/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz వారికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు Raghu ram reddy
వారికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు

సినీ నటి కాదంబరీ జత్వానీ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని, జత్వానీ అక్రమ అరెస్టు వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీయాలంటే నిందితులను అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉందంటూ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో శుక్రవారం వాదనలు వినిపించారు. తనను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారంటూ జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్‌లు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, విజయవాడ వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం మాజీ సీఐ ఎం. సత్యనారాయణలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ చట్ట నిబంధనలు పాటించాల్సిన పోలీస్ ఉన్నతాధికారులే ఉల్లంఘనలకు పాల్పడినందున వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. 

జత్వానీ తరపున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభుదాస్, నర్రా శ్రీనివాసరావులు వాదనలు వినిపిస్తూ .. జత్వానీపై తప్పుడు కేసు నమోదు, అరెస్టు వెనుక నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులుది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఆయన మౌఖిక ఆదేశాలతో ముంబయి వెళ్లి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేసి విజయవాడ తీసుకువచ్చారని వివరించారు. జత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నట్లు ప్రాధమిక ఆధారాలున్నాయని తెలిపారు. 

పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, వినోద్ కుమార్, దేశ్‌పాండే, పట్టాభి తదితరులు వాదనలు వినిపించారు. ఫోర్జరీ దస్త్రాలతో భూమిని విక్రయించేందుకు జత్వానీ ప్రయత్నించారని కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఫిబ్రవరిలో కేసు నమోదైందని తెలిపారు. దీనిపై నమోదైన కేసు విచారణ పూర్తి కాకుండానే జత్వానీ ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదు చేయడం చెల్లదని పేర్కొన్నారు. 

ఈ కేసులో ఏ 1 విద్యాసాగర్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యిందని, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. బాధితురాలు జత్వానీ తరపు న్యాయవాదుల వాదనలు కొనసాగింపుకు, పిటిషనర్ల ప్రతివాదనల కోసం కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ విఆర్‌కే కృపాసాగర్ ప్రకటించారు. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు.

మరో అల్పపీడనం

దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో పలు జిల్లాలను రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు వానలు ముంచెత్తాయి.

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో పలు జిల్లాలను రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు వానలు ముంచెత్తాయి. ఈ నెల 11, 12 తేదీల్లో కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే 16 నుంచి అల్పపీడనం ప్రభావంతో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఈసారి కోస్తాలోని మధ్య ప్రాంతాల వరకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉన్న అల్పపీడనం శనివారం నాటికి బలహీనపడనుండగా, ఆదివారం మరొకటి ఏర్పడనుంది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఇప్పటికే రెండు తుఫాన్‌లు రాగా, మూడు రోజుల క్రితం ఒక అల్పపీడనం వచ్చింది. ఈ నెల 15న మరొకటి రానుంది. ప్రస్తుతం ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రత్యేకించి బంగాళాఖాతంలో అల్పపీడనాలు తుఫాన్‌లకు అనువుగా ఉపరితల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు విశ్లేషించారు. సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలులతో తమిళనాడు, దానికి ఆనుకుని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడులో కొన్నిచోట్ల 50 సెం.మీ. భారీ వర్షపాతం నమోదవగా, ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనంతో శుక్రవారం తమిళనాడులోని ఒక ప్రాంతంలో 54 సెం.మీ. వర్షపాతం నమోదైందని, అనేకచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిశాయని వివరించారు.

గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌లో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో అల్పపీడనంగా బలహీనపడి శుక్రవారం నాటికి లక్షద్వీప్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది శనివారం నాటికి పూర్తిగా బలహీనపడనుంది. అయితే శనివారం నాటికి దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో ఉపరితల ఆవవర్తనం ఆవరించనున్నది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. తరువాత ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 17 కల్లా తమిళనాడు తీరం దిశగా రానుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ అల్పపీడనం మధ్య ఉత్తర తమిళనాడు వైపు వస్తుందని కొన్ని మోడళ్లు చెబుతున్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 16 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. 17 నుంచి 19 వరకూ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలో గుంటూరు జిల్లా వరకు వర్షాలు విస్తరిస్తాయని కొన్ని మోడళ్లు చెబుతుండగా, ఉత్తర కోస్తాలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని మరికొన్ని మోడళ్లు అంచనా వేస్తున్నాయి. కాగా, శుక్రవారం ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.

