/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz సముద్ర గర్భంలోకి Raghu ram reddy
సముద్ర గర్భంలోకి

భూగోళం మూడొంతులు నీళ్లతో నిండి ఉంది. ఈ సముద్రాల్లో ఉన్న జీవరాశుల్ని లెక్కించడం తలకు మించిన భారమే. ఇప్పటిదాకా రెండున్నర లక్షల జాతుల జీవుల్ని గుర్తించారు. మనకు తెలియని ఈ ప్రపంచాన్ని దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కలిగిస్తోంది ‘ఓషన్‌ ఒడిస్సీ

భూగోళం మూడొంతులు నీళ్లతో నిండి ఉంది. ఈ సముద్రాల్లో ఉన్న జీవరాశుల్ని లెక్కించడం తలకు మించిన భారమే. ఇప్పటిదాకా రెండున్నర లక్షల జాతుల జీవుల్ని గుర్తించారు. మనకు తెలియని ఈ ప్రపంచాన్ని దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కలిగిస్తోంది ‘ఓషన్‌ ఒడిస్సీ’.

అందరూ పూర్తిగా లీనమయ్యే ఎగ్జిబిషన్‌ ఇది. సముద్రాల్లో జీవరాశుల జీవన వీడియోలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

వీటిని క్యాప్చర్‌ చేసింది ప్రసిద్ధ ‘నేషనల్‌ జియోగ్రాఫిక్‌’ ఫొటోగ్రాఫర్‌ బ్రియన్‌ స్కెర్రీ. పది వేలకు పైగా గంటలను వివిధ సముద్రాల్లో గడిపి ఎన్నో అరుదైన దృశ్యాలను ఆయన చిత్రీకరించారు.

ఆ వీడియోలను వివిధ నగరాలలో ‘ఓషన్‌ ఒడిస్సీ’ పేరుతో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జర్మనీలోని డార్ట్‌మండ్‌ నగరంలో ఈ ఎగ్జిబిషన్‌ జరుగుతోంది. ఆడియో వీడియో ప్రెజెంటేషన్‌ చూసి సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు.

బంగ్లాదేశ్‌లో 3 నెలల్లో హిందూ మైనారిటీలపై 2000 కంటే ఎక్కువ దాడులు,, వీధుల్లోకి హిందువులు

భారతదేశ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలు ప్రభుత్వం నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దాడులు, వేధింపుల నుండి తమను రక్షించాలని, హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేయడానికి హిందూ సమాజానికి చెందిన దాదాపు 300 మంది శనివారం ఢాకాలో సమావేశమయ్యారు.

ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి హిందూ సమాజంపై వేలాది దాడులు జరిగాయని హిందూ సంఘాల ర్యాలీ పేర్కొంది.

హిందువులపై దాడులకు సంబంధించి, దేశంలోని మైనారిటీ గ్రూప్ బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత కౌన్సిల్ ఆగస్టు 4 నుండి హిందువులపై 2,000 కంటే ఎక్కువ దాడులు జరిగాయని, ఎందుకంటే తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి కష్టపడుతోంది. ర్యాలీ సందర్భంగా హిందూ సమాజానికి తగిన భద్రత కల్పించలేదని హిందూ సంఘాలు కూడా ఆరోపించాయి.

మన దగ్గరే ఉంది ఓ అందమైన గ్రామం

సరదాగా ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకు వెళ్లాలనుకునేవారికి శీతాకాలం చాలా అనువుగా ఉంటుంది. వర్షకాలం లేదా వేసవి మాదిరిగా ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అంతేకాదు ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు చలికాలం అద్భుతంగా ఉంటుంది. మరి మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న ఈ అందమైన గ్రామం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారేమో..

సరదాగా ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకు వెళ్లాలనుకునేవారికి శీతాకాలం చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే వర్షకాలం లేదా వేసవి మాదిరిగా ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అంతేకాదు ప్రకృతి అందాలు ఆస్వాదించేందుకు ఈ సీజన్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఏడాది శీతకాలం వచ్చేసింది. మరి మంచుతో కూడిన సుందర దృశ్యాలను వీక్షించాలనుకునే తెలుగు ఔత్సాహిక టూరిస్టులు ఎక్కడికో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. ‘ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్’గా పిలుచుకునే ‘లంబసింగి’ని సందర్శించి మంచు అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. పొగమంచుతో కప్పి ఉండే ఈ గ్రామాన్ని సందర్శించాలనుకునే హైదరాబాదీలు విమానం ఎక్కి నేరుగా విశాఖపట్నం వెళ్లిపోవచ్చు. అక్కడి నుంచి సులువుగా లంబసింగి చేరుకోవచ్చు.

