/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz 370 అధికరణపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ Raghu ram reddy
370 అధికరణపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాను, కశ్మీర్‌లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు.

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో కేంద్రం రద్దు చేసిన 370వ అధికరణ (Article 370)ను దేశంలోని ఏ శక్తి పునరుద్ధరించ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెగేసి చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతంలో (జమ్మూకశ్మీర్) కాంగ్రెస్ పార్టీ కుట్రలను మహారాష్ట్ర ఓటర్లు గుర్తించాలని హెచ్చరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధులేలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ శుక్రవారంనాడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ ఎజెండాను, కశ్మీర్‌లో వేర్పాటువాద భాషను ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టాలన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను తిరిగి పునరుద్ధరించాలంటూ రెండ్రోజుల క్రితం అక్కడి అధికార 'ఇండియా' కూటమి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ కుట్రలను మహారాష్ట్ర ప్రజలు అవగాహన చేసుకోవాలని, 370వ అధికరణపై అక్కడి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని దేశం అంగీకరించిందని అన్నారు. ఏ శక్తి కూడా ఆ అధికరణను వెనక్కి తేలేదని స్పష్టం చేశారు. 370వ అధికరణకు మద్దతుగా అసెంబ్లీ వెలుపల బ్యానర్లు పెట్టారు. ఆ అధికరణను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ కూటమి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.. దీనిని దేశ ప్రజలు ఆమోదిస్తారా? ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు శక్తవంచన లేకుండా నిరసన తెలిపినప్పటికీ వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించేశారు. కాంగ్రెస్ కూటమి నిజస్వరూపం ఏమిటో యావద్దేశం అవగాహన చేసుకోవాలి'' అని మోదీ అన్నారు.

370వ అధికరణను పునరుద్ధరించేందుకు దేశ ప్రజలు అంగీకరించరని, కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆటలు మోదీ ఉన్నంత వరకూ సాగవని ప్రధాని అన్నారు. బీమ్‌రావ్ అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే అక్కడ నడుస్తుందని, ఏ శక్తీ 370వ అధికరణను వెనక్కి తేలేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. విపక్ష సభ్యలు తీవ్ర ప్రతిఘటన, నిరసనల మధ్య జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 370వ అధికరణను పునరుద్ధరించే తీర్మానాన్ని గత శుక్రవారంనాడు మూజువాణి ఓటుతో ఆమోదించారు.

తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్ వచ్చింది.

తిరుమల లడ్డు వ్యవహారంపై త్వరలో విచారణ జరగనుంది. సీబీఐ నియమించిన బృందానికి సహాయపడేందుకు అదనంగా సిబ్బంది కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ అనుమతి తీసుకుని మరి కొంతమంది పోలీస్ అధికారులను, సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ కోసం సీబీఐ డైరెక్టర్ 5 గురు అధికారులను నియమించారు.

సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ ఏస్ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ IG సర్వశ్రేష్ఠ త్రిపాటి, విశాఖ రేంజ్ DIG జెట్టి గోపీనాథ్, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీ రంభ, FSSAI సలహాదారుడు డాక్టర్ సత్య కుమార్ పండా లను సీబీఐ నియమించింది. ఈ బృందం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పని చేస్తుందని సీబీఐ పేర్కొంది. అయితే, సీబీఐ నియమించిన బృందానికి మరి కొంతమంది అధికారులు, ఇతర స్టాఫ్ కావాలని అధికారులు కోరారు.

తిరుమల లడ్డూ అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో రకాల ప్రసాదాలున్నప్పటికి భక్తులకు తిరుమల లడ్డూ అంటే ఎంతో ప్రత్యేకం. అయితే, ఈ లడ్డూ న్యాణతపై గత కొంతకాలంగా విమర్శలు వస్తునే ఉన్నాయి. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతోపాటు అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ఓ లాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. దీనిని నిర్థారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం గుజరాత్ లోని ల్యాబ్‌కు పంపారు. ఆ రిపోర్టులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు తేలడంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. అయితే, ఈ సంఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

తిరుమల కల్తీ నెయ్యి వివాదం పరిశీలనకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ రంగంలోకి దిగింది. తిరుపతిలో సిట్ కోసం ప్రత్యేక కార్యలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్‌ని సీబీఐ అధికారులు పరిశీలించారు. త్వరలోనే క్షేత్ర స్థాయిలోకుడా సిట్ బృందం పరిశీలన చేయనుంది. ఇప్పటికే సిట్ అధికారులు పరిశీలించిన దర్యాప్తు నివేదికని సీబీఐ బృందం పరిశీలించే అవకాశం ఉంది. త్వరలోనే తిరుమలలోని ల్యాబ్, లడ్డు తయారీ పోటుని దర్యాప్తు బృందం పరిశీలించనుంది. టీటీడీకి నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీని కూడా సీబీఐ బృందం పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. విచారణను స్వయంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించనున్నారు..

