TSNews

Mar 26 2020, 07:40

విద్యా సంవత్సరం ముగిసినట్టేనా..!

లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌ 14 వరకు విద్యాసంస్థల మూత
పరీక్షలు ఉండవని ప్రకటించిన కేంద్రీయ విద్యాలయ సమితి
గత ఫలితాల ఆధారంగా ఎగువ తరగతులకు..?
ఈ విద్యా సంవత్సరంలో తరగతులు లేనట్టేనా..? ఇప్పుడు ఇదే ప్రశ్న  విద్యావర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు.. ఇలా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికప్పుడు ప్రభుత్వం, విద్యాశాఖ నుంచి ఎలాంటి నిర్ణయం ఉండకపోయినా.. తాజా పరిస్థితులు చూస్తే.. ‘ఈ విద్యా సంవత్సరం ఇక్కడితో ముగిసినట్టే..’ అన్నట్లుగా మారింది.
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో 7452 పాఠశాలలున్నాయి. ఈనెల 31వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలు బంద్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 1 తర్వాత పరిస్థితిపై ఈలోపు ప్రకటన వస్తుందని విద్యావర్గాలు ఎదురుచూశాయి. మంగళవారం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. అంటే వచ్చే నెల 14వ తేదీ వరకు అత్యవసర సర్వీసులు మినిహాయించి మిగిలివన్నీ బంద్‌ కానున్నాయి. విద్యాసంస్థలు సైతం ఎట్టి పరిస్థితుల్లో తెరిచేందుకు వీల్లేదు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 14వ తేదీ అంటే వేసవి సెలవులు సమీపిస్తాయి. వాస్తవానికి రెగ్యులర్‌గా తరగతులు నడిస్తే ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలి. ఎండల తీవ్రతను బట్టి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ఏటా ముందుకు తీసుకొస్తోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి ఏప్రిల్‌ 15 నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేసినా.. వారం రోజుల వ్యవధిలో తరగతుల నిర్వహణ ఎంతవరకు సాధ్యమనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం కొనసాగడం దాదాపు అసాధ్యమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ‘‘ఇదే పరిస్థితి కొనసాగితే విద్యాసంవత్సరం కొనసాగడం సాధ్యం కాకపోవచ్చు. అదీగాక ఏప్రిల్‌ 15 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా.. లేదా అన్నది చూడాలి. కొవిడ్‌-19 వ్యాప్తిని బట్టి ఇది తెలుస్తుంది. ఒకటి నుంచి 9వ తరగతి వరకు తరగతుల నిర్వహణ ఉండదని అనుకుంటున్నాం’ అని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ ‘ఈనాడు’కు వివరించారు.
పరీక్షలు లేకుండానే పైతరగతులకు
ఈ ఏడాది ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలు లేకుండానే ఎగువ తరగతులకు పంపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా తరగతుల విద్యార్థులకు సిలబస్‌ పూర్తయ్యింది. వచ్చే నెలలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించకపోతే పరీక్షలు జరిగే అవకాశం లేదు. అదీగాక ఏప్రిల్‌ 15 నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే వేసవి సెలవులకు వారం రోజులే ఉంటుంది. ఈ వ్యవధిలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వడం అసాధ్యమే..! ఇందుకు కనీసం 10-12 రోజులు పడుతుంది. ఈ దృష్ట్యా పరీక్షల నిర్వహణ ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
కింకర్తవ్యం..?
దేశంలో పరిస్థితుల దృష్ట్యా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండా ఎగువ తరగత

TSNews

Mar 25 2020, 22:35

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వసతిలేని వారికి నిత్యావసరాల కోసం ఆందోళన వద్దు: కేటీఆర్‌

హైదరాబాద్‌
By Sridhar Dasari

  లాక్‌డౌన్‌ నేపథ్యంలో వసతిలేని వారికి నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్‌ రూమ్‌లో పురపాలక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. వసతి లేని వారికి నైట్‌షెల్టర్లలో భోజన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వసతి గృహాల్లో నైట్‌షెల్టర్లకు ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. భోజనాన్ని రూ.5కే పగలూ, రాత్రి అందించాలని సూచించారు. అత్యవసర వైద్యానికి ఎవరైనా సాయం కోరితే ప్రత్యేక చొరవ తీసుకోవాలని.. ప్రస్తుతం ఉన్న 150 కేంద్రాలకు అదనంగా నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. నిత్యావసరాలతో పాటు ఔషధాలు, పాలు, కూరగాయలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చని ప్రజలకు కేటీఆర్‌ సూచించారు. అధికారులతో సమీక్షకు ముందు గోల్నాకలో నైట్‌షెల్టర్‌ను మంత్రి పరిశీలించారు. అక్కడి పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

