/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్ Raghu ram reddy
ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్

కేసీఆర్ ప్రభుత్వంలో పింక్ కలర్ చొక్కా వేసుకున్న వారికే స్కీంలు ఇచ్చారని.. వారు ఇంకా అదే భ్రమలో ఉన్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గ్రామ సభలు పెట్టి మంత్రుల ద్వారా ఇళ్లను అప్రూవ్ చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వానికి పేదవారికి అండగా ఉండాలనే ఆలోచన ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం దానావాయిగూడెంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ... పార్టీలకు, కులాలకు అతీతంగా గ్రామ సభలు పెట్టి అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టామని అన్నారు.

మరో రెండు రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈయాప్ ద్వారా ఇళ్ల నిర్మాణం పరిశీలన జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం రూరల్‌లో రూ.71 వేలు , అర్బన్‌లో లక్షా యాబై వేలు రూపాయలు ఇస్తుందని తెలిపారు.

మిగిలిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరించి పేదవారి చిరకాల స్వప్నం నెరవేరుస్తుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో పింక్ కలర్ చొక్కా వేసుకున్న వారికే స్కీంలు ఇచ్చారని.. వారు ఇంకా అదే భ్రమలో ఉన్నారని విమర్శించారు. గ్రామ సభలు పెట్టి మంత్రుల ద్వారా ఇళ్లను అప్రూవ్ చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వానికి పేదవారికి అండగా ఉండాలనే ఆలోచన ఉందని స్పష్టం చేశారు.

అర్హులైన వారు ఏ పార్టీలో ఉన్నా వారికి ఇళ్లు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో లక్షా యాబై వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టామని బీఆర్ఎస్ నేతలు చెప్పారని అన్నారు. కేవలం 91 వేల ఇళ్లు మాత్రమే కట్టి అందులో మౌలిక వసతులు కల్పించలేదని ధ్వజమెత్తారు.

తెలంగాణలో 63 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయని.. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.

రేపు విజయవాడలో జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పలు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతాయి. రూ.12వేల నుంచి రూ.35వేల వరకు వేతనాలు లభించే ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డిఆర్‌డిఎ - సీడాప్ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నవంబర్ 5వ తేదీ మంగళవారం విజయవాడ "ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళానిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో, ముత్తూట్ ఫిన్‌కార్ప్, SBI పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.35,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.

నవంబర్ 5 న నిర్వహించబోయే ఈ జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు వివరించారు.

ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు https://tinyurl.com/jobmela-vjdeast లింక్ నందు తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం జరిగే జాబ్ మేళాకు తమ రెజ్యూమె- బయోడేటా లతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 9347779032 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

కెనడాలో హిందూ ఆలయంపై దాడి

కెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలోని హిందూ ఆలయాలే (Hindu Temples) లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం సృష్టించారు.

కెనడా (Canada)లో ఖలిస్థానీల దాడులు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలోని హిందూ ఆలయాలే (Hindu Temples) లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల విధ్వంసం సృష్టించారు. భక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు (Devotees Attacked). ఇలా వరుస దాడులతో కెనడాలోని హిందువులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం, భక్తులపై జరిగిన దాడి ఘటనపై కెనడా ప్రధాని (Canada PM)జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) స్పందించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. తమ దేశంలోని ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టాలని ప్రాంతీయ పోలీసులన ట్రూడో ఆదేశించారు.

మరోవైపు ఈదాడి ఘటనపై బ్రాంప్టన్‌ మేయర్‌ తీవ్రంగా స్పందించారు. హిందూ ఆలయం వెలుపల జరిగిన దాడి ఘటన విని ఆందోళన చెందినట్లు చెప్పారు. కెనడాలో మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. దాడులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దోషులుగా తేలిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.