డాక్టర్‌ ప్రభావతికి ముందస్తు బెయిల్‌ నో

ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును ఎంపీగా ఉన్న సమయంలో కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో 5వ నిందితురాలుగా ఉన్న డాక్టర్‌ ప్రభావతికి గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది.

ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును ఎంపీగా ఉన్న సమయంలో కస్టోడియల్‌ టార్చర్‌కు గురి చేసిన కేసులో 5వ నిందితురాలుగా ఉన్న డాక్టర్‌ ప్రభావతికి గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. ఆమె దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు గుంటూరు రెండవ అదనపు జిల్లా జడ్జి వై. నాగరాజు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ డాక్టర్‌ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. మెడికల్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న తాను ఈ కేసుకు సంబంధించిన బోర్డులోని ఇతర వైద్యులిచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదిక ఇచ్చానని ఆమె పేర్కొన్నారు. తాను నిర్దోషినని అనారోగ్యంతో ఉన్నానని తెలిపారు. 

ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. కాగా, బాధితుడైన రఘురామ తన న్యాయవాదులు వినాలని ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాదులు వీవీ లక్ష్మీ నారాయణ, కావూరి గోపీనాథ్‌ వాదనలు వినిపించారు. కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో డాక్టర్‌ ప్రభావతి భాగస్వామి అయ్యారని, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య బృందం ఇచ్చిన నివేదికను ఆమె దురుద్దేశంతో ట్యాంపరింగ్‌ చేశారని పేర్కొన్నారు. ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయరాదని కోర్టును కోరారు. మరోవైపు, ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున ప్రాసిక్యూషన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభావతి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి మిగిలిన నిందితులతో కుమ్మక్కయ్యారని కోర్టుకు తెలిపారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ప్రభావతికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరించింది.

టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. అయితే టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 232 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు.

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2025 జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.

12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది. ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు . ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15 తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కళ్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ కారణంగా 15వ తేది సహస్రదీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 15న‌ కార్తీక దీపోత్సవం ఘ‌నంగా జరుగ‌నుంది. సాయంత్రం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి కార్తీక దీపం, వ‌స్త్రాల‌ను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి సమర్పిస్తారు. ఈ సంద‌ర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించ‌నున్నారు. తిరుప‌తి శ్రీ కోదండరామాలయంలో డిసెంబ‌రు 15న‌ సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకువ‌చ్చి, కార్తీక దీపాలు వెలిగిస్తారు.

చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి విడుదల చేశారు. అల్లు అర్జున్‌ను విడుదల చేస్తుండటంతో ఆయన అభిమానులు భారీగా జైలు వద్ద గూమిగూాడారు.

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ను పోలీసులు నిన్న(శుక్రవారం) ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. 'పుష్ప 2 ది రూల్' ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ(శనివారం) ఉదయం 6:45 గంటలకు చంచల్ గూడ జైలు నుంచి ఆయనను విడుదల చేశారు. బెయిల్‌ ఆర్డర్‌ కాపీ పరిశీలన అనంతరం జైలు వెనుక గేటు నుంచి అధికారులు పంపించారు.

మధ్యంతర బెయిల్‌పై అల్లు అర్జున్‌ ఈరోజు విడుదలయ్యారు. 4 వారాల మధ్యంతర బెయిల్‌‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్‌ వచ్చినా రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్‌ ఉన్నారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల చేశారు. అల్లు అర్జున్‌తో పాటు సంధ్యాథియేటర్‌ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు. చంచల్‌గూడ జైలుకు ఇప్పటికే అల్లు అరవింద్‌ చేరుకున్నారు. జైలు అధికారులకు బెయిల్‌ ఆర్డర్‌ కాపీ అందజేశారు. మంజీరా బ్యారక్‌ నుంచి అడ్మిషన్‌ బ్యారక్‌కు అల్లు అర్జున్‌ను తరలించినట్లు సమాచారం. అల్లు అర్జున్‌ కోసం జైలుకు ఆయన బాడీగార్డ్స్‌ చేరుకున్నారు. చంచల్‌గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

