/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz శ్రమ దోపిడీ కి వ్యతిరేకంగా ఉద్యమించాలి: ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ Mane Praveen
శ్రమ దోపిడీ కి వ్యతిరేకంగా ఉద్యమించాలి: ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్

నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ: కార్మిక వ్యతిరేక విధానాలు, మారిన కార్మిక చట్టాల నేపథ్యంలో.. శ్రమ దోపిడీ పెరుగుతుందని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్ అన్నారు. పాలక వర్గాలు కార్పొరేట్ శక్తుల తొత్తుగా మారాయని యూసుఫ్ విమర్శించారు.ఏఐటియుసి నల్లగొండ జిల్లా శిక్షణా తరగతులు సోమవారం మిర్యాలగూడ లో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి సయీద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో ఏఐటియుసి చరిత్ర, కార్మిక చట్టాలు అనే అంశంపై యూసుఫ్ బోధించారు. 

1920 లో ఆవిర్భావించిన ఏఐటియుసి.. స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరుగని పాత్ర పోషించిందని, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరింది మొదట ఏఐటియుసి అని యూసుఫ్ తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు ఆ తర్వాత స్వాతంత్ర్య భారతదేశంలోను అలుపెరుగని పోరాటాలతో హక్కులను సాధించిన ఘనత ఏఐటియుసికి దక్కుతుందన్నారు. 

ఎన్డీఏ పాలనలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో యాజమాన్యాల క్రింద కార్మికులు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మోడీకి కార్పొరేట్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం తెలియదని విమర్శించారు. 

సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచీకరణ, మతోన్మాదం, కార్మిక చట్టాల సవరణ ఇప్పుడు -అత్యంత వేగంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని దీనిని ప్రతిఘటించేందుకు సమరశీల పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలన్నారు. పాలకులు కార్మికులను కాదని యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నాయని, శ్రమకు తగిన వేతనం ఇప్పించడంలో విఫలమవుతున్నాయన్నారు. 

గతంలో కార్మిక చట్టాలు అత్యంత పదునుగా ఉండడంతో శ్రమకు తగిన రీతిలో కాకపోయినా కనీసం సగమైనా వేతనం లభించేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన పాలకులు యాజమాన్యాల సంక్షేమాన్ని చూస్తున్నారని యాజమాన్యాలకు వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు కార్మికుల గురించి ఆలోచించడం లేదన్నారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. పాలకులు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం నిర్వహించే పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుంతుంటే అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, ధరలు పెరగడం వల్ల కార్మిక మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఉద్యమ నేపథ్యం, కార్మికుల సమస్యలు, పోరాట మార్గాలపై దశ దిశ నిర్దేశం చేశారు. జిల్లాలోని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు ఎం.డి సయ్యద్, కె.ఎస్ రెడ్డి, పానం వెంకట్రావు, సహాయ కార్యదర్శులు నూనె వెంకటేశ్వర్లు, దోటి వెంకన్న, జిల్లా కోశాధికారి దోనకొండ వెంకటేశ్వర్లు, జిల్లా యాదయ్య, లింగా నాయక్,వలపట్ల వెంకన్న, శంతాబాయి, డి.రాణి, సుజిత, వనజ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

NLG: ఎన్జీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సోమవారం
యన్ యస్ యస్ యూనిట్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవం గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ చిత్ర పటానికి వైస్ ప్రిన్సిపాల్  డా. పరంగి రవి కుమార్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ మేరకు ఇంచార్జ్  ప్రిన్సిపాల్ డా. పరంగి రవి కుమార్ మాట్లాడుతూ.. ఉన్నత విద్య తో ఉన్నత వికాసమని ,   కనీసం ప్రాథమిక విద్యను పొందడం ప్రతి వ్యక్తి యొక్క జన్మహక్కు అని, పద్నాలుగు సంవత్సరాల లోపు బాల,బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించిన ఆధునిక భారత విద్యా నిర్మాత మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అని తెలిపారు.

దేశంలో ఉన్నత  విద్య ,సాంకేతిక విద్య మరియు పరిశోధనల పురోగతిలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఎనలేని సేవ చేశాడని ఆయన జయంతి ని జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటున్నామని అని పేర్కొన్నారు.


