/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: నేడు యాదగిరిగుట్ట కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి.. వలిగొండ మండలంలో పాదయాత్ర Mane Praveen
NLG: నేడు యాదగిరిగుట్ట కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి.. వలిగొండ మండలంలో పాదయాత్ర
యాదాద్రి జిల్లా:
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఉదయం  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు. స్వామి వారి దర్శనానంతరం మూసీ పునరుజ్జీవన సంకల్ప యాత్రలో భాగంగా మూసి నది ఒడ్డున వలిగొండ మండలం సంగెం నుండి భీమలింగం వరకు పాదయాత్ర చేపడుతారు.

సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గం 9.00 లకు హైదరాబాద్ బేగంపేట్ నుండి హెలికాప్టర్‌ లో యాదగిరిగుట్టకు బయలుదేరుతారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గం.10.10 లకు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి  సమీక్షిస్తారు.

తదుపరి రోడ్డు మార్లంలో వలిగొండ మండలంలోని సంగెం గ్రామం నుండి  మధ్యాహ్నం గం. 2.15 లకు మూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్ర చేపడుతారు. సంగెం నుండి పాదయాత్రగా మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తారు.

అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంగెం - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి  ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుండి హైదరాబాద్‌ కు తిరుగు ప్రయాణం అవుతారు.
ఈ నెల 17, 18 తేదీలలో గ్రూప్-3 పరీక్షలు...TGPSC వెబ్సైట్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు: మేడ్చల్ కలెక్టర్ 
HYD: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 17, 18 తేదీలలో నిర్వహిస్తున్న గ్రూప్-III  పరీక్ష  పరీక్షలకు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 115 పరీక్షా కేంద్రాలలో 65,361 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని మేడ్చెల్ మల్కాజిగిరి జల్లా కలెక్టరు గౌతం పొట్రు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పరీక్షలు రెండు  సెషన్‌లు ఉంటాయని  17 న పేపర్-1-- 10:00 AM నుండి 12:30 PM వరకు, పేపర్-2-- 3:00 PM నుండి 05:30 PM వరకు మరియు 18న పేపర్ 3-10:00 AM నుండి 12:30 PM వరకు నిర్వహించడం  జరుగుతుందని అభ్యర్థులు 10.11.2024 నుండి కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కలెక్టరు సూచించారు.

పరీక్ష రోజు ఉదయం 08:30 గంటల నుండి ముందస్తు సెషన్‌కు మరియు మధ్యాహ్నం 1:30 గంటల నుండి మధ్యాహ్న సెషన్‌కు అభ్యర్థులు పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించబడతారు.

పరీక్షా కేంద్రం గేట్ ఉదయం 09:30 గంటలకు మరియు మధ్యాహ్నం సెషన్ కోసం మధ్యాహ్నం 2:30 గంటలకు మూసివేయబడుతుందని, గేట్లు మూసివేసిన తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరని పేర్కొన్నారు.

పరీక్షలకు మొదటి సెషన్‌కు ఉపయోగించిన హాల్ టికెట్ కాపీని మిగిలిన సెషన్‌లకు ఉపయోగించాలని సూచించారు.

తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ మరియు అన్ని సెషన్‌ల ప్రశ్నా పత్రాలను భద్రపరచుకోవాలని సూచించారు.

ఏదైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే అభ్యర్థులు TGPSC టెక్నికల్ హెల్ప్ డెస్క్‌ ఫోన్ నంబర్లు 040-23542185 లేదా 040-23542187 ను సంప్రదించవచ్చు లేదా కు ఇమెయిల్ చేయవచ్చు. హెల్ప్ డెస్క్ కాల్ టైమింగ్స్: 10:30 AM. నుండి 1:00PM & 1:30 PM నుండి 5:00PM. అన్ని పని దినాలలో సంప్రదించవచ్చని కలెక్టరు తెలిపారు.
NLG: ఎన్యుమరేటర్ కు తన ఇంటి వివరాలు తెలిపిన జిల్లా కలెక్టర్ త్రిపాఠి
నల్లగొండ: కలెక్టర్ ఇలా త్రిపాటి ఇంటికి సర్వే నిమిత్తం వచ్చిన ఎన్యుమరేటర్ కు జిల్లా కలెక్టర్ తన ఇంటి వివరాలు తెలిపారు.

