/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz పెన్షన్లు ఇక వీరికే వారికి కోత Raghu ram reddy
పెన్షన్లు ఇక వీరికే వారికి కోత

ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుతో పాటుగా అనర్హులవి రద్దు దిశగా కసరత్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలకు పెంచి అమలు చేస్తున్నారు. 26 రకాల పెన్షన్లు ప్రస్తుతం అందిస్తున్నారు. అయితే, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెన్షన్ల కొనసాగింపు పైన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెలకు రూ 4 వేలకు పెన్షన్ పెంచి అమలు చేస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకు వెళ్లి అందిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ కింద ప్రస్తుతం మొత్త 64,14,174 మంది పెన్షన్‌ అందుకుంటున్నారు. వీరిలో వృద్ధులతో పాటుగా, దివ్యాంగులు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు. అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు.

అసెంబ్లీలో కొత్త పెన్షన్ల మంజూరు పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ 1 నుంచి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తా మని చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వరకు అర్హత లేని వారు పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దివ్యాంగుల పెన్షన్ల మంజూరులో అర్హత లేని వారికి లబ్ది అందుతున్నట్లు గుర్తించారు. వీరి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు.

రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దాదాపు రెండు లక్షల మంది వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిం చి .. డిసెంబర్ నెలాఖరులో గా పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో ప్రారంభించే జన్మభూమి -2 లో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి వారికి తెలిగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక, పెన్షన్లు రెండు నెలల వరకు తీసుకోని వారికి మూడో నెలలో మొత్తం కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మండల పూజల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల

పశ్చిమ కనుమల్లోని పత్తనంతిట్టా జిల్లా ఉన్శ పవిత్ర పుణ్య క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలల పాటు సాగే మండల మకరు విళక్కు యాత్రా సీజన్ మొదలవుతోంది. ఈ సమయంలో స్వామి దర్శనం కోసం అయ్యప్ప దీక్షాదారులు వేలాదిగా తరలివస్తారు. గతేడాది భక్తుల సంఖ్య భారీగా ఉన్నా.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. చాలా మంది దర్శనాలు చేసుకోకుండానే వెనుదిరిగారు. దీంతో ప్రస్తుతం పక్కా ఏర్పాట్లు చేశారు.

రెండు నెలల పాటు సాగే మండల మకరవిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సర్వం సిద్దమైంది. శుక్రవారం (నవంబరు 15న) సాయంత్రం 4 గంటలకు ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు. రోజుకు ఎంత మంది భక్తులను దర్శనాలకు అనుమతించేల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో 70 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 10 వేల మంది మొత్తం 80 వేల మందిని దర్శనాలకు అనుమతిస్తామని వెల్లడించారు

శబరిమల సహా పలు ఆలయాలను నిర్వహిస్తోన్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మధ్యాహ్నం 1 గంట నుంచి యాత్రికులకు ప్రవేశం కల్పిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఆలయ తలుపులు తెరిచిన తర్వాత పూజారుల మార్పు సాయంత్రం 5 గంటలకు జరుగుతుందని తెలిపింది. కానీ, దర్శనాలు మాత్రం శనివారం ఉదయం మొదలవుతాయని, అప్పటి నుంచే మండల పూజల సీజన్ అధికారికంగా మొదలవుతుందని పేర్కొంది. మరోవైపు, వర్చువల్ క్యూ కోసం శుక్రవారం 30 వేల మంది భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేశారు. వారిని గురువారం 1 గంట తర్వాత పంబ నుంచి అనుమతిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనాల సమయం కూడా పెంచారు. రోజుకు 18 గంటల పాటు దర్శనాలు ఉంటాయని టీడీబీ ఇప్పటికే ప్రకటించింది. పశ్చిమ కనుమల్లో 914 మీటర్ల ఎత్తులో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి పంబ నుంచి 4 కిలోమీటర్ల కాలినడక చేరుకోవాల్సి ఉంటుంది.

ఇక 10 ఏళ్లు నిండి.. 50 ఏళ్లలోపు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధం. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు మండల కాలం అంటే 41 రోజుల పాటు దీక్ష చేపట్టి.. ఇరుమడితో వస్తారు. పావన పదునెట్టాంబడి (18 మెట్లు) మీదుగా స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడి ఉన్నవారికే పదునెట్టాంబడి ఎక్కేందుకు అనుమతి ఉంటుంది. సాధారణ భక్తులకు పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదు. వీరిని పక్కనే ఉన్న గేటు ద్వారా అనుమతిస్తారు.

