/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz TG : ఈ రోజు నుండి ఉచిత పశువైద్య శిబిరాలు TS breaking
TG : ఈ రోజు నుండి ఉచిత పశువైద్య శిబిరాలు

రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శనివారం నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉచిత పశువైద్య గర్భకోశ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచిఘోష్ తెలిపారు.

 సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మేలుజాతి పాడిపశువులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

నేటి రాశి ఫలాలు నవంబర్ 02,2024

ఓం గం గణపతయే నమః 

ఓం గురుభ్యోనమః 

ఓం నమో నారాయణాయ 

నేటి రాశి ఫలాలు

నవంబర్ 02,2024

మేషం

నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం

చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అదిగమించి ముందుకు సాగుతారు.

మిధునం

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

సింహం

ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కన్య

చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

తుల

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణయత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థాణాచలనాలు తప్పవు.

ధనస్సు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం

కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు మార్పులు చోటుచేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

కుంభం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

మీనం

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేరుతాయి.

నేటి పంచాంగము నవంబర్ 02,2024

ఓం గం గణపతయే నమః 

ఓం గురుభ్యోనమః 

ఓం నమో నారాయణాయ 

నేటి పంచాంగము  

నవంబర్ 02,2024

శ్రీ ఇందిరాదామోదరాయనమః 

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: కార్తిక 

పక్షం: శుక్ల - శుద్ధ 

తిథి: పాడ్యమి రా.06:51 వరకు

తదుపరి విదియ

 

వారం: శనివారం - మందవాసరే

 

నక్షత్రం: విశాఖ రా.తె.05:25 వరకు 

తదుపరి అనూరాధ

యోగం: ఆయుష్మాన్ ఉ‌.10:58 వరకు 

తదుపరి సౌభాగ్య

 

కరణం: బవ రా.06:51 వరకు

తదుపరి బాలవ పూర్తి 

వర్జ్యం: ఉ‌.09:10 - 10:56 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.06:14 - 07:42

రాహు కాలం: ఉ‌.09:07 - 10:33

గుళిక కాలం: ఉ‌..06:14 - 07:41

యమ గండం: ప‌.01:25 - 02:51

 

అభిజిత్: 11:37 - 12:21

సూర్యోదయం: 06:14

సూర్యాస్తమయం: 05:44

చంద్రోదయం: ఉ‌.06:44

చంద్రాస్తమయం: రా.06:10

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: తుల

దిశ శూల: తూర్పు

బలి ప్రతిపద 

అభ్యంగనస్నానం 

బలిరాజోత్సవం‌ 

 గోవర్ధనోత్సవం 

బలిధ్వజారోహణం‌ 

గోపూజ 

అన్నకుట్ 

శ్రీ లక్ష్మి పూజ 

ద్యుత క్రీడ 

చెన్న బసవ‌ జయన్తి 

భాస్కర కృచ్ఛవ్రతము ;( దశదినము)

గండ షష్ఠి - షట్‌దిన

ఉపవాసారంభం‌ 

కార్తికనక్త‌ వ్రతారంభం‌ 

వష్టికాకర్షణం 

శ్రీ వారణాసి రామసుబ్బయ్య

జయన్తి‌ 

అపరాహ్ణే మార్గపాలీబంధనం‌  

విక్రమార్క శకారంభం 

కార్తిక నక్తవ్రతారంభం 

మహావీర్ శకారంభం 

అకాశదీపారంభం‌ ( మతాంతరం)

తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి

గజవాహనోత్సవం‌ 

తిరుచెందూర్ శ్రీ మురుగన్

 శూరసంహారోత్సవారంభం‌ 

తిరునల్వేలి శ్రీ కాంతిమతి‌ 

అమ్మన్ ఊంజల్‌ సేవ 

కార్తీకమాసం విశిష్టత...!!

కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానాన్ని చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం

నుదుట విభూతినీ మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం..

ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీకమాసం.

ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీకస్నానం, ఉపవాసము, కార్తీకదీపము. 

కార్తీకస్నానం : 

కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినాసరే, తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. 

ఈ విధంగా నియమంతో స్నానంచేసి శివుడినిగాని, విష్ణవునుగాని, లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కరతీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయి. 

కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే 'నక్తమ్' అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేనివారు పాలవంటి ద్రవపదార్థాన్నిగాని, పండువంటి ఘనపదార్థాన్నిగాని స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకుని, దీపారాధన చేసుకుని భోజనం చేయాలి. 

దీపారాధన :

కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనది. శివాలయంలోగాని, ఇంట్లోనైనాసరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనాసరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది.

జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి. కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము.

దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యకరముగా చెప్పబడినది. సూర్యాస్తమయం అయిన వేంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగును.

కార్తీకమాసములో కొన్ని వస్తువులు నిషేధించడమైనది. అవి వాడరాదు. ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడి కాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము.

పగటిపూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగు రంగుల రంగవల్లిపై కార్తీకదీపం పెట్టి, కార్తీక పూరాణము చదివిన వారికి, వినినవారికి ఏడు జన్మలవరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెపుతున్నది. 

ధాత్రీపూజ : 

ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి.

నేటి రాశిఫలాలు నవంబర్ 01,2024 శుక్రవారం

మేషం

ముఖ్యమైన వ్యవహారలలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

వృషభం

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

మిధునం

ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు తప్పవు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన అనారోగ్య సమస్యలుంటాయి.

కర్కాటకం

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

సింహం

నూతన వాహన యోగం ఉన్నది. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో  సఖ్యతగా వ్యవహరిస్తారు.  సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కన్య

పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచి. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బారం తప్పదు. 

తుల

ఆదాయవ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. ఇంట బయట విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలోలాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం

ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మికచింతన కలుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

ధనస్సు

నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధన పరంగా మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 

మకరం

ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతోవిందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.

కుంభం

మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బందికలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. 

మీనం

ఇతరులకు మాటఇచ్చే  విషయంలో జాగ్రత్త వహించాలి. పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి.

నేటి పంచాంగము నవంబర్ 01,2024 శుక్రవారం

ఓం గం గణపతయే నమః 

ఓం గురుభ్యోనమః

శ్రీ ఇందిరాదామోదరాయనమః 

నేటి పంచాంగము  

నవంబర్ 01,2024

శుక్రవారం

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: ఆశ్వీయుజ 

పక్షం: కృష్ణ - బహుళ 

తిథి: అమావాశ్య సా.04:59 వరకు 

కార్తిక తదుపరి శుక్ల పాడ్యమి

 

వారం: శుక్రవారం - భృగువాసరే

 

నక్షత్రం: స్వాతి రా.03:00 వరకు

తదుపరి విశాఖ

యోగం: ప్రీతి ఉ‌10:21 వరకు

తదుపరి ఆయుష్మాన్

 

కరణం: నాగవ సా.04:59 వరకు

తదుపరి కింస్తుఘ్న రా.తె.05:54 వరకు

తదుపరి బవ

వర్జ్యం: ఉ‌.06:46 - 08:31 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.08:32 - 09:18

మరియు ప‌.12:22 - 01:08

రాహు కాలం: ఉ‌.10:33 - 11:59

గుళిక కాలం: ఉ‌.07:40 - 09:07

యమ గండం: ప‌.02:52 - 04:18

 

అభిజిత్: 11:37 - 12:21

సూర్యోదయం: 06:14

సూర్యాస్తమయం: 05:44

చంద్రోదయం: ఉ‌.పూ.05:53

చంద్రాస్తమయం: సా.05:31

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: తుల

దిశ శూల: పశ్చిమం

ఆశ్వయుజ అమావాస్య 

దీపావళి 

శ్రీ మహాలక్ష్మి పూజ 

పితృతర్పణాలు 

శ్రీ విద్యాధిరాజతీర్థ 

పుణ్యతిథి 

మైకండ దేవర్ నాయనారు గురుపూజ 

విష్ణు పంచకోపవాసము 

కేదారేశ్వర వ్రతము 

ఉల్కా ప్రదర్శనము 

గుజరాతీ‌ నూతన 

సంవత్సరాది‌

నేటి పంచాంగము అక్టోబర్ 29,2024

ఓం గం గణపతయే నమః

ఓం శ్రీ గురుభ్యోనమః

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం 

ఋతువు: శరద్

మాసం: ఆశ్వీయుజ 

పక్షం: కృష్ణ - బహుళ 

తిథి: ద్వాదశి ఉ‌.11:06 వరకు

తదుపరి త్రయోదశి

 