దక్షిణ భారతదేశంలో అరుదైన వాతావరణం, పొగమంచుతో కప్పి ఉండే ఏకైక హిల్ స్టేషన్ ఇదే కావడం గమనార్హం. ఇక్కడ ఉష్ణోగ్రతలు మంచు కురిసేంత తక్కువగా ఉంటాయి. ఇక్కడ అరుదైన వాతావరణం నెలకొని ఉంటుంది. అతిశీతలంగా, సుందరమైన లోయలు, ప్రకృతి అందాలు అబ్బురపరుస్తాయి. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి దాదాపుగా 1,000 మీటర్లు (3,280 అడుగులు) ఎత్తులో ఉంది. దక్షిణ భారతదేశంలో శీతాకాలం కురిసే మంచు దృశ్యాలను వీక్షించగలిగే ఏకైక ప్రదేశం లంబసింగి కావడం విశేషం. ఏడాదంతా ఇక్కడ హిమపాతం సంభవిస్తున్నప్పటికీ శీతకాలంలో ఇంకా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఇక్కడ ఉండే గడ్డకట్టే చలి వాతావరణం కారణంగా కొన్నిసార్లు ఉదయం పూట మంచు స్ఫటికాలుగా మారి గ్రామాన్ని తెల్లటి పొర కప్పేసి ఉంటుంది. స్థానికులు లంబసింగిని ‘కొర్ర బయలు’ అని కూడా పిలుస్తుంటారు. ‘ఎవరైనా రాత్రిపూట బహిరంగ ప్రదేశంలో ఉంటే కర్రలా స్తంభించిపోతారు’ అని ఈ పదానికి అర్థం. ఎముకలు కొరికే చలి వాతావరణం ఇలా పిలుచుకోవడానికి కారణమైంది. చలి తీవ్రంగా ఉండే డిసెంబర్- జనవరి నెలల్లో ఇక్కడి ఉష్ణోగ్రతలు 0 నుంచి -2 ° సెంటిగ్రేడ్ స్థాయికి పడిపోతుంటాయి. ఇతర సీజన్లలో కూడా గ్రామం చాలా చల్లగా, పొగమంచు పడుతూ ఉంటుంది. చాలా రోజుల్లో ఉదయం 10 గంటల తర్వాత మాత్రమే సూర్య కిరణాలు పడతాయి.

లంబసింగిలో కనిపించే సుందరమైన లోయలు, దట్టమైన అడవులు, పర్వతాలు చాలా ఆహ్లాదకరంగా కనువిందు చేస్తాయి. కాఫీ తోటలు, యాపిల్ తోటలు, మిరియాల సాగు కనిపిస్తాయి. అంతేకాదు స్థానికంగా ఉండే గిరిజనులతో మాట్లాడడం కూడా కొత్త అనుభూతిని ఇస్తుంది. లంబసింగి గ్రామీణ జీవనశైలిని తెలుసుకోవచ్చు. గ్రామం అవతలి అందాలను చూడాలనుకునేవారికి కూడా సమీపంలోని కొన్ని సుందర ప్రదేశాలు ఉన్నాయి.

కొత్తపల్లి జలపాతం, సుసాన్ ఫ్లవర్ ఫీల్డ్స్, తాజంగి రిజర్వాయర్, కాఫీ తోటలు, యాపిల్ తోటలు, స్ట్రాబెర్రీ సాగు ఇలా దగ్గరలోనే కొన్ని సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

లంబసింగికి నేరుగా రైళ్లు లేవు. సమీపంలో చింతపల్లి రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి లంబసింగి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వెళ్లేవారు కాకినాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లకు కూడా చేరుకోవచ్చు. బస విషయానికి వస్తే లంబసింగిలో అంతగా సౌకర్యాలు లేవు. ఈ మధ్య హోమ్‌ స్టేలు ప్రారంభమయ్యాయి. సమీపంలో ఉన్న పెద్ద పట్టణం అయిన నర్సీపట్నంలో ఉన్న హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో బస చేయవచ్చు.