గ్రామ గ్రామాన బీజేపీ జండా ఎగరాలి

రాబోయే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలి.

గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగిన మాట వాస్తవం. సమన్వయ లోపాలు ఓటమికి దారితిస్తాయి.

పెద్ద చిన్న అందరు కలిసికట్టుగా నిలబడి విజయం సాధించాలి అని ఆకాంక్షిస్తున్నాను. మోడీజీ పరిపాలననే బ్రమాస్త్రంగా ప్రజలకు వివరించాలి.

 మంగినపల్లి వెంకట చేతన్

 బీజేపీ రాష్ట్ర నాయకులు

తోపులాటలో ఇరుక్కుపోయిన తెలంగాణ మంత్రి

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తోపులాటలో చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది.

మంత్రి కొండా సురేఖ (Minister Konda surekha) తోపులాటలో ఇరుక్కుపోయారు. అవును.. మీరు విన్నది కరెక్టే. స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయిన కొండాసురేఖ తోపులాటలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురయ్యారు. చుట్టూ పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ తోపులాట నుంచి మంత్రిని బయటకు తీయలేని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ యాదాద్రిలో ఏం జరిగింది.. మంత్రి కొండా సురేఖ తోపులాటలో ఎలా ఇరుక్కుపోయారో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు (శుక్రవారం) యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి యాదాద్రి పర్యటన సందర్భంగా పెద్దఎత్తు ఆయన అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. సీఎంను చూసేందుకు ఎగబడ్డారు.

వారిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో తూర్పు గోపురం వద్ద పోలీసులు - కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ కూడా తూర్పుగోపురం వద్దకు వచ్చారు. అంతలోనే తోపులాట చోటు చేసుకోవడంతో మంత్రి కూడా అందులో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక తోపులోటలో కాసేపు మంత్రి విలవిలలాడి పోయారు. చివరకు ఎలాగోలా పోలీసులు.. మంత్రి కొండా సురేఖను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాటతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తానికి కార్యకర్తలను అదుపు చేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు.

మైనారిటీ హోదాపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ విద్యాసంస్థా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్ట్ కీలకమైన తీర్పు ఇచ్చింది.

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (AMU) మైనారిటీ విద్యాసంస్థా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్ట్ ఇవాళ (శుక్రవారం) కీలకమైన తీర్పు వెలువరించింది. ఏఎంయూకు మైనారిటీ హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. ఏఎంయూకి మైనారిటీ హోదాను తొలగిస్తూ 1967లో ఇచ్చిన తీర్పును న్యాయస్థానం రద్దు చేసింది. ఈ మేరకు రాజ్యాంగ ధర్మాసనం 4:3 అనుకూల తీర్పు ఇచ్చింది. అయితే మైనారిటీ హోదా కల్పించే అంశంపై తుది నిర్ణయాన్ని మరో బెంచ్‌కు అప్పగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ అంశంపై విచారణకు మరో బెంచ్ ఏర్పాటు కానుంది.

చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీర్పును చదివారు. ధర్మాసనంలో నాలుగు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని వెల్లడించారు. మెజారిటీ తీర్పును తానే స్వయంగా రాశానన్నారు. జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్ మిశ్రా, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్ దత్తా, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ వేర్వేరుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

కాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని 1920లో స్థాపించారు. భారత రాజ్యాంగం ప్రకారం మైనారిటీ సంస్థగా గుర్తించవచ్చా లేదా అనే అంశం దీర్ఘకాలంగా వివాదాస్పద చర్చ నడుస్తోంది.

తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సుప్రీంకోర్టులో కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను నేడు విచారించనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిని(Tirumala) కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ అంశంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేయనుంది. తిరుమల దేవాలయాల నిర్వహణ పాలకమండలి చేతిలో కాకుండా పూజారుల చేతుల్లో ఉంచాలని కేఏ పాల్ పిటిషన్‌లో కోరారు.

దీంతోపాటు దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని పాల్ అన్నారు. తిరుమల దేవాలయానికి వచ్చే వేల కోట్ల ఆదాయం దుర్వినియోగం అవుతుందని కేఏ పాల్ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, సీబీఐ, డీజీపీలను ప్రతివాదులుగా చేరుస్తూ కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు.

