/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఘనంగా నాగుల చవితి వేడుకలు Raghu ram reddy
ఘనంగా నాగుల చవితి వేడుకలు

నాగుల చవితి అంటే నాగదేవతలను ఆరాధించే పండుగ. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాలుగవ రోజు అంటే చతుర్థినాడు నాగుల చవితిని జరుపుకుంటారు హిందువులు. కార్తీక మాసంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి ప్రధాన పండుగ. అలాగే కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు.

నగరంలో నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చోడవరం నాగేంద్ర స్వామిదేవాలయం, అయ్యప్ప నగర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకాలు చేస్తున్నారు. నాగుల చవితి సందర్భంగా దేవాలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయాలకు చేరుకుని పుట్టలో పాలు పోస్తుంటారు.

నాగుల చవితి అంటే నాగదేవతలను ఆరాధించే పండుగ. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాలుగవ రోజు అంటే చతుర్థినాడు నాగుల చవితిని జరుపుకుంటారు హిందువులు. కార్తీక మాసంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి ప్రధాన పండుగ. అలాగే కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతమంది ఇంట్లో నాగదేవత విగ్రహం పెట్టి పూజలు చేస్తారు. కానీ కొన్ని ప్రదేశాలలో భక్తులు పాము పుట్ట వద్దకు వెళ్లి నైవేద్యం సమర్పించి ఇతర పూజలు చేసి పాలు పోస్తారు. నాగుల చవితి సందర్భంగా మహిళలు ఉపవాసం ఉండి నాగపూజను చేస్తారు. అలాగే ఆలయాల్లోని పుట్ట వద్దకు పాలు పోసి, నైవేద్యం సమర్పిస్తారు. తమ సంతానాన్ని క్షేమంగా ఉండాలని మహిళలు నాగపూజను ఆచరిస్తారు. పాలు, కుంకుడు, పసుపు, విభూతి, బెల్లం, నల్ల నువ్వుల మిశ్రమంతో చేసిన తీపి పదార్ధాలతో పాలు బెల్లం, తెల్ల నువ్వులు, ఉడకబెట్టని మిశ్రమంతో తయారు చేసి పుట్టల వద్ద నైవేద్యంగా ఉంచుతారు. అలాగే కొంతమంది గుడ్లను కూడా పుట్ట వద్ద ఉంచుతారు. నాగదేవత పుట్టపై పసుపు, కుంకుమ్మ వేసి పూలు పెడతారు. దీపం వెలిగించి తమతో తెచ్చుకున్న నైవేద్యాన్ని పుట్ట వద్ద ఉంచుతారు. పూజ అనంతరం కొంచెం పుట్ట మన్ను ను తీసుకుని వెళ్తారు మహిళలు. నాగుల చవితి, నాగుల పంచమి రోజు నాగేంద్రుడిని ఆరాధిస్తే సకల రోగాలు తొలగిపోయి ఆరోగ్యంవంతులం అవుతారమని భక్తుల విశ్వాసం.

అలాగే నాగుల చవిత నాడు ఏ సమయంలో పుట్టకు పాలు పోయాలి, చవితి ఘడియలు ఎప్పుడు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చవితి ఘడియలు నిన్న (నవంబర్ 4) రాత్రి 8:53 గంటల నుంచి ప్రారంభమై ఈరోజు (మంగళవారం) రాత్రి 9:25 గంటలకు ముగియనున్నాయి. అంటే ఈరోజు మొత్తం కూడా చవిత ఘడియలు ఉన్న నేపథ్యంలో మంగళవారం నాడు నాగుల చవితిని జరుపుకోవాలి. ఈరోజు ఉదయం 8:21 గంటల నుంచి 9:16 గంటల వరకు పుట్టలో పాలు పోయవచ్చని.. వర్జ్యం, దుర్ముహూర్తాలు లేకుండా పుట్టలో పాలు పోయవచ్చని పురోహితులు చెబుతున్నారు. మరోవైపు తిరుమలలో కూడా చవితి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు దర్శనమివ్వనున్నారు.

కేసులు కొట్టివేయండి

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం, ముత్తుకూరు పోలీసులు తనపై నమోదు చేసిన రెండు వేర్వేరు కేసులను కొట్టివేయాలని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం, ముత్తుకూరు పోలీసులు తనపై నమోదు చేసిన రెండు వేర్వేరు కేసులను కొట్టివేయాలని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ వద్ద విచారణకు రానున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై అసత్యాలు ప్రచారంతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముత్తుకూరు పోలీసులు కాకాణి పై కేసు నమోదు చేశారు.

