/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: 2 వ ఏ.ఎన్.ఎం ల రాష్ట్ర మహాసభ ను జయప్రదం చేయాలి: తోట రామాంజనేయులు Mane Praveen
NLG: 2 వ ఏ.ఎన్.ఎం ల రాష్ట్ర మహాసభ ను జయప్రదం చేయాలి: తోట రామాంజనేయులు
నల్లగొండ:
పరీక్ష తేదీ ఖరారు చేసిన ఏఎన్ఎం ల నోటిఫికేషన్ లో ఉన్న 1931 పోస్టులకుకు మరో  3000 పోస్టులను పెంచి.. వయసు మీరి పరీక్ష రాయటానికి అర్హత లేని రెండో ఏఎన్ఎం లకు100 % గ్రాస్ శాలరీ తో పాటు రిటైర్మెంట్ సమయంలో 10 లక్షల లైఫ్ గ్రాట్యుటీ ఇవ్వాలి. పరీక్ష రాసి ఉద్యోగ అర్హత సాధించలేని రెండో ఏఎన్ఎం లకు 100% గ్రాస్ శాలరీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రెండో ఏఎన్ఎం ల సంఘం, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నెల 17న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరుగుతున్న రెండవ ఏఎన్ఎంల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ నల్లగొండ లో జరిగిన జిల్లా రెండో ఏఎన్ఎంల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 

గతంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో రెండవ ఏఎన్ఎం సమస్యలు పరిష్కరించాలని నిలవధిక సమ్మె చేసినట్లు ఆయన గుర్తు చేశారు. సమ్మె సమయంలో గత ప్రభుత్వం మరియు నేటి ప్రభుత్వ నాయకులు హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలుకు నోచుకోలేదన్నారు. రెండు నెలల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మూడు నెలల సమయం కావాలని తెలిపినట్లు వారు తెలిపారు. ఈనెల 17వ తేదీ నాటికి మూడు నెలల సమయం అవుతుండగానే పరీక్ష తేదీని విడుదల చేయడాన్ని ప్రశ్నించారు.

గత 17 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎం లకు తొలి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. అందులో భాగంగానే డిపార్ట్మెంటల్ పరీక్ష ద్వారా వీరికి నియమకాలు చేపట్టేలా అవకాశం ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్, తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రత్నకుమారి , జిల్లా ప్రధాన కార్యదర్శి రాయల గీతా రాణి, ఉపాధ్యక్షురాలు పుష్ప లత , సహాయ కార్యదర్శి అరుణ మేరీ, హైమావతి, సరిత, రమాదేవి, సాలమ్మ, వసుమతి, పద్మ, నాగమణి, సునీత, భాగ్యలక్ష్మి, రేణుక, శ్రీలత, సునిత కుమారి, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
నల్గొండ పట్టణంలోని టీఎన్జీవో భవనం లో,యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజు  నవంబర్ 11 సందర్భంగా, నేషనల్ ఎడ్యుకేషన్ డే ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్ కె.చాంద్ పాష అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డా.యేకుల రాజారావు, డా.అన్సారీ, మసియుద్దిన్, ఖాజ ముహిత్, కొండ లలిత హజరయ్యారు.జిల్లా కమిటీ సభ్యులు రఫీ, షేక్ సద్దాం, జహంగీర్, రియాజ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
NLG: కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు ఇవ్వాలి: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు
నల్లగొండ: కాటమయ్య రక్షణ కవచాలను కల్లుగీత వృత్తి చేసే నిజమైన గీత కార్మికులకు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు అన్నారు. శనివారం నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు మాట్లాడుతూ..  రాజకీయాలకు అతీతంగా నిజమైన కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలని ఆయన అన్నారు.

