/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ డి మహేందర్ Vijay.S
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ డి మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వలిగొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై డి మహేందర్ అన్నారు. వర్షాల కారణంగా మండల ప్రజలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని కరెంటు వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మండల ప్రజలకు తెలియజేశారు.
హామీలు తప్ప నిధులు లేవు: ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న భువనగిరి జిల్లా కేంద్రంలో చిన్న నీటి వనరులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో హామీలు తప్ప నిధుల ఊసే లేదని ఆర్బాటపు హామీలు చేయడంలో కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. జిల్లాలో చిన్న నీటి వనరులపై గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా హామీలకే పరిమితం అయ్యిందని నిధుల విడుదల ఊసే లేదని, బునాదిగాని పిలాయిపళ్లి, ధర్మారెడ్డిపళ్లి కాల్వల విషయాన్ని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఊరడింపుగా ప్రస్తావించిన నిధులు మాత్రం ప్రకటించలేదని వారు అన్నారు. నిధులు విడుదల చేయకుండా సమీక్ష సమావేశాలతో ఒరిగేదేమీ లేదని ఇది ఆర్భాటపు ప్రచారానికే తప్ప దేనికి ఉపయోగపడదని అన్నారు. 2016-17 సంవత్సరంలో ప్రారంభించిన బునాధిగాని కాలువ 98 కిలోమీటర్లు విస్తీర్ణం ఉంటే 34 కిలోమీటర్ల పని మాత్రమే జరిగిందని కాలువ పూర్తి కావడానికి రూ 260 కోట్ల అంచనాకు కేవలం రూ 33 కోట్లు మాత్రమే మంజూరు అయినవని వారు అన్నారు. గత తెలుగుదేశం, కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ కాలువలను నిర్లక్ష్యం చేసినవి ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నవి అందుకే చిత్తశుద్ధి లేని మాటలు మాని నిధుల విడుదలపై దృష్టి పెట్టాలని వారు అన్నారు. ఈ అంశాలపై సిపిఎం ప్రజల్లోకి వెళ్లి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఇందులో భాగంగానే సెప్టెంబర్ 8,9 తేదీలలో అడ్డగూడూరు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు గ్రామ గ్రామాన మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించి 9న కలెక్టరేట్ ముందు మహాధర్న నిర్వహిస్తామని వారు తెలిపారు.
ఎమ్మెల్యే వీరేశం ను అడ్డుకున్న పోలీసు అధికారులపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి:ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ

యాదాద్రి భువనగిరి జిల్లా లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై సమీక్ష సమావేశం కోసం ముఖ్య అతిథులు గా విచేస్తున్న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గార్ల ను సమావేశానికి ఆహ్వానించడం కోసం మిగతా ప్రజా ప్రతినిధుల తో పాటు హెలిపాడ్ దగ్గరకు వెళ్తున్న నకిరేకల్ యం ఎల్ ఏ మాదిగ జాతీ ముద్దు బిడ్డ వేముల వీరేశాన్ని వెళ్లనివ్వకుండా ప్రోటోకాల్ విస్మరించి పోలీస్ అధికారులు అడ్డుకోవడం విచారకరం. ఈ సంఘటన యావత్ మాదిగ, దళిత, పీడిత వర్గాల సమాజాన్ని కలచి వేసింది. ఒక నియోజకవర్గానికి రాజ్యాంగ బద్దంగా ప్రజల ఓట్ల తో ఎన్నికైన శాసన సభ్యుడి నే ప్రోటోకాల్ పాటించకుండా అడ్డుకోవడం తో సాధారణ సగటు సమాజానికి అధికారులు ఎలాంటి సందేశం ఇస్తున్నారని, ఇది పీడిత వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని ఈ సంఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణమే యం ఎల్ ఏ వేముల వీరేశం కు పీడిత వర్గాల సమాజానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పియాస్ రాష్ట్ర నాయకులు - యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ అన్నారు. శాసన సభ్యులు ప్రోటోకాల్ పరిధి లో వస్తారని మరి యం ఎల్ ఏ వీరేశం పేరు ప్రోటోకాల్ జాభితాలో చేర్చలేదా? చేర్చకుంటే ప్రోటోకాల్ జాభితా రూపొందించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేదా ప్రోటోకాల్ జాభితాలో యం ఎల్ ఏ వీరేశం పేరు చేర్చినా కూడా భద్రత కల్పిస్తున్న పోలీస్ అధికారులు ఉద్దేశ్య పూర్వకంగా అడ్డుకుంటే ఆ అడ్డుకున్న పోలీస్ అధికారులపై విచారణ జరిపి సంఘటన కు కారకులేవరో తేల్చి వారిపై ఉన్నత స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి అని భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు.లేకుంటే దీనిపై పీడిత వర్గాల సమాజాన్ని ఏకం చేసి ఉద్యమాలు చెపడుతామని అన్నారు.
స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు : పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి డైరెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకమును గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 1. ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ 2. సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ ... ఆరు నెలలు, ఐటిఐ డిప్లమా పాస్ 3. కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సెల్ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ & సిసి టీవీ టెక్నీషియన్ .... ఆరు నెలలు, పదవ తరగతి పాస్ 4. టైలరింగ్ ఎంబ్రాయిడరీ జర్దోజి క్వి ల్డ్ బ్యాగ్ మేకింగ్.... ఆరు నెలలు 8వ తరగతి పాస్ అయి ఉండాలి. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతీ యువకులు తేదీ 09-09-2024 సోమవారం ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరుకావాలని ఆమె కోరారు.
ఎం ఎస్ ఎం ఈ లతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు: ఎర్ర శివరాజ్ సీనియర్ రిసోర్స్ పర్సన్

భువనగిరి:  దేశంలో అధికశాతం యువత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల తోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని సీనియర్ రీసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ కళాశాలలో జరిగిన "సఫల్ శిక్షణా కార్యక్రమం" లో భాగంగా రెండు రోజుల శిక్షణా కార్యక్రమాల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. మన దేశంలో సుమారు 6.3 కోట్ల ఎం ఎస్ ఎం ఈ లు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. సూక్ష్మ, చిన్న, మద్య తరహా పరిశ్రమల ద్వారానే అధికశాతం ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశంలోని ఎగుమతుల్లో సుమారు 40 శాతం ఎగుమతులు కేవలం ఎం ఎస్ ఎం ఈ లు ద్వారానే జరుగుతుందన్నారు. చిన్న పరిశ్రమలను రక్షించుకునేందుకు యువతీ యువకులు పారిశ్రామిక రంగం లో ప్రవేశించాలని ఆయన కోరారు. ఎం ఎస్ ఎం ఈ లను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం సెమినార్లు, ఎగ్జిబిషన్లు, వర్క్ షాపులు, అవార్డులు , గుర్తింపులు నిరంతరం కొనసాగించాలని ఆయన సూచించారు.ఈ శిక్షణా సమావేశంలో నవభారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిక్కా ప్రభాకర్ గౌడ్, రీసోర్స్ పర్సన్లు కొడారి వెంకటేష్, వగ్గు క్రిస్టోఫర్, మాటూరి దశరథ, ఆవుల వినోద్, అధ్యాపకులు పూల్ చంద్, సంతోష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

భువనగిరి పార్లమెంట్ స్థాయి సాగునీటి కాలువల పై సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

భువనగిరి పార్లమెంట్ స్థాయి సాగునేటి కాల్వల పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశానికి శుక్రవారం హెలికాప్టర్ లో భువనగిరికి విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు* అనంతరం రోడ్డు మార్గం ద్వారా భువనగిరి మండలం అనాజిపురం శివారులోని బునాధిగాని కాల్వ వద్దకు చేరుకొని కాల్వను పరిశీలించి, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశంలో *ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు,బీర్ల అయిలయ్య గారు,మందుల శామ్యూల్ గారు,వేముల వీరేషం గారు,మల్ రెడ్డి రంగా రెడ్డి గారు,పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు,భువనగిరి యంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పాల్గోన్నారు* *ఉత్తమ్ కుమార్ రెడ్డి (నీటిపారుదల శాఖ మంత్రి ) కామెంట్స్ :* *నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తా..* లక్షకోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు కూలిపోవడం ప్రశ్నార్ధకం.. మెడిగడ్డ ,సుందిళ్ళ బ్యారేజీల భవిష్యత్తు ప్రశ్నార్ధకం.. గందమల్ల ప్రాజెక్టును మంజూరు చేసి పూర్తి చేస్తా.. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి భువనగిరి పార్లమెంట్ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తా.. *బునియాదిగాని ,పిల్లయిపల్లి, దర్మారెడ్డి పల్లి కాలువలకు ఎన్ని నిధులైన ఖర్చు చేసి పూర్తి చేస్తాం* దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి సోనియాగాంధీ ప్రారంభింస్తాం..
చిన్న పరిశ్రమలే దేశానికి వెన్నుముక : చిక్క ప్రభాకర్ గౌడ్ ప్రిన్సిపాల్ నవభారత్ డిగ్రీ కళాశాల