వారం: మంగళవారం - భౌమవాసరే 

 

నక్షత్రం: ఉత్తరఫల్గుణి రా.07:39 వరకు 

తదుపరి హస్త

యోగం: ఐంద్ర ఉ‌.07:27 వరకు

తదుపరి వైధృతి

 

కరణం: తైతుల ఉ‌.11:06 వరకు

తదుపరి గరజ రా.11:59 వరకు

తదుపరి వణిజ 

వర్జ్యం: రాతె.04:57 - 06:43

దుర్ముహూర్తం: ఉ‌.08:31 - 09:18

మరియు రా.10:42 - 11:32 వరకు

రాహు కాలం: ప‌.02:52 - 04:19

గుళిక కాలం: ఉ‌.11:59 - 01:26

యమ గండం: ఉ‌.09:06 - 10:33

 

అభిజిత్: 11:36 - 12:22

సూర్యోదయం: 06:13

సూర్యాస్తమయం: 05:45

చంద్రోదయం: రా.తె.03:32

చంద్రాస్తమయం: ప‌.03:52

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కన్య

దిశ శూల: ఉత్తరం

నక్షత్ర శూల: ఉత్తరం

నేటి రాశిఫలాలు అక్టోబర్ 29,2024 మంగళవారం

ఓం గం గణపతయే నమః

ఓం శ్రీ గురుభ్యోనమః

మేషం

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు.

వృషభం

చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

మిధునం

ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

కర్కాటకం

వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి

సింహం

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయటపడతారు.

తుల

నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారూలతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

వృశ్చికం

ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు

సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది.

మకరం

ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.

కుంభం

నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

మీనం

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

Hyd : నెల రోజులు హైదరాబాద్ లో 144 సెక్షన్... - పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

హైదరాబాద్ నగరంలో రానున్న నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల రోజుల పాటు ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. 

ఏక్ పోలీస్ విధానం అమలు, సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుళ్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 

ఇది రోజురోజుకూ తీవ్రతరమవుతుంది. పైగా, యూనిఫామ్‌లతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని బెటాలియన్ కానిస్టేబుళ్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. 

నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హింసాత్మక ఘటనలు, అశాంతిని రేకెత్తించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు అందింన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని ఆయన జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు అమల్లోకి ఉంటాయని వెల్లడించారు. ఈ సమయంలో సమావేశాలు, ర్యాలీలు, సభలు, ధర్నలు, రాస్తారోకోలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఆంక్షల్లో భాగంగా ఐదుగురికి మించి ఒక చోట గుమికూడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

అల్లం టీ – ఆరోగ్య ప్రయోజనాలు..

అల్లం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ నేప‌ధ్యంలోనే మనం అల్లం టీ గురించి మీకు చెప్పబోతున్నాం, ఇది తయారు చేయడం చాలా సులభం.

దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

అల్లం టీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం అందించడంతో పాటు.. ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా ఇది ప్రభావవంతంగా ప‌నిచేస్తుంది. కాబట్టి, దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అల్లం టీ తీసుకోవ‌డం వ‌ల్ల‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

రక్తపోటు పెరగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో అల్లం టీ కాల్షియం ఛానెల్‌ని నిరోధించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది.

అల్లం యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. అల్లం టీ తాగడం వ‌ల‌న‌ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది. అందువల్ల జలుబు, దగ్గు, ఫ్లూ మొదలైన వాటిని నివారించడంలో ఇది చాలా సహాయపడుతుంది.

యాంటీ మైక్రోబియల్ లక్షణాలతో పాటు, యాంటీఆక్సిడెంట్లు కూడా అల్లంలో ఉన్నాయి, ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. అల్లం టీ చర్మాన్ని, ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది.

వికారం లేదా వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. అల్లం టీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జింజెరాల్ ఇందులో ఉంటుంది, ఇది వికారం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అల్లంలో ఉన్నాయి. అల్లం టీ తాగడం వల్ల నొప్పి, వాపు తగ్గుముఖం ప‌డ‌తాయి. ఇది మాత్రమే కాదు. ఇది ఎముకల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.