అలాగే పత్రికా సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవానికి భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని వెంకటాచలం మండలం టీడీపీ నాయకులు కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీడీపీలో తీవ్ర విషాదం మాజీ మంత్రి కన్నుమూత

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో కన్నుమూశారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రెడ్డి సత్యనారాయణ మరణంపై సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలో వయసురీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. రెడ్డి సత్యనారాయణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతల్లో రెడ్డి సత్యనారాయణ ఒకరు.

గతంలో మాడుగుల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీ తరఫున వరుసగా 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఎన్టీఆర్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు.. పశుసంవర్ధక శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు ఆయన టీటీడీ పాలకమండలి సభ్యుడిగా కూడా పనిచేశారు. 2004 ఎన్నికల్లో రెడ్డి సత్యనారాయణ టీడీపీ నుంచి మరోసారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు.

సత్యనారాయణ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి అనుభవించినప్పటికి చాలా నిరాడంబరంగా ఉండేవారు. సీనియర్ నేత అయినా సరే.. నిత్యం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. రెడ్డి సత్యనారాయణ 2023 అక్టోబర్‌లో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.. ఆ తర్వాత కోలుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత ప్రాణాలు కోల్పోయారు

ఉద్యోగాల్లో ఆ కోటా రిజర్వేషన్ పెంపు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలు, నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ 2 నుంచి 3 శాతానికి పెంచాలని నిర్ణయించారు. అలాగే ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్, జాతీయ క్రీడాల్లో పాల్గొని పతకాలు సాధించే రాష్ట్ర క్రీడాకారులకు భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మొత్తా్న్ని కూడా పెంచుతూ ప్రతిపాదనలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను పెంచాలని నిర్ణయించింది. ఏపీలో నూతన క్రీడా విధానంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షించారు. సచివాలయంలో క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, శాప్ ఛైర్మన్ రవి నాయుడు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలతో పాటుగా గ్రామాలలో క్రీడా స్థలాల ఏర్పాటుపైనా సీఎం వారితో చర్చించారు. ఈ సందర్భంగా పలు సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని పతకాలు సాధించే రాష్ట్ర క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచాలని నిర్ణయించారు.

ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ స్వర్ణ పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ఇప్పటి వరకూ ప్రోత్సాహకం కింద రూ.75 లక్షలు అందించేవారు. అయితే ఈ మొత్తాన్ని రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ఆసియా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రోత్సాహకం కింద రూ.10 లక్షలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. వరల్డ్ ఛాంపియన్ షిప్‌, వరల్డ్ కప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధిస్తే రూ.50 లక్షలు, సిల్వర్ మెడల్ సాధిస్తే రూ.35 లక్షలు, కాంస్యం సాధించిన క్రీడాకారులకు రూ.25 లక్షలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్యం కైవసం చేసుకున్న క్రీడాకారులకి రూ.3 లక్షల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఇప్పటి వరకూ 2 శాతం రిజర్వేషన్ కల్పించేవారు. అయితే ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచాలని నిర్ణయించారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో స్టేడియాలు నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సంస్థలు, వ్యక్తుల సహకారంతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయాలని.. సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

మరోవైపు స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో క్రీడా మంత్రిత్వశాఖ.. నూతన క్రీడా పాలసీని రూపొందించింది. సమీక్షా సమావేశంలో అధికారులు దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. నాలుగు లక్ష్యాలతో పాలసీ ఉండాలన్న ముఖ్యమంత్రి.. దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం ఉండాలని సూచించారు. అనంతరం నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.

సోమశిల టు శ్రీశైలం బోటు ప్రయాణం

నిత్యం ఉరుకుల పరుగుల జీవితం నుంచి ప్రజలకు కాసేపు ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. అందులోభాగంగా సోమశిల నుంచి శ్రీశైలం, అలాగే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు క్రూయిజ్ సర్వీసులు ప్రారంభించింది.

నిత్యం ఉరుకులు పరుగుల జీవితం. దీనికి తోడు ట్రాఫిక్ కష్టాలు. ఎక్కడైనా కాసేపు సేద తీరదామంటే.. కుదరని పని. పుణ్యం. పురుషార్థం కోసం ఎక్కడికైనా వెళ్దామా అంటే.. రైలు, విమానాలు, బస్సు ఇలా అన్నింటిలో సీట్లు, బర్త్‌లు ఫుల్. ఖాళీలు నిల్. అలాంటి వేళ.. ఇటువంటి వారి కోసం తెలంగాణ పర్యాటక శాఖ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం. అటు సోమశిల నుంచి శ్రీశైలం.. రెండు రివర్ కమ్ రోడ్డు ట్రిప్పులను ఏర్పాటు చేసింది.