కాటమయ్య రక్షణ కవచాలను అర్హులకు ఇవ్వకుండా వృత్తిలో లేనివారికి ఇవ్వడం వలన నిజమైన కల్లుగీత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు గీత కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చి అమలు చేయడంలో విస్మరించిందని విమర్శించారు. జిల్లాలో 25 వేల మంది కల్లుగీత వృతి పై ఆధారపడి జీవిస్తున్నారని, తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాది మంది గీత కార్మికులు కాళ్లు, చేతులు విరగడం,నడుము విరిగిపోవడం, చనిపోవడం జరుగుతుందన్నారు. ప్రమాదాలు నివారించడానికి తక్షణమే సేఫ్టీ మోకులు అందించి గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన అన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి భూములకు ధరలు పెరగడంతో తాటి, ఈత చెట్లను నరికి వేస్తున్నారని, ఎన్నోసార్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన నామ మాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

తాటి,ఈత చెట్లను నరికిన వారిపై నాన్ బేయిలబుల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించే విధంగా చట్టం తీసుకురావాలని అన్నారు. గత ప్రభుత్వం నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ ఏర్పాటు చేసిందని, దీనిని టాడి కార్పొరేషన్ ద్వారా నిర్వహించి జిల్లాలకు విస్తరింప చేయాలని కోరారు.

ప్రమాదానికి గురై చనిపోయిన కుటుంబాలకు,శాశ్వత వికలాంగులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా నెలరోజుల్లోపు ఇవ్వాలని, మెడికల్ బోర్డు విధానం తొలగించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పామన గుండ్ల అచ్చాలు, జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల గోపాల్, జిల్లా సహాయ కార్యదర్శిలు రాచకొండ వెంకట్ గౌడ్,  జెర్రిపోతుల ధనంజయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చండూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులుగా గ్యార యాదగిరి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల,చండూరు ప్రిన్సిపాల్ అర్జున్ ఆధ్వర్యంలో శనివారం పేరెంట్స్ కమిటీ ఎలక్షన్లు నిర్వహించారు.

ఈ మేరకు అధ్యక్షుడిగా గ్యార యాదగిరి, ఉపాధ్యక్షులుగా వి.సుష్మ,
జనరల్ సెక్రెటరీ- రాజు, ఆర్గనైజేషన్ సెక్రెటరీ - సుధా, ట్రెజరర్ - చంద్రశేఖర్ లు ఎన్నికయ్యారు.

అదేవిధంగా కమిటీ మెంబర్స్ గా రాజు, రామస్వామి, నాగయ్య, విజయలక్ష్మి, వసంత, దీప ఎన్నికయ్యారు.

పేరెంట్స్ కమిటీ సలహాదారులుగా రవీందర్ రెడ్డి, బిక్షం, శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
NLG: హాకీ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
నల్గొండ పట్టణంలోని మాధవ్ నగర్ JBS ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ MD అలీమ్ మరియు హాకీ కోచ్ మనోరంజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని శనివారం  ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు సందర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు సెలవు దినాల్లో కూడా స్వయంగా శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, జేబీఎస్ హైస్కూల్ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో క్రీడలను ప్రాక్టీస్ చేస్తున్నారని.. భవిష్యత్తులో చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, మా స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా అన్ని రకాల క్రీడాకారులను వెలికితీసి వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
TG: సంగెం భీమలింగేశ్వరుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం:

మూసి పరివాహక ప్రాంత ప్రజలు కోరుకుంటున్నట్టుగానే సంగెం భీమలింగేశ్వరుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కాలుష్యమయమైన మూసీకి పునరుజ్జీవం తేవాలని, సీఎం తన జన్మదినం రోజున శుక్రవారం సంగెం మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసి సంకల్పం తీసుకున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాదు నుండి వచ్చి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుని సంగమస్థలి మూసీ ఒడ్డున భీమలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పడవలో ప్రయాణించి కలుషితాలతో ప్రవహిస్తున్న మూసీ ప్రవాహాన్ని పరిశీలించారు. మూసీ వెంట పాదయాత్ర చేస్తూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

సంగెం - నాగిరెడ్డిపల్లి రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు. మూసీ కాలుష్య కాసారంగా మారిన కారణంగా తలెత్తుతున్న విష పరిణామాలను వివరించారు. సీఎం తన జన్మదినం రోజున దర్శించుకుని మూసీ పునరుజ్జీవం చేస్తామన్న సంకల్పం తీసుకోవడంతో జన్మ ధన్యమైందిగా భావిస్తానని చెప్పారు.