TSNews

Mar 25 2020, 22:27

కరీంనగర్‌లో నిబంధనలు మరింత కఠినం

కరీంనగర్‌ జిల్లా
By Sridhar Dasari

   కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లాలో చేపట్టిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్‌ కె.శశాంక‌, సీపీ కమలాసన్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ... ప్రమాదకర జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. నిన్న 1500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా అనుమానితులను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నామని వివరించారు. కొంతమందిని కరీంనగర్‌లోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌లో ప్రమాదకర జోన్‌గా ప్రకటించిన ప్రాంతం నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిన్న..చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరిస్తామని కలెక్టర్‌ తెలిపారు. నిత్యావసర సరకులు విక్రయించే కిరాణా దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు. అమ్మకం దారులు, కొనుగోలు దారులు సహకరించాలని కోరారు.
సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఇండోనేసియా వాసులు తిరిగిన ప్రాంతాలను గుర్తించామని, మిగతా జిల్లాల కంటే కరీంనగర్‌ జిల్లాలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందున్నారు. ఈరోజు నుంచి నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామని సీపీ స్పష్టం చేశారు.

TSNews

Mar 25 2020, 22:11

అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి పాస్‌లు : సీపీ

హైదరాబాద్‌
By Sridhar Dasari

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 21 రోజులు తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజలు సహకరించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అందరం క్రమశిక్షణ, ఐకమత్యంతో మెలగాలి. లాక్‌డౌన్‌ సమయంలో సౌకర్యమంతమైన వాతావరణం ఉండదు.  10వేల మంది నగర పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారు. ఈ రోజు నాలుగుగంటల పాటు ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించాం.  సమీక్ష తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అత్యవసర విభాగాల్లో పనిచేసిన వారికి పాస్‌లు ఇస్తాం. హైదరాబాద్‌కు సంబంధించి 900 పాస్‌లు ఇచ్చాం. పాస్‌ల కోసం ఆన్‌లైన్‌లో ఈ-మెయిల్‌ చేయండి. ద్వారా పాస్‌ల కోసం వినతులు పంపాలి. అలాగే, 9490616780 నంబర్‌కు వాట్సప్‌ సందేశాలు పంపొచ్చు’’ అని వివరించారు. 

TSNews

Mar 25 2020, 22:04

మీడియా కు ప్రత్యేకమైన పాస్ లు జారీ చేస్తాం: ఎస్పి

గద్వాల

   కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ని అమలు చేయడం జరిగిందని గద్వాల ఇంచార్జీ ఎస్పి అపూర్వ రావు తెలిపారు. మీడియా మిత్రుల పాత్ర చాలా కీలకమైందని,ఈ లాక్ డౌన్ సందర్భంగా మీడియా మిత్రులకు గుర్తించలేకపోవడంతో తమ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక మైన పాస్ లు జారీ చేస్తామని తెలిపారు.దీనికోసం గద్వాల డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వద్ద మీడియా మిత్రుల పేర్లను ఇచ్చి పాస్ లను తీసుకోవాలని ఆమె మీడియా మిత్రులకు సూచించారు.

TSNews

Mar 25 2020, 21:50

కరోనా కట్టడిలో కామారెడ్డి ప్రథమస్థానం - వేముల ప్రశాంత్‌రెడ్డి

కామారెడ్డి జిల్లా
By Sridhar Dasari

   గ్రామాలను కట్టడి చేయడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో ఉందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని జనహిత భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలందరి సంక్షేమం కోసమే ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తోందని వివరించారు. కరోనా వైరస్‌ను అరికట్టడానికి అందరి సహకారం అవసరమన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. స్వీయ నియంత్రణ పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. జిల్లా యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేసి వ్యాధి నియంత్రణకు కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని 525 గ్రామ పంచాయతీల్లో రోడ్లను ప్రజలు కట్టడి చేసినట్లు పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులను వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తే జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
    ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్‌ గోత్రే, ప్రత్యేక కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

TSNews

Mar 25 2020, 21:39

హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించొద్దు: తెలంగాణ డీజీపీ

హైదరాబాద్‌
By Sridhar Dasari

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్‌డౌన్‌ ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని డీజీపీ స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు.