ఇక మండల-మకర విళక్కు పూజల సీజన్ ఏర్పాట్లు, బందోబస్తుపై కేరళ డీజీపీ షేక్ దర్వైష్ సాహెబ్ గురువారం ఉన్నత న్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం 14 వేల మంది పోలీసులతో పాటు వాలంటీర్లను భద్రత విధులు, యాత్రికుల సేవల కోసం మోహరిస్తున్నట్టు తెలిపారు. అలాగే, భక్తుల వాహనాల పార్కింగ్ స్లాట్లను 10 వేలకు పెంచారు. అలాగే, రెస్టారెంట్లు, హోటళ్లపై ధరల వివరాలను దక్షిణాది అన్ని భాషల్లోనూ డిసిప్లే చేయాలని అధికారులు ఆదేశించారు.

చలో కొడంగల్‌

కొడంగల్‌(Kodangal) ఫార్మా కోసం గిరిజనుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వెంటనే విరమించాలని గిరిజన సంఘాల జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. త నపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్‌ స్వయంగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కుట్రపూరితంగా లంబాడీ రైతులపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసిందని ఆరోపించారు.

కొడంగల్‌(Kodangal) ఫార్మా కోసం గిరిజనుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వెంటనే విరమించాలని గిరిజన సంఘాల జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. త నపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్‌ స్వయంగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వం కుట్రపూరితంగా లంబాడీ రైతులపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసిందని ఆరోపించారు. గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకొని అందరిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

గురువారం బాగ్‌లింగంపల్లి(Baglingampalli)లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ‘కొడంగల్‌ ఫార్మా- భూముల కేటాయింపు’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్‌సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్‌నాయక్‌(Bhukya Sanjeev Nayak), ప్రొఫెసర్‌ నారాయణ, గణేష్ నాయక్‌, మోతీలాల్‌, శంకర్‌నాయక్‌తో పాటు పలువురు మాట్లాడారు.

ఫార్మాసిటీ కోసం గిరిజనుల వ్యవసాయ భూములను తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. వచ్చే సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి గిరిజనుల చలో కొడంగల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకించారు. సమావేశంలో గిరిజన జేఏసీ నాయకులు రాంబాబు నాయక్‌, రాజునాయక్‌, హరినాయక్‌, రాథోడ్‌, విద్యాకృష్ణ, శ్రీనివా్‌సనాయక్‌, కల్యాన్‌నాయక్‌, మోహన్‌, బిక్షనాయక్‌ పాల్గొన్నారు.

రాం గోపాల్ వర్మకు షాక్

కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాం గోపాల్ వర్మ కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద రామ్ గోపాల్ వర్మ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే రాంగోపాల్ వర్మ పైన మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన, లోకేష్, నారా బ్రాహ్మణి పైన వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇక ఈ పోస్టులపైన మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం రాంగోపాల్ వర్మ చంద్రబాబును పదేపదే టార్గెట్ చేశారు. ఏకంగా చంద్రబాబును నెగిటివ్ క్యారెక్టర్ గా తన సినిమాలలో చూపిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.

సోషల్ మీడియాలో కూడా చంద్రబాబును పదేపదే టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు, పవన్, లోకేష్ ల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి పోస్టులు పెట్టిన వైసిపి కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న వారి భరతం పడుతున్నారు.

రాం గోపాల్ వర్మకు పోలీసుల షాక్

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మ కి కూడా షాక్ ఇచ్చి ఆయన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మరి ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుందో ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేయడం పైన రామ్ గోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారో అన్నది తెలియాల్సి ఉంది.

ప్రజ్వల్ రేవణ్ణకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రజ్వల్‌కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అంతేకాదు, ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హసన మాజీ ఎంపీతో పాటు ఆయన తండ్రిపై ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. కానీ, అతడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదరయ్యింది. ఈ కేసులో ప్రజ్వల్‌కు బెయిల్ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతేకాదు, ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలని వ్యాఖ్యానించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజ్వల్ వీడియోలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. వందల మందిపై అత్యాచారాలకు పాల్పడి... వాటిని వీడియోలు తీసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి ససేమిరా అంది. దీంతో రేవణ్ణ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడి ధర్మాసనం.. వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి వ్యాఖ్యానించింది.

రేవణ్ణ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఛార్జ్‌షీట్ వేశారు కానీ, ప్రాథమిక ఫిర్యాదులో ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదుచేయలేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అక్టోబరు 21న కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అరెస్ట్ అయిన ఆరు నెలల తర్వాత కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించాలని రోహత్గీ కోరారు. అయితే దాని గురించి ఏమీ చెప్పలేమని బెంచ్ పేర్కొంది. అనంతరం అతని పిటిషన్‌ను కొట్టివేసింది.

ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడులు, అత్యాచారాలపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. మాజీ ప్రదాని మనవడిపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణ పూర్తిచేసిన సిట్.. ఆగస్టులో 2,144 పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించింది. ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి, హోళినరిసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై కూడా లైంగిక వేధింపులు, కిడ్నాప్ వంటి ఆరోపణల్లో అరెస్టయ్యారు. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయట ఉన్నారు.

2024-25: భారీగా ఏపీ వ్యవసాయ బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అచ్చెన్నాయుడు.. ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం వెన్నెముకగా పేర్కొన్నారు. రైతు అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. రైతులకు ఆధునిక పనిముట్లు, రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి అచ్చెన్న తెలిపారు.

వడ్డీ లేని రునాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యమిస్తామని అచ్చెన్న చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదిక వ్యవసాయ మంత్రి ప్రకటించారు. సాగుకు సూక్ష్మ పోషకాలు అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వ్యవసాయ రంగానికి నిర్ధిష్ట ప్రణాళిక అవసరం అన్నారు మంత్రి. పెట్టుబడి సాయం పెంచి నెల రోజుల్లోనే అందించామని చెప్పారు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే.. లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్‌ రూపొందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయం ఆధారంగా 62% మంది జీవిస్తున్నారని.. 2047 టార్గెట్‌తో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రూ.43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌

రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు

భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు

విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు

ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు

పొలం పిలుస్తోంది రూ.11.31 కోట్లు

PACSల ద్వారా ఎరువుల పంపిణీ

డిజిటల్‌ వ్యవసాయం - రూ.44.77 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ - 187.68 కోట్లు

వడ్డీ లేని రుణాలు - రూ.628 కోట్లు

అన్నదాత సుఖీభవ - రూ.4,500 కోట్లు

రైతు సేవా కేంద్రాలు - రూ.26.92 కోట్లు

ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ - రూ.44.03 కోట్లు

పంటల బీమా - రూ.1,023 కోట్లు

వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు

ఉద్యానశాఖ - రూ.3,469.47 కోట్లు

పట్టు పరిశ్రమ - రూ.108.44 కోట్లు

వ్యవసాయ మార్కెటింగ్‌ - రూ.314.8 కోట్లు

సహకార శాఖ - రూ.308.26 కోట్లు

ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు

ఎన్జీ రంగా యూనివర్సిటీ - రూ.507.3 కోట్లు

ఉద్యాన యూనివర్సిటీ - రూ.102.22 కోట్లు

వ్యవసాయ పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు

ఫిషరీస్‌ యూనివర్సిటీ - రూ.38 కోట్లు

పశు సంవర్థక శాఖ - రూ.1,095.71 కోట్లు

మత్స్యరంగం అభివృద్ధి - రూ.521.34 కోట్లు

ఉచిత వ్యవసాయ విద్యుత్‌ - రూ.7,241.3 కోట్లు

ఉపాధి హామీ అనుసంధానం - రూ.5,150 కోట్లు

ఎన్టీఆర్‌ జలసిరి - రూ.50 కోట్లు

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు

అన్నదాతల ఆందోళనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికీలక ఆదేశాలు

తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని, సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని మండిపడుతున్నారు రైతులు. సిండికేట్‌గా ఏర్పడి తేమశాతం పేరుతో కోత విధిస్తున్నారన్నారు. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు. ఈ క్రమంలో ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలంటూ పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. మిల్లుల ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి అన్యాయం చేస్తున్నారని.. తేమశాతం, తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఇలా అయితే ఎలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రైతులను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) చట్టం కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సోమవారం మాట్లాడారు.

రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం

ఎన్నికల బాండ్లు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో కీలక తీర్పులిచ్చిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జస్టిస్‌ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 2019 జనవరిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఖన్నా.. దాదాపు ఈ ఆరేళ్లలో 450కిపైగా తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు.

భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప-రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఇక, 2019 జనవరి 18వ తేదీన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ ఖన్నా 1960 మే 14వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న జస్టిస్ సంజీవ్‌.. సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్న వ్యక్తి.

తీస్‌హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి.. మొదటిసారి. 2005లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2006లో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టుకూ చీఫ్ జస్టిస్‌గా పని చేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్దిమంది న్యాయమూర్తిల్లో జస్టిస్ ఖన్నా ఒకరు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నాకు ఆయన స్వయానా సోదరుడి కుమారుడు. ముఖ్యమైన రాజ్యాంగసంబంధ కేసుల్లో పెదనాన్న జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా ఇచ్చిన తీర్పులతో స్ఫూర్తిపొంది న్యాయవాద వృత్తివైపే మొగ్గుచూపారు.