మూసీ పునరుజ్జీవ సంకల్పంలో భాగంగా 2025 జనవరి మొదటి వారంలో మూసీ, కృష్ణా నదిలో కలిసే వాడపల్లి నుండి చార్మినార్ వరకు పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు.మూసీ కాలుష్యం అణుబాంబు కన్నా ప్రమాదకరంగా మారిందని, పరీవాహక ప్రాంతాలకు వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

కొందరు మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని, అలా చేస్తే పౌరుషాల గడ్డ నల్గొండ జిల్లా ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. అనంత పద్మనాభుడి పాదాల చెంత పుట్టిన మూసీని ప్రక్షాళన చేయడానికి దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చారని, ప్రతి ఒక్కరూ జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

రేవంత్ రెడ్డి పైన నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన కొత్త పాటను విడుదల చేశారు. అలాగే సంగెం గ్రామానికి చెందిన సురుకంటి రాజేందర్ మూసీ ప్రక్షాళన అంశంపై రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

TG: ఏసీబీకి పట్టుబడ్డ వర్ణి ఎస్ఐ
ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు  పట్టుబడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా, వర్ణి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్సై) బి. కృష్ణ కుమార్.. BNSS భా.న్యా. సు.సం. సెక్షన్ 35 ప్రకారం నోటీసు ఇవ్వడానికి ఓ రైతు వద్ద నుండి రూ.20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
NLG: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు ఎంపిక
నల్లగొండ: ఈనెల 11 ,12,13 తేదీలలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే  రాష్ట్ర 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల  U/17 రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు, ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియను, పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం నల్లగొండ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దగ్గుపాటి విమల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలికలు పాఠశాల స్థాయి నుండి క్రీడల పై ఆసక్తి పెంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఈ ఎంపికల ప్రక్రియలో ఉమ్మడి జిల్లా నుండి 80 మంది క్రీడాకారిణిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయమ ఉపాధ్యాయులు మెర్సీ ప్రభావతి, రవీందర్, బోనగిరి శ్రీనివాసులు, గుండా శ్రీనివాస్, కవిత, ఇమామ్ కరీం, శంభు లింగం, గఫర్ తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ: మరోసారి సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా ఏర్పుల యాదయ్య ఎన్నిక
నల్లగొండ జిల్లా:
సిపిఎం పార్టీ మర్రిగూడ మండల 8వ మహాసభలో కార్యదర్శిగా రెండోసారి ఏకగ్రీవంగా ఏర్పుల యాదయ్య ఎన్నికయ్యారు. సభ్యులుగా నీలకంఠం రాములు, కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, దామెర లక్ష్మి, గడగోటి  వెంకన్న, మైల  సత్తయ్య, లను ఎన్నుకున్నారు.

ఈ మేరకు ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. పేద ప్రజల సమస్యల కోసం, ఇండ్లు ఇండ్ల స్థలాలు, పెన్షన్స్, రేషన్ కార్డులు, మండలంలో ఉన్నటువంటి వివిధ సమస్యలపై పోరాటం చేస్తాం,  పేద ప్రజలు లబ్ది పొందే వరకు  పోరాటాలు చేస్తామని ఆయన అన్నారు. కార్మిక కర్షకుల కోసం ఎర్రజెండా అండగా ఉంటుందని వారి పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు.
NLG: రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన నల్లగొండ విద్యార్థిని
నల్గొండ: పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని  లుబ్నంతన్వీర్, మేడ్చల్ జిల్లాలో జరగబోయే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్ 17 బాలికల చెస్ పోటీలకు ఎంపికైందని శుక్రవారం, ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన విద్యార్థిని అభినందించారు. ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించి, చెస్ క్రీడలో ఉన్నత స్థాయి క్రీడాకారిణిగా రాణించాలని ఆకాంక్షించారు.