/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz మర్రిగూడ మండలంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి Mane Praveen
మర్రిగూడ మండలంలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:
మర్రిగూడ:  నేడు భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ  జయంతి సందర్బంగా.. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు,నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకుని నిర్వహించుకునే ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా  మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

మర్రిగూడ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు సీనియర్ నాయకులు మారనేని లూర్దయ్య, నున్సవత్ బిచ్య నాయక్, ఐతపాక జంగయ్య, మాజీ ఎంపీటీసీ భీమ్లా నాయక్, వెంకటపేట బాలయ్య, మార్కెట్ పిఎసిఎస్ డైరెక్టర్లు డైరెక్టర్లు, గంట మల్లేష్ , బాయికడి కొండల్, గ్రామ శాఖ అధ్యక్షులు కోలుకుపల్లి శంకర్, జాల వెంకటయ్య, రాజు నాయక్ మునుగోడు యూత్ కాంగ్రెస్ కాంటెస్టెడ్ అధ్యక్షులు అబ్బనగోని రాము యాదవ్, యూత్ కాంగ్రెస్  అధ్యక్షులు బేత వెంకటేష్, కాంటెస్ట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడలా ఆల్వాల్ రెడ్డి, లవకుమార్, ఎస్సీ సెల్ జిల్లా కన్వినర్ సిరపంగి శ్రీనివాస్, మండల నాయకులు, రావుల రాములు, కోలుకుల పల్లి జంగయ్య, ఎలిమినేటి సతీరెడ్డి మారనేని ప్రశాంత్, పగడాల యాదయ్య, తన్నీరు యాదయ్య,గ్యార వెంకటేష్, లపంగి యాదయ్య,జిల్లా శంకర్, దుబ్బ మల్లేష్, వంపు రాంచరణ్, గొట్టిముక్కల ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి జయంతి ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరాగాంధీ జయంతి ని ఘనంగా నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
చౌటుప్పల్:
నేడు భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా  చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పట్టణ కేంద్రంలోని బస్ స్టాప్ పక్కన ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి బంగారు బాటలు వేసిన నాయకురాలు ఇందిరాగాంధీ, భారత తొలి మహిళా ప్రధానిగా అమూల్యమైన సేవలందించారని తెలిపారు. దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు.

మాజీ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పబ్బు రాజు గౌడ్,  కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనా రెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహా గౌడ్, ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్ కొయ్యడ సైదులు, పోలోజు అనిల్ కుమార్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, బొడిగె బాలకృష్ణ, మరియు షాదిఖాన చైర్మన్ కరీం, ఊదరి నరసింహ, బొంగు జంగయ్య, ఆవుల ఏసు,చిలువేరు శ్రీశైలం, ఎం.డి. ఏజాస్, పాలకూర యాదయ్య,ఎర్రగోని లింగస్వామి, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
NLG: మిత్రుడి కుటుంబానికి బాసటగా పూర్వ విద్యార్థులు
నల్గొండ జిల్లా:
చిట్యాల మండలం, పెద్దకాపర్తి గ్రామంలో తెలుసూరి శ్రీను ఇటీవల అకాల మృతి చెందగా, ఆయన మిత్రులు, పూర్వ విద్యార్థులందరూ కలిసి పోగుచేసిన 1 లక్ష 13 వేల రూపాయలను సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.

టెన్త్ 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఈ మేరకు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ను భార్య, తల్లిదండ్రులకు అందించారు. సందర్భంగా పూర్వ విద్యార్థులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.
NLG: బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందికి తేవడం వల్ల బీసీలకు తీవ్రమైన నష్టం: పిఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

నల్లగొండ:

గత ప్రభుత్వం కలిపిన బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్ లను మళ్లీ విడగొట్టాలని తద్వారానే బీసీ ప్రజలకు ఎక్కువ న్యాయం జరుగుతుందని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.

ఈరోజు నల్లగొండలో జరిగిన ఉమ్మడి జిల్లా బీసీ కమిషన్ బహిరంగ విచారణలో తన అభిప్రాయాన్ని తెలిపారు.

నూనె వెంకటస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్లను విడిగా ఉన్న వాటిని ఒకే గొడుగు కిందికి తేవడం వల్ల బీసీ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. వీటి రెండింటిని విడగొట్టాలని దీనివల్లనే బీసీ విద్యార్థులకు, బీసీ ప్రజలకు సమగ్రమైన న్యాయం జరుగుతుందని అన్నారు.

ఉద్యోగ నియామకాలు చేయలేక, బీసీ ప్రజల జనాభా కనుగుణంగా నిధులను ఇవ్వలేక, సరైన అభివృద్ధి పథకాలు లేక.. బీసీ వెల్ఫేర్ ను కార్పొరేషన్ ను కలిపారని, ఈ విధంగా కలపడం వల్ల బీసీ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతోందని, ప్రస్తుతం బీసీ కమిషన్ ను వేసినందున ఆ కమిషన్, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, మళ్లీ వాటిని విడగొట్టి అత్యధిక నిధులు రాబట్టాలని వారు కోరారు.

