Andrapradesh

May 12 2021, 17:55

కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
 


13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాల ఏర్పాటు
విజయవాడ: కోవిడ్ కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకూ సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడి కోసం పగటి పూట కర్ఫ్యూని పటిష్టంగా అమలు చేస్తున్నప్రభుత్వం.. కరోనా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. అలానే మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగతున్న సంగతి తెలిసిందే.

Andrapradesh

May 12 2021, 13:21

కాంట్రాక్ట్ నర్సులను పర్మినెంట్ చేయాలి- కేజీహెచ్ నర్సులు
 


విశాఖ:


నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా... ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ... కెజిహెచ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట నర్సులు బుధవారం శాంతియుతంగా నిరసన తెలిపారు. కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సుల, నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌ కె.మదీనా మాట్లాడుతూ... ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో నర్సులుగా విధులు నిర్వహిస్తున్నవారికి నెలకు రూ.22,500 జీతం ఇస్తున్నారని చెప్పారు. 2020 సెప్టెంబర్‌ లో కొత్తగా కాంట్రాక్టు నర్సులను తీసుకున్నారని, వారికి నెలకు రూ.34 వేలు వేతనంగా ఇస్తున్నారని తెలిపారు. వారిలాగే తమకు కూడా రూ.34 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో 160 మంది కాంట్రాక్ట్‌ పద్ధతిలో నర్సులు పని చేస్తున్నారని, రాష్ట్రంలో 1000 మంది పనిచేస్తున్నారని ఎస్‌కె.మదీనా పేర్కొన్నారు.

Andrapradesh

May 12 2021, 13:17

ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
 


అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20 నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2021-22కు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగముండగా.. అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి. అసెంబ్లీలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, మండలిలో చల్లా రామకృష్ణ రెడ్డిలకు సంతాపం ప్రకటించనున్నారు.

Andrapradesh

May 12 2021, 13:03

కరోన బాధితులకు చికిత్స అందిస్తూ పల్లెపోగు శోభరాణి మృతి 
 


హైదరాబాద్ ఈయస్ఐ హాస్పిటల్ లో వైధ్యురాలిగా పని చేస్తూ కరోనా బారిన పడి పల్లెపోగు శోభారాణి (46) మృతి బాధాకరమని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు.
వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మాజీ ఐఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ నాయకులు పల్లెపోగు సీమొను కుమారుడు పల్లెపోగు వెంకట్రావు సతీమణి పల్లెపోగు శోభారాణి కరోణ బాధితులకు చికిత్స అందిస్తూ వైరస్ బారినపడి మృతి చెందటం కలచి వేసిందన్నారు.
వైద్యవృత్తిని దైవంగా భావిస్తూ, ఎంతో మంది కరోన బాధితులకు నేనున్నానంటూ వైద్య సేవలు అందించారు అని కొనియాడారు.
కరోన ఆపత్కాలంలో ఆమె అందించిన సేవలు నిరుపమానమైనవని గుర్తు చేశారు.
మృతురాలి భర్త పల్లెపోగు వెంకట్రావు కూడా వైద్యులు గా ఎంతోమంది నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.
మృతురాలి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
మృతురాలు పల్లె పోగు శోభారాణి మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కోటేరు ముత్త రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆవుల రమేష్ బాబు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బొమ్మిశెట్టి భాస్కర రావు. చౌటుపల్లి సర్పంచ్ పల్లె పోగు పుల్లయ్య, ఉపసర్పంచ్ కోటా సంగయ్య తో పాటు పలువురు నాయకులు సంతాపాన్ని, సానుభూతి తెలిపారు.

Andrapradesh

May 12 2021, 12:59

నడిరోడ్డుపై పడిగాపులు...
 


కృష్ణాజిల్లా జగ్గయ్యపేట :

జగ్గయ్యపేట మండలంలో గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తెలంగాణ లాక్ డౌన్ లో భాగంగా ఏపీ లోకి అనుమతులు లేకుండా వాహనాలను రానివ్వకుండా నిలుపుదల చేసిన పోలీసులు

అనుమతులు వుంటేనే ఏపీలో కి రానిస్తామంటూ భీష్మించుకుని కూర్చున్న పోలీసులు

దీంతో 1 కిలోమీటర్ల వరకు నిలిచిపోయిన ట్రాఫిక్

ఇటు ఏపీ నుండి కూడా సరైన అనుమతులు ఉంటేనే అటు తెలంగాణాలో కి పంపిస్తున్న పోలీసులు 

ఈ రెండు రాష్ట్రాల నియమ నిబంధనల మధ్య తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

