/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ఆధ్వర్యంలో ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శికి సన్మానం Mane Praveen
NLG: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ఆధ్వర్యంలో ఎస్జిఎఫ్ జిల్లా కార్యదర్శికి సన్మానం
నల్లగొండ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల ను శాలువాతో ఘనంగా సన్మానించారు. గాంధీ సంస్థల రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి.. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల  వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలు కొన్ని సంవత్సరాలుగా క్రీడలను, క్రీడాకారులను, కోచ్, లను ప్రోత్సహిస్తూ ఎన్నో క్రీడా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 2023 సంవత్సరంలో SGF మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించిన క్రీడల్లో దాదాపు 5000 మంది క్రీడాకారులకు భోజన వసతి కల్పించామని గుర్తు చేశారు. ప్రస్తుత ఎస్జిఎఫ్ సెక్రెటరీ దగ్గుపాటి విమల ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాముల అశోక్, సంస్థల బాధ్యులు అజీజ్ షరీఫ్, గొర్రె వెంకట్ రెడ్డి, యానాల రాధిక, ఫిజికల్ డైరెక్టర్లు ఇమాం కరీం, నుస్రత్, లెనిన్, విజయ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
NLG: ఛలో నల్లగొండ... కర పత్రాలు ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా:
మునుగోడు: షెడ్యూల్ కులాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో 'మాల ఉద్యోగుల స్వాభిమానసభ' కర పత్రాలను  గురువారం మండల కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలో, కమిటి మండల అధ్యక్షుడు చలిచీమల యాదగిరి ఆధ్వర్యంలో మాలమహానాడు నాయకులు ఆవిష్కరణ చేశారు.

నవంబర్ 3 ఆదివారం రోజున, నల్లగొండ చర్లపల్లి బైపాస్లో గల ఎన్ఆర్ఎస్ గార్డెన్ లో జరిగే మాల ఉద్యోగుల స్వాభిమానసభ కు మాలలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కమిటి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లపు బాలశివ రాజు, మండల ప్రధాన కార్యదర్శి భేరి రవీందర్, సీనియర్ నాయకులు రెడ్డిమల్ల యాదగిరి, గుంటుక కృష్ణయ్య, మండల నాయకులు బొల్లు సైదులు, బొల్లు శ్రీను, అన్నిమళ్ళ నాగరాజు, ముచ్ఛపోతుల శ్రీకాంత్, శిర్గమల్ల రమేష్, దాసరి సాయి కుమార్, బొల్లు పెద్ద శ్రీను, బొల్లు రామలింగయ్య, ఓడిగా కృష్ణయ్య, అద్దంకి అంజయ్య, బొల్లు లింగయ్య, గోలి వెంకన్న, భేరి అంజయ్య, మండల నాయకులు పాల్గొన్నారు.



NLG: అగ్రికల్చర్ సైంటిస్ట్ కృష్ణంరాజు ను కలిసిన చత్రపతి శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
అగ్రికల్చర్ సైంటిస్ట్, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, జీకే సీడ్స్ జీకే బయో సైన్సెస్ ప్రై. లిమిటెడ్ చైర్మన్ జి.కృష్ణంరాజు ను చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడల అభివృద్ధికై కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ద్వారా సహకరించాలని కోరారు.
NLG: మునుగోడు నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
ఈరోజు దీపావళి పండుగ పురస్కరించుకొని.. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనలో సరికొత్త ఉత్సాహానికి స్ఫూర్తినిస్తూ వెలుగులు పంచే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండగ వేళ టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
TG: రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగనే దీపావళి పండగ అని అన్నారు. 

తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని.. ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగు రేఖలను ఇనుమడింపచేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని వెలుగుల పండగను సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
NLG: వ్యాపారాలు నిర్వహించి లాభాలు పొంది తోటి వారికి ఉపాధి కల్పించాలి: మెప్మా స్టేట్ కోఆర్డినేటర్
నల్లగొండ: పట్టణంలో 'ఇందిరా మహిళా శక్తి' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన యూనిట్లను, మహిళా పొదుపు సంఘము వారు చేపట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను.. మంగళవారం మెప్మా స్టేట్ మిషన్ కో -ఆర్డినేటర్ ప్రసన్న కుమార్, మున్సిపల్ కమిషనర్ మూసాబ్ అహమద్ సందర్శించారు. ఈ మేరకు హోమ్ ఫూడ్స్, పచ్చళ్ల తయారీ మరియు కంప్యూటరు ఎంబ్రాయిడరీ యూనిట్లను వారు పరిశీలించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం  'మహిళలకు స్వయం ఉపాధి తో లాభాలు పొందుటకు గాను రుణాలు మంజూరు చేస్తున్నది' అని అట్టి మహిళా పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలను వృధా చేయకుండా వ్యాపారాలు నిర్వహించి లాభాలు పొంది తోటి వారికి ఉపాధి కల్పించాలని అన్నారు.

నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించి వారు తయారు చేస్తున్న అరిసెలు, లడ్డులు, బూంది, సద్ద బూరెలు, గరజలు, కరపప్పలు, చేగోడీలు, సకినాలు, మురుకులు, పచ్చళ్ల తయారీ లో మామిడి, నిమ్మకాయ, టమాట, ఉసిరి, చికెన్, మటన్ మరియు చేపల పచ్చలు చేసే విధానంను వ్యాపార లావాదేవీల గూర్చి సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తయారు చేయు విధానాన్ని పరిశీలించి వ్యాపారం చాలా బాగుందని ప్రశంసించారు. అదేవిధంగా కంప్యూటరు ఎంబ్రాయిడరీ గురించి అడిగి తెలుసుకున్నారు.

పిండి వంటలు కేజీ రూ. 200 ల నుండి రూ. 300 వరకు పచ్చలు రూ.400 నుండి రూ. 1000 వరకు అమ్మడం జరుగుతున్నదని మహిళలు వారికి తెలిపారు.

కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మిషన్ కొ- ఆర్డినేటర్ శివాజీ, మెప్మా సిబ్బంది శ్రీనివాస్, నరసింహ, జ్యోతి, అనిల్, రాజు, ఆర్పీ లు మరియు సంఘ సభ్యులు, యూనిట్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: పగిడిమర్రి గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ: జిల్లాలోని ప్రతి పల్లెకు మౌలిక వసతులు కల్పించే వరకు విశ్రమించనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం పగిడిమర్రి గ్రామంలో 38 కోట్ల రూపాయలతో.. సోమన్నవాగు వద్ద హైలెవల్ బ్రిడ్జ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా కొత్తపల్లి – పగిడిమర్రి రోడ్, పగిడిమర్రి – మదనాపురం రోడ్, పగిడిమర్రి – కుదావన్ పూర్ రోడ్ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
చండూరు నూతన ఆర్డీవోగా శ్రీదేవి
నల్లగొండ జిల్లా:
చండూరు రెవెన్యూ డివిజన్ ఆర్డీవోగా శ్రీదేవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీదేవికి పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా నూతనంగా ఏర్పడిన చండూరు రెవిన్యూ డివిజన్ కు ఆర్ డి ఓ గా పని చేసిన సుబ్రమణ్యం మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి రెవెన్యూ డివిజన్ కు బదిలీపై వెళ్లారు.
NLG: మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో హాకీ జట్టు ఎంపికలు ప్రారంభం
నల్లగొండ: ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 హాకీ జట్టు ఎంపికలు మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్ జి ఎఫ్ సెక్రటరీ దగ్గుపాటి విమల కార్యక్రమాన్ని ప్రారంభించి  మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీలలో మన హాకీ జట్టు ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. క్రీడల ద్వారానే శారీరక మరియు మానసిక రుగ్మతలను జయించవచ్చని ఆమె తెలిపారు. ఎంపిక ప్రక్రియ చాలా నిష్పక్షపాతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు మెర్సీ ప్రభావతి, వాడపల్లి రవీందర్, గుండా శ్రీనివాస్, ఇమామ్ కరీం, బొమ్మ పాల గిరిబాబు, రాజశేఖర్, కవిత, శ్రీదేవి, అజీజ్  కేలో ఇండియా హాకీ కోచస్ యావర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
NLG: పక్షవాతం వ్యాధిగ్రస్తురాలికి వీల్ చైర్ అందజేత
నల్లగొండ జిల్లా:
నాంపల్లి గ్రామానికి చెందిన కమిశెట్టి చంద్రకళ గత 9 సం. లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వారానికి 3 రోజులు డైయాలసిస్ కోసం నిమ్స్ కు వెళ్తున్నారు.

అయితే ఇటీవల ఆమెకు పక్షవాతం రావడంతో రెండు కాళ్ళు పని చెయ్యక పోవడం తో ఆమెకు వీల్ చైర్ అవసరం ఏర్పడింది.

కానీ ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేక దాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిమ్స్ లో పిఆర్ఓ గా విధులు నిర్వర్తిస్తున్న ఆశా రాణి మంగళవారం తన సొంత ఖర్చుతో వీల్ చైర్ అందచేసి తన ఉదారత ను చాటుకున్నారు.