పర్యాటకులకు అలలపై ప్రయాణం సాగిస్తూ.. ప్రకృతిని ఆస్వాదించేలా తెలంగాణ పర్యాటక శాఖ ఈ రెండు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందులో ఒకటి శ్రీశైలం నుంచి సోమశిలకు లాంచీ ప్రయాణం. మరొకటి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు. అయితే ఈ ప్రయాణంలో సోమశిల నుంచి లాంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ సోమశిలలో సోమేశ్వరుడు కొలువు తీరారు. ఆయన్ని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది సోమశిలకు తరలి వస్తారు. చుట్టు నీరు, కొండలతో ప్రకృతి రమణీయత ఉట్టిపడుతుంది. ఈ ప్రాంతాన్ని సప్తనది సంగమం అని కూడా పిలుస్తారు. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ గ్రామం నుంచి శ్రీశైలానికి ప్రత్యేకంగా రివర్ కమ్ రోడ్డు ట్రిప్‌ను ఏర్పాటు చేసింది. వారంతంలో ఏర్పాటు చేసిన ఈ ట్రిప్ అందరిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది తెలంగాణ పర్యాటక శాఖ.

సోమశిల - శ్రీశైలం మధ్య దూరం 120 కిలోమీటర్లు. సోమశిల నుంచి శ్రీశైలం చేరడానికి 6 గంటల సమయం పడుతుంది. ప్రతి శని, ఆదివారాల్లో తెలంగాణ పర్యాటక శాఖ బోట్ సింగిల్ ట్రిప్‌ను నవంబర్ 2వ తేదీన ప్రారంభించింది. ఉదయం 10.00 గంటలకు ఈ బోట్ ప్రయాణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.00 లేదా 4.30 గంటలకు శ్రీశైలం సమీపంలోని ఈగల పెంట గ్రామానికి ఈ బోట్ చేరుతుంది. ఈగల పెంట నుంచి శ్రీశైలానికి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ప్రయాణికులు రహదారి మార్గంలో శ్రీశైలానికి చేరుకోవాల్సి ఉంటుంది.

అయితే గతంలో రెండు వైపులా ప్రయాణం సాగేది. అంటే సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లితే.. మళ్లీ వారిని సోమశిలకు తీసుకు వచ్చేవారు. కానీ అందుకు భిన్నంగా ఈ సారి తెలంగాణ పర్యాటక శాఖ ఒక వైపు మాత్రం ప్రయాణం కల్పిస్తుంది. ఈ ప్రయాణంలో లాంచీలోనే ప్రయాణికులకు భోజనం. సాయంత్రం స్నాక్స్ అందజేస్తారు. ఇక శ్రీశైలంలో భక్తుల బసతోపాటు మల్లన్న దర్శన బాధ్యత భక్తులే చూసుకోవాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ. 2000, పిల్లలకు 1600గా టికెట్ ధర నిర్ణయించారు. ఇక ఈ ప్యాకేజీ ట్రిప్ ఏడాదంతా ఉండదని పర్యాటక శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కృష్ణానదిలో జలకళ ఉన్నంత వరకే ఈ ట్రిప్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే బోటులో ప్రయాణికుల విషయంలో తెలంగాణ పర్యాటక శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు.

వందరోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. 365 రోజులకు 30 రోజులే మిగిలి ఉన్నా ఇంకా హామీలు అమలు చేయలేదని, దీనికి ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు. “వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారంటీ” అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్. మూడు వందల ముప్పై రోజులు ముగిసింది, ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది!

ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది – 2 లక్షల జాబ్‌లు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు.

ఏడాదికి 35 రోజులే మిగిలింది – ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది – పెంచిన రూ.4,000 పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది-నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయి అంటున్నారు అడబిడ్డలు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది-పెంచి ఇస్తామన్న రూ.6,000 పెన్షన్ ఎక్కడని నిలదీస్తున్నారు దివ్యంగా అన్నలు, అక్కలు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది-ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది – కౌలు రైతులు రూ.15000 ఎక్కడ, రైతు కూలీలు రూ.12000 ఎక్కడ అంటున్నారు..

ఏడాదికి 35 రోజులే మిగిలింది – తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు..

చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే – చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే.. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసి సర్కార్ఏ ముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు, రాస్తారోకోలు తప్ప? జవాబు చెప్తావా ఢిల్లీ బాబు రాహుల్‌ గాంధీ? అంటూ కేటీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. పాదయాత్రకు సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టేందుకు.. సిద్ధమయ్యారు. ఇందుకోసం నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన పుట్టినరోజు అయిన నవంబర్ 8వ తేదీన.. మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మూసీ పరివాహక గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజీవం ప్రాజెక్టు విషయంలో ప్రజల నుంచి వస్తున్న మిశ్రమ స్పందనతో.. మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 08వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా.. తన క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని.. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం వైటీడీఏ, జిల్లా అధికారులతో కలిసి యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు.

మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర" పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రను వాడపల్లి నుంచి ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు సాగనుంది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలోనే.. మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల మధ్య ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై విమర్శలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. వాడపల్లి నుంచి తాను చేయనున్న పాదయాత్రకు కలిసి రావాలని.. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. ఆరోజు చెప్పినట్టుగా.. ఈనెల 8 నుంచి మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రను చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.

అధికారంలో ఉన్నప్పుడే బీఆర్‌ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవనం కోసం ప్రయత్నాలు చేశారని.. అందుకోసం మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కూడా ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ప్రాజెక్టు డిజైన్ కూడా చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. అసలు మూసీ ప్రక్షాళనే తప్పు అన్నట్టుగా బీఆర్‌ఎస్ నేతలు నానా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణపై సూచనలు ఇవ్వాలని.. అంతేకానీ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం సమంజసం కాదని హెచ్చరించారు. మూసీ మురికిలో ఉండేందుకు ప్రజలెవరూ సుముఖంగా లేరన్నారు. మూసీ పరివాహక ప్రజలకు న్యాయం చేసేందుకు ఏమైనా సూచనలు ఉంటే చేయాలని.. అంతే కానీ ఆందోళనలు చేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్

కేసీఆర్ ప్రభుత్వంలో పింక్ కలర్ చొక్కా వేసుకున్న వారికే స్కీంలు ఇచ్చారని.. వారు ఇంకా అదే భ్రమలో ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గ్రామ సభలు పెట్టి మంత్రుల ద్వారా ఇళ్లను అప్రూవ్ చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వానికి పేదవారికి అండగా ఉండాలనే ఆలోచన ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ... పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామని అన్నారు.

మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈయాప్ ద్వారా ఇళ్ల నిర్మాణం పరిశీలన జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం రూరల్‌లో రూ.71 వేలు , అర్బన్‌లో లక్షా యాబై వేలు రూపాయలు ఇస్తుందని తెలిపారు.

మిగిలిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరించి పేదవారి చిరకాల స్వప్నం నెరవేరుస్తుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో పింక్ కలర్ చొక్కా వేసుకున్న వారికే స్కీంలు ఇచ్చారని.. వారు ఇంకా అదే భ్రమలో ఉన్నారని విమర్శించారు. గ్రామ సభలు పెట్టి మంత్రుల ద్వారా ఇళ్లను అప్రూవ్ చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వానికి పేదవారికి అండగా ఉండాలనే ఆలోచన ఉందని స్పష్టం చేశారు.

అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా వారికి ఇళ్లు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో లక్షా యాబై వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టామని బీఆర్ఎస్ నేతలు చెప్పారని అన్నారు. కేవలం 91 వేల ఇళ్లు మాత్రమే కట్టి అందులో మౌలిక వసతులు కల్పించలేదని ధ్వజమెత్తారు.

తెలంగాణలో 63 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయని.. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.

రేపు విజయవాడలో జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పలు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతాయి. రూ.12వేల నుంచి రూ.35వేల వరకు వేతనాలు లభించే ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డిఆర్‌డిఎ - సీడాప్ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నవంబర్ 5వ తేదీ మంగళవారం విజయవాడ "ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళానిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో, ముత్తూట్ ఫిన్‌కార్ప్, SBI పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.35,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

నవంబర్ 5 న నిర్వహించబోయే ఈ జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు వివరించారు.

ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు https://tinyurl.com/jobmela-vjdeast లింక్ నందు తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం జరిగే జాబ్ మేళాకు తమ రెజ్యూమె- బయోడేటా లతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 9347779032 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

కెనడాలో హిందూ ఆలయంపై దాడి

కెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలోని హిందూ ఆలయాలే (Hindu Temples) లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం సృష్టించారు.

కెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలోని హిందూ ఆలయాలే (Hindu Temples) లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం సృష్టించారు. భక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు (Devotees Attacked). ఇలా వరుస దాడులతో కెనడాలోని హిందువులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం, భక్తులపై జరిగిన దాడి ఘటనపై కెనడా ప్రధాని (Canada PM)జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) స్పందించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. తమ దేశంలోని ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టాలని ప్రాంతీయ పోలీసులన ట్రూడో ఆదేశించారు.

మరోవైపు ఈదాడి ఘటనపై బ్రాంప్టన్‌ మేయర్‌ తీవ్రంగా స్పందించారు. హిందూ ఆలయం వెలుపల జరిగిన దాడి ఘటన విని ఆందోళన చెందినట్లు చెప్పారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. దాడులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దోషులుగా తేలిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.