కేవలం 744 మంది కేథలిక్కులున్న వాటికన్ సిటీని ప్రత్యేక ప్రాంతంగా గుర్తించారని ఈ సందర్భంగా కేఏ పాల్ ప్రస్తావించారు. ఇదే సమయంలో లక్షలాది మంది భక్తులకు ప్రాధాన్యత ఉన్న తిరుపతిని కూడా ఆ విధంగా చేయాలని పాల్ కోరారు. 100 రోజుల సంకీర్ణ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారని విమర్శించారు. జులైలో లభించే లడ్డూల నాణ్యతపై ల్యాబ్ రిపోర్టును సెప్టెంబర్‌లోనే ఎందుకు తెప్పించారని, సమస్య ఏ సమయానికి వచ్చిందని ప్రశ్నించారు.

లడ్డూ వివాదానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కేఏ పాల్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. లడ్డూలలో ఎలాంటి కల్తీ లేదని, భక్తుల్లో అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని, లడ్డూల గురించి తదుపరి చర్చలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని పాల్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. అంతేకాదు తిరుమల లడ్డూల నాణ్యతపై తలెత్తిన వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ అవసరమని కేఏ పాల్ గతంలో అన్నారు.

కేఏ పాల్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో లడ్డూ వివాదం, తిరుపతికి కేంద్ర పాలిత హోదా కల్పించే రెండింటిపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు. మరి కేఏ పాల్ పిటిషన్ విషయంలో ధర్మాసనం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులకు రెట్టింపు జరిమానా

 దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ తీవ్రమవుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానాల్లో రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో రాజధాని ప్రాంతంలో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకూ తీవ్రమవుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ – ఎన్సీఆర్‌ ప్రాంతంలో గాలి నాణ్యత చాలా పేలవమైన స్థాయిలో నమోదవుతోంది. ఏక్యూఐ లెవల్స్‌ రాజధాని ప్రాంతంలో 400కుపైనే నమోదవుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానాల్లో రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో రాజధాని ప్రాంతంలో ఈ పరిస్థితి తలెత్తుతోంది.

కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రెట్టింపు జరిమానా విధించేలా నిబంధనలను (Farmers to face fines) సవరించింది. రూ.30 వేల వరకూ జరిమానాను పెంచింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. కేంద్ర నిబంధనల ప్రకారం.. రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రూ.5 వేల జరిమానా విధించనున్నారు. రెండు నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న వారికి రూ.10 వేలు, ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ.30 వేలు జరిమానా విధించనున్నారు.

కాగా, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత 367గా నమోదైంది. ఆనంద్‌ విహార్‌, జహంగీర్‌పురి, అశోక్‌ విహార్‌, బావన, ముంద్కల్‌, రోహిని, సోనియా విహార్‌, వివేక్‌ విహార్‌, వాజీపూర్‌.. ఈ తొమ్మిది ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో ఉందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఓ వైపు వాయు కాలుష్యంతో ఊపిరితీసుకోవడం ఇబ్బందికరంగా మారగా.. మరో వైపు నీటి కాలుష్యంతోనూ సతమతమవుతున్నారు. యయునా నదిలో కాలుష్య స్థాయి విపరీతంగా ఉన్నది.

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

తెలంగాణలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు అక్రమంగా విక్రయించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదులందాయి. దాంతో గతేడాది జూన్‌లో ఈడీ రంగంలోకి దిగి మాజీ మంత్రి మల్లారెడ్డితోపాటు ఇతర ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో పలు హార్డ్ డిస్క్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

 పీజీ మెడికల్ కాలేజీ సీట్లు అక్రమంగా విక్రయించారనే అభియోగాలపై మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డికి ఈడీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈ రోజు జరిగే విచారణకు హాజరు కావాలని ఆయనకు జారీ చేసిన నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. దీంతో ఈడీ ఎదుట విచారణకు మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఈడీకి ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో పలు మెడికల్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు విక్రయించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. అందులోభాగంగా గతేడాది జూన్‌లో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి నివాసం, మెడికల్ కాలేజీతోపాటు కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది.

అలాగే 12 మెడికల్ కాలేజీల్లో సైతం సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది.

రాష్ట్రంలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు.. ఈడీ తన సోదాల్లో గుర్తించింది. దాంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డితోపాటు వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

భారత్‌కు వరమా లేక శాపమా

అమెరికా విదేశాంగ విధానంలో డొనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాల్లో భారతదేశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలకులు మాత్రం పాకిస్తాన్‌కు ఇతోధికంగా సహకరిస్తూ పరోక్షంగా భారతదేశానికి నష్టం కలిగిస్తూ వచ్చారు. కానీ ట్రంప్ హయాంలోనే భారత్-అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయి.