ఈ నిబంధనతో ఇటు ఏపీ అటు తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు

Andrapradesh

May 12 2021, 11:49

ప్రపంచ నర్సులు దినోత్సవం సందర్భంగా నర్సులందరికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
 


కరోనా సమయంలో నర్సులు సేవలు అనిర్వచనీయం 

కరోనాపై పోరాటంలో నర్సులు సంకల్పం స్ఫూర్తిదాయకం 

ప్రాణాలు పణంగా పెట్టి ప్రజాసేవ చేస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిది 

టీడీపీ అధినేత చంద్రబాబు

Andrapradesh

May 12 2021, 11:45

అంజాద్ బాషా, డెప్యూటీ సీఎం
 

కోవిడ్ కర్ఫ్యూ నేపథ్యంలో రంజాన్ నిర్వహణపై మార్గదర్శకాలు విడుదల చేసిన మైనారిటీ శాఖ
బహిరంగ ప్రదేశాలు, ఈద్గాల్లో ప్రార్థనలు నిషేధం
ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే ప్రార్థనలు నిర్వహించాలి,
ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు ఇంటి లోనే ప్రార్థనలు చేసుకోవాలి,
మసీదులో 50 మందికి మించి ప్రార్థనలకు హాజరు కావద్దు.
తప్పనిసరిగా ప్రార్థనలు సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించాలి,
చిన్న పిల్లలు, వృద్ధులు, దగ్గు జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు ప్రార్ధనలకు రావొద్దు.

Andrapradesh

May 11 2021, 17:38

గనిలో పేలుడు: వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి అరెస్ట్‌
 


కలసపాడు: కడప జిల్లా మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల్లో పేలుడు ఘటనలో పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ వైఎస్‌ కుటుంబానికి చెందిన ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. గనిలో వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌ పులివెందుల నుంచి కలసపాడు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పులివెందులలో వైఎస్‌ ప్రతాప్‌రెడ్డికి చెందిన మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి జిలెటన్‌ స్టిక్స్‌ తరలించినట్లు తేల్చారు. ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టకుండా తరలించారంటూ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ప్రతాప్‌రెడ్డి పెదనాన్న. ఆయనకు పులివెందుల, సింహాద్రిపురం, లింగాల పరిసర ప్రాంతాల్లో గనులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేలుడుకు వినియోగించే జిలెటన్‌ స్టిక్స్‌కు మ్యాగజైన్‌ లైసెన్స్‌ ప్రతాప్‌రెడ్డికి ఉంది. ఈ క్రమంలో పులివెందుల నుంచి మామిళ్లపల్లె గనులకు జిలెటన్‌ స్టిక్స్‌ తరలించి అక్కడ అన్‌లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది కూలీలు మృతిచెందారు. ఈ కేసులో ఇప్పటికే గని యజమాని నాగేశ్వర్‌రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు.

Andrapradesh

May 11 2021, 17:04

ఎంత శ్రమిస్తున్నా కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు: సీఎం జగన్
 


'స్పందన'పై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
తిరుపతి రుయా ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం
తామే బాధ్యత వహించాల్సి వస్తోందని ఆవేదన
తమిళనాడు నుంచి ట్యాంకర్ ఆలస్యమైందని వెల్లడి
కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
ఏపీ సీఎం జగన్ 'స్పందన'పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ లభ్యత లేక 11 మంది చనిపోవడంపై వివరణ ఇస్తూ, కొవిడ్ కట్టడి, ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ అందజేత వంటి అంశాలపై తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వివరించారు. కొన్ని అంశాలు మన చేతుల్లో ఉండవు అని, అటువంటి సంఘటనలకు కూడా తామే బాధ్యత వహించాల్సి వస్తోందని అన్నారు. కొవిడ్ తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని, ఈ నేపథ్యంలో కొన్ని బాధాకరమైన ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. "ఒక్కోసారి ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా నష్టాలు జరుగుతున్నాయి. వాటికి కూడా మనమే బాధ్యత వహించకతప్పదు. ఇవాళ ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. నిన్న కూడా ఆరు ఖాళీ ట్యాంకర్లను ఒడిశా పంపి అక్కడ్నించి ఆక్సిజన్ నింపుకుని వెనక్కి తీసుకువస్తున్నాం. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ ను కొనుగోలు చేసి నౌకల ద్వారా తెప్పిస్తున్నాం" అని వివరణ ఇచ్చారు. అయితే కొందరు రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. వ్యాక్సిన్ల పరిస్థితిపై రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. డబ్బులు తీసుకుని వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరినా కంపెనీలు తీసుకోవట్లేదని వెల్లడించారు.