నాగార్జునసాగర్ లో ఉమ్మడి జిల్లా స్థాయి 'నెట్ బాల్'  సెలక్షన్స్: ఎస్ జి ఎఫ్ సెక్రటరీ
నల్లగొండ: జిల్లా విద్యాధికారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్ 14,17 బాల బాలికల 'నెట్ బాల్'  సెలక్షన్స్, ఈనెల 20 వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్నట్లు ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ విమల తెలిపారు.

ఈ క్రీడలో పాల్గొనదలచిన క్రీడాకారులు 14 సం.లోపు బాల బాలికలు 01.01.2011 తర్వాత జన్మించి ఉండాలి, 17 సం. ల బాల బాలికలు 01.01.2008 తరువాత జన్మించిన వారు అయి ఉండాలి. క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ బోనఫైడ్ మరియు ఆధార్ కార్డులతో హాజరు కావాలని సూచించారు.

ఇంటర్మీడియట్ క్రీడాకారులైతే 10 వ తరగతి మెమో తో పాటు, ఈ సంవత్సరం ఒరిజినల్ బోనఫైడ్ మరియు ఆధార్ కార్డు లతో హాజరు కావాలన్నారు.

మరిన్ని వివరాలకు నాగార్జునసాగర్, హిల్ కాలనీ లో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పిఈటి కిరణ్ కుమార్ ను సంప్రదించాలని సూచించారు.
NLG: ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సిపిఎం మండల కార్యదర్శి
నల్గొండ జిల్లా, చండూరు మండలం:
రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆ పార్టీ మండల కమిటీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ధనంజయ మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులను తేమ శాతం పేరుతో రోజుల తరబడి కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో సాగు కోసం రైతు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఉందన్నారు.

ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తేమతో నిమిత్తం లేకుండా ధాన్యమును కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యము కొనుగోలు చేయకపోవడంతో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందేమోనని భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం చండూరు మండల కమిటీ సభ్యులు చిట్టిమల్ల లింగయ్య, గ్రామ రైతులు బి.నరసింహ, కె.రామలింగం, గంట గణపతి, బోయపల్లి శివలింగం, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ మాలల సభను విజయవంతం చేయండి: దళితరత్న నాగిల్ల మారయ్య
నల్లగొండ జిల్లా:
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపుమేరకు, నల్లగొండ పట్టణంలో ఈనెల 23 న  జరిగే మాలల ఆత్మీయ సమ్మేళనం సభను విజయవంతం చేయాలని.. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మునుగోడు నియోజకవర్గ కో కన్వీనర్ దళితరత్న నాగిల్ల మారయ్య కోరారు.

ఈ మేరకు సోమవారం మర్రిగూడ మండలంలోని తమ్మడపల్లి, తిరుగండ్లపల్లి గ్రామాలలో కరపత్రం, వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. మండలం నుంచి మాలలు అధిక సంఖ్యలో నల్లగొండ సభకు హాజరు కావాలని కోరారు.

కార్యక్రమంలో గ్రామ పెద్ద మాల చెల్లం బాలసుందర్ రావు, యంజాల శ్రీనివాస్, పెద్దిరాజు, చెల్లం రమేష్, అనిల్, భాను చందర్, శివ, బాలకృష్ణ బాలయ్య, లక్ష్మమ్మ,  తదితరులు పాల్గొన్నారు
రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
చండూరు మున్సిపాలిటీలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన రహదారిపై జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి, ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు ఉన్నారు.
NLG: వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి: వికలాంగుల హక్కుల పోరాట సమితి
నల్గొండ జిల్లా, మునుగోడు:
వికలాంగులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వికలాంగుల హక్కుల పోరాట సమితి 
జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు అన్నారు.

మునుగోడు మండల కేంద్రంలోని, నేడు రైతు వేదికలో జరిగిన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి పెరిక శ్రీనివాసులు, ముఖ్య అతిథులుగా జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత 11 నెలలుగా చేయూత పెన్షన్ దారులను మోసం చేస్తుందని.. 6 గ్యారంటీ లలో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు 4000 రూపాయల పెన్షన్  ఇస్తామని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో దివ్యాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చి, ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయక పోవడాన్ని త్రీవంగా ఖండిస్తూ, ఈనెల 18 నుండి 23 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ రేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని ఆ లోపు  పెన్షన్ల పెంపు పై స్పష్టత రాకపోతే, నవంబర్ 26 వ తారీకు చలో హైదరాబాద్ నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము హరి కుమార్, జిల్లా కో కన్వీనర్లు వీరబోయిన సైదులు యాదవ్,జిల్లా సీనియర్ నాయకులు చిలుముల జలంధర్, జిల్లా నాయకులు దొంతగాని మహేష్, మునుగోడు నియోజకవర్గ నాయకులు దొమ్మటి సత్యనారి, యాసరాని మంగమ్మ, శివరాత్రి సైదమ్మ, ఈత పరమేష్, సహదేవులు, శృతి,రమేష్, సత్తెమ్మ, రాములమ్మ, మల్లిక, లిఖిత, తదితరులు పాల్గొన్నారు.
నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం చొప్పరివారిగూడెంలో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయితీ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.