రెండు రోజులు యూపీఐ సేవలు బంద్

నవంబర్‌లో రెండు రోజుల పాటు ఓ బ్యాంక్ కస్టమర్‌లు UPI సేవలను ఉపయోగించలేరు. బ్యాంకు వ్యవస్థలో నిర్వహణ పనుల కారణంగా ఆయా ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతారని ప్రకటించారు. అయితే ఈ సేవలు ఏ సమయంలో, ఎప్పుడు బంద్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రతిరోజూ వేల కోట్ల రూపాయల విలువైన UPI లావాదేవీలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి దేశంలో యూపీఐ ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. UPI వాడకం ద్వారా నగదును తీసుకువెళ్లే అవసరమే లేకుండా లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. ఈ నవంబర్ నెలలో రెండు రోజులు మాత్రం UPI పనిచేయదు. దీనిని ఉపయోగించలేరు. కానీ అందరికీ మాత్రం కాదు. అయితే ఇది ఎవరికి పనిచేయదు, ఎన్ని రోజులు పనిచేయకుండా ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

నవంబర్‌లో రెండు రోజుల పాటు UPI సేవలను ఉపయోగించుకోలేరని HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు తెలిపింది. బ్యాంక్ వెబ్‌సైట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ముఖ్యమైన సిస్టమ్ మెయింటెనెన్స్ సెట్టింగ్స్ కారణంగా HDFC బ్యాంక్ ఈ UPI సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పింది. HDFC బ్యాంక్ UPI సేవను ఉపయోగించే కస్టమర్‌లు నవంబర్ 5, నవంబర్ 23న UPI ద్వారా డబ్బు పంపలేరు లేదా స్వీకరించలేరు.

నవంబర్ 5న అర్ధరాత్రి 12.00 గంటల నుంచి 02.00 గంటల వరకు, ఆ తర్వాత నవంబర్ 23న అర్ధరాత్రి 12.00 గంటల నుంచి తెల్లవారుజామున 03.00 గంటల వరకు ఈ యూపీఐ సేవలు నిలిపివేయబడతాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కరెంట్, సేవింగ్స్ ఖాతాలతో పాటు రూపే కార్డ్‌లపై ఆర్థిక, ఆర్థికేతర యూపీఐ లావాదేవీలు చేసుకోవడం సాధ్యం కాదని బ్యాంక్ తెలిపింది. ఇది కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ సేవల ద్వారా చెల్లింపులు చేసుకునే దుకాణదారులు కూడా ఈ వ్యవధిలో చెల్లింపు చేసుకోలేరు.

మీరు మీ HDFC బ్యాంక్ ఖాతా నుంచి UPIని వినియోగిస్తున్నయితే HDFC బ్యాంక్ మొబైల్ యాప్, Paytm, PhonePe, Google Pay, Mobikwik వంటి వాటి ద్వారా డబ్బును పంపలేరు లేదా స్వీకరించలేరు. మొత్తంమీద ఈ వ్యవధిలో HDFC బ్యాంక్‌కి లింక్ చేయబడిన ఎటువంటి UPI లావాదేవీలను చేయలేరు.

సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు నరసింహ వారాహి బ్రిగేడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన పవన్ కళ్యాణ్, నేను అన్ని మతాలను గౌరవిస్తానని అన్నారు

ఏలూరు (ఆంధ్రప్రదేశ్), నవంబర్ 3 (IANS). దక్షిణాదికి చెందిన ప్రముఖ సూపర్‌స్టార్ మరియు జనసేన పార్టీ (జెఎస్‌పి) అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీలో నరసింహ వారాహి బ్రిగేడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బ్రిగేడ్ యొక్క ప్రధాన లక్ష్యం సనాతన ధర్మాన్ని రక్షించడం.

పవన్ కళ్యాణ్ శనివారం ప్రసంగిస్తూ, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, కానీ నా విశ్వాసంలో నేను స్థిరంగా ఉన్నాను. సనాతన ధర్మాన్ని విమర్శించినా, సోషల్ మీడియాలో అగౌరవంగా మాట్లాడేవారూ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు నా పార్టీలో నరసింహ వారాహి బ్రిగేడ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాను.

జగన్నాథ్‌పూర్ గ్రామంలో డిపామ్-2 ఉచిత ఎల్‌పిజి సిలిండర్ పథకాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

ఆయన ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వం కంటే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. దీపం-2 పథకం ద్వారా రాష్ట్రంలోని 1,08,39,286 మంది అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి రూ.2,684 కోట్లతో మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో ప్రజల సంక్షేమం కోసం రూ.13,425 కోట్లు ఇస్తామన్నారు.

సంకీర్ణ ప్రభుత్వం బాలికలు, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.

మహిళలపై ఎవరైనా బెదిరింపు దాడులు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలపై కూడా విమర్శలు గుప్పించారు. కేవలం 11 సీట్లు వచ్చినా వైఎస్సార్‌సీపీ సభ్యులు, మద్దతుదారులు బాగుపడలేదన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొన్ని నెలలే అయినా ఏదో పెద్ద అవాంఛనీయ సంఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇక నుంచి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసేవారిని సహించేది లేదన్నారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా సోషల్‌ మీడియాలో మహిళలను అగౌరవపరచడం ఆపడం లేదని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.

మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా ఉపేక్షించేది లేదని, ఈ ప్రవర్తనకు పాల్పడే వారి సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా ఉంచుతున్నామని ఆయన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను హెచ్చరించారు. ఇక నుంచి ఎవరైనా మహిళలను కించపరిచేలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఆర్బీఐ వద్ద ఏపీ సెక్యూరిటీ బాండ్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది.

అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టే సంప్రదాయాన్ని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కొనసాగిస్తోంది.

ఇప్పటికే దశలవారీగా వేల కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అప్పులకు వెళ్లింది చంద్రబాబు సర్కార్. తాజాగా 2,000 కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. దీనికి అవసరమైన రెండు సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టింది.

ఒక్కో బాండ్ విలువ 1,000 కోట్ల రూపాయలు. ఇవి రివైజ్డ్ సెక్యూరిటీ బాండ్లు. ఈ నెల 5వ తేదీన అంటే మంగళవారం నాడు ఈ సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది.

ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 18, మరొకటి- 23 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈ నెల 30వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 గంటలు, కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు అదే తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.

అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఈ నెలన్నర రోజుల వ్యవధిలో తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది అయిదోసారి. ఇదివరకే 12,000 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. తొలుత 3,000 కోట్లు, ఆ తరువాత 5,000 కోట్లు, మూడో విడతలో 2,000 కోట్లు, నాలుగోసారి మళ్లీ 2,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరించింది.

ఏపీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. బిహార్- రూ. 2,000 కోట్లు, హర్యానా- రూ. 1,500 కోట్లు, కేరళ- రూ.1,000 కోట్లు, తమిళనాడు- రూ. 2,000 కోట్లు, ఉత్తరాఖండ్- రూ. 500 కోట్లు, మిజోరం- 80 లక్షల రూపాయల మేర బాండ్లను వేలానికి పెట్టాయి. మొత్తంగా 9,467 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వచ్చే మంగళవారం వేలానికి పెట్టనుంది ఆర్బీఐ.

టార్గెట్ పవన్, చంద్రబాబు.. షర్మిల సంచలన ట్వీట్

3 ఉచిత సిలిండర్లు ఇచ్చి.. ప్రజలను నుంచి డబ్బులు వసూలు చేయాలని కూటమి సర్కార్ ఆలోచిస్తుందన్నారు షర్మిల. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి.. ఇప్పుడు పెంచడం దారుణమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 5న ఆందోళనకు పిలుపినిస్తున్నట్లు చెప్పారు.

కూటమి సర్కార్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో జనసేన, టీడీపీ, బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని కూటమి సర్కార్ గఫ్ఫాలు కొట్టుకుంటోంది అని అన్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని మండిపడ్డారు.

ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి అని సెటైర్లు వేశారు. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు.. ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు అని అన్నారు. ఇంకా రూ.3వేల కోట్లు ప్రజలపైనే అధనపు భారం పడుతుంది కదా అని ప్రశ్నించారు. దీపం - 2 కింద వెలుగులు పక్కన పెడితే .. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లు అని ఫైర్ అయ్యారు. గత వైసీపీ చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది APERC తప్ప.. మేము కాదని, చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరోటి కాదని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచితే, మీరూ మొదలుపెట్టారు కదా అని చురకలు అంటించారు. మీకు వాళ్లకు ఏంటి తేడా ? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే, మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా అని నిలదీశారు.

మీకు వాళ్లకు ఏంటి తేడా. రూ.6వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదని అన్నారు. బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు కదా… సాయం తీసుకురండి అని అన్నారు. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5 న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తుందని అన్నారు.

ఢిల్లీలో దారుణంగా వాయు నాణ్యత

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకూ పడిపోతోంది. దీపావళి సందర్భంగా ప్రభుత్వం పటాకులపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయకుండా పెద్దమొత్తంలో బాంబులను కాల్చడంతో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజురోజుకూ పడిపోతోంది. దీపావళి సందర్భంగా ప్రభుత్వం పటాకులపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయకుండా పెద్దమొత్తంలో బాంబులను కాల్చడంతో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్‌ (Delhi – NCR) ప్రాంతంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 300కి పైనే నమోదవుతోంది. ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (SAFAR) సంస్థ ప్రకారం.. ఇది చాలా ఆధ్వాన్నమైన స్థాయిలో ఉన్నట్లు. ఈ కారణంగా ఢిల్లీతోపాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో ప్రజలు విష వాయువులను పీల్చుకుంటున్నారు. తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు

దేశ రాజధానిలో దీపావళి రాత్రి అధిక స్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ రీడింగ్‌లు గరిష్ఠ సాయి 999కి చేరాయి. దీని కారణంగా ఢిల్లీ – ఎన్సీఆర్‌ ప్రాంత ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను నివేదించినట్లు ఓ సర్వే తాజాగా వెల్లడించింది. 69 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గొంతునొప్పి, దగ్గుతో సహా కాలుష్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు సదరు సర్వే నివేదించింది.

డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన లోకల్ సర్కిల్స్ ఈ సర్వే నిర్వహించింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో 21 వేల కంటే ఎక్కువ మందిపై సర్వే చేసింది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా 62 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కళ్ల మంటలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. 46 శాతం మంది ముక్కు కారటం వంటి సమస్యలు నివేదించారు. ఇక 31 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా ఆస్తమా ఉన్నట్లు తెలిపారు. మరో 31 శాతం మంది తలనొప్పిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

23 శాతం మంది ఏకాగ్రతను కోల్పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేయగా.. 15 శాతం మంది నిద్రపోతున్న సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. అయితే, 31 శాతం మంది మాత్రం కాలుష్యం కారణంగా ఎలాంటి ఇబ్బందులనూ నివేదికంకపోవడం విశేషం. రాజధాని వాసులు చాలా మంది ఇప్పటికే దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రోన్కైటిస్‌ క్రానిక్‌, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతున్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. రానున్న రోజుల్లో ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో ఏక్యూఐ స్థాయిలు మరింత దిగజారే అవకాశం ఉందని సదరు సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

ఇక ఇదే సర్వే.. రాజధానిలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవుతున్నారని ఢిల్లీ వాసులను ప్రశ్నించింది. 10,630 మందిలో 15 శాతం మంది ఈ సీజన్‌లో నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మరో 9 శాతం మంది రోగనిరోధక శక్తి పెరిగే ఆహారాలు, పానీయాలు తీసుకుంటూ ఇంటి పట్టునే ఉండాలనుకుంటున్నట్లు సమాధానం ఇచ్చారు. మరో 23 శాతం మంది ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించాలని యోచిస్తున్నారు. కొందరు కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరికొందరు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.

తెలంగాణ సీఎం మార్పు వార్తలపై మంత్రి పొంగులేటి

తెలంగాణ సీఎం కుర్చీ మార్పు వార్తలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి పీరియడ్ ఇంకా నాలుగేండ్ల ఒక నెల ఉందని.. పూర్తి కాలం రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు.

