NLG: హై స్కూల్ హెడ్మాస్టర్ పై.. డిఇఓ కు ఫిర్యాదు
చండూర్ హై స్కూల్ హెడ్మాస్టర్ అక్కడ పని చేసే వంట చేసే మహిళలను అసభ్య పదజాలంతో తిడుతూ వేధిస్తున్నాడని, ఆరోపిస్తూ.. అతని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు ఇవాళ నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా విద్యాధికారి కి, జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పలు విద్యార్థి సంఘాలు మహిళా వంట మనుషులకు మద్దతుగా నిలిచారు.
మహిళా సమభావన సంఘం నుండి గత పది సంవత్సరాలుగా చండూర్ హై స్కూల్ నందు పనిచేస్తున్నామని.. హెడ్మాస్టర్ మహిళలమైన తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని తొలగించి, హెడ్మాస్టర్ ప్రభుత్వ నియమ నిబంధనకు విరుద్ధంగా ఆయనకు సంబంధించిన వేరే ప్రైవేటు వ్యక్తులను పనిలో పెట్టుకోవడం జరిగిందని, ఇట్టి విషయంపై అడగ్గా నాకిష్టం వచ్చిన వారిని పెట్టుకుంటా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దుర్భాషలాడుతున్నాడని, నిబంధన ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఇట్టి విషయంపై సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని వారు కోరారు.
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు 400 మంది ఉంటే ప్రతి ఒక్కరికి ఎనిమిది రూపాయలు చొప్పున 30 రోజులకు ఒక లక్ష రూపాయల వరకు డబ్బులు వస్తే మహిళా సంఘం అకౌంట్ లో జమ చేయకుండా సదురు హెడ్మాస్టర్ తన సొంత అకౌంట్ లో వేసుకొని వారికి కేవలం నెలకు 15 వేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఇదే తరహాలో గత పది సంవత్సరాలుగా ఇతర హెడ్మాస్టర్ లు కూడా చేశారని.. హెడ్మాస్టర్ అకౌంట్లో డబ్బులు వేయించుకుంటూ మహిళా సంఘం అకౌంట్ డబ్బులు వేయడంలేదని ఆరోపించారు. ప్రశ్నిస్తే వారిని తీసివేసి వేరే ప్రవేట్ వ్యక్తులు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు.ఇదే విషయమై జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ కలిసి సమస్యని వివరించడంతో, విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిఇఓ ను ఆదేశించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, నవదీప్, శేఖర్, కిరణ్, సంగం సెంట్రల్ కమిటీ సభ్యులు కిన్నర జగదీష్ ,యాదయ్య, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్, తదితరులు పాల్గొన్నారు.
Oct 21 2024, 21:11