రాజపేట తండాలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో రాజపేట తండా గ్రామ పంచాయతీకి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మండల నాయకులు కొడాలి అల్వాల్ రెడ్డి లు పంపిణీ చేశారు. జింకల విగ్నేష్ కు రూ.15000/-, మునగపాటి లక్ష్మయ్య రూ. 27000/-, జి.అరుణ కు రూ. 60,000/- ల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ రాజపేట తండ మాజీ సర్పంచ్ నూన్సావత్ బిచ్చు నాయక్,యూత్ లీడర్ మారగోని సుధీర్,కాంగ్రెస్ పార్టీ నాయకుడు జింకల కొండల్ ముదిరాజ్, జింకల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Aug 06 2024, 22:30