ఇంటింటి సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్ ఆయేషా హమీరా, జిల్లా కలెక్టర్ త్రిపాటి ఇంటిని సంప్రదించి.. ఇంటి నెంబర్,ఇంటి యజమాని,తదితర వివరాలను అడిగి తెలుసుకొని ఇంటికి అతికించే స్టిక్కర్ పై నమోదు చేశారు. అనంతరం కలెక్టర్ ఇంటికి సర్వే స్టిక్కర్ అతికించారు.
NLG: 'కష్టజీవుల హక్కుల సాధనకై నిరంతరం పోరాడేది ఎర్రజెండా'
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ: నిరంతరం కష్టజీవుల పక్షాన, విద్యార్థులు, యువకులు, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనార్టీల హక్కుల సాధనకై నిత్యం పోరాడేది ఎర్రజెండా అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున అన్నారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల సిపిఐ(ఎం) ఎనిమిదవ మహాసభల్లో వారు పాల్గొని మాట్లాడారు.కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, కార్మిక, ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ అండగా నిలుస్తుందని అన్నారు. స్థానిక సంస్థల సంస్థలకు నిధులు కేటాయించి, అభివృద్ధి పనులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేది ఎర్రజెండా అని,ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ సిపిఐ ఎం ముందుకు వెళ్తుందని వారు చెప్పారు.

గత టిఆర్ఎస్ ప్రభుత్వం లాగ కాకుండా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం,  ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు చేసిన వాగ్దానాలను అన్ని అమలు చేయాలని అన్నారు. పంటలకు మద్దతు ధర రాక చేసిన అప్పులు తీరక రైతాంగం ఆత్మహత్యలకు నేటికీ పాల్పడుతున్నారు అని అన్నారు. అర్హులందరికీ రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని, రైతుకు భరోసా నిధులు విడుదల చేయాలని,రైతు బీమా వర్తింపచేయాలని, కౌలు రైతులకు వ్యవసాయ కార్మికులకు రూ.12,000.. మహిళలకు రూ.25, 000 చెల్లించాలని.. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కార్పొరేషన్లకు అధిక నిధులు కేటాయించాలని పేర్కొన్నారు.

ఇప్పటికైనా సర్వే అనంతరం ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు బోట్ట శివకుమార్, మండల కమిటీ సభ్యుడు నీలకంఠ రాములు కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, గడగూటి వెంకటయ్య, దామేర లక్ష్మమ్మ, రామలింగా చారి,
మల్ రెడ్డి నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
TG: ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ  డిఇఓ రవీందర్
మహబూబ్‌ నగర్‌:  డైట్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తూ, FAC జిల్లా విద్యాశాఖ అధికారి గా విధులు నిర్వహిస్తున్న ఆటి రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఓ ఫిర్యాదుదారుని భార్య యొక్క పదోన్నతికి సంబంధించి లంచం డిమాండ్ చేసి రూ. 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈవో ను అదుపులోకి తీసుకున్నారు.

ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయమని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు.
NLG: పత్తి,వరి ని తేమతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలి: బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా:
మునుగోడు: వరి,పత్తి పంటలను తేమతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించాలని, వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం మిర్యాల భరత్ అధ్యక్షతన జరిగింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామని చెప్పడంతో పాటు, సన్న వడ్లు పండించిన వారికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతాంగం సన్నవడ్లు ఎక్కువగా సాగు చేశారని వారికి బోనస్ 500 రూపాయలు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలలో దళారుల బెడద లేకుండా చూసి మద్దతు ధర ఇవ్వాలని వరి తేమ శాతం తో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన అన్నారు.