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. యావత్ ప్రపంచంపై ఆ దేశం ప్రభావం అలాంటిది. 90వ దశకం తర్వాత నుంచి ఆ దేశం భారతదేశంపై చూపే ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ గతంలోనూ ఒక పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా పనిచేయడం, కొన్ని అంశాలపై ఆయన నిక్కచ్చి వైఖరి గురించి భారతదేశానికి, అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు ఇప్పటికే తెలుసు కాబట్టి.. “ట్రంప్ గెలిస్తే భారతదేశానికి లాభం.. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులకు మాత్రం నష్టం” అన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ విజయం భారత్‌కు వరమా లేక శాపమా అన్న విశ్లేషణ చాలా అవసరం. ముందుగా సానుకూలాంశాలను చర్చించుకుందాం.

అమెరికా విదేశాంగ విధానంలో ట్రంప్ ఆసియా దేశాల్లో భారతదేశానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత పాలకులు మాత్రం పాకిస్తాన్‌కు ఇతోధికంగా సహకరిస్తూ పరోక్షంగా భారతదేశానికి నష్టం కలిగిస్తూ వచ్చారు. కానీ ట్రంప్ హయాంలోనే భారత్-అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయి. ఆయన హయాంలోనే అమెరికాతో భారత్ అతి పెద్ద రక్షణ ఒప్పందం చేసుకుంది. అంతేకాదు, మూలనపడ్డ క్వాడ్ కూటమి (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్)ని పునరుద్ధరించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. భారతదేశానికి సరిహద్దుల్లో సమస్యలు సృష్టించడంతో పాటు భారత మార్కెట్‌పై గుత్తాధిపత్యానికి ప్రయత్నాలు చేస్తున్న చైనా పట్ల ట్రంప్ అనుసరించే వైఖరి మన దేశానికి కలిసొచ్చే అంశం.

అలాగే భారతదేశానికి చిరకాల మిత్రదేశం రష్యా పట్ల ట్రంప్ వైఖరి డెమోక్రాట్ల మాదిరిగా లేదు. పైగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన తర్వాత భారత్ ఏ పక్షానికి మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని అవలంబిస్తూ రష్యాతో సత్సంబంధాలను కొనసాగించింది. ఇది పశ్చిమ దేశాలకు నచ్చలేదు. ఇప్పుటు ట్రంప్ రాకతో ప్రపంచ పరిణామాల్లో చోటుచేసుకునే మార్పులు భారత్‌కు అనుకూలంగా మారతాయని ఆశించవచ్చు. ఎందుకంటే.. ట్రంప్ కూడా భారత్ మాదిరిగానే ఉక్రెయిన్ – రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని, చర్చలతోనే పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛ గురించి అమెరికా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటుంది. కానీ ట్రంప్ హయాంలో అలాంటి జోక్యమేదీ కనిపించలేదు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. పైగా మోదీ-ట్రంప్ మధ్య వ్యక్తిగత స్థాయిలో కూడా మంచి సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్ కోసం మోదీ అమెరికాలో పరోక్షంగా ప్రచారం కూడా చేశారు. అలాగే గుజరాత్ వచ్చినప్పుడు ట్రంప్ సైతం మోదీని కొనియాడి తమ స్నేహాన్ని చాటుకున్నారు. కాబట్టి రానున్న నాలుగేళ్ల పాటు భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం, వ్యాఖ్యానాలు ఉండబోవని ఆశించవచ్చు.

ఏందయ్యా సీఐ.. ఏంటీ పని

సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారింది. ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటికి వెళ్లి మరీ సీఐ దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. గుణదలలో ఎస్‌ఎల్వీ కైలాస్ హైట్స్, రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

తమ గోడను కూలగొట్టారంటూ ఎస్‌ఎల్వీ యజమాని ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 23న దేవినేని శ్రీహరిపై గుణదలలో కేసు నమోదు చేశారు.

ఆ తరువాత సీఐ శ్రీనివాస్ ఏకంగా దేవినేని శ్రీహరి ఇంటికి వెళ్లి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యక్తిగత కక్షతోనే సీఐ దాడికి పాల్పడ్డారని, రౌడీ షీట్ తెరుస్తానని బెదిరించారని దేవినేని శ్రీహరి ఆరోపిస్తున్నారు.

సివిల్ వివాదంలో సీఐ తలదూర్చడంపై సర్వాత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో మాజీ సీపీ కాంతీరాణాకు నమ్మిన బంటుగా వ్యవహరించారని సీఐ శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి.