/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png
నల్లగొండ: మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతిగా ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ నియామకం.
తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలకు ప్రభుత్వం వైస్ ఛాన్స్లర్ లను నియమించింది.
NLG: అతిథి అధ్యాపక (గెస్ట్ లెక్చరర్స్) పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు.
పీ.జి లో 55 శాతం, యస్.సి. యస్.టి వారికి పీ.జి లో 50 శాతం మార్కులు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. అర్థశాస్త్రం- 01, జంతు శాస్త్రం- 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ నెల 22 వ తేదీ లోపు దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తేది.23-10-2024 ఉదయం 10.30 గంటలకు కళాశాల లో ఇంటర్వూ కు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.
NLG: టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) ను సందర్శించిన ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్లగొండ లోని నాగార్జున ప్రభుత్వ
కళాశాల విద్యార్థులు, ఇవాళ హైదరాబాద్ లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) పరిశోధన కేంద్రంను సందర్శించారు.
ఈ మేరకు ఈ సందర్శన విద్యార్థులకు ఉన్నత విద్యా పరిశోధనలో అనుభవాన్ని అందించి, పరిశోధనలో ఉన్నత స్థాయి అవకాశాలను అవగాహన చేసుకోవడంలో ప్రేరణను కల్పించిందని ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ అన్నారు.
వైస్ ప్రిన్సిపాల్ డా. పి. రవికుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బతిని నాగార్జున, ఎం. శ్రీనివాస రెడ్డి, డి. కృష్ణ, మహేశ్వరి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీఐఎఫ్‌ఆర్ డైరెక్టర్ ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు ఈ సందర్శనలో ఆసక్తి చూపించినందుకు అభినందించారు.
NLG: అద్దెభవనాల్లో నడుస్తున్న గురుకులాల కు తక్షణమే అద్దె చెల్లింపులు చేయాలి: ఎస్ఎఫ్ఐ
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేవరకొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్ నాయక్,బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభమవుతున్న విద్యాసంస్థలలో అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలును యాజమానులు తాళ్లం తీయడం లేదు. గత 12 నెలలు నుండి తమకు అద్దె చెల్లించడం లేదని అద్దె చెల్లించకపోవడంతో తాము చేసేది ఎమిలేక మూసివేస్తున్నామని ప్రకటిస్తున్నారు. విద్యాసంస్థకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్ అంతా బయటే ఉన్నారని అధికారులు మాట్లడుతున్నా.. తాళ్లలు తీయడం లేదని ,తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతుందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు యాజమాన్యాలు తాళాలు వేశారు. సుమారు 9 నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ భవనాల యజమానులు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టళ్లకు తాళాలు వేశారు. దీంతో దసరా సెలవుల అనంతరం పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్‌నగర్, తొర్రూర్, భువనగిరిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు భవన యజమానులు తాళాలు వేశారు.
ఒకప్రక్క ఇంటిగ్రేడెడ్ గురుకులాలు అంటూనే.. ఉన్న గురుకులాలు సమస్యలు పరిష్కారం చేయడం లేదని ఆరోపించారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో తాళాలు వేయడం తో మరింత సమస్యలు తీవ్రతరం అవుతాయని తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఎస్.ఎఫ్.ఐ డివిజన్ నాయకులు నేర్లపల్లి జై చరణ్ ,జల్లెల ఇద్ధి రాములు, పోట్ల రాకేష్,మంజుల, నేనావత్ సరస్వతి, రాధిక తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం చుట్టూ సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
యాదాద్రి జిల్లా:
చౌటుప్పల్: మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ఇవాళ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డు 14 వ వార్డులో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం చుట్టూ.. సిసి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, స్థానిక కౌన్సిలర్ సంధగల్ల విజయ్ సతీష్, రామాలయ గుడి చైర్మన్ మురళి, నాయకులు ఊడుగు శ్రీనివాస్(అడ్వకేట్), మునుకుంట్ల సత్యనారాయణ, చింతకింది అంజయ్య, ఉడుగు మల్లేష్, ఉష్కాగుల రమేష్, చెవగోని వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్జిటిగా ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
నాంపల్లి మండల కేంద్రం కేతపల్లి గ్రామంలో డీఎస్సీ ఫలితాలలో ఇటీవల ఎస్జిటిగా ఉద్యోగాలు సాధించిన వారిని, గురువారం స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేష్ సన్మానించారు. ఈ మేరకు గాదేపాక వేలాద్రి, గాదేపాక సైదులు లను శాలువాతో సన్మానించారు.
