నల్లగొండ లో ముగిసిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలు
నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడల పోటీలు సోమవారం ముగిసాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా, బాలికల విభాగంలో అసిఫాబాద్ జిల్లా విజయం సాధించి రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ ఎండి అక్బర్ అలీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, గౌరవ అతిథిగా జిల్లా గ్రంధాలయ చైర్మన్
డా.హఫీజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ కోకో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాది కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఈ పోటీలలో 33 జిల్లాల నుండి బాలికలు 450 మంది, బాలురు 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో ద్వితీయ స్థానం నల్గొండ జిల్లా సాధించగా, బాలుర విభాగంలో మేడ్చల్ మల్కాజిగిరి ద్వితీయ స్థానం పొందారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కోచ్ మేనేజర్లు, టెక్నికల్ అఫీషియల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ముఖ్య అతిథి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ, గ్రామీణ క్రీడాకారులకు మంచి సదుపాయాలు కల్పిస్తూ మున్ముందు కూడా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నల్గొండలో నిర్వహిస్తామని తెలిపారు.
8 hours ago
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.2k