TSNews

Mar 25 2020, 21:17

'లాక్ డౌన్' పరిస్థితులను ఆకస్మికంగా తనిఖి చేసిన ఉప సభాపతి టి. పద్మరావు గారు  

సికింద్రాబాద్ 
✍గవ్వల శ్రీనివాసులు
Date: 2020-03-25


     
    కరోనా వైరస్ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సికింద్రాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 'లాక్ డౌన్' పరిస్థితులను ఉప సభాపతి టి. పద్మరావు ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను తెలుసుకుకున్నారూ.అనంతరం నామాలగుండు లోని తన క్యాంపు కార్యాలయంలో జి. హెచ్ఎంసి  ఉప కమీషనర్ రవి కుమార్, చిలకలగూడ ఇనిస్పెక్టర్ 
 బలగంగి రెడ్డి, ఇతర అధికారులు, కార్పోరేటర్ సామల హేమ, ఇతర నాయకులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భయంకరమైన కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం పకడ్బంది ఏర్పాట్లు జరుపుతోందని, వ్యక్తిగత పరిశుబ్రత, తగినంత దురాన్ని పాటించడం ద్వారా ప్రజలు సహకరించాలని  పద్మారావు గౌడ్ వివరించారు. లాక్ డౌన్ కారణంగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఇబ్బంది పడకుండా కనీసం ఓ 10 వేల మంది దినసరి కూలీలకు భోజనం సమకూర్చాలని నిర్ణయించామని, అవసరమైన పక్షంలో వ్యక్తిగత నిధులను సైతం అందించి పేద ప్రజలకు ఉచితంగా భోజనాన్ని సమకూరుస్తామని పద్మారావు గౌడ్ ప్రకటించారు. అదే విధంగా ఓ దయగ్నస్తిక్ సెంటర్ సహకారంతో మాస్కులు, శనితైజర్ లను ఉచితంగా ప్రజలకు అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఆపద సమయంలో ప్రజలు తము అండగా నిలుస్తామని,  ఎవ్వరు ఆందోళనకు గురికాకుండా ప్రజలు ప్రభుత్వం తో సహకరించి కరోనా వ్యాప్తిని నివారించేందుకు సహకరించాలని పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు.ఉచితంగా మాస్కులు, శానిటైజర్ల పంపిణిసికింద్రాబాద్ పరిధిలోని నామాలగుండు, సితఫలమంది, ఉప్పరి బస్తి తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పర్యటించి సన్ రైజ్ డయాగ్నొస్టిక్ సంస్థ సహకారంతో మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా పంపిణి చేశారు.

TSNews

Mar 25 2020, 21:09

కరోనా వైరస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పాటించాలి - ఎంఆర్ఓ మాధవి రెడ్డి

సికింద్రాబాద్ కంటోన్మెంట్
తిరుమలగిరి
✍గవ్వల శ్రీనివాసులు
Date: 2020-03-25
      
   కరోనా వైరస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు పాటించాలని, వైరస్ బారిన పడకుండా ఉండాలని కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి ఎంఆర్ఓ శ్రీమతి మాధవి రెడ్డి వ్యవసాయ దారులకు, హమాలీలకు సూచించారు. 
ఈ రోజు ఉదయం బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మాధవి రెడ్డి తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ టి. ఎన్. శ్రీనివాస్, డైరకర్లు పి. అరుణ్ యాదవ్, మన్నే ఉదయ్ యాదవ్, బాలమల్లేష్ కురుమ, తదితరలు టీఆర్ఎస్ నాయకులు సిహెచ్. పోచయ్య, దయ్యాల మల్లేష్ లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు, వ్వవసాయదారులు, హమాలీల వద్దకు వెళ్ళి కరీనా వైరస్ గురించి వివరంగా వివరించారు ఎంఆర్ఓ మాధవి రెడ్డి. మార్కెట్ ప్రాంగణం అంతా ఎల్లవేళల శుభ్రంగా ఉండాలని, పారిశుధ్యం లోపించకుండా చూడాలని చైర్మన్ శ్రీనివాస్ తో ఈ సందర్భంగా తెలిపారు. మాస్కులు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో కూడా చూడాలని ఆమె చెప్పారు. సుమారు రెండు గంటల పాటు ఈ ఫ్రాంగణంలో కలియదిరిగారు.

TSNews

Mar 25 2020, 21:04

ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకుని జంపన ప్రత్యేక పూజలు 

సికింద్రాబాద్ కంటోన్మెంట్
✍గవ్వల శ్రీనివాసులు 
Date: 2020-03-25
      
  కరోనా వైరస్ మహమ్మారిని తరమి కొట్టి దేశప్రజలను కాపాడాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ దేవ దేవుడైన శ్రీ సీతారాముల స్వాముల వారనివేడుకుంటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకుని ఈ రోజు కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్ పల్లి లోని కంసరి బజార్ లో గల శ్రీ రామ్ మందిరం లో ఈ మేరకు పూజలు జరిపించారు. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతతంగా విస్తరీస్తున్న ఈ కరోనా మహ‌మరిమరి నుంచి ప్రజలను కాపాడాలని, దాన్ని తరిమి కొట్టమని ఆ శ్రీ సీతారాముల, వారిని వేసుకోవడం జరిగిందని జంపన ప్రతాప్ మీడియా కు తెలిపారు.ప్రతాప్, వెంట ఆయన అనుచరులు కూడా ఈ పూజలో పాల్గొన్నారు.