తెలంగాణలో సీఎం మార్పుపై గతకొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పందించారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ సీఎం మార్పు ఉండదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి పీరియడ్ ఇంకా నాలుగేండ్ల ఒక నెల ఉందని.. పూర్తి కాలం రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని తెలిపారు. ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అవి టీ కప్పులో తుఫాను మాత్రమే అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

మంత్రి ఇంకా మాట్లాడుతూ.. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోస్తామన్నారు. గ్రామ సభలు పెట్టి ఇండ్లను మంజూరు చేస్తామని.. నాలుగు విడతల్లో 5 లక్షలు పేమెంట్ చేస్తామన్నారు. ఫౌండేషన్ లెవల్‌కు లక్ష, లెంటల్ లెవల్‌కు 1.25 లక్షలు, స్లాబ్ లెవల్‌కు 1.75 లక్షలు, పూర్తి అయ్యాక లక్ష చెల్లిస్తామన్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉంటుందన్నారు. సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఇండ్లకు కూడా సహాయం చేస్తామన్నారు. ఈ నెల 20లోపు ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల జాబితాను పంపిస్తాయన్నారు.

ఈ నెలాఖరుకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి అవుతుందని వెల్లడించారు. ఆ వెంటనే ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఫ్రీ ఇసుక ఇచ్చే అవకాశాలు పరిశీలిస్తామన్నారు. కేంద్ర గృహ నిర్మాణ స్కీం అడాప్ట్ చేసుకుంటున్నామని.. పేద ప్రజలకు అన్యాయం జరగొద్దని కేంద్రం ఎన్ని కండిషన్‌లు పెట్టినా ఒప్పుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కేంద్రం లోగో పెట్టుకోవడానికి కూడా ఒప్పుకున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజలకు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామన్నారు. రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

రాబోయే నాలుగేళ్లు 20 లక్షల ఇండ్ల నిర్మాణం టార్గెట్ పెట్టుకున్నామని.. తల తాకట్టు పెట్టైనా పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మొదటి విడత ఇండ్లకు 26 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. సంక్రాంతి పండగ ముందు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్లు

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్రపక్షంగా మారింది. కాగా.. బీఆర్ఎస్‌పై ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతకాలన్ని తమ దగ్గరున్నాయని.. తాను నోరు విప్పితే తట్టుకోలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. నిన్నటివరకు మిత్రులుగా ఉన్నవాళ్లు కూడా తెల్లారే సరికి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ శత్రువులుగా మారిపోతుండటం చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు అచ్చంగా అదే జరిగింది తెలంగాణలో కూడా. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి విమర్శలు చేయని ఎంఐఎం నేతలు.. ఇప్పుడు మెల్లగా అది కూడా మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీలపై ఏకంగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

శనివారం (నవంబర్ 02న) రోజున మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ.. బీఆర్ఎస్ జాతకాలన్ని తమ దగ్గరున్నాయని.. అవన్ని చేప్తే వాళ్లు తట్టుకోలేరంటూ కీలక కామెంట్లు చేశారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళికలు చేయలేదా.. ఆ ప్రణాళిక వద్దని నేను చెప్పలేదా అంటు అసదుద్దీన్ ప్రశ్నించారు. అప్పటి విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా అని అడిగిన అసదుద్దీన్.. తాను నోరు విప్పితే బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడతారంటూ హెచ్చరించారు. ఇళ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే స్వాగతిస్తామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలని సూచించారు.

బీఆర్ఎస్ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ వల్లే ఎక్కువ సీట్లు వచ్చాయని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు. ఎంఐఎం మద్దతుతోనే ఎక్కువ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేదని తెలిపారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు చాలా అహంకారం ఉండేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. ఎక్కువ మంది సంతానం ఉండాలని చంద్రబాబుతో పాటు స్టాలిన్‌ కూడా అంటున్నారని గుర్తు చేసిన అసదుద్దీన్.. అదే విషయాన్ని తాను చెప్పి ఉంటే ఎక్కడలేని రచ్చ చేసేవారని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత్ దేశంలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారన్నారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి నష్టమేనని.. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతుందన్నారు. బాగా పనిచేసిన రాష్ట్రాలను ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభమని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు.