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన వాటి ధ‌ర‌లు అంతర్జాతీయంగా 60 శాతం నుండి 70 శాతం వరకు పెరిగాయి. కాబట్టి, డీఏపీ బ్యాగ్ ధ‌ర ఇప్పుడు రూ .2,400గా చేరింది.. పాత స‌బ్సిడీ ప్ర‌కారం.. ఎరువుల కంపెనీలు రూ .500 సబ్సిడీని పరిగణనలోకి తీసుకున్న త‌ర్వాత రూ .1,900కు బ‌స్తా అమ్మాల్సి ఉంటుంది.. కానీ, ఇవాళ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో రైతులకు రూ .1,200కే డిఎపి బ్యాగ్ ల‌భించ‌నుంది.

Andrapradesh

May 20 2021, 10:26

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న 5 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం తిరుమల శ్రీవారిని 5,030 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 18 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2295 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Andrapradesh

May 20 2021, 10:26

కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిబంధనలు విడుదల చేసింది. 
  


కోవిడ్ బారినపడి, పాజిటివ్ వచ్చినవారు రికవరీ అయిన మూడు నెలలకు  మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని.
మొదటి డోసు వేసుకున్నాక కోవిడ్ బారినపడిన, రికవరీ తరువాత మూడు నెలలు గడువు.
ప్లాస్మా ట్రీట్మెంట్ తీసుకున్న కరోనా రోగులు కూడ 3 నెలలు తరువాత వ్యాక్సిన్ వేసుకోవాలి.
ఇతర రోగాలతో సీరియస్ స్టేజ్  లో ICUలో ఉండి, రికవరీ అయినవారు  4 నుండి 8 వారాలు తరువాత వ్యాక్సిన్ వేసుకోవాలి.బ్లడ్ డొనేట్ చేసే వారు రికవరీ అయిన 14 రోజుల తర్వాత RT-PCR టెస్ట్ లో నెగిటివ్ వచ్చాక రక్తదానం చేయవచ్చు.
బాలింతలు అందరూ వ్యాక్సిన్ వేసుకోవచ్చు.

Andrapradesh

May 20 2021, 10:25

AP Budget 2021: అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం
  


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం ప్రారంభమైంది. తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ముందుకు రాబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు.

ఉదయం 11 గంటలకు  ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్‌ను హోంమంత్రి సుచరిత ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్‌  ప్రవేశపెట్టనున్నారు.

Andrapradesh

May 20 2021, 08:24

అమిత్ షాతో ఎంపీ రఘురామ కృష్ణరాజు భార్య, పిల్లలు భేటీ..        
  


ఆ విషయాలన్నీ పూసగుచ్చినట్లు.. సంచలనం!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు భార్యా,పిల్లలు బుధవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
    
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సతీమణి రమాదేవి,కూతురు ఇందు ప్రియదర్శిని,కుమారుడు భరత్‌ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.రఘురామపై జగన్‌ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు.తన తండ్రికి సంబంధించి జరిగిన విషయాలన్నీ అమిత్ షా‌కు పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలను అమిత్‌షాకు ఇందు ప్రియదర్శిని,భరత్‌ వివరించారు.అనంతరం అమిత్‌షాకు ఇరువురు కలిసి వినతిపత్రం అందజేశారు.

అమిత్ షాతో ఎంపీ రఘురామ పిల్లలు భేటీ.

కాగా,పథకం ప్రకారం ప్రభుత్వాన్ని,ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ 12/ 2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణ రాజు,A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానల్‌ను సీఐడీ ఎఫ్‌ఐర్‌లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచింది. 

అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది.

అయితే, సీఐడీ కస్టడీలో తనను కొంతమంది కొట్టారని ఎంపీ రఘురామ ఆరోపించారు.దీంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు సూచించగా.. 

గుంటూరు జీజీహెచ్‌లో నిర్వహించి రిపోర్ట్ అందజేశారు.రఘురామ మాత్రం వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో..అక్కడ పరీక్షలు నిర్వహించి రిపోర్టులను సీల్డ్ కవర్‌లో తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టుకు అందజేశారు.                  

ఈ రిపోర్టులో ఏముందనేంది ఉత్కంఠరేపుతోంది.