జస్టిస్‌ సంజీవ్ ఖన్నా ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గానూ.. అంతేకాకుండా భోపాల్‌లోని నేషనల్‌ జ్యుడిషియల్‌ అకాడమీ పాలక మండలి సభ్యుడిగానూ కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ముఖ్యంగా ఈవీఎంలపై అనుమానాలకు సంబంధించిన కేసుల్లో తీర్పు చెప్పారు. ఈవీఎంలు సురక్షితమైనవని, బూత్‌ల ఆక్రమణ, బోగస్‌ ఓటింగ్‌లకు చెక్‌ పెడతాయని స్పష్టం చేయడమే కాకుండా ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించారు. అలాగే, ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దును సమర్దిస్తూ ఇచ్చిన ధర్మాసనంలోనూ జస్టిస్ ఖన్నా భాగస్వామి

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వెలగపూడిలో అసెంబ్లీ నిర్మించినప్పటి నుంచి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం ఆనవాయితీని చంద్రబాబు కొనసాగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ అమోదముద్ర వేసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 2.9 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సాధారణ బడ్జెట్‌ తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనల తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. పది నుంచి 11రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. మండలిలో బడ్జెట్‌ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ మంత్రి నారాయణ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరనే ఉద్దేశంతో సమావేశాలకు జగన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరవుతారు. మండలిలో బొత్స సత్యనారాయణ ప్రమాణం చేస్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా సమావేశాలు నిర్వహించలని వైసీపీ నిర్ణయించింది.

దేవాలయాల్లోని పాలకమండళ్లలో అదనంగా మరో ఇద్దరు సభ్యుల నియామకంపై బిల్లును బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జ్యూడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ను రద్దు చేస్తూ బిల్లు పెడుతున్నారు. జ్యూడీషియల్‌ అధికారుల వయసును 60 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణ చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ వైసీపీ ప్రభుత్వం గతంలో తెచ్చిన చట్టాన్ని రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ఇచ్చింది. దీనికి బదులు మద్యం దుకాణాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు 2024ను సభలో ప్రవేశపెడతారు.

నవంబర్‌ 22వ తేదీ వరకు బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రోడ్లనిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ ఏడు ఇప్పటివరకు రెండు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ రెండు బడ్జెట్లకు కలిపి రూ.2.39 లక్షల కోట్లకు ఆమోదం తీసుకున్నారు.

2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌ రూ.3లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. క్యాబినెట్‌ అమోదం పొందిన తర్వాత బడ్జెట్‌కు‌ ఆన్‌లైన్‌లో గవర్నర్‌ అమోదం తీసుకోనున్నారు. గత మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నాలుగు నెలలకు గాను ఓటాన్‌ అకౌంట్‌ను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మరో నాలుగు నెలలకు గాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 4 నెలలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు.

పత్తి కొనుగోళ్లు బంద్‌

పత్తి రైతులపై పిడుగు పడింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్‌ చేస్తున్నట్టు జిన్నింగ్‌ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది.

పత్తి రైతులపై పిడుగు పడింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్‌ చేస్తున్నట్టు జిన్నింగ్‌ మిల్లులు ప్రకటించాయి. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై పత్తి కొనుగోలు చేయబోమని రాష్ట్ర జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఆదివారం సమావేశమైన సంఘం నేతలు పత్తి కొనుగోళ్ల నిలిపివేతకు సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, సీసీఐ సీఎండీకి లేఖ రాశాయి. పత్తి కొనుగోలులో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) అమలు చేస్తున్న అడ్డదిడ్డ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నాయి. ఈ సీజన్‌లో తెలంగాణలో రైతుల నుంచి పత్తి కొనుగోలుపై సీసీఐ ఎన్నడూ లేని విధంగా కొర్రీలు పెడుతున్నది.

రెండు రోజుల క్రితం సీసీఐ తీసుకున్న నిర్ణయం ఇటు మిల్లులకు, అటు రైతులకు శరాఘాతంగా మారింది. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 318 జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసేది. కానీ శనివారం నుంచి సీసీఐ ఈ విధానాన్ని ఎత్తేసి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక జిల్లాలోని మిల్లులకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3.. ఇలా క్రమసంఖ్యను కేటాయిస్తుంది. క్లస్టర్ల వారీగా విభజించి మొదటి మిల్లులో సామర్థ్యం మేరకు కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే మరో మిల్లులో కొనుగోళ్లు ప్రారంభిస్తుంది. అప్పటి వరకు మిగిలిన మి ల్లుల్లో ఎలాంటి కొనుగోళ్లు ఉండవు.