పవన్‌ కల్యాణ్‌ సంచలనం

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, నేరాలు పెరిగిపోతుండడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. హోంమంత్రి వంగలపూడి అనిత పనితనంపై పరోక్షంగా తప్పుబట్టారు. తాను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని పేర్కొన్నారు. ఒక అడుగు ముందుకు వేసి తానే హోమంత్రిగా బాధత్యలు తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై పవన్‌ అసహనం వ్యక్తం చేశారు.

కాకినాడ జిల్లాలోని తన నియోజకవర్గం పిఠాపురంలో సోమవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి.. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోంమంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటా. హోంమంత్రి అనిత సమీక్ష చేయాలి. శాంతి భద్రతలు చాలా కీలకం. పోలీసులు మర్చిపోకండి' అని సూచించారు.

అభివృద్ధి ఉండాలి కానీ కలుషితం లేని ఫార్మా కంపెనీలు రావాలి. గోదావరి జిల్లాల్లో నీళ్లున్నాయి. పశ్చిమ గోదావరిలో తాగేందుకు నీరు లేదు. అరబిందో ఫార్మా కంపెనీ,ఇతర కలుషిత జలాలు వదిలే ఫ్యాక్టరీలు ప్రజాశ్రేయస్సు దృష్టిలో ఉంచుకోవాలి' అని పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ సూచించారు. దివిస్ అరబిందో పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్వీకరించాలని చెప్పారు.

'అభివృద్ధి చెందిన దేశాలు సాధించలేనిది భారతదేశం చేసింది. సామాజిక న్యాయం నా ధ్యేయం' అని పవన్‌ కల్యాణ్ ప్రకటించారు. '3, 5 ఏళ్ల పిల్లలపై అత్యాచారాలు చేసే దుర్మార్గులు ఉన్నారు. గత ప్రభుత్వ వారసత్వం ఇపుడు చూస్తున్నాం. చంద్రబాబు, నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. నన్ను, బాబును చంపేస్తామని.. నా కూతుళ్లపై అఘాయిత్యం చేస్తానని హెచ్చరించారు' అని గుర్తు చేశారు. 

నా గురించి తప్పుగా మాట్లాడితే స్పందించడానికి అధికారులకు భయం. డీజీపీకి బాధ్యత లేదా?' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు. 'బలమైన చట్టాలు ఉన్నా అమలు చేయడం లేదు' అని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయండి, ఇళ్లలో ఉన్న మహిళలను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. 'మూడు నెలలుగా అఘాయిత్యాలు పెరిగాయి. ఇప్పుడు అధికారులు పని చేయమంటే మీనమేషాలు లెక్కపెడుతున్నారు' అని అధికారుల తీరుపై మండిపడ్డారు.

'మూడేళ్ల ఆడపిల్లను రేప్ చేస్తే కులం చూస్తారా? పోలీసులు ఎందుకు పట్టించుకోరు. అధికారంలో ఉన్నామని సహనంతో ఉన్నాం. చేతకాక కాదు' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తప్పు చేసిన వాళ్లని మడత పెట్టి కొట్టండి పిలుపునిచ్చారు. 'హోంమంత్రి అనితకు బాధ్యత వహించాలని చెబుతున్నా. నేను హోమ్ బాద్యతలు తీసుకుంటే వేరేలా ఉంటుంది. అవసరమైతే హోమ్ బాధ్యతలు తీసుకుంటా' అని సంచలన ప్రకటన చేశారు

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్

రైళ్లలో ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ల బుకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీని ఉపయోగిస్తున్నారు. పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్‌ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్‌లు వినియోగించాలి. ఆ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్‌సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్‌ను తీసుకొస్తోంది.

భారతీయ రైల్వే (Indian Railways) వ్యవస్థ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చుతోంది. రైళ్లలో ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ (IRCTC)ని ఉపయోగిస్తున్నారు. పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్‌ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్‌లు వినియోగించాలి. ఆ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్‌సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్‌ను తీసుకొస్తోంది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి (IRCTC Super APP).