యన్ యస్ యస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, యన్ కోటయ్య, కె. శివరాణి, ఏ.మల్లేశం, అనిల్ కుమార్, యమ్. సావిత్రి, బోధన మరియు బోధనేతర సిబ్బంది యన్ యస్ యస్ వాలంటీర్స్, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.
NLG: చేతి వృత్తుదారుల సంఘం మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా రామలింగాచారి
NLG: చేతి వృత్తుదారుల సంఘం మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా రామలింగాచారి
NLG: మిడ్ డే మిల్స్ బిల్లులు స్వాహా చేసిన హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి
చండూరు ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్, మిడ్ డే మీల్స్ బిల్లులను తన సొంత అకౌంట్లో వేసుకుని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ, ఆయన పై శాఖ పరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా,  జిల్లా కలెక్టర్ త్రిపాఠి కి వినతి అందజేశారు.ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, బీసీ రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ లు వినతి ఇచ్చారు.


వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్, మధ్యాహ్నం భోజనం వండే మహిళ కార్మికురాలు స్వాతిముత్యం, సంఘం సభ్యులను  డైలీ వైజ్ లేబర్ గా పనులకు వినియోగించుకుంటూ వారి సమభావన సంఘం అకౌంట్లో డబ్బులు జమ చేయకుండా, సరుకులు, సామాన్లు, వంట సామాగ్రి తానే స్వయంగా తీసుకొచ్చి వంటలు వండించడం జరిగిందని.. సుమారు పది సంవత్సరాలుగా పూర్వపు హెడ్మాస్టర్, ప్రస్తుతం పని చేస్తున్న హెడ్మాస్టర్ లు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాల్సిన ప్రధానోపాధ్యాయులుగా గత పది సంవత్సరాలుగా మధ్యాహ్నం భోజన బిల్లును స్వాహా చేయడం జరిగిందని ఆరోపించారు.

సాంఘిక సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్ మాదిరిగా బిల్లులను తన సొంత అకౌంట్లో వేసుకొని సమబావన సంఘాన్ని డైలీ లేబర్ గా మార్చి వారికి రావాల్సిన బిల్లుని స్వాహా చేయడం జరిగిందని చెప్పారు.

గత పది సంవత్సరాలుగా జరిగిన అవినీతి పై పూర్తిగా విచారణ చేసి 10 సంవత్సరాల మెనూ బిల్లులు సమ భావన  సంఘానికి అందే విధంగా చూడాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కామల్ల నరేష్ కుమార్, కొండన్న, బాకీ తరుణ్, తదితరులు పాల్గొన్నారు.
NLG: రైస్ మిల్లర్లు, రైతులకు పలు కీలక సూచనలు జారీ చేసిన జిల్లా కలెక్టర్

నల్లగొండ: జిల్లాలో 2024 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రైస్ మిల్లర్లు, రైతులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఏ రైస్ మిల్లరు మద్దతు ధర కన్నా తక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు అని కలెక్టర్ తెలిపారు

ఎవరైనా రైస్ మిల్లర్ మద్దతు ధర కన్నా తక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను మోసం చేసినట్లయితే రైస్ మిల్లును సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

అంతేగాక అన్ని రకాల లైసెన్స్ లను రద్దు చేయడం జరుగుతుందని (ఉదాహరణకు మార్కెటింగ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, పొల్యూషన్ లైసెన్స్ ,విద్యుత్ లైసెన్స్ వంటివి) తెలిపారు.

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధరను,బోనస్ ను పొందాలని విజ్ఞప్తి చేశారు.

TG: శ్రీ కురుమూర్తి దేవాలయం ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు

మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గంలోని పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి దేవాలయానికి ఘాట్ రోడ్డు కావాలని దశాబ్ధ కాలంగా ఎదురుచూస్తున్న వెంకన్న భక్తుల కోసం.. ఆర్ & బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో 110 కోట్ల రూపాయలు మంజూరు చేసి, ఈ రోజు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు.

పదేండ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పాలమూరు జిల్లా పాడి పంటలతో పచ్చబడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు.

NLG: జిల్లా కలెక్టర్, ఎస్పీ లను కలిసిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే టీం
నల్గొండ పట్టణంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో భాగంగా నేడు నల్గొండ ఆర్డిఓ , మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఎన్యూమరేటర్లు మరియు సూపర్‌వైజర్లు సహకారంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లను కలిసి వారి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలన్నారు.
NLG: 2 వ ఏ.ఎన్.ఎం ల రాష్ట్ర మహాసభ ను జయప్రదం చేయాలి: తోట రామాంజనేయులు
నల్లగొండ:
పరీక్ష తేదీ ఖరారు చేసిన ఏఎన్ఎం ల నోటిఫికేషన్ లో ఉన్న 1931 పోస్టులకుకు మరో  3000 పోస్టులను పెంచి.. వయసు మీరి పరీక్ష రాయటానికి అర్హత లేని రెండో ఏఎన్ఎం లకు100 % గ్రాస్ శాలరీ తో పాటు రిటైర్మెంట్ సమయంలో 10 లక్షల లైఫ్ గ్రాట్యుటీ ఇవ్వాలి. పరీక్ష రాసి ఉద్యోగ అర్హత సాధించలేని రెండో ఏఎన్ఎం లకు 100% గ్రాస్ శాలరీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రెండో ఏఎన్ఎం ల సంఘం, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నెల 17న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరుగుతున్న రెండవ ఏఎన్ఎంల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ నల్లగొండ లో జరిగిన జిల్లా రెండో ఏఎన్ఎంల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 

గతంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో రెండవ ఏఎన్ఎం సమస్యలు పరిష్కరించాలని నిలవధిక సమ్మె చేసినట్లు ఆయన గుర్తు చేశారు. సమ్మె సమయంలో గత ప్రభుత్వం మరియు నేటి ప్రభుత్వ నాయకులు హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదన్నారు. రెండు నెలల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మూడు నెలల సమయం కావాలని తెలిపినట్లు వారు తెలిపారు. ఈనెల 17వ తేదీ నాటికి మూడు నెలల సమయం అవుతుండగానే పరీక్ష తేదీని విడుదల చేయడాన్ని ప్రశ్నించారు.

గత 17 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లకు తొలి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. అందులో భాగంగానే డిపార్ట్మెంటల్ పరీక్ష ద్వారా వీరికి నియమకాలు చేపట్టేలా అవకాశం ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్, తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రత్నకుమారి , జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల గీతా రాణి, ఉపాధ్యక్షురాలు పుష్ప లత , సహాయ కార్యదర్శి అరుణ మేరీ, హైమావతి, సరిత, రమాదేవి, సాలమ్మ, వసుమతి, పద్మ, నాగమణి, సునీత, భాగ్యలక్ష్మి, రేణుక, శ్రీలత, సునిత కుమారి, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
నల్గొండ పట్టణంలోని టీఎన్జీవో భవనం లో,యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజు  నవంబర్ 11 సందర్భంగా, నేషనల్ ఎడ్యుకేషన్ డే ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ కె.చాంద్ పాష అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డా.యేకుల రాజారావు, డా.అన్సారీ, మసియుద్దిన్, ఖాజ ముహిత్, కొండ లలిత హజరయ్యారు.జిల్లా కమిటీ సభ్యులు రఫీ, షేక్ సద్దాం, జహంగీర్, రియాజ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
NLG: కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు ఇవ్వాలి: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు
నల్లగొండ: కాటమయ్య రక్షణ కవచాలను కల్లుగీత వృత్తి చేసే నిజమైన గీత కార్మికులకు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు అన్నారు. శనివారం నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు మాట్లాడుతూ..  రాజకీయాలకు అతీతంగా నిజమైన కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలని ఆయన అన్నారు.

కాటమయ్య రక్షణ కవచాలను అర్హులకు ఇవ్వకుండా వృత్తిలో లేనివారికి ఇవ్వడం వలన నిజమైన కల్లుగీత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు గీత కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చి అమలు చేయడంలో విస్మరించిందని విమర్శించారు. జిల్లాలో 25 వేల మంది కల్లుగీత వృతి పై ఆధారపడి జీవిస్తున్నారని, తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాది మంది గీత కార్మికులు కాళ్లు, చేతులు విరగడం,నడుము విరిగిపోవడం, చనిపోవడం జరుగుతుందన్నారు. ప్రమాదాలు నివారించడానికి తక్షణమే సేఫ్టీ మోకులు అందించి గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన అన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి భూములకు ధరలు పెరగడంతో తాటి, ఈత చెట్లను నరికి వేస్తున్నారని, ఎన్నోసార్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన నామ మాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

తాటి,ఈత చెట్లను నరికిన వారిపై నాన్ బేయిలబుల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించే విధంగా చట్టం తీసుకురావాలని అన్నారు. గత ప్రభుత్వం నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ ఏర్పాటు చేసిందని, దీనిని టాడి కార్పొరేషన్ ద్వారా నిర్వహించి జిల్లాలకు విస్తరింప చేయాలని కోరారు.

ప్రమాదానికి గురై చనిపోయిన కుటుంబాలకు,శాశ్వత వికలాంగులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా నెలరోజుల్లోపు ఇవ్వాలని, మెడికల్ బోర్డు విధానం తొలగించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పామన గుండ్ల అచ్చాలు, జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల గోపాల్, జిల్లా సహాయ కార్యదర్శిలు రాచకొండ వెంకట్ గౌడ్,  జెర్రిపోతుల ధనంజయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.