Andrapradesh

May 11 2021, 17:00

పోతిన వెంకట మహేష్.. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
 


ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎపీలో కరోనాతో ప్రజలు అల్లాడుతున్నారు

వెల్లంపల్లి మంత్రిగా ఉండి కరోనా సమయంలో కూడా రాజకీయాలు చేయడం సిగ్గు చేటు

మిమ్మలను ఓట్లేసి గెలిపించింది... ఇంట్లో కూర్చోవడానికేనా మంత్రిగారూ

పశ్చిమ నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్లను ఎందుకు ఏర్పాటు చేయలేదో మంత్రి వెల్లంపల్లి సమాధానం చెప్పాలి 

అసలు కరోనా టెస్ట్ లు, రిపోర్టులు ఎప్పుడు వస్తాయో కూడా కనీసం సమాచారం చెప్పలేకపోతున్నారు

జిల్లా మంత్రిగా విజయవాడలో ఒక్క సమీక్ష అయినా చేశారా

ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఏర్పాట్లను కూడా పరిశీలించలేకపోయారా

వైసీపీ గొప్పగా చెప్పుకునే వార్డు వాలంటీర్లు వ్యవస్థ ఏం చేస్తుంది

రెండేళ్లుగా కనీసం పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ది పనులు కూడా చేపట్టలేదు

ఎంతసేపూ ఆలయాలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేయడం...

స్థలాలను కబ్జా చేయడం పైనే వెల్లంపల్లి దృష్టి అంతా

మొదటి కరోనా వేవ్ లో కూరగాయల పంపిణీ పేరుతో దోపిడీ చేశారు

రెండో వేవ్ లో అర్చక పోస్టుల భర్తీతో లక్షల వసూళ్లు చేస్తున్నారు

కరోనా ... అందరినీ కష్ట పెడుతుంటే .. వెల్లంపల్లికి మాత్రం కాసులు కురిపిస్తుంది

పెన్షన్లు, రేషన్ ఇచ్చినప్పుడు పొటోలు దిగే కార్పోరేటర్లంతా ఇప్పుడు ఎక్కడ

కరోనాతో బాధ పడుతున్న వారికి కనీసం సాయం అందించారా

విశాల ప్రాంగణం ఉన్న కెబీయన్ కళాశాలలో వ్యాక్సిన్ కేంద్రం పెడతారా.. బెడ్ లు ఏర్పాటు చేయరా 

శాశ్వత వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటుకు నా కార్యాలయం ఇస్తా.. తీసుకోండి

అవసరమైతే.. ఇందుకు సొంత ఖర్చులు భరించేందుకు సిద్దంగా ఉన్నాను

పది ఎకరాల భూమి ఉన్న కేబీయన్ కాలేజీ ప్రాంగణంలో పడకలు ఏర్పాటు చేయండి

వ్యాక్సిన్, ఇంజక్షన్, బెడ్లు కొరతతో ప్రజలు పరుగులు పెడుతున్నా... పట్టించుకోరా

స్మశానాలలో అంత్యక్రియలకు కూడా టోకెన్ తీసుకోవాల్సిన దుస్థితి

ప్రజలు కోరుకున్నది ఇటువంటి పాలన కాదు జగన్ రెడ్డి గారూ.. 

ఓట్లు వేసిన ప్రజలకు.. ఇదేనా మీరు అందించే పాలన

విపత్కర పరిస్థితులలో సేవ చేయాల్సిన వారు పత్తా లేకుండా పోతారా

రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందకపోవడం ప్రభుత్వ వైఫల్యమే

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే.. ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతారా

ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. వెంటనే ప్రజల అవసరాలకు అనుగుణంగా వైద్యపరమైన చర్యలు చేపట్టాలి

మంత్రి వెల్లంపల్లి రాజకీయాలు మాని.. కోవిడ్ సెంటర్ ను నీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలి

విపత్కర పరిస్థితులలో ఇంట్లో దాక్కుంటే.. ప్రజలు తరిమికొడతారు

ప్రభుత్వం వెంటనే వ్యాక్సిన్ తెప్పించి.. అర్హులైన వారికి క్రమపద్దతిలో వేయాలి