అల్లు అర్జున్‌ను ఉదయం 6.45 గంటలకు విడుదల చేశామని జైలు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్‌ను వెనుక గేటు నుంచి పంపించామని చెప్పారు. అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను విడుదల చేశామని అన్నారు. సంధ్యా థియేటర్‌ యజమానిని విడుదల చేశామని జైలు అధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్‌ బెయిల్ పేపర్లు అందడానికి ఆలస్యమైందని జైలు అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత బెయిల్‌ పేపర్లు అందాయని జైలు అధికారులు తెలిపారు. చంచల్‌గూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి అల్లు అర్జున్‌ చేరుకున్నారు. గీతా ఆర్ట్స్‌ ఆఫీస్‌ నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్‌ నివాసం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు అల్లు అర్జున్‌‌ను విడుదల చేస్తుండటంతో చంచల్‌గూడ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు నిన్న(శుక్రవారం) 14 రోజులు రిమాండ్‌ విధించడంతో ప్రత్యేక పోలీస్‌ బృందం భారీ బందోస్తు నడుమ అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) బన్నీ విడుదల అవుతుండటంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు.

రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్‌ ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చినా ఆర్డర్‌ కాపీ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్‌ విడుదల కాలేదు. సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట కేసులో బన్నీ అరెస్టైన విషయం తెలిసిందే. తొక్కిసలాట కేసులో మొత్తం 18 మంది నిందితులను చేర్చారు. ఈ కేసులో A11 నిందితుడిగా అల్లు అర్జున్‌ ఉన్నారు. అల్లు అర్జున్‌కు అండర్‌ ట్రయల్‌ ఖైదీ నెంబర్‌ 7697 కేటాయించారు. అల్లు అర్జున్‌ కోసం ఇంటి నుంచి బయల్దేరిన ఆయన బాడీగార్డ్స్‌ నిన్న జైలు నుంచి విడుదల కాకపోవడంతో అల్లు అర్జున్‌కు అండర్‌ ట్రయల్‌ ఖైదీ నెంబర్‌ 7697ను జైలు అధికారులు ఇచ్చారు. చంచల్‌గూడ జైలు మంజీరా బ్యారక్‌లో అల్లు అర్జున్‌ ఉన్నారు. చంచల్‌గూడ జైలు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాత్రి చంచల్‌గూడ జైలు దగ్గర అభిమాని హంగామా చేశారు. అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయాలంటూ పెట్రోల్‌ పోసుకుని అభిమాని హల్‌చల్‌ చేశాడు. పోలీసులు అడ్డుకున్నారు.

అల్లు అర్జున్‌ను పీఎస్‌లోకి తీసుకువెళ్లిన తర్వాత ఎవరినీ లోనికి రాకుండా పోలీసులు గేట్లు మూసివేశారు. డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌, ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ ఆధ్వర్యంలోని బృందం సుమారు గంటపాటు ఆయనను విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఓవైపు ప్రశ్నిస్తూనే రిమాండ్‌ రిపోర్ట్‌ను తయారు చేశారు. మధ్యాహ్నం 1:30కు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ‘పుష్ప అరెస్టు’ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులతోపాటు.. స్థానిక ప్రజలు ఎగబడ్డారు.

దాంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. అల్లు అర్జున్‌ను విచారిస్తున్న క్రమంలో ఆయన తండ్రి అల్లు అరవింద్‌, సినీ నిర్మాత దిల్‌ రాజు, అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌రెడ్డిని మాత్రమే లోపలికి రానిచ్చారు. ఆయన సోదరుడు అల్లు శిరీష్‌, కోల శ్రీకాంత్‌ అనే స్నేహితుడు పీఎ్‌సకు చేరుకోగా వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా, మధ్యాహ్నం 2:15 గంటలకు అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ రాజు ఆధ్వర్యంలో బీపీ, షుగర్‌, కొవిడ్‌ వంటి వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం భారీ బందోబస్తు నడుమ 3:10 గంటలకు నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. సుమారు 45 నిమిషాలపాటు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సాయంత్రం 4:00 గంటలకు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. అల్లు అర్జున్‌ను నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచిన క్రమంలో హైదరాబాద్‌ అడిషనల్‌ సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌ కోర్టులోనే ఉండి పోలీస్‌ భద్రత, బందోబస్తును పర్యవేక్షించారు.