భువనగిరి:  చిన్న తరహా పరిశ్రమలే దేశానికి వెన్నెముక గా నిలిచి, దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతాయని నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చిక్కా ప్రభాకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం "స్కిల్ ఇండియా" సహకారంతో ఏర్పాటు చేసిన విద్యార్థుల శిక్షణా,అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో 2021 నుండి ప్రతి ఏటా ఆగస్టు 30 న *జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని* జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్థిక సహాయం అందించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించతో పాటు, దేశాన్ని ఆర్దికంగా అగ్ర భాగాన నిలబెట్టవచ్ఛని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సఫల్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సీనియర్ రీసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాల క్రితం ఇన్ఫోసిస్, రిలయన్స్ సంస్థలు కూడా చిన్న తరహా పరిశ్రమలు గానే ప్రారంభమై నేడు టాప్ టెన్ లో నిలిచాయన్నారు. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, పరిశ్రమల స్థాపనలో, మరియు స్వయం ఉపాధి అవకాశాలకు ప్రాదాన్యత ఇవ్వాలని కోరారు. పరిశ్రమల స్థాపనలో విద్యార్థులకు శిక్షణా మరియు అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రిసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్, నవభారత్ కళాశాల అధ్యాపకులు ఫూల్ చంద్, సంతోష్ కుమార్, రీసోర్స్ పర్సన్లు వగ్గు క్రిస్టోఫర్, కొడారి వెంకటేష్, మాటూరి దశరథ, మహిపాల్ , హరిబాబు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొలనుపాక జైన ,సోమేశ్వర దేవాలయం సందర్శించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ


తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి స్వాగతం పలికిన *తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు  బీర్ల ఐలయ్య , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర  యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం  ఆలేరు మండలం కొలను పాక గ్రామం లోని చారిత్రాత్మక అతి పురాతనమైన జైన్ మందిర్, శ్రీ సోమేశ్వర దేవాలయాల సందర్శన కోసం జిల్లాకు విచ్చేసిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారికి పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా స్వాఘతం పలికారు. శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని,అభిషేక పూజలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్. వేద పండితులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్ర గవర్నర్ కు స్వాగతం పలికారు. తొలుత దేవాలయం ముందు బతుకమ్మలు, బోనాలు, కోలాటలతో మహిళలు స్వాగతం పలికారు.
ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్

భువనగిరి: ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, గ్రామ సభల ద్వారా టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున భువనగిరి ఆర్డీవో కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నర్సింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ కోసం తక్షణమే 13 వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని అన్నారు. సగం మంది రైతులకే మాఫీ కావడం వల్ల మిగతా సగం మంది రైతులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ అన్ని పనులు మాని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ కోసం 45 వేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనాకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పికేవలం 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందన్నారు. వారు చెప్పిన ప్రకారమే 13వేల కోట్ల రూపాయలను వెంటనే చేయాలన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సవరించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రేషన్ కార్డులు, ఐటీ రిటర్న్స్, రీ షెడ్యూల్ లాంటి వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. రైతు వేదికల ద్వారా కాకుండా గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభలు నిర్వహించి సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 మాసాల అవుతున్న రెండు సీజన్లకు రైతు బరోసా డబ్బులు ఇవ్వకుండా తాత్సార్యం చేస్తుందన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో కరెంటు కోతలను నివారించే నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు నాయకులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ , రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిపిఎం బొమ్మలరామారం మండల కార్యదర్శి రాకల శ్రీశైలం, నాయకులు ఏదునూరి మల్లేశం, పల్లెర్ల అంజయ్య, కొండమడుగు నాగమణి, అబ్దుల్లాపురం వెంకటేష్ , వనం రాజు,సిలివేరు ఎల్లయ్య, కొండా అశోక్, కూకుట్ల కృష్ణ, చింతల శివ, వడ్డబోయిన వెంకటేష్, మచ్చ భాస్కర్, ఐతరాజు కిష్టయ్య, పండాల మైసయ్య, బోడ ఆంజనేయులు బందెల ఎల్లయ్య, మోకు దేవేందర్ రెడ్డి, రంగా కొండల్, కడారి కృష్ణ, ముత్యం ప్రకాష్, పాలడుగు రవి , గోరేమియా పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలోఎంటర్ప్రైన్యూర్ షిప్ పై అవగాహన సదస్సు


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ఆద్వర్యంలో విద్యార్థులకు రెండు రోజుల శిక్షణా సదస్సులో భాగంగా గురువారం జరిగిన ప్రారంభ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. స్కిల్ ఇండియా వారి సహకారంతో సఫల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాపార అవకాశాలు, మెలకువలు, ఆర్థిక వనరుల సమీకరణ, వ్యాపార నిర్వహణ, ప్రభుత్వ సహకార పథకాలపై కల్పించిన అవగాహనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రీసోర్స్ పర్సన్ ఎర్ర శివరాజ్ మాట్లాడుతూ సూక్ష్మ , కుటీర, చిన్న పరిశ్రమలు స్థాపించాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు,రుణ సౌకర్యాలు, సబ్సిడీలు ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనలో విద్యార్థులు అంచెలంచెలుగా ఎదిగి, నలుగురికి ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. ఈ అవగాహన సదస్సు సమావేశంలో రీసోర్స్ పర్సన్ కొడారి వెంకటేష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గంజి రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.