రైల్వేశాఖకు సంబంధించి టికెట్స్‌ బుకింగ్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రాకింగ్‌ స్టేటస్‌ కోసం రకరకాల యాప్స్‌ని ఉపయోగించడం చాలా కష్టం అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఇండియన్ రైల్వేస్ సరికొత్త సూపర్‌ యాప్‌ని తీసుకురాబోతోంది. ఇకపై ఈ యాప్‌లోనే టికెట్స్‌ బుకింగ్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రెయిన్‌ ట్రాకింగ్‌ చేసేందుకు వీలుంటుంది.

అంతేకాదు రైలు ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందట. ఇక, ప్లాట్‌ఫారమ్‌ టికెట్ నుంచి జనరల్‌ టికెట్‌ వరకు ఆన్‌లైన్‌ మోడ్‌లో కొనుగోలు చేసే వీలుంటుంది. డిసెంబర్ చివరి నాటి ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తుందట.

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను 10 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్‌గా నిలిచింది. రైల్ మదద్, యూటీఎస్, సటార్క్, టీఎమ్‌సీ-నిరీక్షన్, ఐఆర్‌సీటీసీ ఎయిర్, పోర్ట్‌రీడ్‌ వంటి యాప్‌లు కూడా రైల్వే సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. వీటన్నింటిలోనూ ఉన్న సేవలను ఓకే సూపర్ యాప్ ద్వారా అందించేందుకు రైల్వే సిద్ధమవుతోంది.

దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి వీచే నగరాలివే

దీపావళి పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

దీపావళి పండుగ తరువాత దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 400 దాటింది. ఇది చాలా ప్రమాదకర స్థాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు.. చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాలుష్యపూరితమైన గాలిలో ప్రజలు జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి ఉన్న నగరం/నగరాలు ఏంటో తెలుసా? ఉత్తమ గాలి నాణ్యత ఉన్న నగరం ఏది? దేశంలో స్వచ్ఛమైన గాలి ఉన్న టాప్ 10 నగరాలు/ప్రాంతాల పేర్లు ఇప్పుడు తెలుసుకుందాం..

కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చన్నరాయపట్నం నగరంలో అత్యంత స్వచ్ఛమైన గాలి ఉంది. అందుకే ఈ ప్రాంతం టాప్ 1 లో నిలిచింది. చన్నరాయపట్నంలోని AQI సోమవారం ఉదయం 8 గంటలకు 8 పాయింట్స్‌గా నమోదైంది.

పరిశుభ్రమైన గాలి ఉన్న నగరాల జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్ రెండో స్థానంలో ఉంది. సోమవారం ఉదయం 8 గంటలకు బిష్ణుపూర్ ఏక్యూఐ 10 పాయింట్స్‌ నమోదైంది.

అస్సాంకు చెందిన సిల్చార్, మణిపూర్‌కు చెందిన కక్చింగ్, కర్ణాటకలోని బేలూర్ నగరం మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు 11 పాయింట్స్‌ నమోదైంది.

నాగాలాండ్ రాజధాని కోహిమా పరిశుభ్రమైన గాలిలో ఆరవ స్థానంలో ఉంది. ఇక్కడ సోమవారం ఉదయం 8 గంటలకు AQI 12 గా నమోదైంది.

దేశంలోని స్వచ్ఛమైన గాలిలో కర్ణాటకలోని హసన్ నగరం, మణిపూర్ రాజధాని ఇంఫాల్ కూడా టాప్ 10లో ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 13 నమోదైంది.

మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కూడా గాలి చాలా శుభ్రంగా ఉంది. గాలి నాణ్యత ఆధారంగా ఐజ్వాల్ తొమ్మిదవ స్థానంలో ఉంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఐజ్వాల్‌లో ఏక్యూఐ 14 నమోదైంది.

పరిశుభ్రమైన గాలి ఉన్న మొదటి 10 నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి 10వ స్థానంలో ఉంది. ఇక్కడ సోమవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ 15 పాయింట్స్‌ నమోదైంది.

రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి అంకానికి , అభ్యర్థుల ప్రచారం

అమెరికా ఓటర్లలో ఉత్సాహం కనిపిస్తోంది.పోలింగ్‌ తేదీ కంటే ముందుగానే ఓటు వేసేందుకు కోట్ల మంది యూఎస్ పౌరులు ముందుకు వస్తున్నారు. రేపే (మంగళవారం) పోలింగ్‌ జరగనుండగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్, కమలా హారిస్‌ తమ ప్రచార చివరి అంకంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇక, ముందస్తు ఓటింగ్‌కు ఓటర్లు గతంలో కంటే ఈసారి ఎక్కువగా వస్తుండటంతో పోలింగ్‌ కేంద్రాలను పెంచాల్సి వచ్చింది.

న్యూయార్క్‌లోని 42 బ్రాడ్‌వేలో ఉన్న బోర్డు ఆఫ్‌ ఎలక్షన్స్‌ ఆఫీసు ఈ ఏర్పాట్లలో బిజీ అయిపోయింది. బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ ర్యాన్, ఆయన డిప్యూటీ విన్సెంట్‌ ఇగ్నిజియో ఎన్నికల పనుల్లో స్పీడ్ పెంచారు. ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే న్యూయార్క్‌ రికార్డు సృష్టించగా.. అది ఇంకా కొనసాగుతోందని ర్యాన్‌ వెల్లడించారు. న్యూయార్కే కాదు.. అమెరికా మొత్తం ఇదే ట్రెండ్‌ నడుస్తుంది. మెయిల్స్, పోలింగ్‌ కేంద్రాల ద్వారా వారంతా ఓట్లు వేస్తున్నారు.

ఇక, గత ఎన్నికల్లో న్యూయార్క్‌లో ముందస్తు పోలింగ్‌ కేంద్రాలను 100 ఏర్పాటు చేయగా.. ఈసారి 50 శాతం అధికంగా ఏర్పాటు చేశారు. అయితే, అసాధారణ వాతావరణ పరిస్థితులు, పోలింగ్‌ రోజున భారీ క్యూలతో ప్రజల ఇబ్బందులు, ఎన్నికల రోజున గొడవలు.. ముందస్తు ఓటింగ్‌కు కారణాలుగా అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌.. తనకు అనుకూలమైన నార్త్‌ కరోలినాలో మకాం వేశారు. డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రేపటి (మంగళవారం) వరకూ నార్త్‌ కరోలినాలో ఉండి ర్యాలీలు నిర్వహించాలని ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. 2016, 2020లలో తనకు మద్దతుగా నిలిచిన ఈ రాష్ట్రంపై ఆయన ఎక్కువగా నజర్ పెట్టారు.

అలాగే, న్యూమెక్సికో, వర్జీనియాలనూ సైతం డొనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారు. నార్త్‌ కరోలినాలోని గ్యాస్తోనియా, ఛార్లెట్, గ్రీన్స్‌బరోల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. ఆదివారం కింగ్‌స్టన్‌లో ప్రచారం చేయగా.. ఈరోజు (సోమవారం) రాలేగ్‌లో నిర్వహించే ప్రచారంలో ఆయన పాల్గొంటారు. దీంతో నార్త్‌ కరోలినాలోనే అక్టోబరు 1 నుంచి ఆయన 9 ర్యాలీలు నిర్వహించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ 6సార్లు ఈ రాష్ట్రంలో పర్యటించారు.

కమలా హారిస్‌ కూడా శనివారం నార్త్‌ కరోలినాలోని ఛార్లెట్‌లో ప్రచారం చేయగా.. ఇవాళ తన భర్త డగ్‌ ఎంహాఫ్‌ను గ్రీన్‌విల్లేకు పంపబోతున్నారు. తుఫాన్ కారణంగా నార్త్‌ కరోలినా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో ఈ ప్రాంత ఓటర్లు ఎటు వైపు మొగ్గుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. శుక్రవారం నాటికి నార్త్‌ కరోలినాలో 78 లక్షలమంది ఓటు వేశారు.