నిజానికి డిసెంబర్ 4న రాత్రి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వెళ్లారు. ఆ క్రమంలో వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు గాయపడ్డారు. దీంతో మహిళ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 105, 118 (1) కింద అల్లు అర్జున్, ఆయన భద్రతా బృందం, థియేటర్ యాజమాన్యంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి ముందు మహిళ మృతికి సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 11న అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

సిరియా నుంచి 75 మంది భారతీయుల త‌ర‌లింపు

సిరియా అధ్య‌క్షుడు బ‌ష‌ర్ అల్ అస‌ద్‌ను తిరుగుబాటు ద‌ళాలు గ‌ద్దె దించి అధికారాన్ని త‌మ నియంత్ర‌ణ‌లోకి తీసుకోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి. ఈ నేప‌థ్యంలో సిరియాలో ఉంటున్న భార‌త పౌరుల‌ను వెన‌క్కి ర‌ప్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 

దీనిలో భాగంగా 75 మంది భారతీయులను డ‌మాస్క‌స్ నుంచి లెబ‌నాన్‌కు త‌ర‌లించ‌డం జ‌రిగింది. భారతీయ పౌరులు సురక్షితంగా లెబనాన్‌కు చేరుకున్నార‌ని, వాణిజ్య విమానాల ద్వారా స్వ‌దేశానికి తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

సిరియాలోని భారతీయ పౌరుల అభ్యర్థనలు, అక్క‌డి భద్రతా పరిస్థితిని అంచనా వేసిన తరువాత మ‌నోళ్ల త‌ర‌లింపున‌కు సంబంధించిన‌ నిర్ణ‌యం తీకుంది. డమాస్కస్, బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయాలు దీనికి సహ‌క‌రించాయ‌ని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇక తాజాగా తరలించిన 75 మందిలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన 44 మంది 'జైరీన్' (యాత్రికులు) ఉన్నారు. వారు సైదా జైనాబ్ వద్ద చిక్కుకుపోయారని మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

అయితే, కొంతమంది భారతీయులు సిరియాలోనే ఉంటున్నారు. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా డమాస్కస్‌లోని రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973, ఇమెయిల్ ద్వారా టచ్‌లో ఉండాలని ప్రభుత్వం వారికి సూచించింది.

నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ

ప్రముఖ నటుడు, మెగా బ్రదర్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వరించిన విషయం తెలిసిందే.

ప్రముఖ నటుడు, మెగా బ్రదర్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వరించిన విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్‌లో ఆయనకు చోటు లభించింది.

నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు నాగబాబుకు సినిమాటోగ్రఫీ (Cinematography) శాఖను కూటమి ప్రభుత్వం అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం జనసేన పార్టీ నేత కందుల దుర్గేశ్‌ ఈ శాఖను నిర్వర్తిస్తున్నారు. దీంతోపాటు టూరిజం శాఖ కూడా దుర్గేశ్‌ వద్దే ఉంది. అయితే, దుర్గేశ్‌ నుంచి సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. దుర్గేశ్‌ సొంత పార్టీ నేతే కావడంతో ఆయన నుంచి ఈ శాఖను నాగబాబుకు బదిలీ చేయడం సులభతరం అవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక చిత్రపరిశ్రమకు చెందిన నాగబాబుకు ఈశాఖ కేటాయించడం వల్ల ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో గనుల శాఖ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అంశంపై మరో రెండు లేదా మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

17న మంగళగిరి ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

మంగళగిరిలోని ఆల్‌ ఇండి యా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఏఐఐఎంఎస్‌) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.

మంగళగిరిలోని ఆల్‌ ఇండి యా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స(ఏఐఐఎంఎస్‌) ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తాత్కాలికంగా ఖరారైన కార్యక్రమం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17న ఉదయం 11.20 గంటలకు భారత వాయుసేన విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్క డి నుంచి రోడ్డు మార్గంలో 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్తా రు. స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్‌ సీఎం చంద్రబాబు కేంద్ర, రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొంటారు అని సీఎస్‌ తెలిపారు.

సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌

సింగరేణి సీఎండీ పోస్టు కోసం పలువురు కీలక ఐఏఎ్‌సలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సింగరేణి సీఎండీ పోస్టు కోసం పలువురు కీలక ఐఏఎ్‌సలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్‌.బలరామ్‌ కేంద్ర సర్వీసులకు చెందిన అధికారి. రాష్ట్రంలో ఆయన డిప్యూటేషన్‌ కాలం ముగిసిపోవస్తోంది. డిప్యూటేషన్‌ను పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే వార్తలు రావడంతో ఆ పోస్టును దక్కించుకోవడానికి పలువురు కీలక ఐఏఎ్‌సలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శైల జా రామయ్యర్‌ ముందు వరుసలో ఉన్నారు. 1997 బ్యాచ్‌కు చెందిన ఆమె సీఎండీ పోస్టును కోరుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె చేనేత శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈమెకు కోల్‌బెల్ట్‌పై పూర్తి స్థాయిలో పట్టుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సతీమణి కావడం ఆమెకు కలిసొచ్చే అంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యధికకాలం ఎన్‌.శ్రీధర్‌ సీఎండీగా ఉన్నారు.

9 ఏళ్లకు పైగా ఆయన సీఎండీ పోస్టులో కొనసాగారు. పలు సందర్భాల్లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా సింగరేణి పాలక మండలి సమావేశంలో ఆయన పదవీ కాలం పొడిగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీధర్‌ను కొనసాగించింది. గత ప్రభుత్వంలోని కీలక పెద్దలకు ఆప్తుడిగా శ్రీధర్‌కు పేరుండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చీ రాగానే శ్రీధర్‌ను తప్పించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. తాజాగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. శ్రీధర్‌ను తప్పించిన నాటి నుంచి ఎన్‌.బలరామ్‌ ఇన్‌చార్జి సీఎండీగా ఉన్నారు. ఆర్థిక రంగంపై బలరామ్‌కు బలమైన పట్టు ఉంది. సింగరేణి ఆర్థిక పరపతి పెంచడంలోనూ ఆయన పాత్ర కీలకమని అధికారులు చెబుతుంటారు. నిధుల సమీకరణలోనూ బలరామ్‌ దిట్ట. రాష్ట్రంలోని మరే కార్పొరేట్‌ కంపెనీలో లేని విధంగా సింగరేణి కార్మికులకు రూ.కోటి బీమాను బ్యాంకుల నుంచి వర్తింపచేయడంలో బలరామ్‌దే కీలక పాత్ర. దాంతో కొత్త సీఎండీగా ఐఏఎ్‌సలకు అవకాశం ఇస్తారా? లేక కేంద్రాన్ని ఒప్పించైనా బలరామ్‌ను కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది.

త్వరలో లిక్కర్‌ ప్రీమియం స్టోర్లు

రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్‌ బ్రాండ్లు విక్రయించేందుకు ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి.

రాష్ట్రంలో ప్రీమియం లిక్కర్‌ బ్రాండ్లు విక్రయించేందుకు ‘ప్రీమియం స్టోర్లు’ అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా ఒకట్రెండు రోజుల్లో ఎక్సైజ్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 12 ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ కార్పొరేషన్లు, ప్రధాన నగరాల్లో మాత్రమే ఉండే వీటికి దరఖాస్తు రుసుము రూ.15 లక్షలుగా ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. దరఖాస్తులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. లైసెన్స్‌ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాలి. దానిపై ఏటా 10శాతం చొప్పున ఫీజు పెరుగుతుంది.

అయితే ఈ స్టోర్లకు ఒకేసారి ఐదేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేస్తారు. కనీసం 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం చూపించినవారే దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తులు పరిశీలించి లైసెన్సీలను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తుంది. సాధారణ మద్యం షాపుల తరహాలోనే ఈ స్టోర్ల పనివేళలు ఉంటాయి. ప్రీమియం స్టోర్లలో లిక్కర్‌, బీరు, వైన్‌తో పాటు లిక్కర్‌ చాక్లెట్లు, సిగార్స్‌, సిగరెట్లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌ కూడా విక్రయించవచ్చు.