పత్తి రంగు మారిందని రైతులను మోసం చేస్తూ దళారులు ఊర్ల మీద ఎగబడి డిజిటల్ కాంటాలు పెట్టి తూకాలలో మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వస్తుందని అందుకే పత్తిని రంగు మారిన అన్ని రకాల పత్తిని తీసుకుని మద్దతు ధర కల్పించాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మిర్యాల భరత్, సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రి పోతుల ధనంజయ, సిపిఎం మునుగోడు మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు లింగస్వామి, మండల కమిటీ సభ్యులు యాసరాణి శ్రీను, యాట యాదయ్య, పగిల్ల మధు,  నరేష్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
నల్లగొండ: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో చర్చించి వినతి పత్రం అందజేశారు.

హౌసింగ్ సొసైటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు ఫహీమ్ జీ, గుండగోని జయశంకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పులి మామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్  ప్రెస్ క్లబ్ కోశాధికారి రవికుమార్, ఎలక్ట్రానిక్ మీడియా జనరల్ సెక్రెటరీ జానయ్య తదితరులు ఉన్నారు.
NLG: ఇంటింటికి స్టిక్కర్లు వేస్తున్న ఎన్యుమరేటర్లు
నల్లగొండ జిల్లా:
రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే భాగంగా, మర్రిగూడెం మండలం సరంపేట గ్రామంలో ఇవాళ, ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంటి తలుపుకు స్టిక్కర్లు వేస్తున్నారు.

ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. నేటి నుండి 9వ తారీకు వరకు కుటుంబాలను గుర్తిస్తూ స్టిక్కర్లు వేస్తున్నామని, 9వ తేదీ నుండి కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన వివరాలు సేకరిస్తామని తెలిపారు.
NLG: సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:
యరగండ్లపల్లి గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, బుధవారం మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్ పంపిణీ చేశారు. ముదం పద్మమ్మ భర్త వెంకటయ్య కు 54,000 రూపాయల చెక్కును, వల్లముల నర్సమ్మ కు 20,000 రూపాయల చెక్కు ను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు వరం లాంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద వినియోగించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాకులవరం అశోక్ రెడ్డి, పులిమామిడి నరసింహారెడ్డి,  ఏడుదోడ్ల కృష్ణ రెడ్డి, జమ్ముల వెంకటేష్ గౌడ్, ఎం.డీ.ఇబ్రయీమ్, వనపర్తి యాదయ్య, మామిడి అంజయ్య, సీత వెంకటయ్య, ఆకారపు శీను, కుక్కడపు ముత్యాలు, కాకులవరం పృద్విశ్ రెడ్డి,  బొమ్మిడి సుదర్శన్,నక్కరగోని కొండల్,కుక్కడుపు అంజయ్య, ముద్దం వెంకటయ్య, గోడ్డేటి వెంకటయ్య, మైలారం అంజయ్య, గజ్జి యాదయ్య, సిలివేరి యాదయ్య, పొలగోని అబ్బయ్య, పోలగొని యాదయ్య, ఏర్కలి రాములు, నక్కరగోని స్వామి, తోడేటి నాగరాజు, రాముని సంతోష్, పొలాగోని  శేఖర్, సురగొని శ్రీను, వల్లాముల శ్రీశైలం, బచ్చనగోని లింగం, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLG: మాల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సీసీఐ కేంద్రాలు ప్రారంభం
నల్లగొండ జిల్లా:
మాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు మంగళవారం చింతపల్లి మండలం లోని చింతపల్లి, కొంకిరాల తండా గ్రామాలలో పత్తి కొనుగోలు సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న రైతులు తాము పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధరను పొందాలని, దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని మోసపోవద్దని సూచించారు.

కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతం సంజీవరెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శీను యాదవ్, పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.