డి.ఎస్.పి మండల అధ్యక్షుడు ఇరిగి సుధాకర్, పిపిఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి శ్రీను, చిరంజీవి, ఎల్లయ్య, రజినీకాంత్, నవీన్, వెంకటయ్య పాల్గొన్నారు
NLG: నేటి సీఎం కప్ టార్చ్ ర్యాలీలో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలి: బొమ్మపాల గిరిబాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 33 జిల్లాల్లో నిర్వహిస్తున్న 2024 సీఎం కప్ క్రీడా పోటీల టార్చ్ ర్యాలీ భువనగిరి మరియు సూర్యాపేట జిల్లాల ద్వారా ఈరోజు మధ్యాహ్నం నల్లగొండలో ప్రవేశిస్తుందని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఈ ర్యాలీ కి ఘనమైన స్వాగతం తెలిపే కార్యక్రమంలో పట్టణం మరియు గ్రామాలలోని క్రీడాకారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని క్రీడా సంఘీభావం తెలియజేస్తూ టార్చ్ ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
NLG: కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి: జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న
అక్టోబర్ 18న హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేజీకేఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మిక సంఘం పదేండ్ల ప్రయాణం పేరుతో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సుకు నల్లగొండ జిల్లా నుండి కల్లు గీత కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న పిలుపునిచ్చారు.
చండూరు మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి 10 సం.లు పూర్తి అవుతున్నా.. ప్రభుత్వాలు మారినా.. కల్లు గీత కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కరించ లేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కల్లు గీత కార్మికుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించకపోవడం, కేటాయించిన నిధులు ఖర్చు చేయకపోవడం వల్ల గీత కార్మికుల జీవితాలలో ఎలాంటి మార్పు లేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం కల్లు గీత కార్మికుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వృత్తి రక్షణ కోసం గీత కార్మికుల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు.
గీత కార్మికులందరికీ మోటర్ బైక్ లు ఇవ్వాలని, గీత కార్మికులు సహజ మరణం పొందిన ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా గీతన్న బీమా పథకాన్ని అమలు చేయాలని, ప్రతి గీత కార్మికుల కుటుంబానికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ రుణం ఇవ్వాలని ఆయన అన్నారు.ఎక్స్గ్రేషియా పది లక్షలకు పెంచాలని 18 డిమాండ్లతో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సదస్సుకు జిల్లా నుండి అధిక సంఖ్యలో గీత కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, కెవిపిఎస్ జిల్లా నాయకులు రవీందర్, కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు చెనగోని కిరణ్, బొమ్మరగోని కిరణ్, ఖమ్మంపాటి యాదయ్య, బొమ్మర గోని కృష్ణయ్య, బిక్షం, చేనగొని పెంటయ్య, బోయపల్లి రోశయ్య, అంజయ్య, శ్రీను, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
NLG: ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలంలో దసరా పండుగ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ జరుపుల బిచ్య నాయక్ కుటుంబ సభ్యులను, ఇవాళ కాంగ్రెస్ నేత కోడలా అల్వాల్ రెడ్డి పరామర్శించి రూ 10 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు.
కార్యక్రమంలో సైదులు, ఈద కృష్ణ, ప్రదీప్ రెడ్డీ, శ్రీశైలం, సురేష్, కొండల్, మంగ్త, బాలు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Oct 19 2024, 12:38