TTD: శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక ఈ కేంద్రాల్లోనూ లభ్యం..!!
Srivari Laddu Prasadam: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక ఎంపిక చేసిన కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇక నుంచి దర్శనం టికెట్ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, భక్తుల నుంచి వస్తున్న వినతులతో లడ్డూ పలు కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది.
తగ్గిన రద్దీ
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. తిరుమలలో శ్రీవారి ప్రసాదం లడ్డూ పంపిణీలో తాజాగా టీటీడీ మార్పులు చేసింది. ఇక నుంచి దర్శనం టికెట్ లేకుండా తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే వారికి గరిష్ఠంగా రెండు లడ్డూలు మాత్రమే ప్రసాదంగా అందించాలని.. అదీ కూడా ఆధార్‌కార్డు చూపించి మాత్రమే రెండు లడ్డూలు కొనుగేలా చేసేలా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేసారు.
ఇదే సమయంలో లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని ఈవో శ్యామలా రావు తెలిపారు.
లడ్డూ ప్రసాదం
గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబరెటరీ లేదని, ప్రయివేటు ల్యాబరెటరీ సౌకర్యం ఉన్న పరిశీలించలేదన్నారు.
టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబరెటరీ ఏర్పాటు చేస్తునట్లు ఈవో వెల్లడించారు. ఇదే సమయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు.
Sep 05 2024, 15:05