ఈ విధం గా నల్గొండ జిల్లాలో మొత్తం 23 జిన్నింగ్‌ మిల్లులు ఉండగా కేవలం 7 మిల్లుల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో మిగిలిన మిల్లు ల పరిధిలోని రైతులు ఈ ఏడు మిల్లులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా రైతులపై రవాణా భారం పడుతున్నది. ఈ కొత్త విధానాన్ని ఎత్తేయాలని జిన్నింగ్‌ మిల్లులు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పత్తి కొనుగోలు భారం నుంచి తప్పించుకొనేందుకే సీసీఐ ఉన్నతాధికారులు ఇలాంటి కుట్రలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు నష్టపోయినా పర్వాలేదు.. ప్రభుత్వానికి నష్టం రావొద్దనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చేతులెత్తేసిన మార్కెటింగ్‌ శాఖ

సీసీఐ పత్తి కొనుగోలులో ఇష్టారీతిగా కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన మార్కెటింగ్‌ శాఖ చేష్టలుడిగి చూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ సచివాలయానికి, మార్కెటింగ్‌ శాఖకు తిరగడానికే సరిపోతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోలులో రైతుల ఇబ్బందులు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలో కూర్చొని సమీక్షలు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లి సీసీఐ అధికారులను కలిసి తేమ శాతం సడలింపుపై, కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల తొలగింపుపై ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

నిబంధనలు సడలించాలి

సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు బంద్‌ చేయాలని నిర్ణయించాం. కొన్ని మిల్లుల్లోనే కొనుగోలు చేయాలనే సీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. తద్వారా మిగిలిన మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడింది. అదే విధంగా రైతులు రవాణా ఖర్చులు భరించి ఇతర ప్రాంతాల మిల్లులకు పత్తిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. అదే విధంగా తేమ శాతాన్ని సైతం సడలించాలి.

రెండు రోజుల క్రితం సీసీఐ తీసుకున్న నిర్ణయం ఇటు మిల్లులకు, అటు రైతులకు శరాఘాతంగా మారింది. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 318 జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేసేది. కానీ శనివారం నుంచి సీసీఐ ఈ విధానాన్ని ఎత్తేసి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక జిల్లాలోని మిల్లులకు ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3.. ఇలా క్రమసంఖ్యను కేటాయిస్తుంది. క్లస్టర్ల వారీగా విభజించి మొదటి మిల్లులో సామర్థ్యం మేరకు కొనుగోళ్లు పూర్తయిన తర్వాతే మరో మిల్లులో కొనుగోళ్లు ప్రారంభిస్తుంది. అప్పటి వరకు మిగిలిన మి ల్లుల్లో ఎలాంటి కొనుగోళ్లు ఉండవు.

ఈ విధం గా నల్గొండ జిల్లాలో మొత్తం 23 జిన్నింగ్‌ మిల్లులు ఉండగా కేవలం 7 మిల్లుల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో మిగిలిన మిల్లు ల పరిధిలోని రైతులు ఈ ఏడు మిల్లులకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా రైతులపై రవాణా భారం పడుతున్నది. ఈ కొత్త విధానాన్ని ఎత్తేయాలని జిన్నింగ్‌ మిల్లులు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పత్తి కొనుగోలు భారం నుంచి తప్పించుకొనేందుకే సీసీఐ ఉన్నతాధికారులు ఇలాంటి కుట్రలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు నష్టపోయినా పర్వాలేదు.. ప్రభుత్వానికి నష్టం రావొద్దనే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీసీఐ పత్తి కొనుగోలులో ఇష్టారీతిగా కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన మార్కెటింగ్‌ శాఖ చేష్టలుడిగి చూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ సచివాలయానికి, మార్కెటింగ్‌ శాఖకు తిరగడానికే సరిపోతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోలులో రైతుల ఇబ్బందులు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. సచివాలయంలో కూర్చొని సమీక్షలు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లి సీసీఐ అధికారులను కలిసి తేమ శాతం సడలింపుపై, కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల తొలగింపుపై ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు బంద్‌ చేయాలని నిర్ణయించాం. కొన్ని మిల్లుల్లోనే కొనుగోలు చేయాలనే సీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. తద్వారా మిగిలిన మిల్లులు మూతపడే ప్రమాదం ఏర్పడింది. అదే విధంగా రైతులు రవాణా ఖర్చులు భరించి ఇతర ప్రాంతాల మిల్లులకు పత్తిని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. అదే విధంగా తేమ శాతాన్ని సైతం సడలించాలి.