ఉద్యోగులకిచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతాం

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని, ప్రతీ ఉద్యోగి సంయమనం పాటిస్తే వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని, ప్రతీ ఉద్యోగి సంయమనం పాటిస్తే వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మంలోని చెరుకూరివారి తోటలో ఆదివారం జరిగిన ఖమ్మం జిల్లా సకల ఉద్యోగుల వనసమారాధన, ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, రెవెన్యూ మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రభుత్వాల తలరాతను మార్చే శక్తి కలిగిన ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయని తెలిపారు.

అయితే వాటిని పరిష్కరించేందుకు కాస్త సమయం కావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకుంటూ ప్రాధాన్య క్రమంలో ఒక్కో రంగం సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్‌ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే జనవరి నాటికి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ఇక, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు నిరంతరం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

పాక్ వింత వాదన

పాకిస్థాన్ లోని పంజాబ్ సిటీలో దారుణంగా రికార్డయిన ఏక్యూఐ

మన దేశం నుంచి వీచే గాలులతో వాయు కాలుష్యం పెరిగిందని ఆరోపణ

ఓ టీవీ ఇంటర్వ్యూలో పాక్ పంజాబ్ మంత్రి విమర్శలు

దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని వింత వాదన తెరపైకి తెచ్చింది. ఈమేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

శీతాకాలంలో ఢిల్లీ, హర్యాణా, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అసాధారణ స్థాయిలో రికార్డవుతుంది. మన దేశంలోనే కాదు పాకిస్థాన్ లోనూ పంజాబ్ రాష్ట్రం ఉంది. అక్కడి లాహోర్ సిటీలో వాయు కాలుష్యం ఇటీవల భారీగా పెరిగింది.

ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లు నమోదైంది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఆదివారం ఓ మీడియాతో మాట్లాడారు. లాహోర్ లో వాయు కాలుష్యం పెరగడానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్ కు చేరుకుని ఏక్యూఐ దారుణంగా పెరిగిందని మండిపడ్డారు.

ఆదివారం లాహోర్ లో ఏక్యూఐ 500 పాయింట్లకు కాస్త అటూ ఇటుగా ఉందని మరియం తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. వీచే గాలిని ఆపడం కుదరదని, భారత్ తో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు.

హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం

సాంకేతిక సమస్య కారణంగా హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. దీంతో మెట్రో సేవలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం కారిడార్‌లో దాదాపు 30 నిమిషాలుగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నాగోల్ -రాయదుర్గం, ఎల్బీ నగర్ - మియాపూర్ కారిడార్లలో ట్రైన్లు నిలిచిపోయాయి. దాదాపుగా 30 నిమిషాలకు పైగా మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు ఆఫీసుకు, విద్యార్థులు కాలేజీలకు వెళ్లే సమయం కావటంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.

ట్రైన్లు సకాలంలో రాకపోవటంతో మెట్రో ప్లాట్‌ఫాంపై ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై నిరీక్షిస్తున్నారు. ట్రైన్లలో ఉన్నవారు ట్రైన్లలో.. స్టేషన్లలో ఉన్నవారు స్టేషన్లలోనే ఉండిపోయారు. అయితే ఈ అంతరాయంపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

హైదరాబాద్‌ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం రెండ్రోజుల క్రితం ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. సెకండ్ ఫేజ్‌లో మెుత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనుండగా.. అందుకు అనుమతి లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

మొత్తం మెట్రో ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. అందులో తెలంగాణ ప్రభుత్వ వాటారూ.7,313 కోట్లు ప్రస్తుతం నగరంలో మూడు కారిడార్లలో మెట్రో పరుగులు పెడుతుండగా.. కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ విస్తరించనున్నారు. నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, రాయదుర్గ- కోకాపేట వరకు 11.6 కిలో మీటర్లు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలో మీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్లు మెట్రోను విస్తరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.